Tuesday, May 26, 2009

ఓ కౌన్ థీ ?

టక్ టక్ టక్

చప్పుడు విని తలుపు తీసిన నాకు,ఎదురుగా చిక్కటి చీకటి లో, కొద్ది దూరములో వెలుగుతున్న నెగడు వెలుగు లో ,తెల్ల చీర కట్టుకొని,మోచేతులదాకా తెల్ల జాకిట్టు వేసుకొని,మోకాళ్ళవరకు జుట్టు విరబోసుకొని కనిపించిన ఆకారము నన్ను చూడగానే మొహము లో తెల్లని పళ్ళు మెరుస్తుండగా నవ్వుతూ చేయి కొద్దిగా ముందుకు జాపుతూ,గీత అరుపులు వినగానే బెదిరి పోయి వెనకకి అడుగు వేసింది.ఇంతలో జీప్ డ్రైవెర్ రాంసింగ్ పక్క నుంచి వచ్చి ,మేంసాబ్ ఇనో కల్నల్ సాబ్ కి బేటీ హై అన్నాడు.ఎప్పుడు లేచి వచ్చిందో సంజు హాయ్ఆంటీ అంటూ ఆ అమ్మాయి వైపు చేయి చాపింది.అప్పటి కి నా బుర్ర మాములు అయ్యి,పార్టీ కి వెళుతూ మా వారు,ఈ రొజు ఉదయము కల్నల్ పాల్ కూతురు వచ్చింది,ఆ అమ్మాయీ వక్కతే మెస్స్ లో వుంటుంది కాబట్టి మన యింటి కి పంపుతాను అని చెప్పిన విషయము గుర్తుకు వచ్చింది.అప్పటికే తను హాయ్ స్వీటీ అంటూ సంజు తో చేయి కలుపు తోంది.నన్ను చూస్తూ ,మిసెస్ .కుమార్ ఐ ఆం నీతూ పాల్ అంది. నీతూ చేయి అందుకొని ప్లీస్ కం ఇన్ అన్నాను.

ఇంకా భయం,భయం గా చూస్తున్న గీత ని చూసి ఎందుకు నన్ను చూసి అరిచింది అన్నది తల్లీ ఈ ఆకారములో వస్తె భయపడమా ,అందులో నిన్ననే ఓ కౌన్ థీ చూసాము అన్నాను .ఓ సారీ డాడీ పశుపతి నుంచి తెచ్చారు కొత్త చీర అని కట్టుకున్నాను.అంది.ఆ తరువాత ఇద్దరము కలిసి వంట చేసుకొని ,తిని,కబుర్లు చెప్పుకుంటూ కుర్చున్నాము. అవును మాలా ఇక్కడ కుక్కలేమిటి ఇలా వున్నాయి .పొద్దున వాటిని చూడగానే చాలా భయ్యం వేసింది అంది.అవి కుక్కలు కావు నక్కలు .ఇక్కడ అవి, ఏనుగులు చాలా ఎక్కువ.కొంతమంది ఇళ్ళలో కుందేళ్ళని కూడా పెంచుతున్నారు.మిసెస్స్ .దివాన్ అయితే అడవి లోపలి దాకా వెళుతుంది ఎవైనా డ్రై ఫ్లవర్స్ దొరుకుతాయేమో నని అస్సలు భయ్యం లేదు.ఈ పూలు ఆమె ఇచ్చినవే .నిన్న ఓ గమ్మత్తు జరిగింది.ఘూర్ఖా రెజిమెంట్ దగ్గర వొక జవాను రెడ్ అరటి పళ్ళు కొన్ని పక్కన పెట్టుకొని తింటున్నాడట.ఇంతలో ఎవరో భుజం మీద తట్టిన్నట్టు అనిపించి అరటిపళ్ళు ఎవరైనా అడుగుతున్నాడేమో అనుకొని జావ్ జావ్ అంటూ వెనుక కి చూస్తె ఏనుగు నిలబడి వుందిట.అంతే అతను పరుగో పరుగు.ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే కాలము ఎంత గడిచిపొయిందో కూడా తెలీలేదు.

సడన్ గా టైం చూస్తే టు ఓ క్లాక్ అయ్యింది.ఇంకా వీళ్ళు రాలేదేమా అనుకుంటుండగానే వచ్చారు.కల్నల్ .పాల్ లోపలికి వస్తూనే వుయ్ ఆర్ వెరీ లక్కీ ,గాడ్ సేవెడ్ అస్,గాడ్ ఈస్ గ్రేట్ అన్నాడు.మావారు పిల్లలిద్దరి నీ ఆరాటం గా దగ్గరికి తీసుకున్నారు.ఏమయిందో అర్ధముకాక నేనూ, నీతూ అయోమయంగా చూస్తూ నిలబడ్డాము.కొంచము తేరుకున్నక వాళ్ళు చెప్పిన సంగతి,

రోజూ నీళ్ళని అడవి ఏనుగులు పాడుచేసి పోతున్నాయని,నీళ్ళ టాంక్ దగ్గర మైల్డ్ గా కరెంట్ కనెక్షన్ ఇచ్చారట.ఈ రోజు సాయంకాలము ఓ పిల్ల ఏనుగు అక్కడికి వచ్చి నీళ్ళు తాగబోతే దానికి షాక్ కొట్టిందట.ఇక అది వెళ్ళి మిగితా ఏనుగు గుంపును తీసుకొచ్చిందట.పార్టీ మొదలయిన కొద్దిసేపటికే ఏనుగుల మంద వచ్చి లేడీస్ రూం ని నేల మట్టము చేసేసాయట.వాటి ని ఎవరూ నిలవరించ లేకపోయారట.అందరూ చూస్తూ నిలబడి పోయారట.అదృష్టవసాత్తు వీళ్ళ వైపు రాకుండా చేయగలిగారు. ఎప్పుడు పార్టీలయినా పిల్లలని తీసుకెళ్ళి లేడీస్ రూం లో పడుకో పెడతాము.పిల్లల జ్వరము మూలంగా ఆరోజు వెళ్ళలేదు.నేను వెళ్ళలేదని ,మిస్సెస్ ,షేర్గిల్ల్ కుడా వెళ్ళలేదు.లేకపోతె పిల్లలు నలుగురు, వాళ్ళ పనమ్మాయి ,మా పనమ్మాయి ఏమయిపోయేవారో!

ఈ సంఘటనలు జరిగినది నైంటీన్ సెవంటీ ఫొర్ లో సిలుగురి దగ్గర ,మేము సేవక్ రోడ్ లో వున్నప్పుడు .భీతి కలిగించే రెండు సంఘటనలు ఒకే రోజు జరగటము యాదృచ్చికము.

అవునూ దయ్యాలు తెల్ల చీరే ఎందుకు కట్టుకుంటాయి?

.ఓ కౌన్ థీ నీ చూడాలనుకుటే
కమ్మటి కలలు లో చూడవచ్చు.

5 comments:

యోగి said...

శీర్షిక చూడగానే జోజో పాడిన ఒక పాత ఇండీపాప్ పాట గుర్తుకొచ్చింది. "ఓ కౌన్ థీ, నజర్ మిలాకె జాన్ లేగయీ జో.." :)

cbrao said...

"దయ్యాలు తెల్ల చీరే ఎందుకు కట్టుకుంటాయి?" -అవి ఎక్కువగా రాత్రుళ్లు తిరుగుతాయి. నల్ల చీర కడితే చీకటిలో కలిసిపోతాయి. చీకటిలో కూడా తెల్లచీర ప్రస్ఫుటంగా కనిపిస్తుంది కంటికి. ఈ కారణంగా దెయ్యాలు తెల్లచీరనే ఇష్టపడతాయి.
పాఠకులకు మూడు ప్రశ్నలు: 1) దెయ్యాలు జుట్టు ఎందుకు విరబోసుకుంటాయి? 2) దెయ్యాల కాళ్లు ఎందుకు వెనుతిరిగి ఉంటాయి?
3) దెయ్యలు రాత్రుళ్లే ఎందుకని తిరుగుతాయి? సరైన సమాధానాలు పంపినవారికి దెయ్యంచే ఒక చక్కటి తెల్ల చీర బహుకరించబడుతుంది. వేదిక: ఆదివారం, అమావాశ్య అర్థరాత్రి , కాలే చితిమంటల కాంతిలో, నక్షత్రాల కొలువులో, తోటి పిశాచరగణ సమక్షంలో.

Srujana Ramanujan said...

Because the directors ordered such dresses. Very racy narration and a different experience.

మాలా కుమార్ said...

yogi garu,cbraogaru,srujana,

thank you

psmlakshmiblogspotcom said...

మాలాగారూ
బలే అనుభవాలుకదా. ఇప్పుడు చెప్తుంటే బాగానేవుంటుంది కానీ నేను మీరు అప్పుడున్న సీన్ కి వెళ్ళిపోయాను.
psmlakshmi