Sunday, May 10, 2009

అమ్మ

“అమ్మమ్మా” అంటూ వచ్చింది అదితి. నిన్నొక ప్రశ్న అడుగుతాను సరిగ్గా సమాదానం చెప్పాలి.

“అలాగే అడుగు తెలుస్తే చెపుతా” అనగానే...

” నీకు మీ అమ్మ అంటే ఇష్ఠమా”

“అదేం ప్రశ్న? చాలా ఇష్ఠం”

“ఎందుకు కని, పెంచింది వగైరా చెప్పకు కనక పోయినా పెంచిన అమ్మ మీద ప్రేమ వుండదా?”

“ఎందుకువుండదు? వుంటుంది .యశోదా క్రిష్ణులనే చూడు అమ్మ అంటే యశోదయే అనిపిస్తుంది. కృష్ణుడిని ఎంత ప్రేమ గా పెంచుతుంది. కన్నయ్య అల్లరి , యశోద ప్రేమ, ఆ తల్లి కొడుకుల అనుబంధం చదువుతుంటే , వింటుంటే, సినిమాలలో చూస్తుంటే ఎంత మధురంగా వుంటుంది. అసలు తల్లీ కొడుకులు అంటే ఇలాగే వుంటారేమొ , ఇలాగే వుండాలి అనే భావన కలుగుతుంది. అసలు ప్రతి స్త్రీ హృదయము మాతృత్వపు వాత్యలముతో నిండివుంటుంది. రోడ్డు మీద ఏ పిల్లో , పక్షినో దెబ్బతగిలి పడివుంటే చూడగానే ఎంత బాధ కలుగుతుంది? పేపర్ లో ఎక్కడో చంటి పిల్లలు దొరికారు అని చదవగానే హృదయం ద్రవించి పోతుంది. నాకైతే తెచ్చుకొని పెంచుదామని పిస్తుంది.. ఎందుకని? వాళ్ళతో నాకేమీ సంబంధం లేదే

అంతెందుకు సత్యా అంటీ కి బొమ్మలు అంటే ఇష్టం అని అరవింద్ యు.యస్.నుంచి ఒక బాబు బొమ్మని పంపాడట.ఆ బొమ్మకి డుంబు అని పేరు పెట్టి ఒక చిన్న బాబు తో మాట్లాడినట్లే మాట్లాడుతూ గారాబం చేస్తూవుంటుంది. తనే కాదు వాళ్ళ అత్తగారు కూడా ఆ బొమ్మ ను చూసినప్పుడల్లా ఎత్తుకొని ,కాళ్ళ మీద పడుకో పెట్టుకొని జో కొడుతూ వుంటారు. వాళ్ళే కాదు ఎవరు ఆ బొమ్మను చూసినా ముద్దు చేయకుండా వుండలేరు.

అసలు చిన్న చిన్న అమ్మాయిలనైనా చూడు వాళ్ళ బొమ్మలకు పేర్ల్లు పెట్టటము, వాటిని ముద్దు చేయటము,అమ్మ లా లాలించి, స్నానము చేయించి, అన్నము పెట్టి ఎంత ముద్దు చేస్త్తారు. నీకు గుర్తు లేదు , చిన్నప్పుడు నువ్వు ఆడుకున్న బొమ్మలాటలు. చిన్నప్పుడు బొమ్మని లాలించని అమ్మాయి ఎవరైనా వున్నారా? అంటే అమ్మలా వుండటము అమ్మాయికి చిన్నప్పటి నుంచే సహజముగా వచ్చేస్తుంది. అది ప్రకృతి ఇచ్చిన వరము.


“మరైతే అమ్మమ్మా అంత ప్రేమగా పెంచిన యశోదను, క్రిష్ణుడు కొంచము పెద్దవాడు కాగానే వదిలి అసలు అమ్మ దేవకి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు?

“అది బాధ్యత తీర్చుకోవటానికి.అమ్మ చెరసాలలో వుంటే విడిపించటము ఆయన బాధ్యత కాదా! అందుకే ఒకసారి , కృష్ణుడు తన అష్టభార్యలను తీసుకొని యశోద దగ్గరకి వచ్చినప్పుడు, యశోదమ్మ అడుగుతుంది కన్నయ్యా బాల్యములో నీ ముద్దుమురిపాలు చూసాను, లాలించి ఆనందించాను. కాని పెద్దవాడివి అయ్యాక నీ అవసరాలు చూడలేకపోయాను. ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నావు నేను ఒక్కటి అయినా చూడలేకపోయాను అని విచారిస్తుంది. అప్పుడు కన్నయ్య అంటాడు.. విచారించకమ్మా, వచ్చే నా అవతారములో నా ఆలనా పాలనా చూసి, నువ్వే నా కళ్యాణము జరిపిద్దువుగాని అని వరము ఇస్తాడు. యశోదమ్మ కోరిక కృష్ణుడు వెంకటేశ్వర స్వామిగా తీరుస్త్తాడు. వారిది జన్మ జన్మల బంధం.”

“అప్పుడూ సొంత అమ్మ కాదుగా!నువ్వూ మమ్మలిని చిన్నపటినుంచి పెంచావు,మా చిన్నపుడు నీదగ్గరే వున్నాము .అయితే నేనంటే మీకిష్టమే కదా! నువ్వంటే ఇష్టమే కాని మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అమ్మమ్మా ఎందుకని? నాకే కాదు ,మేఘ,గౌరవ్ ,విక్కి అందరూ అంతే వాళ్ల అమ్మలు రాగానే నీదగ్గరనుండి పరిగెత్తి వెళ్ళిపోతారు.
ఎందుకని ?”

“సరే నువ్వు చెప్పు నీకు మీ అమ్మంటే ఎందుకు ఇష్టం?”

“ఎందుకంటే మా అమ్మ కాబట్టి.

చూసావా అమ్మమ్మ, బామ్మ, అత్తమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మా ఎంతమంది అమ్మలు అమ్మంత అప్యాయత పంచినా అమ్మ అంటే అమ్మే. అందుకే పెద్దవాళ్ళు , తల్లీ పిల్లల బంధాన్ని పేగుబంధం అంటారు. ఆ అనుబందం మానసికానుబందం. మాటలతో నిర్వచించలేని. ఆ ఆప్యాయతకి అర్ధము ఏ డిక్షనీర్ లోనూ దొరకనిది.

అందుకే నాకూ మా అమ్మంటే చాలాఇష్టం. ,

10 comments:

పరిమళం said...

నిజమేనండీ అమ్మ అమ్మే ! ప్రపంచానికే అమ్మ చిత్రం బావుందండీ ! అమ్మకు , మీకూ శుభాకాంక్షలు .

మాలా కుమార్ said...

పరిమళం గారూ,

ధన్యవాదాలండి.మీకూ మాతృదినోత్సవ శుభాకాంక్షలు

Narendra Chennupati said...

చాలా బాగా చెప్పారండి, ఎంతైనా అమ్మ అమ్మే.....
మీకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు....

psm.lakshmi said...

ఫ్రపంచంలోనే గొప్ప అమ్మ ఫోటో చాలా బాగుంది. ఆడపిల్లకి చిన్నప్పటినుంచే అమ్మలా ప్రవర్తించటం సహజంగానే వస్తుంది. ఎంత నిజం.
psmlakshmi

మరువం ఉష said...

అమ్మ అమ్మే. నేను వ్రాసుకున్న కవిత "అమ్మ అమ్మే - తను కాదా అనాది దేవత?" http://maruvam.blogspot.com/2009/04/blog-post_24.html

మాలా కుమార్ said...

నరేంద్ర గారు,
థాంక్స్ అండి

మాలా కుమార్ said...

లక్ష్మి గారు,
నా బ్లాగ్ కి వచ్చినందుకు ధన్యవాదాలండి.

మాలా కుమార్ said...

ఉష గారు,
నిన్న మీ కవిత చదువుతుండగా కరెంట్ పొయింది.ఇప్పుడు చదువుతాను

థాంక్స్ అండి

నేస్తం said...

చాలా బాగా చెప్పారండి
మాతృదినోత్సవ శుభాకాంక్షలు..

మాలా కుమార్ said...

నేస్తం గారు,
ధన్యవాదాలు.
మీకూ మాతౄదినొత్సవ శుభాకాంక్షలు.