"హాయ్ బామ్మా "
"హాయ్ కన్నా "
"కెన్ వుయ్ హావ్ మిడ్ నైట్ ఐస్క్రీం ?"
"వావ్ వాటే గ్రేట్ ఐడియా :)" ఎన్ని సంవత్సరాలైందో మిడ్ నైట్ ఐస్క్రీం తిని !అర్జెంట్ గా కళ్ళ ముందు రింగులు తిరిగిపోయాయి!
"బుజ్జిగాడా తప్పకుండా తిందాము కాని నువ్వు అప్పటి వరకు మెలుకువగా వుండగలవా మరి?"
"వుంటా బామ్మా."అనేసి హడావిడిగా "మహేష్" అని డ్రైవర్ ను పిలిచాడు.ఏమిటిబాబూ అంటూ వచ్చాడు మహేష్.
"నువ్వు మిడ్ నైట్ వస్తావా "?
మహేష్ కు అర్ధం కాలేదు :)
బాబు అర్ధరాత్రి బయటకు వెళ్ళి ఐస్క్రీం తింటాడట , నువ్వు వచ్చి తీసుకెళుతావా అని అడుగుతున్నాడు అని చెప్పాను.ఈ బామ్మా మనవళ్ళు ఎక్కడి పిచ్చోళ్ళు అనుకున్నాడో ఏమో , మా ఇద్దరినీ తిప్పి తిప్పి చూసి వస్తాను బాబూ అని చెప్పి వెళ్ళిపోయాడు.ఇహ అప్పటి నుంచి మా రాజాబాబు గారు గంతులే గంతులు. మాటి మాటి కీ టైం చూసుకోవటం , ఇంకా మిడ్ నైట్ ఎప్పుడవుతుంది బామ్మా అని హైరానా పడిపోవటం , నాకు చాలా ముచ్చటగా , వాడి కి చాలా భారం గా సమయం గడిచీ . . . గడిచీ . . . మొత్తానికి 11 అయ్యింది!
ఇహ మా హడావిడి మొదలైపోయింది. అందరూ బయిలుదేరేవరకూ వాడికి ఎంత కంగారో!తాత వస్తానని మర్చిపోయి నిద్రపోయారు.ఎంత లేపినా ఊ ఊ అంటారే కాని లేవరు ! డాడీ కి మీటింగూ!ఏచేస్తాం ఇద్దరినీ వదిలేసాం:)హాయిగా మా కోడలు , నేనూ , మనవడు, మనవరాలు వెళ్ళాము.
అబ్బ ఐస్క్రీం పార్లర్ ఎంత చల్లగా వుందో!ఐస్క్రీం ఓ పట్టాన తేడు. మేమిద్దరమూ చలికి ఊహ్ అనుకుంటూ వున్నాము. చివరకు తట్టుకోలేక వాడేమో చేతులు షర్ట్ లో దాచేసుకున్నాడు:)నేనేమో కొంగు పూర్తిగా కప్పేసుకున్నాను:) ఐనా చలి మమ్మలిని వదలందే!ఇద్దరికీ ఆరాటమే కాని ఏదీ తట్టుకోలేరు అని మాకోడలు, మనవరాలు మామీద జోకులు!అమ్మయ్య ఎట్లా ఐతేఏం మావాడి షేక్ (ఏమి షేక్ అబ్బా వాడేదో పేరు చెప్పాడు మర్చిపోయాను ), నా కసాటా , మనవరాలి బుల్ ఐ , కోడలి లీచీ ఐస్క్రీం వచ్చాయి.చలికి వణుకుతూ , చల్లటి ఐస్క్రీం తింటం వావ్ అదో తుత్తి :)
బయటకు వచ్చి కార్ లో ఎక్కుతూనే మహేష్ కు థాంక్స్ చెప్పాడు. పాపం మహేష్ సిగ్గుపడిపోయి ముసిముసి నవ్వులు నవ్వాడు.అంతే మా పని ఐపోయింది. ఎంత నిద్ర ముంచుకు వచ్చిందో!ఇంటికి వెళ్ళేదాకా అన్నా ఆగరా అంటే ఆ నిద్ర ఎలా ఆగుతుంది.ఏదో మిడ్ నైట్ ఐస్క్రీం మోజులో అప్పటి వరకూ అగాడుకాని !అలా అలిసిపోయి మీదవాలి నిద్రపోతుంటే ఎంత ముద్దువచ్చేసాడో చిన్నిగాడు:)
పైన కనిపిస్తోందే అది నా కొత్త కంప్యూటర్. మా అబ్బాయి తెచ్చి ఇచ్చాడు.అలా ఇస్తే పరవాలేదు బోలెడు జాగ్రత్తలు చెప్పాడు .ఇప్పుడేకాదు ముందు నుంచీ అంతే!మొదటిసారి నేను కంప్యూటర్ వాడినప్పుడు ఏ సైట్ కు వెళ్ళాలన్నా పర్మిషన్ అడిగేది.మా అబాయి కంప్యూటర్ పక్కకు తిప్పి ఏదో చేసేవాడు వచ్చేది . అప్పట్లో నేంతగా అదేమిటో పట్టించుకోలేదు. నా లాప్ టాప్ పిల్లలూ వాడేవారు.ఏదో కాజువల్ గా చూసినట్లు నా ఈ మేయిల్సూ చెక్ చేసేవాడు:) అందరికీ తలో ఎకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చాడు.ఓరోజు మనవరాలు అడిగింది"బామ్మా నువ్వు పెద్దదానివేకదా డాడీ నీకు ఎడ్మిన్ష్ట్రేషన్ పవర్ ఇవ్వొచ్చుకదా " అని . నిజమే కదా అనుకొని మావాడి ని షంటి, వాడితో బోలెడు కండీషన్స్ పెట్టించుకొని అడ్మిన్ష్ట్రేషన్ పవర్ తీసుకున్నాను. అప్పటి నుంచి పిల్లలు ఏదో ఓపెన్ చేసి తెచ్చి బామ్మా ఇక్కడ నీ పాస్ వర్డ్ రాయి అనేవారు. అప్పటికీ నేను అదేమి సైటా అని చూసేదానిని. పిల్లసన్నాసులు ఏసైట్ కు వెళుతారు , ఏవో గేంస్ కు వెళ్ళేవాళ్ళు పాపం. ప్రతిసారీ వాళ్ళు అడగటం నేను టైప్ చేయటం ఎందుకని నా పాస్ వర్డ్ వాళ్ళకు చెప్పేసాను. ఆ సంగతి డాడీ కి చెప్పొద్దు అనుకున్నాముకూడా !స్చప్ ఎలాగో తెలిసిపోయింది !ఇహ చూసుకోండి ఏమి తాండవమాడాడో .ఐదుగురం (ఇద్దరు మనవరాళ్ళు , ఇద్దరు మనవలు , నేను అన్నమాట)బిక్క చచ్చిపోయి , నిలువు గుడ్ళేసుకొని చూస్తూ వుండిపోయాము!అదేమిటో నేను పెద్దదాన్ని , వాడి అమ్మను అన్న జ్ఞానం కూడా లేకుండా పిల్లల ముందు చెడామడా అరిచేసి, నా అడ్మిన్ష్ట్రేషన్ పవర్ పీకేసి,కొన్ని రోజులు నేను కూడా లాప్ టాప్ వాడొద్దు అని రూల్ పెట్టేసి అబ్బో ఏ చెప్పాలి నా కష్టాలు !
సరే అదంతా పాత కథ కదా ఇప్పుడెందుకు అంటే ఇప్పుడు మళ్ళీ మొదటికొచ్చింది నా కథ!నేను గ్రీటింగ్ కార్డ్స్ కోసం ఏవేవో డౌన్లోడ్ చేస్తున్నానట!అందువల్ల నా కంప్యూటర్ లో వైరస్ వచ్చి ఫార్మెట్ చేయించాల్సి వస్తోందిట.ఈ కొత్త లాప్టాప్ లో ఏవీ డౌన్లోడ్ చేయనూ అంటేనే ఇస్తానన్నాడు!ముద్దుగా వున్న విండోస్ 8 లాప్ టాప్ వదులుకోబుద్ది కాలేదు!ఓ పది రోజులు తీవ్రం గా ఆలోచించాను.( అవును మరి పది రోజులు టైం ఇచ్చాడు, నేను ఇక్కడ వున్నన్ని రోజులూ వాడుకుంటాను తరువాత ఇచ్చిపోతాను అని.)గ్రీటింకార్డ్స్ నా, కంప్యూటరా అని . నా లాప్టాప్ మళ్ళి ఫార్మెట్ చేయించే స్టేజ్ కు వచ్చింది.ఇప్పటికే చాలా సార్లు చేయించాను.ఓ క్షణం అనుకున్నాను , పోరా నువ్వియకపోతే మా ఆయన కొని ఇవ్వరా ( మరే నేను కంప్యూటర్ నేర్చుకున్నపటి నుంచి నేను కంప్యూటర్ తో బిజీగా వున్నాను అని సంతోష పడిపోతూవుంటారు) అని కూడా అనుకున్నాను. కాని బుజ్జి దాన్ని వదులుకోలేక , గ్రీటింకార్డ్స్ చేయటానికి వాడుపెట్టిన షరతులు ఒప్పేసుకున్నాను.ఇహ పైన ఫొటో షాప్ లో రకరకాలుగా చేయలేను. నా పోస్ట్ లలో ఇమేజెస్ పెట్టలేను !లేదా అందరినీ ఫొటోలు అప్పు అడుక్కోవాలి:) నేను తీసిన ఫొటోలో లేక ఇంకెవరన్నా పర్సనల్ గా తీసిన ఫొటోలో మాత్రమే వుపయోగించాలిట!నెట్ నుంచి అస్సలు అస్సలు తీసుకోవద్దట! ఈ లాప్టాప్ ఫార్మెట్ చేయిస్తే మటుకు ఇకపై నేను లాప్ టాప్ మర్చిపోవాల్సిదే అని హెచ్చరించి మరీ ఇచ్చిపోయాడు. ఓ పక్క సంతోషం , ఓ పక్క దుఖం:)
లాప్ టాప్ గోలకేమొచ్చే గాని , ఐస్క్రీం తిని వస్తుంటే మా బుజ్జిగాడు బామ్మా మనం ఐస్క్రీం తిన్నది నీ బ్లాగ్ లో వ్రాయాలి అన్నాడు. నేను మాట్లాడలేదు . అవునాంటీ తప్పకుండా వ్రాయండి. అంది . ఏమో అనూ నేను పిల్ల ల విషయాలు కొంచం ఓవర్గా వ్రాస్తున్నానేమో అనిపిస్తోంది అన్నాను. లేదాంటీ , మీకు తెలుసా గౌరవ్ కు నేనెప్పుడూ చెపుతూవుంటాను, నీ పిల్లలకు మీ బామ్మ నీ గురించి వ్రాసినవన్నీ చదివి వినిపిస్తాను.అప్పుడు మీ బామ్మ ఫ్రెండ్స్ ఇలా అన్నారు అని కామెంట్స్ కూడా చదివి వినిపిస్తాను అని అంది.నిజమా అని ఎంత త్రిల్ ఫీలైపోయానో!.అవునాంటీ పిల్లల చిన్నప్పటి సంగతులు మీ ఫీలింగ్స్ అన్నీ చదవటానికి బాగుంటున్నాయి.అవి వాళ్ళపిల్లలకు చదివి వినిపిస్తుంటే ఇంకా బాగుంటుంది కదూ అంది.
ఓహ్. . . నేనెప్పుడూ ఇలా అనుకోలేదు. బ్లాగ్ లో ఏదో రాసుకోవాలి అనుకోవటం , నీకు నచ్చినవి వ్రాసుకో అమ్మా అని మా అమ్మాయి సలహా ఇవ్వటం తో , పిల్లల సంగతులు , మావారి గురించి ఐతే ఏగొడవలు రావుకదా అనుకొని అవి వ్రాసుకుంటున్నానే కాని , భవిష్యత్తులో నా ముని మనవలు- మనవరాళ్ళు చదువుతారు అని ఎప్పుడూ అనుకోలేదు!పైగా ఈ మధ్య మరీ ఓవర్ గా వ్రాసానేమో అనుకున్నవి డిలీట్ చేసానుకూడా ! అయ్యో అనుకుంటున్నాను ఇప్పుడు. బుజ్జిగాడు వాడి బర్త్డే కు అడిగి మరీ కార్డ్స్ పెట్టించుకునేవాడు. పిల్లలు సర్ప్రైజ్ గా వాళ్ళ బర్త్ డేస్ కు పోస్ట్ వేస్తే ఎంత సంతోషపడిపోయేవారో. అలా సంతోషపడ్డానే కాని , ఈ కోణం లో ఎప్పుడూ ఆలోచించలేదు .నా మునిమనవరాలు/మనవడు ను మధ్యలో పడుకోబెట్టుకొని, నా బ్లాగ్ ఓపెన్ చేసి, నాకోడలు చదివి వినిపించటం వూహించుకుంటూంటేనే ఎంత ఉద్వేగం గా వుందో!ఆ రోజు నేను వుండను కాని నా బ్లాగ్ , నా బ్లాగ్ లో నేను వ్రాసిన నా మనవడి గురించిన విషయాలు సజీవంగా వుంటాయి.మా కోడలు చెపుతుంటేనే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి.తట్టుకోలేని ఆనందం తో తనని హగ్ చేసి థాంక్ యూ అనూ అని చెప్పాను !ఏమో ఎవరు చెప్పొచ్చారు , ఆ మునిమనవడుగానో/ముని మనవరాలూగానో నేనే మళ్ళీ జన్మించి వుండవచ్చుకదా !అప్పుడు ముందు జన్మలో నేను వ్రాసుకున్నవే నేను వినటం ఓహ్ ఎంత అద్భుతంగా వుంది ఈ ఊహ!ఓ మరీ ఎటో వెళ్ళిపోయాను కదూ :)
నా మనవడి కోరిక మీద నా కొత్త లాప్ టాప్ వాడి మిడ్ నైట్ ఐస్క్రీం తోనే మొదలు పట్టాను :) అందుకే అన్ని విషయాలు , నా లాప్ టాప్ గురించి, ఐస్క్రీం గురించి , అఫ్ కోర్స్ నా పునర్జ్మ గురించి అన్నీ కదంబమాల లా వచ్చేసాయి:)

15 comments:
ఏమో మీ మునిమనవళ్ళకీ/మనవరాళ్ళకీ మీ బ్లాగు మీరే చదివి వినిపిస్తారేమో. ఉండరని ఎందుకనుకోవాలీ? బాగున్నాయి మీ కబుర్లు. :)
మనవలతో అర్ధరాత్రి ఐస్క్రీం తినే భాగ్యం కలిగిందన్నమాట. బావుందండీ.
చలిలో అర్ధరాత్రి మనవలతో ఐస్ క్రీం తినడం వణుకుతూ గొప్ప అనుభవం. మన తరవాత మన బ్లాగు మన మనవలు ముని మనవలు చదువుతారంటారా?
మాలా గారు .. ఎంత బావుందో! ఐస్ కరీం ముచ్చట్లు కన్నా ..మీ ముచ్చట్లు ఎంత బావున్నాయో ! ఏటో..వెళ్లి పోయింది మనసు :) అదుర్స్.
మనవడితో గడిపిన మిడ్ నైట్ ఐస్క్రీమ్ ముచ్చట్లే మిమ్మల్నింత అందమైన బావోద్వేగానికి గురిచేసాయే.. మరింక మునిమనవడితో గడిపితేనో.. అందుకే మీరింకా పదికాలాలు మునిమనవడితో ఐస్క్రీమ్ తినేవరకూ వుండాలి, అది మళ్ళీ మీరు వ్రాయాలి, మేమంతా కామెంట్లు పెట్టాలి.. అంతే.. ఇంక దీనికి తిరుగులేదు.
మాల గారు మీ మనవడి ఐస్క్రీం కోరిక తీర్చడానికి వెళ్లి చక్కగా మీరూ బాగా ఎంజాయ్ చేసారనమాట .మీ కొత్త లాప్టాప్ బాగుంది .దాంట్లో మీ మనవల గూర్చి బోల్డు సంగతులు మీరు రాయాలి మేమంతా చదవాలి .పోటోల కోసం బెంగ పెట్టుకోకండి మేమంతా ఉన్నాంగా మీకు కావలసినవి పంపడానికి (రాధిక నాని )
"మా కోడలు చెపుతుంటేనే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి.తట్టుకోలేని ఆనందం తో తనని హగ్ చేసి థాంక్ యూ అనూ అని చెప్పాను"
మరే మా మనసుల తలుపులూ తట్టారండీ
చలచల్లని అక్షరమాలతో మనసుని పెనవేసి చిన్నారుల ఐస్ క్రీం ముచ్చట్లు వినిపించారు.మీరు ప్రక్కనే కూర్చుని చెప్తున్నట్లే ఉంది మరి!కొత్త ల్యాప్ టాప్ కు Congrats!
మనవలకి పిల్లలు పుట్టాక వీళ్ళ చిన్నప్పటి విషయాలు చదివి వినిపించడం..నిజంగా ఊహించుకోవడానికి బావుంది.nice post
శిశిరా,
పాపి చిరాయువు అని ఇంకా 30 ఏళ్ళు బతకమంటావా వద్దులే :)
*జ్యోతిర్మయి గారు,
అవునండి :)
*కష్టేప్ఫలేగారు,
నా బ్లాగ్ వాళ్ళు చదివినా చదవకపోయినా మా కోడలు ఆ మాట అంది అదే నాకు చాలా ఆనందం కలిగించింది :)
వనజగారు,
నా కబుర్లు నచ్చినందుకు థాంక్స్ అండి.
*శ్రీలలిత గారు,
మునిమనవడితో గడపటం ముచ్చటగానే వుంటుంది కానీయండి, ఇప్పటికే శరీరానికి చిన్నా పెద్దా బోలెడు రిపేర్లు వచ్చాయి:) ఈ రిపేర్ల తో అందరినీ ఏడిపిస్తూ ఏముంటాను లెండి :)
రాధికగారు,
నిజం చెప్పమంటారా :)మా అబ్బాయి ఫొటోల గురించి చెప్పగానే మీరు, శేఖర్ గుర్తొచ్చారు. మీ ఇద్దరినే అడగాలి అనుకున్నాను. నా మనసులోని మాట తెలిసినట్లు అప్పుడే శేఖర్ కొన్ని కొత్త ఫొటొలు తీసాను చూడండి మీకు పనికి వస్తాయేమో అని పంపారు. మీరూ ఇస్తానంటున్నారు. చాలా చాలా సంతోషంగా వుంది. థాంక్ యూ వెరీ మచ్ .
*శ్రీనివాస్ పప్పూ గారు,
థాంక్స్ అండి.
*ఉమాదేవి గారు,
థాంక్స్ అండి.
* అనామిక గారు,
కదా !ఆ ఊహే ఎంత బాగుందో :) థాంక్స్ అండి.
Congrats! బాగున్నాయి మీ కబుర్లు:)))
కొత్త లాప్ టాప్ కి అభినందనలు. నెట్ నుండి డౌన్లోడ్ చేసుకోకుండా ఫోటోషాపింగ్ చేసుకోండి. మీకు బొమ్మలివ్వడానికి బోలెడు మంది ఉన్నారుగా. నేను కూడా.. ఓ మెయిల్ పడేసినా, కాల్ చేసినా సరే.. కావాలంటే డౌన్లోడ్ చేసిస్తాలెండి. ఊర్వశిని జబ్బు చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి.. :)
సునీత గారు,
థాంక్స్ అండి.
*జ్యోతి గారు,
థాంక్స్ అండి. తప్పకుండా అడుగుతాను.థాంక్యు.
మరే జబ్బు చేయకుండా చూసుకోవాలనే నా ఆశ :)
Post a Comment