Monday, February 22, 2010

డబ్బులోయ్ డబ్బులు * # ? . = 5

" డబ్బులు లేని వాడు డుబ్బుకు కొరకాడు " , " డబ్బంటే చేదా ? " , " మనీ మేక్స్ వండర్స్ " , " పైసా మే పరమాత్మా హై " ఇంకా అన్ని బారతీయ భాషలలో , ఇంకా మాట్లాడి తే హోల్ మొత్తం ప్రంపంచ భాష లలో ( ఆ భాష లలో ఏమంటారో నాకు తెలీదు ) ఎంత చెప్పినా , అన్నింటికీ ఒకటే అర్ధం , ధనమేరా అన్నింటికి మూలం అని . రూపాయిని " రూపాయీ , రూపాయీ , నీ గుణమేమిటమ్మా " అని అడుగుతే , " ప్రాణం గా వున్న వాళ్ళని విడదీస్తాను ." అనీ నవ్వుతుందట !!!!!

అంతటి శక్తిగల రూపాయిని , కళ్ళు మూసుకొని " రూపాయి " అని తలుచుకోండి . ఏం కనిపించింది ? వెయ్యి రూపాయల నోట్ , ఐదువందల నోట్ . ఓ కె , ఓ కే , దాని మీది చిహ్నం ఓసారి గుర్తు తెచ్చుకోండి . నాలుగు సిం హాల బొమ్మా ? , గాంధీ తాత బొమ్మా ? అశోకుడి స్తంభం ? అబ్బే ఏదీ చప్పున గుర్తు రావటము లేదే ? ఐతే సరే డాలర కు చిహ్నమేదో ఆలోచించి చెప్పండి . దీనికి అలోచనెందుకు , $ ఇదే కదా ? అదేమరి , డాలర్ కు వున్నట్లు గా , రూపాయికి ప్రత్యేక మైన చిహ్నం లేదు . అందుకే మనకు వెంటనే ఏ గుర్తూ , గుర్తు రాదు ! అన్నింటిలోనూ అమెరికా తో పోటీ పడుతున్న మనకు ఓ గుర్తు లేకపోవటమా ? ఎంత లోటు ? అందుకే ఈ లోటును పూడ్చటానికి , కిందటి ఏడాది కేంద్ర ప్రభుత్వం ఒక పోటీ పెట్టింది . సులభంగా , అందం గా , అందరికీ అర్ధం అయ్యే విధంగా రూపాయకి చిహ్నాన్ని తయారు చేసి ఇచ్చిన వారికి బహుమతి ఇస్తామని ప్రకటించింది .

పోటీ నియమాలు :
* మన చారిత్రక వారసత్వాన్ని , సంస్కృతి గొప్పతనాన్ని ఈ చిహ్నం ప్రతిఫలించాలి .
* భారతీయ భాషల్లో ఇమిడిపోయే విధంగా ఉండాలి .
* తుది డిజైన్ 232 చదరపు సెంటీమీటర్లకు మించి వుండకూడదు .


దాదాపు ఇరవై ఈదు వేలమంది , ఈ పోటీ లో పాల్గొన్నారు . వీరినుంచి కొందరిని ఎంపిక చేసి పోటీకి ఆహ్వానించారు . గతనెల వీరు తమ డిజైన్లని ప్రభుత్వానికి అందజేసారు . వీటినుండి ఐదు డిజైన్లను ఎంపిక చేసారు .

." రూపాయికి చిహ్నం ఎందుకు వుండాలి ? ఇది కేవలం ఒక సింబాలిజం మాత్రమే అని కొందరు వాదిస్తూవుండవచ్చు . కాని చిహ్నం మన ఆర్ధిక స్వేచ్చకు ప్రతీక . అంతేకాదు మనం ఆర్ధిక లావాదేవీలు చూసే సమయము లో కొన్ని సార్లు ఆర్ అని రాస్తాము . మరి కొన్ని సార్లు ఆర్ఎస్ అని రాస్తాము . అంతే కాదు ఎక్కడ పుల్ స్టాప్ పెట్టాలనే విషయం లో కూడ సంధిగ్దత వుంది . దీనిని తొలిగించాలంటే మనదైన ఒక చిహ్నము వుండాలి ." అంటున్నారు , చివరి ఐదుగురు పోటీదారులలో ఒకరైన , ఆర్కిటెక్ట్ నందిత. తాను రూపొందించిన చిహ్నాన్ని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది అనే నమ్మకం తనకు గాడం గా వుంది అని ఆశాభావం వ్యక్తీకరిస్తున్నారు .

" చిహ్నం అనేది అందరికి సులభం గా అర్ధం కావాలి . అందరూ గుర్తు పట్టగలగాలి . అంతే కాకుండా అన్ని వర్గాలవారికి అర్ధం కావాలి . మహిళలకు , పిల్లలకు , వయోజన విద్య నేర్చుకునేవారు మొదలైన వర్గాలు దీనిని సులభం గా గుర్తించగలగాలి. " అంటాడు హితేష్ . ప్రస్తుతం టోరంటోలో ఒక భారతీయ ప్రాజెక్ట్ లో ఆర్కిటెక్ట్ గా పనిచేస్తున్న హితేష్ కు చిహ్నాలను రూపొందించటమంటే చిన్నప్పటినుండి చాలా ఇష్టం ." నా డిజైన్ ఎంపికైతే అంతకన్నా ఆనందం ఏముంటుంది ? ప్రతి వ్యక్తి చేతి లో నేనుంటాను ." అంటూ తుది ఫలితం కోసం , హితేష్ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాడు .

" ఒక లిపి పుట్టుక వెనుక పెద్ద ప్రక్రియ వుంటుంది . దీనిని తెలుసుకో గలుగుతే చిహ్నాలను కూడా అర్ధం చేసుకోగలుగుతాము . రూపాయకి చిహ్నం రూపొందించటమనేది ఒక పెద్ద చాలెంజ్ . ఇది చాలా సులభంగా , సామాన్య మానవుడికి అర్ధం అయ్యే విధంగా , గుర్తు పెట్టుకునే విధం గా వుండాలి . నేను రూపొందించిన చిహ్నం అలాగే వుంది ." అంటాడు , ఈ పోటీ గురించి విన్నదగ్గర నుండి చాలా ఆసక్తి చూపించి , ఇందులో పాల్గొన్న , " తమిళ లిపి - టైపోగ్రాఫిక్ మార్పులు " మీద మొంబై ఐ .ఐ .టి లో పి.హె. డి చేస్తున్న ఉదయ్ కుమార్ .

" నేను చేసిన ప్రాజెక్టులన్నిటి లోనూ ఇది క్లిష్టమైనది " అంటాడు షారూక్ ఇరానీ .పబ్లిసిస్ యాంబియన్స్ అనే సంస్థలో క్రియేటిక్ డైరక్టర్ గా పని చేస్తున్న షారుక్ , రూపాయి చిహ్నం తన జీవితాన్ని మలుపు తిప్పుతునదని భావిస్తున్నాడు .

" ఇప్పటి దాకా వందల కొద్దీ లోగోలు తయారు చేసాను .ఇది నాకు పెద్ద చాలెంజ్ " అంటాడు , కేరళ లోని తళసెరి లో ఉపాద్యాయుడిగా పని చేస్తున్న షబీన్ . " మొదట్ రెండు స్కెచ్ లు వేసి పంపా .డిజైన్ చేయమన్నారు . తయారు చేసి పంపాను . తుది జాబితా లో నాది కూడా ఉందనే వార్త చాలా ఆనందం కలిగించింది " అంటున్నారు , షబీన్ .

ఈ ఏడాది మార్చి లో వీటిలోనుండి ఒక చిహ్నాన్ని ఎంపిక చేస్తారు . అది మన రూపాయికి చిహ్నం అవుతుంది . ఈ ఐదుగురి తో పాటు మనము కూడా ఏ చిహ్నం మన చేతులోకి వస్తుందో న్ని అప్పటి వరకు ఎదురుచూస్తూ వుందాము .


27 - 1 - 2010 ఆంద్రజ్యోతి , దినపత్రిక సౌజన్యము తో . . .

ఇవ్వండీ , నా * డబ్బులోయ్ # డబ్బులు ? కబుర్లు .. . .

గళ్ళాపెట్టి గల గలలు ఇక్కడ వినవచ్చు .

కొసమెరుపు - - -

ఆయనగారికి తెలీకుండా ఆవిడ గారు డబ్బులు దాచుకుందా మనుకుందామనుకోవటం ఎందుకో ? శ్రీవారి దగ్గర డబ్బులెన్నివున్నా , శ్రీమతిగారి బ్లాక్ మనీ మీదే శ్రీవారి కన్నులెందుకో ? మరి ఎందుకో ?????

9 comments:

భాస్కర రామి రెడ్డి said...

ఓ, ఇదేదో బాగుందండి. ఇంతవరకు మనకు ఇలా గుర్తు లేదేమిటి చెప్మా :(?

>>ఆయనగారికి తెలీకుండా ఆవిడ గారు డబ్బులు దాచుకుందా మనుకుందామనుకోవటం ఎందుకో ? శ్రీవారి దగ్గర డబ్బులెన్నివున్నా , శ్రీమతిగారి బ్లాక్ మనీ మీదే శ్రీవారి కన్నులెందుకో ? మరి ఎందుకో ?????

ఇది అదుర్స్...ఎందుకో అంటే మాకు ఘాట్టి నమ్మకం ఎంతలేదన్నా ఇంటో అక్కడో ఇక్కడో వదిలేసిన డబ్బులు గళ్ళాపెట్టేలో చేరిపోతాయని :)

శ్రీలలిత said...

నిజమే. మనకి చిహ్నం లేదేమిటా అనుకునేదాన్ని ఇంతవరకూ. ఇప్పుడు తెలిసింది.

......
ఎందుకంటే, మనం దాచుకున్న తాయిలం మనం ఎప్పుడైనా తినొచ్చు. ముందు ఎదుటివారిది తీసేసుకుంటే ఒక పని అయిపోతుందిగా..

మధురవాణి said...

Intersting information! Thanks for sharing.

భావన said...

బాగుందండి. మనం కూడా ఎదురు చూద్దాము మన అందరి బంధువు కు చిహ్న మేమవుతుందో

మురళి said...

నేను కూడా ఆసక్తి గా చూస్తున్నానండీ ఏ చిహ్నం వస్తుందో అని.. బాగుంది టపా..

మాలా కుమార్ said...

$ భాస్కరరామి రెడ్డి గారు ,
మీ నమ్మకానికి మా జోహార్ అండి .
థాంక్ యు .

$ శ్రీలలిత గారు ,
మీరు చెప్పిన మాట కూడా నిజమేనండి . థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

మధురవాణి గారు ,
థాంక్ యు .

$.భావన గారు ,
థాంక్ యు.

$.మురళి గారు ,
మీకు నా టపా నచ్చినందుకు థాంక్స్ అండి .

memorao said...

chaala informativega vundi.
bagundi,good attempt.
parvathi

memorao said...

chaala informativega vundi.
bagundi,good attempt.
parvathi