కార్
సడంగా ఆగింది!
"ఏమైంది
మహేష్?"
"సార్
ముందు స్కూటీ మీద వెళుతున్న అమ్మాయి
స్కూటీలో నుంచి సెల్ పడిపోయింది."
అంటూ కార్ దిగబోయాడు మహేష్.
రయ్య్య్య్య్య్య్య్య్య్య్య్య్
. . . . .
ఓ బైక్ దూసుకొచ్చింది.దాని
మీద వున్న దొంగగారు చటుక్కున కింద బడ్డ సెల్
అందుకొని ఫటుక్కున్న మాయమైపోయాడు.
డ్రైవరూ
,సారూ అవాక్కయ్యారు!
"మహేష్
తొందరగా పోనీయ్ ."
అంతే
కార్ స్పీడ్ అందుకుంది.కాని బైక్ కనిపించలేదు!మాయదారి వాన మొదలైంది.
"సార్
అదిగో ఆ అమ్మాయి ఆ
బస్ స్టాప్ లో ఆగి వుంది."
కార్
ఆ అమ్మాయి ముందు ఆగింది.ఆ
అమ్మాయి ఆశ్చర్యంగా చూసింది!
కార్
లో నుంచి సార్ గారు
దిగారు."అమ్మాయ్ నీ సెల్ వుందా
?" ఘంభీరంగా అడిగారు.ముందు బిత్తరపోయిన ఆ
అమ్మాయి స్కూటీ పక్క కవరూ , తన
పాకెట్సూ అన్నీ వెతుక్కొని లేదంకుల్
అంది గాభరగా.
"అక్కడ
పడిపోయింది. మేము తీసే లోపలే
ఎవడో దొంగ ఎత్తుకుపోయాడు. పట్టుకుందాం.
ఫాలో మీ."
ముందు
కార్, వెనుక స్కూటీ చేజింగ్
చేజింగ్ . . . . .
అయ్యో
కార్ ను స్కూటీ కాదు
బైక్ కోసం.
వాన పడుతూనే వుంది. . . . .
కరుడుగట్టిన
స్మగ్లర్ జాన్ పాషా కోసం
రా ఏజెంట్స్ రయ్ రయ్ మని
చేజ్ చేస్తున్నారు.
"సార్"
కెవ్వ్ కేక. "అదిగో ఆ షాప్
పక్కన బైక్ , ఆ దొంగ గారు”.
సర్ర్
ర్ర్ ర్ర్ మంటూ ఆ
అబ్బాయి పక్కన కార్ ఆగింది.ఆ వెనుకే స్కూటీ.
. . .
సార్
గారు చాలా ఘంభీరంగా కార్
దిగారు.సార్ గారు, డ్రైవర్
గారు, దొంగగారికి చెరో పక్కన నిలబడ్డారు.
" ఊ ఆ సెల్ తీయ్."
"ఏ
సెల్ సార్?" అమాయకంగా దొంగగారు.
"ఇందాక
అక్కడ రోడ్ మీద పడ్డ
ఈ అమ్మాయి సెల్ తీసుకున్నావు కదా
అది,మర్యాదగా ఇస్తావా పోలీస్ లను పిలవమంటావా?"
అవాక్కయిన
దొంగగారు జేబులో నుంచి సెల్ తీసి
ఇచ్చారు!
ఆ సెల్ అందుకున్న అమ్మాయి
థాంక్ యూ అంకుల్ అంది
త్రిల్లింగ్ గా!
అమ్మయ్య
మా ఆయనకు ఏమీ కాలేదు
బాగానే వున్నారు అని నేను హాయిగా
నిట్టూర్చాను. మరి లేకపోతే ఈ
మధ్య ఏ ఎడ్వెంచర్సూ చేయటం
లేదు.ఏ గాలో ధూళో
సోకలేదు కదా!ఏమైనా మంత్రం
వేయించాలా?ఎవరు వేస్తారు అని
బెంగ పడిపోతున్నాను. అమ్మయ్య ఈ రోజు ఈ
ఎడ్వెంచర్ చేసాము అని ఇంటికి రాగానే
చెప్పారు.మరి బెంగతీరి హాపీసే కదా!
5 comments:
అమ్మయ్య. అంతా హేపీస్. మీవారు హేపీగా ఎడ్వెంచర్ చేశారు, మీరు హేపీగా రాశారు, మేము హేపీగా చదివాము. హేపీ (హాస్య) కధలుకూడా రాయచ్చు మీరని ఇందుమూలముగా సర్టిఫికెట్ ఇవ్వటమైనది.
psmlakshmi
హబ్బ హబ్బా. యేం చేజింగ్. యేం సస్పెన్స్. యేం అడ్వంచర్..హాట్స్ ఆఫ్..
ఈ కథ చదివాక భయంతో ఇంక ఇవాళ నాకు నిద్ర పడుతుందా.
Sorry late ga chadivaanu. Manchi
Suspense! Meeru ilativi try cheyyandi.....Maro suspense thriller kosam eduru choostam!
:) :)
lakshmi gaaru, Sriilalita gaaru,lakshmi raaghava gaaru, parimalam gaaru thanks andi.
Post a Comment