Friday, September 20, 2013

చక్కటి పూల కు చాంగుభళా!


నిత్య పూజలివిగో నెరిచిన నోహో
ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో


ముద్దుగారే యశోద ముంగిట ముత్యము.


 పచ్చకప్పురమె నూఱి పసిడి గిన్నెల నించి - తెచ్చి శిరసాదిగ దిగనలది
అద్దెరబ ఈ కూన అందరి కన్నులకింపై,


పేరంటాళ్ళ నడిమి పెళ్ళికూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు - See more at: http://www.lyricsintelugu.com/2010/07/pidikita-talambrala-pendli-koothuru.html#sthash.EgYZU2wp.dpufపేరంటాళ్ళ నడిమి పెళ్ళికూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు - See more at: http://www.lyricsintelugu.com/2010/07/pidikita-talambrala-pendli-koothuru.html#sthash.EgYZU2wp.dpufపేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరుకుచ్చు సిగ్గువడీ బెండ్లి కూతురు.కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సలుపు చూపులకు చాంగుభళా!


ఉన్నతి పతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా!


జల్లన పుప్పొడి జారగ పతిపై చల్లే రతివలు జాజర.

ఈ సారి కుసిన వానల మహత్యమో, ఆరు సంవత్సరాలుగా నేను చేస్తున్న కృషి , సంవత్సరము గా  కొత్తమాలి ఈశ్వర్ పడుతున్న శ్రమ కు ఫలితమో , ఏదైనా కాని ఈ సారి నా తోట నలువైపులా రంగు రంగుల పూవులతో కనులకింపుగా వుంది:)

ఇదికాదే సౌభాగ్యము,ఇదికాదే వైభవము!
ఇంతటి ఆనందములో ,పక్కుంటి వారికోసం బాదం చెట్టును కు వీడ్కోలు ఇవ్వటం , వెనికింటి వారి కోసము అరటి మొక్కను తీసేయటము సరిపోనట్లు కొత్త బాధ వచ్చింది :(


  అంతర్యామీ అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదే చొచ్చితినీ!`

చెట్టు నిండా బోండాలతో కళకళలాడుతూ , ప్రతి శనివారమూ వెంకటేశునికి తప్పక కాయనిస్తుంది ఇది. ప్రతి శ్రీరామనవమి కీ "విను వీధుల తిరిగే " మా శ్రీరామునికి నాలుగు సంవత్సరాలుగా మా ఇంటి ముందు దీని కాయను సమర్పించుకుంటున్నాము.అంతేనా ఇంటికెవరు వచ్చినా పైకి తీసుకెళ్ళి , పిట్ట గోడ మీదుగా అందే బోండాళ్ళను , వాళ్ళు కోసుకుంటే ఆనందిస్తున్నాము.అదేమిటో దీని కాండానికి చెదలు పట్టాయి. ఏ మందులకూ లొంగటము లేదు. కాండమంతా డొల్లగా ఐపోయింది. ఐనా చెట్టు నిండా బోండాలు వస్తూనే వున్నాయి. మొన్న శ్రావణ శుక్రవారానికి , వినాయక చవితి కీ నాలుగేసి పెద్ద పెద్ద కాయలు ఇచ్చింది. ఐనా ఈ చెట్టును వుంచకూడదుట!ఇంత డొల్ల వుంటే ఎప్పుడైనా కూలిపోవచ్చు, చాలా ప్రమాదం అంటున్నారు. నిన్న మా వియ్యంకుడు చూసి మరీ మరీ చెప్పారు తీసేయమని.శుక్రవారము, మంగళవారము కాకుండా చూడండి, ముందుగా దీని కాయలు గుళ్ళో కొట్టండి, చెట్టుకు పసుపూ కుమకుమ తో పూజచేసి తీసేయండి తప్పదు అని మరీ మరీ చెప్పివెళ్ళారు. ఎంత దిగులుగా వుందో !


 దిగులుపడకు నేను పూత మొదలుపెట్టాను కదా అని ఓదారుస్తోంది పక్కనున్న ఇంకో నారికేళవృక్షం.


నానాటి బ్రతుకు నాటకము.
ఓ నిష్క్రమణ , ఓ అవిష్క్రమణ తప్పనిదేమో!

మొగ్గ తొడిగినప్పటి నుంచి పుష్పించేవరకూ గమనించటం ఎంత ఆనందం :) ప్రతిరోజూ ఉదయమే మొక్కలలో తిరుగుతూ ఏవి పూసాయి, ఏవి వాడిపోయాయి అని పరిశీలిస్తూ ,నా మాట వినని  మొండి మొక్కలు రాధామాధవాన్ని, గన్నేరును మందలిస్తూ,నీకెప్పుడూ ఎర్ర మందారమే ఇష్టం నేనంటే ఇష్టం లేదు అని అలిగే పసుపు, గులాబీ మందారాల అలుకలు తీరుస్తూ , అదిగో అల్లదిగో అంటూ పైపైకి పోతున్నావు కాని ఎప్పుడు పూస్తావు అని మల్లెను కోపం చేస్తూ, నువ్వు బంగారుతల్లి పూయటం మొదలుపెట్టిన సన్నజాజిజి బుజ్జగిస్తూ (నా మొహం మూడే పూలు పూసింది. గట్టిగా అంటే అవీ పూయదేమో),నన్ను పూజకు ఎప్పుడూ కోయవు అని మూతిముడిచే గోరింట, చంద్రకాంత, కనకాంబరాలను ఓదారుస్తూ (అదేమిటో అవి పూజకు పనికి రావని ఎవరో చెప్పారు ) భావములో , భాహ్యంలో ఆ గోవిందుని తలుచుకుంటూ నేను పూజకు పూలు కోసుకొచ్చేసరికి చాలా సార్లు మావారి పూజైపోతుంది :) 

క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహలక్ష్మికిని
నీరజాలయకును నీరాజనం - 

13 comments:

తృష్ణ said...

colourful!!బాగుందండి మీ తోట.

Unknown said...

చాలా బాగుంది మీ తోట. బాగా రాసారు (పాడారు)రాధిక (నాని)

sreelu said...

బాగుంది మీ తోట.....తోట లొని పువ్వులు.....ఎంతైనా మనం పెంచుకున్న చెట్ల పువ్వులతో పూజ ఎంతో ఆనదకరంగా వుంటుంది...

సిరిసిరిమువ్వ said...

భలే..రోజూ అలా మొక్కలకి పాటలు పాడుతూ ఉంటారన్న మాట. ఉదయాన్నే మొక్కల్లో తిరగటం భలే ఉంటుందండి.

ఏవైనా సరిగ్గా పెరగక పోయినా..చనిపోయినా ఎంత బాధగా ఉంటుందో.

శ్రీలలిత said...


మొత్తానికి మీ తోటలో పదకవితాపితామహులు అన్నమాచార్యులవారిని దింపేసారు. చాలాబాగుంది.

సి.ఉమాదేవి said...

మీ మనసే అందాల బృందావనం!మరి మీ వనవిహారంలో విరిసిన పుష్పరాగాలాపన మనసుపై కురిసిన చిరుజల్లు... ఊహూ విరిజల్లు!

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుందండీ మీ తోట. పూలూ వాటికి మీరద్దిన పాటల పరిమళాలు రెండూ చాలా బాగున్నాయ్.

Sunita Manne said...

బాగుందండి మీ తోట:)))

శశి కళ said...

photolu super ...poolu super :))

nagarani yerra said...

బావుందండీ!తోటలో తిరుగుతూ మీరు చేసే స్వరాభిషేకంతోనే మీ తోట బాగా పెరుగుతున్నట్లుంది.చెట్లు కొట్టివేయాల్సి వచ్చినప్పుడు పడే బాధ నాకూ అనుభవమే.చక్కగా వ్రాసారు.

Typed with Panini Keypad

నవజీవన్ said...

మీ తోట ...మీ పూలు...మీ పదాలు అన్నీ బాగున్నాయి...

మాలా కుమార్ said...

trushna garu,
radhika garu,
Sreelu garu,
sirisirimuvva garu,
srilalita garu,
c.umadevi garu,
venu srikant garu,
sunita manne garu,
sasikala garu,
nagarani yerra garu,
navajevan garu,

andari kii chaalaa chaalaa thanks andi.

Anonymous said...

Thanks for another informative web site. Where else may
I am getting that type of info written in such a
perfect means? I've a mission that I am just now operating on, and I have been at the
glance out for such info.

Here is my blog - Free Music Downloads (Http://Freemusicdownloadsb.Com)