ఈ రోజే నా బ్లాగ్ పుట్టినరోజు. నేనింకా రేపనుకుంటున్నాను. అదేమిటో ఈ మధ్య బాగా మతిమరుపు వచ్చేస్తోంది.
ఈ రోజు కు ఐదు సంవత్సరాలు నిండాయి.స్కూల్ల్ ల్లో వేయాలి :) ఐదు సంవత్సరాలంటే ఎక్కువే :) నేనసలు ఇన్ని సంవత్సరాలు బ్లాగ్ వ్రాస్తాననుకోలేదు :)
హాపీ బర్త్ డే సాహితి:)
11 comments:
చివురు తొడిగిన సాహితీమాల పుష్పించి ఫలించాలని ఆశిస్తూ శుభాభినందనలు.
సాహితికి పుట్టినరోజు శుభాకాంక్షలు..
అయిదేళ్ళూ నిండాయా.. ఇంకా స్కూలో వెయ్యలేదా..హయ్యో.. రెండేళ్ళు నిండగానే వేసెయ్యొద్దూ.. ఈపాటికి ఎమ్సెట్ కి రెడీ అవుతూండాలే.. హేమిటో.. మీరన్నీ యిలాగే చేస్తారేంటో..
సాహితీ......మనిద్దరం ఒకే బళ్ళో పక్కప్రక్కన కూర్చుని చదివేసుకుందామా నేను మీ క్లాసేగా. హ్యాపీ బర్త్ డే...మరి నాకు చాక్లెట్ ఇవ్వవా :-)
శ్రీలలిత గారూ :-))
సాహితి కి హోమ్ స్కూలింగేమో మాల గారి దగ్గరే!
శుభాకాంక్షలు మాల గారూ
ఉమాదేవి గారు,
మీ శుభాభినందనాలకు థాంక్ యు .
శ్రీలలిత గారు,
నేను పాతకాలందాన్ని కదా అందుకే ఐదోఏట స్కూల్ లోవేసేది .
థాంక్ యు.
పద్మార్పిత గారు,
అలాగే పక్కపక్కన కూర్చుందాము , ఐతే నాకు పేంటింగ్ కూడా నేర్పించండేం :)
సుజాత గారు,
నా దగ్గర చువుకుంటే మొద్దవుతుంది నా సాహితి , ముందే బద్ధకం ఎక్కువైంది :)
మీ శుభాకాంక్షలకు థాంక్స్ అండి.
wish you a beautiful birthday
wish you a beautiful birthday
సాహితికి పుట్టినరోజు శుభాకాంక్షలు మాలా గారు ..నా కబుర్లు కాకరకాయల కన్నా కొద్దిగా పెద్దది ....ఏ స్కూల్ లో వేస్తున్నారో చెప్పండి :)
ఇంకో రెండు నెలల్లో నాకు అయిదు నిండుతాయి మీ వెనుకే నేను చేరతాను అస్సలే వెనకబడిపోయాను నాకు కొంచెం ప్లేస్ వుంచండి :-)
మంజు గారు, హిమబిందుగారు,
నా సాహితి ని కార్పొరేట్ స్కూల్ లో చెర్చనండి. అక్కడ కుందేలు కూనల్లా తయారవుతారు:) గవర్నమెంట్ స్కూల్ లో చేరుస్తాను. అక్కడైతే పిల్లలు గట్టిగా అవుతారు:) సో మీ ఇష్టం :)
Post a Comment