శ్రావణ మాసం రాగానే గుర్తుకు వచ్చేవి నోములు, పేరంటాలు,శనగల వాయనం. పెళ్ళైన కొత్తలో నోముకున్న మంగళగౌరీ వ్రతం, శ్రావణ శుక్రవార వ్రతం, అమ్మవారి నైవేద్యాలు ...తలుచుకుంటే అప్పుడు జరిగిన పొరపాట్ల లోని తమాషాలు వగైరా.. ఇప్పటికీ నవ్వొస్తుంది.. .నాకైతే ముందుగా గుర్తొచ్చేది కొత్తచింతకాయ పచ్చడి , దానికోసం జరిగిన హడావిడి. నా మొదటి శ్రావణ శుక్రవార నోముకోసం నేను పుణె నుండి హైదరబాద్ వచ్చాను. పెళ్ళి కాకముందు అమ్మ నోముకుంటుండగా అమ్మవారి అలంకరణలో , పేరంటం లో చిన్న చిన్న సహాయాలు చేయటంతో ఉత్సాహంగానే ఉండేది . ఆ రోజు నోములో వాయనం ఇవ్వటం కోసం మా మామగారు వూరినుంచి పెసలు తెచ్చారు. పూలు పండ్లు పూజ ముందు రోజు తెస్తారు. పేరంటం పిలుపులు కూడా మొదలయ్యాయి. ఇహ మొదలైంది అసలు హడావిడి.
“ఏమయ్యా!” ( మా అత్తగారు మా మామగారిని బహు సొగసుగా అలా పిలిచినప్పుడల్లా నాకూ మావారిని అలా పిలవాలనిపించేది. కాని భయం , మొహమాటం వల్ల ఇప్పటికీ పిలవలేక పోతున్నాను. ప్చ్.) శుక్రవారం రెండు రోజులలోకి వచ్చింది .నువ్వింకా చింతకాయలు తేలేదు.
నేనేమన్నా ఖాళీగా వున్నానా ? వెతుకుతునే వున్నాను .ఇంకా రాలే.
మరి ఎట్లా ?
మళ్ళీ మా మామగారు, సంచీ తీసుకొని చింతకాయల కోసం బయలు దేరారు. ముందుగా నారాయణగూడా మార్కెట్ కి. అక్కడ ఇంకా రాలేదు.
తరువాత చిక్కడపల్లికి. అక్కడవున్నాయి . కాని పిట్టలోళ్ళు మహా కంత్రీ గాళ్ళు, బేరం పడనీయరు.
ఆ పైన బడీచావిడీ కి .అక్కడా బేరం కుదరలేదు.
అటుపై సుల్తాన్ బజార్ అక్కడ బేరం కుదరలేదు.
ఆ రకం గా రెండూ రోజులూ తిరిగీ, తిరిగీ చివరికి సుల్తాన్ బజార్ లోనే తెచ్చారు. ఈ తతంగం అంతా ప్రతి సంవత్సరం శ్రావణశుక్రవారం ముందు తప్పనిసరి. మా ఇంటి అలవాటో ,ఆనవాయితి నో తెలీదు కాని వరలక్ష్మీ వ్రతము రోజు బూరెలు, పులిహోరతోపాటు కొత్తచింతకాయ పచ్చడి నైవేద్యము కూడా తప్పనిసరి ఉండాల్సిందే.
మా హోల్ మొత్తం కుటుంబాని కి చింతకాయ పచ్చడి అంటే బహు ప్రీతి. ఎంత అంటే పోయిన సంవత్సరము మోండా మార్కెట్ లో 50రూపాయలు పావు కిలో అయినాసరే కొనుక్కునేంత అన్నమాట. మావారి మేనత్త చింతకాయ పచ్చడి పెట్టటములో ఎక్స్పర్ట్ . ప్రతి సంవత్సరము మాకు ఆవిడే చింతకాయ పచ్చడి సరఫరా చేసేవారు. దాన్ని మేము వూరూవాడా ఇతోధికంగా పంచేవాళ్ళము. అదేమిటో మా హోల్ మొత్తం కుటుంబానికే కాక ,మా ఫ్రెండ్స్ కి కూడా మా చింతకాయ పచ్చడి మహా ఇష్టం. మాజాంగ్ ఆడటానికి వచ్చినప్పుడు ,మా ఫ్రెండ్స్ మాకు వేడి వేడి అన్నం, ముద్దపప్పు చింతకాయ పచ్చడి పెట్టమంటారు. 4 గంటలకు టీ టైం లో ఇదేమిటి అంటే ఇదే మా స్నాక్స్ అంటారు. సొ అంత పేరు ప్రఖ్యాతి కలదన్నమాట మా చింతకాయ పచ్చడి. కొత్తగా వస్తున్న లేలేత చింతకాయలు కొద్ది వగరుతో ,కొద్ది పులుపు తో చాలా రుచిగావుంటాయి. నేను మా అత్తగారి దగ్గర వాటితో పచ్చడి చేయడం నేర్చుకున్నాను .
ఆ విధానము,
ఈ కాలములో ముందుగానే ఓ పావుకిలో మెంతులు ఎరుపు రంగు వచ్చేవరకు వేయించి ,పొడి చేసుకొని వుంచుకుంటాము. చింతకాయలు శుభ్రం చేసుకొని కడిగి ఆరపబెట్టు కోవాలి. తరువాత వాటిని రోట్లో వేసి, వాటిలో పసుపు, కరివేపాకు వేసి, కొద్ది కొద్దిగా వుప్పు వేసుకుంటూ దంచాలి. వుప్పు కొంచం ఎక్కువగానే పడుతుంది. దీనికి కొలతలు చెప్పటము కష్టం. మద్య మద్య లో సరిపోయిందో లేదో రుచి చూడటమే ! రుచి చూసాక మిగిలిన పచ్చడి లో కొద్దిగా మెంతిపొడి ,సరిపడ ఎర్ర కారం పొడి , కొద్దిగా ఇంగువ వేసి మెత్తగా నూరుకోవాలి. ఆ పైన పల్లి నూనెని కాచి దానిలో కొన్ని మెంతులు వేసి ఎరుపు రంగు వచ్చాక ,ఎండు మిరపకాయలు ,కొన్ని ఆవాలు ,ఇంగువ ,కరివేపాకు వేసి పోపు పెట్టాలి .అంతే కొత్తచింతకాయ పచ్చడి రెడీ .
ఈ ఫొటో లో వున్న చితకాయ పచ్చడి పోయిన సంవత్సరంది . అందుకే రంగు మారింది. కాని ఏదో పురజనుల కోరిక పై ఇప్పటికి ఇది పెట్టాను. కొత్తది చేయగానే అప్పుడు మార్చేస్తాను. ఇప్పటికి దీనితో సర్దుకొండి. సర్దుకుపోవాలి మరి. తప్పదు..
15 comments:
abba ee saaari nenu india vachinappudu tea timeki vachi tintaanu...tappadu mari naaku noru unrinchaaaru.kaani vidhanam rasukunna.
chintakayalu dorikite try chestaa.
very very mouth watering post.
బాగుంది :)
ఈ స్టోరీ అంతా నాకు తెలీదు. వరలక్ష్మీవ్రతం తర్వాత మీఇంటికి వస్తున్నాను.ఓ సీసాడు (చిన్నదే) పచ్చడి తీసిపెట్టండి..
మాలాకుమార్ గారూ,
చింతకాయపచ్చడి వూరినకొద్దీ రుచే అనుకుంటాను. అందుకని దీనిలో వాటా తీసి పెట్టండి నాకు.. ఎప్పుడో దిగిపోతాను మీ ఇంటి ముందు.
శ్రీలలిత
subhadra gaaru,
srujana garu,
kottapaali gaaru ,
jyoti gaaru ,
srilalita gaaruu,
andrikii thaanks andi.
అలాగే రండి మాయింటికి ,చింతకాయ పచ్చడేగా అడిగారు ,తప్పక ఇస్తాను, అదేమైనా భాగ్యమా ,బంగారమా !
స్స్స్ ....ట్ట్తో ..ట్ట్తో ....
చాలా బాగా రాస్తున్నారు :) చింతకాయ పచ్చడి నేర్చేసుకున్నా మొత్తానికి :)
నేస్తం గారు మెచ్చుకున్నారంటే కొండ ఎక్కినంత సంబరంగా వుంది.
థాంక్ యు నేస్తం గారు.
పరిమళంగారు ఇంకారాలేదేమిటి చెప్మా అనుకుంటున్నాను .వచ్చేసారు.
ఐ మిస్స్ యు.
థాంక్ యు
మాలా కుమార్ గారు ఇందాకే మీ బ్లాగ్ ఒకసారి మొదటి నుండి ఇప్పటివరకూ తిరగేసాను..ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఇన్నాళ్ళకు తీరిక దొరికిందన్నమాట,అన్నీ చదవకపోయినా చాలా చదివాను..మీరు రాసే విధానాన్ని బట్టి 30 లోపేమో మీ వయసు అనుకున్నాను ఇంతకు ముందు..:) కాని ఎంత చక్కగా ఆహ్లాదం గా రాసారండి.. నిజానికి మీవంటివారి అభిమానాన్ని నేను సొంతం చేసుకున్నందుకు నాకు కొండ ఎక్కినంత ఆనందం గా ఉంది ..
chintakaya pachadi gurinchi baaga rasarandi. maa amamkuda baaga chesthundi.aslu chintakayapachadilo vullipaya nachukoni vedi vedi ananmalo tintu vunte............. swarganaiki betthedu duram.....kadantaara?
చింతకాయ పచ్చడి లో ఉల్లిపాయ నంచుకోవటము నాకు తెలీదే ! ఈ సారి తిని చూస్తా .
మీరన్నది కాదని నేను ఎందుకంటాను ?
థాంక్ యు అండి .
ఓస్.చింతకాయపచ్చడిలో పళ్ళకారం కలిపి, వేడన్నంలో నెయ్యేసి రెండిటినీ (అన్నం, చింతపళ్ళకారం) పిసికిపారేసి, మధ్యలో గుంటచేసి మజ్జిగపులుసు పోసుకు తినండి. యాం హా లాగా ఉంటుంది.
వావ్ ! వాట్ ఏ క్రేజీ కాంబినీషన్ !
mottaaniki naaku chintakaya tinnatlugaa vundi meeru raasindi chaduvutunte
.
Post a Comment