Tuesday, May 5, 2015

అలమారా లిఫ్ట్ తో అగచాట్లు

 ఈ మాగ్జిన్ "యామిని" లో ప్రచురించిన నా కథ "అలమారా లిఫ్ట్ తో అగచాట్లు".
http://www.yaaminii.com/uncategorized/16%E0%B0%85%E0%B0%B2%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE-%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AB%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%85%E0%B0%97%E0%B0%9A%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2/

అలమారా లిఫ్ట్ తో అగచాట్లు
మాలాకుమార్

గేట్ తీసుకొని లోపలికి వచ్చిన అరుంధతి ఎదురుగా వున్న లిఫ్ట్ వైపు చూసి , నిట్టూరుస్తూ అక్కడ వున్న కుర్చీలో కూర్చుందిసెల్ తీసి రింగ్ చేసింది. "హాయ్ అరుంధతీ ఎప్పుడు బయిలుదేరుతున్నారు?" అడిగింది పార్వతి.
"వచ్చేసానుమీ పార్కింగ్ ఏరియాలో వున్నాను."
" ఐదు నిమిషాల్లో వచ్చేస్తున్నానుపోనీ పైకి వచ్చేయకూడదూ."
"ప్లీజ్ పార్వతీ మీకు తెలుసుగా నా ప్రాబ్లం."
"ఒకే ఒకే కూర్చొండి వచ్చేస్తున్నాను."
మళ్ళీ ఓసారి ఎదురుగా తలుపులు మూసుకొని వున్న లిఫ్ట్ వైపోసారి చూసిహుం దీన్ని ఎవరు కనిపెట్టారో కాని నా దుంపతెగిపోతోందిదీని వలన నానా అగచాట్లు పడాల్సి వస్తోంది అని విసుగ్గా అనుకొంటూ ఆలోచనల్లోకి జారిపోయింది.
కనీసం కటకటాల లిఫ్టైనా బాగుండేది అది ఆగిపోతే బయట వున్నవాళ్ళు కనిపిస్తారుఏవరినైనా పిలిచేందుకు వుంటుందిగాలి వస్తుందిఅదేమిటో దాన్ని బాన్ చేసారటఇప్పుడు అన్ని చోట్లా తప్పనిసరిగా అలమారా లిఫ్ట్ లు పెడుతున్నారుదీని దుంపతెగ మనం లోపలికి వస్తుండగానే దాని టైం ఐపోతే టక్కున తలుపు మూసుకుంటుంది.ఎవరోవకరు తలుపు పట్టుకుంటారు అందరూ ఎక్కేదాకాఅదో ప్రహసనమైతే , తలుపు మూసుకోగానే లోపల చుట్టూ గట్టి స్టీల్ తలుపులు తప్ప ఇంకేమీ కనిపించవు.ఊపిరి ఆడదు.అసలు కదులుతోందో లేదో కూడా తెలీదు.అంతా బాగానే వుంటారు తనకు మటుకు అది ఆగి తలుపు తెరుచుకునేవరకూ గుండెలదురుతూవుంటాయి.
పార్క్ లో వాకింగ్ ఫ్రెండ్ అన్నమాచార్యకీర్తన పాడుతే , చాలా బాగా పాడారండిఎక్కడైనా నేర్చుకున్నారా అని అడిగింది తనుఅవునండి అంది ఆవిడ పైగా తనకు అంతకు ముందు పాడటము కూడా రాదని , మాష్టారుగారు బాగా నేర్పించారని కూడా చెప్పిందిఎప్పటి నుంచో తనకూ అన్నమాచార్యకీర్తనలు నేర్చుకోవాలనిహాయిగా పాడుకోవాలని కోరిక.తనూ నేర్చుకోవాలని ఉత్సాహపడి , ఆవిడ నడిగి అడ్రెస్ తీసుకుందిఇంటికి దగ్గరేఆయన , పిల్లలు వెళ్ళిపోయాక పనయ్యాకమధ్యాహ్నం అంతా ఖాళీనే!హాయిగా నేర్చుకోవచ్చు అనుకుంది.నేర్చుకుంటున్నానని ఇప్పుడే ఎవరికీ చెప్పొద్దు.నీకు సా . . . పా . . .  అంటమే రాదు నువ్వేమి నేర్చుకుంటావు నీ మొహం అని వెక్కిరిస్తారు.ఎలాగూ నేను వెళ్ళి వచ్చింది కూడా ఎవరికీ తెలియదు.బాగా నేర్చుకొని పాడి వినిపించి సర్ప్రైజ్ చేయాలి అని నిశ్చయించుకుంది రాత్రంతా తను పాడటం బాగా నేర్చుకున్నట్లు , మాష్టారుగారు తనను ప్రోగ్రాములకు కూడా తీసుకెళ్ళి పాడించినట్లూ , అందరూ మెచ్చుకుంటుంటే ఆయనపిల్లలు ఇదంతా ఎప్పుడు సాధించావు అని ఆశ్చర్యంగా చూస్తున్నట్లూ బోలెడు కలలు .
మరునాడే  అడ్రెస్ వెతుకుంటూ వెళ్ళిందిఇల్లు సులభంగానే కనిపించిందిహూం ఆతరువాతే అసలు కష్టాలు మొదలయ్యాయి.మాష్టారుగారి ఇల్లు పైన నాలుగో అంతస్తులోకింద మూడంతస్తులూ షాప్  కిచ్చారు.బిల్డింగ్ వెనక వైపున పైకి వెళ్ళేందుకు లిఫ్టూమెట్లు వున్నాయిపైగా అలమారా లిఫ్ట్చిన్నగా మెట్లెక్కేందుకు వెళ్ళిందిఎక్కడి నుంచి వచ్చాడో సెక్యూరిటీ అతను, " మేడం లిఫ్ట్ పని చేస్తోందిమీరు లిఫ్ట్ లో వెళ్ళవచ్చు అన్నాడు.
ఒక్క నిమిషం అతని వైపు చూసి "నువ్వు వస్తావా నాతో పాటు " అని అడిగింది.
ఆమె వైపు విచిత్రంగా చూసి "పదండి మేడం." అన్నాడు.
లిఫ్ట్లోకి వెళ్ళి తలుపు మూసుకోగానే కాళ్ళూ చేతులూ వణికిపోయాయి.గుండెను అరచేత్తో పట్టుకొని ఎలాగో పైకి చేరుకుంది.మాష్టారు గారి తో మాట్లాడి క్లాస్ లో చేరింది పది మంది విధ్యార్ధులు వున్నారుఅందరూ గృహిణులే.దాదాపు తన వయసు వారేఅమ్మయ్య పరవాలేదు అనుకొంది. రోజు క్లాస్ ముగించుకొని ఎలాగో కిందికి దిగింది.
మరునాడు తొందరగా పని ముగించుకొని పదింటికల్లా క్లాస్ కు చేరుకుంది.లిఫ్ట్ కు మెట్లకూ మధ్య నిలుచొని పైకీ కింది కీ చూస్తూ ఆలోచనలో పడింది.అంతా బాగానే వుంది కాని  లిఫ్ట్ తో చావొచ్చిపడిందే ఏమి చేయటం .లిఫ్ట్ దాకా వెళ్ళింది కాని ఎక్కే ధైర్యం చేయలేకపోయింది.  నిన్నేదో ఉత్సాహం లో అలమార లిఫ్ట్ లోనుంచి పైకి వెళ్ళింది కాని ఇప్పుడు దాన్ని చూడగానే గుండె గుబ్బిల్లుమంది.ఎలా నాలుగో అంతస్తు కు వెళ్ళటముపైకీ కింది కి  చూస్తొంది.ఇంతలో సెక్యురిటీ గార్డ్ వచ్చి క్యా చాహియే మేడంఅన్నాడు.
నిన్నటి అతను కానట్లున్నాడు.
ఫోర్త్  ఫ్లోర్ కొ జానా హై.
ఇదర్ లిఫ్ట్ హై మేడం.
యే ఏకీ హై క్యా? (పక్కన తనలాంటివారి కోసం కటకటాల లిఫ్ట్ ఏమైనా పెట్టారేమో అన్న ఆశతో అడిగింది.)
అతను  విచిత్రం గా చూసి హౌ మేడం అన్నాడు.
షాప్స్ కే అందర్సే ఎస్కలేటర్ సే జాసక్తే క్యా?
నైక్యో మేడం యే లిఫ్ట్ మె జావోనా ?
ఏం చెబుతుంది అతనికి?   రెండు రోజు లైతే అదే అలవాటు అవుతుంది అనుకొని , తన వైపు వింత గా చూస్తున్న సెక్యూరిటీ గార్డ్ ని పట్టించు కోకుండా ,అసలు  అలమారా లిఫ్ట్ లు ఎవరు కనిపెట్టారు? ,హాయిగా కట కటా లిఫ్ట్ లైతే బాగుంటాయి కదా అని తిట్టుకుంటూ ఆపసోపాలు పడుతూ నాలుగు అంతస్తులూ   ఎక్కి  వెళ్ళి కాసేపు ఆయాసం తీర్చుకోవటానికి వరండాలో కుర్చీలో కూర్చుంది.ఇంతలో లోపలి నుంచి ఒకావిడ వచ్చిఅదేమిటి ఇటునుంచి వచ్చారు అటు లిఫ్ట్ వుంది కదా అని అడిగిందినవ్వి ఊరుకుంది తను.
చిన్నగా క్లాస్ లో అందరూ పరిచయం అయ్యారుక్లాస్ ఐపోగానే మెట్లవైపు నడుస్తున్న తన తో ఇటు లిఫ్ట్ వుందండి అన్నారు ఎవరోవినిపించుకోనట్లు వెళ్ళిపోయిందిమరునాడు మెట్లెక్కుతుంటే ఎవరో అమ్మా అమ్మా  అని గట్టిగా పిలిచారుఏమిటీ అని వెనక్కి తిరుగుతే వెనికింటి పనిమనిషి ఇటు లిఫ్ట్ వుందమ్మా అందిమొహమాటంగా నవ్వి మెట్లెక్కి వెళ్ళిపోయిందిరోజూ ఇదో గోలైపోయింది వెనికింటి వాళ్ళో , పక్కింటి వాళ్ళో పిలిచి , అరిచి మరీ చెప్పటం తను తిరిగి చూడకుండా హుస్సో అనుకుంటూ , జనాభాకు మరీ ఇంత పరోపకార బుద్ది ఎక్కువైందేమిటి అని విసుక్కుంటూ ఎక్కటం . రెండు రోజులు గడిచాయితనకు కొంచం ఫ్రెండ్ ఐన లక్ష్మి తో , " లిఫ్ట్ ఆగిపోతే ఎలాగండి.ఏదైనా బాక్ అప్ వుందా?" అడిగింది.
"జనరేటర్  వుందండి . కాకపోతే ఒక్కోసారి జనరేటర్ పని చేయకపోతే కష్టం . ఓసారి ఇలాగే అయ్యిందిమాష్టారుగారి అల్లుడు లిఫ్ట్ లో వుండగా ఆగిపోయిందిలిఫ్ట్ ఆగగానే ఫస్ట్ ఫ్లోర్ లోకి దిగి తలుపు తెరుచుకుంది." అంది.
"అమ్మయ్య .లిఫ్ట్ ఆగుతే కింది ఫ్లోర్ కు వెళ్ళి తలుపు తెరుచుకుంటుంది కదా , ఐతే పర్వాలేదు." అని ఊపిరిపీల్చుకుంది తను.
"అవుననుకోండి , కాని బయటకు ఎలా వస్తారు?" అడిగింది లక్ష్మి.
"అదేమిటి తెల్లబోయింది తను.
"అవునుకదా లిఫ్ట్ కు షాప్  వైపు   ఫ్లోర్ లోనూ తలుపులు లేవుగోడలే వున్నాయిఇటువైపు చిన్న బాల్కనీ లా కట్టారు. మాష్టారుగారింటి బాల్కనీ లో తప్ప మిగితా మూడు అంతస్తులూ ఇటువైపు వున్న చిన్న బాల్కనీలల్లోకే తలుపులు వున్నాయి. అంత ఎత్తునుంచి ఎలా దిగుతాము?"అడిగింది లక్ష్మి.
"ఎందుకలా కట్టారు ? ఆయన ఎలా బయటకు వచ్చారు ?" ఆతృతగా అడిగింది తను.
"ఇది మాష్టారుగారి సొంత స్తలం కదండి.మూడు ఫ్లోర్ లూ వాళ్ళే కట్టి షాప్ లకు ఇచ్చారు.వీళ్ళ కోసం లిఫ్ట్ ఇటువైపు పెట్టుకున్నారు. షాపులకు  వచ్చేపోయేవాళ్ళంతా లిఫ్ట్ వాడుతే లిఫ్ట్ పాడవుతుందనేమో  లేకపోతే ప్రైవసీ వుండదనో మరేమో నాకు తెలీదు, అటువైపు లిఫ్ట్ కాకుండా గోడ కట్టారు. అల్లుడుగారిని నిచ్చెన వేసి దింపారుమొదటి అంతస్తేగా!" అని ముగించింది లక్ష్మి.
నా తల్లే చెప్పావు కాదూ , అదే మూడో అంతస్తులోనో ఆగితే నిచ్చెనా అందదు. ఏమోలే నేను లిఫ్ట్ ఎక్కబోయానా అనుకుంది తనుఅనుకుందేకాని ఇంటికి వెళ్ళినా అదే ధ్యాస.రాత్రి భోజనాలయ్యాక  అలాగే కలత నిదురబోయింది.
చిన్నగా వెలుతురు వస్తోంది. లిఫ్ట్ లో లైట్ సరిగ్గా వెలుగుతున్నట్లులేదు. రోజు మరీ నడుం నొప్పి కాళ్ళ నొప్పులు వుండటం తో తప్పక లిఫ్ట్ ఎక్కింది.ఇంతలో గుడ్డి వెలుతురు కూడా పోయింది. చుట్టూ చీకటి.. . భయం తో నోరు పిడచకట్టుకుపోయింది.
 ఎవరినైనా పిలుద్దామన్నా నోరు పెగలటం లేదు . . .
 ఇంతలో లిఫ్ట్ రయ్ రయ్ కిందికి జారసాగింది.అమ్మో హెల్ప్ హెల్ప్ కెవ్వ్ కెవ్వ్ అరిచింది.
గబుక్కున లిఫ్ట్ ఆగి దఢాల్ మని తలుపు తెరుచుకుంది. అదురుతున్న గుండెతో బయటకు పరిగెత్తి చుట్టూ చూసింది.భూమి ఎక్కడో కింద కనిపిస్తోంది. అక్కడి నుంచి నిచ్చెన వేసి దిగు దిగు అనిపిలుస్తున్నారు. ఏట్లా దిగను. నాకు నిచ్చెన అందటం లేదు ఏమండీ ఏమండీ అని అరిచింది.
ఎక్కడి నుంచో కిరణ్ అరుంధతీ  అరుంధతీ అని పిలుస్తున్నాడు.కుదుపుతున్నాడు. కళ్ళు తెరిచి చూసింది.వళ్ళంతా చెమటలు కారుతున్నాయి. శరీరం భయం తో వణికిపోతోంది. ఒక్క క్షణం తనెక్కడుందో అర్ధం కాలేదు. కిరణ్ అరుంధతి ని చిన్నగాలేపి కూర్చోబెట్టి మంచి నీళ్ళు ఇచ్చాడు. పక్క గది నుంచి పిల్లలు పూజ, ప్రవీణ్ పరిగెత్తుకుంటూ వచ్చారు. చిన్నగా తేరుకొని చుట్టూ చూసింది అరుంధతి. తను లిఫ్ట్ లో లేదు ఇంట్లోనే వుంది.లేచి కూర్చోబోయింది . నడుము కలుక్ మంది. ఏమైంది? అందరూ కంగారుగా అడిగారు.ఏమీ లేదు ఏదో పీడకల అంది అప్పటికి తేరుకున్న అరుంధతి.

కాని తెల్లారి లేచి భారంగా పెడకాళ్ళేస్తూ , నడుస్తూ వుంటే అంతా గాభరాపడ్డారు.ఏమైంది? మొహం కూడా పీక్కుపోయింది. డాక్టర్ దగ్గరకు వెళుదామా అని వేదించేసారు అంతా. అమ్మో డాక్టర్ దగ్గరికే!ఇంకేమైనా వుందీ ఏమని చెబుతుంది. ఏమీ కాలేదు ఏదో కాస్త వాతావరణం మారింది కదా , కాస్త వళ్ళు నొప్పులు అంతే అని చెప్పి వొప్పించేసరికి తలప్రాణం తోకకోచ్చింది.  ఇలా రోజూ నాలుగంతస్తులు మెట్లెక్కుతున్నాను అని చెబితే ఇంకేమైనా వుందా ! అప్పటికీ రోజు ఓపిక తెచ్చుకొని క్లాస్ కు వెళ్ళింది. కాని క్లాస్ లో కూర్చోవటం కాందే!ఒకటే నీరసం.  ఇదంతా భరించలేక ఊసురోమంటూ అన్నమయ్యా నా అపరాధాన్ని మన్నించు.నీ కీర్తనలు శ్రావ్యంగా పాడుకునే అదృష్టం నాకు లేదు. స్చప్ కచేరీలూ . . . శాలువాలూ . . .చప్పట్లూ కళ్ళ ముందు కదలాడుతుంటే దీనంగా వాటికేసి చూస్తూ అన్నమయ్యను అటకెక్కించేసింది.

ఓరోజు పొద్దున్నే ప్రాణస్నేహితురాలు సుధ ఫోన్ చేసి మా అమ్మాయి శ్రావణి పెళ్ళి కుదిరింది. సాయంకాలమే నిశ్చితార్ధం గ్రాండ్ హోటల్ లో అని సంబరంగా చెప్పింది.

తనూ సంతోషపడిపోతూ హోటల్ లో హాల్ ఎక్కడుంది కిందనే కదా అని అడిగింది.
నీరసంగా " కాదు ఐదో అంతస్తు. నాకు వెంటనే నువ్వు గుర్తొచ్చావు కాని అల్లుడుగారు అక్కడే కావాలన్నారు. అందుకని తీసుకోక తప్పలేదు" అంది సుధ.

"మరి. . . మరి . . . లిఫ్ట్ " అంటూ నసిగింది తను.

"నీ లిఫ్ట్ భయం తగలెయ్య. ప్రపంచం లో రోజూ కొన్ని కోట్ల మంది లిఫ్ట్ ఎక్కుతున్నారు నువ్వొక్కదానివే కాదు." కసురుకుంది సుధ.

"అది కాదు సుధా ప్లీజ్ సారికి నన్నొదిలేయవే.పెళ్ళి కి వారం రోజులు మీ ఇంట్లోనే వుంటానుగా ప్లీజ్ ప్లీజ్ ."అని బతిమిలాడింది తను.

"పెళ్ళి సంగతి అప్పుడే చూసుకుందాము. రోజు రాకపోయావో నీతో జన్మ లో మాట్లాడను." అని బెదిరించి తను చెప్పేది వినిపించుకోకుండా ఫోన్ పెట్టేసింది!
మొడిది అన్నంత పనీ చేస్తుంది. తప్పించుకునే దారి లేదు దేవుడా అనుకుంటూ వెళ్ళింది. హోటల్ లోకి వెళుతూనే కిరణ్ లిఫ్ట్ వైపు నడుస్తుంటే అనుసరించింది. సార్ లిఫ్ట్ ఆగిపోయింది. అటువైపు ఇంకోటి వుంది అందులో వెళ్ళండి అన్నాడు అక్కడ వున్న వేయిటర్.
 కళ్ళు పెద్దవి చేసి " లిఫ్ట్ ఆగినప్పుడు అందులో ఎవరైనా వున్నారా ?" భయం భయం గా అడిగింది.
నీకెందుకు అటు పద అని కిరణ్ తనను లాక్కెళ్ళాడు.లిఫ్ట్ దాకా వెళ్ళాక "మీరు లిఫ్ట్ లో రండి నేను మెట్లెక్కి వస్తాను." అని గబగబా మెట్లెక్కింది. కిరణ్ తనను అనుసరించాడు."ప్లీజ్ మీరు లిఫ్ట్ లో రండి." బతిమిలాడింది. కాని కిరణ్ మాట్లాడకుండా వెనకే వచ్చాడు.ఆపసోపాలు పడుతూ ఐదంతస్తులూ ఎక్కారు.లోపలి కి వెళుదామంటే తలుపు వేసేసి వుంది!ఎంత కొట్టినా ఎవరూ పలకలేదు. సుధ నంబర్ కు కాల్ చేసింది, హడావిడిలో సెల్ ఎక్కడపడేసిందో తీయలేదు! తన దగ్గర సుధ ది తప్ప ఇంకెవరి నంబరూ లేదు. చుట్టూ చూసింది .మెట్ల మీద లైట్ డిం గా వుంది.అంతటా నిశబ్ధం . అమ్మో కిరణ్ వెంట రాకపోతే . . . తలుచుకుంటేనే వణుకొచ్చేసింది.

ఏమి చేద్దాం అన్నట్లు కిరణ్ వైపు చూసింది . భుజాలు ఎగరేసి వెనకకు తిరిగాడు. శ్రీరామచంద్రా నారాయణా ఎన్ని కష్టాలు పెట్టావురా నాయనా అనుకుంటూ ఐదంతస్తులూ దిగి లిఫ్ట్ ఎక్కారు. పని ముందే చేస్తే బాగుండేదిగా అన్నట్లు చూసాడు కిరణ్. మొహం తిప్పుకుంది.పైకి వెళ్ళాక తనను చూసి "కాస్త నవ్వు మొహం పెట్టు. అంత దిగులుగా ఆపసోపాలు పడుతూ వుంటే అందరూ ఏమైనా అనుకొంటారు."హెచ్చరించాడు కిరణ్ . నవ్వు మొహమా అయ్యో రామా అని నిట్టూర్చింది.

అదిగో అప్పట్నించీ లిఫ్ట్ భయం ఇంకా యెక్కువయింది అని విసుగ్గా అనుకొంటూ ఆలోచనల్లోకిజారిపోయింది.
"అమ్మా ఎవరమ్మా ? ఇక్కడ కూర్చున్నారు ?"

"నేను  ఫోర్నాట్ ఫోర్ అమ్మగారి కోసం వచ్చానునువ్వెవరు ?" అడిగింది.
"నేను ఇక్కడ వాచ్ మాన్ భార్యనుఇక్కడెందుకు కూర్చున్నారులిఫ్ట్ బాగానే వుందివెళ్ళండి " అన్నది వా.భా
అబ్బా. . . వా.భా ను పట్టించుకోకుండా, పార్వతి గారు ఎప్పుడు వస్తారో! లోపల శారదగారికి కాల్ చేసి విష్ చేస్తే పోలే అనుకుంటూ సెల్ తీసింది.
"హలో అరుంధతి గారు చెప్పండి?"అటునుంచి శారద మాట్లాడింది.
"మీ కథ కు బహుమతి వచ్చింది కదా కంగ్రాట్యులేషన్స్ అండి ."అన్నది అరుంధతి.
"థాంక్స్ అండి అరుంధతి గారు. నేను ఒక ఫంక్షన్ కు వచ్చాను.ఇక్కడ లిఫ్ట్ లో ఇరుక్కుపోయాను.తలుపులు తీస్తున్నారు. ఇంటి కి వెళ్ళాక మాట్లాడుతాను. ఏమనుకోండి ప్లీజ్."
"దేవుడా" తలకొట్టుకుంది.
అమ్మా పిలిచింది వా.భా.
హుం మొదలైందిఇహ ముసుగులో గుద్దులాట ఎందుకని "నాకు లిఫ్ట్ అంటే భయంఅందుకని ఇక్కడే కూర్చున్నానుపార్వతమ్మ ఇప్పుడే వస్తారు ."అని చెప్పింది.
"భయమెందుకమ్మా ? నేను తీసుకెళుతాను . నా చేయి పట్టుకోండిఅమ్మ వచ్చేసరికి ఎంతసేపు అవుతుందో .ఎండలో ఎందుకు?" అంది.
ఇదీ అందరు చెప్పే మాటే మేమున్నాముమా మధ్య లో వుండుమా చేయి పట్టుకో , కళ్ళు మూసుకో సింగినాదం జీలకర్రా అనుకొంటూ "మీ లిఫ్ట్ మధ్యలో ఆగదా ?" అందరినీ అడిగే ప్రశ్నే అడిగింది.
"లేదమ్మా ఆగదుకరెంట్ పోగానే జనరేటర్ వేస్తాము." అంది వా.భా.
"మరి జనరేటర్ పాడవుతే?"
"లిఫ్ట్ ఒక అంతస్తు దిగి తలుపు తెరుచుకుంటుంది."
"లిఫ్ట్ ఎప్పుడూ పాడవలేదా ?"
"లేదమ్మా . కాకపోతే అప్పుడోసారి లిఫ్ట్ పని చేసే ఆయన లిఫ్ట్ లో వుండగా పాడైందిపది నిమిషాలకు బాగై తెరుచుకుందనుకోచావు కబురు చల్లగా చెప్పింది వా.భా.
అంతా బాగానే వుంటుంది "కాకపోతేతోటే నాకు  అలమారా లిఫ్ట్ అగచాట్లు!
మహాభారతంలోఅస్తమానం “పరంతూ..”అంటూవిదురుడు భీష్ముడితోఅన్నట్టు  లిఫ్ట్ భయం కాదు కానీ అందరూ “కాకపోతే..” అన్నమాట మటుకు మహబాగా ప్రయోగిస్తున్నారు!

మహాభారతంలోఅస్తమానం “పరంతూ..”అంటూవిదురుడు భీష్ముడితోఅన్నట్టు  లిఫ్ట్ భయం కాదు కానీ అందరూ “కాకపోతే..” అన్నమాట మటుకు మహబాగా ప్రయోగిస్తున్నారు!4 comments:

శ్రీలలిత said...

అలమారాలిఫ్ట్ తో మీ అగచాట్లు భలే వున్నాయండీ..

శ్రీలలిత said...

అలమారా లిఫ్ట్ తో మీ అగచాట్లు భలే వున్నాయండీ..

మాలా కుమార్ said...

srilalita garu thanks andi.

Anonymous said...

This is called claustrophobia or elevator phobia.Using staircase is only way to get rid of this anxiety.Well written article.