Saturday, June 1, 2013

విహంగ లో నా కథ "మట్టిలో మాణిక్యం "


"మీరు కథలు వ్రాయొచ్చుకదా?" కలిసినప్పుడల్లా , కాల్ చేసి నప్పుడల్లా పి.యస్.యం లక్ష్మి గారి డైలాగ్ ఇది .అబ్బే నాకేమొచ్చండి నేనేమి వ్రాయగలనండీ నా మొహమాటపు జవాబు . "పొనీ ఏదైనా ఆర్టికల్స్ వ్రాసి మాగ్జిన్స్ కు పంపండి ." అనేవారు . ఆవిడంత ప్రోత్సహించినా ,బ్లాగ్ వ్రాసి ఇప్పటికే జనాలను తింటున్నాను , ఇహ కథలు కూడా వ్రాసి ఎందుకు ఏడిపించటము అనుకొని ఆవిడ మాటలను వినిపించుకోలే:)(ధైర్యం చాలలే )అలా అలా గడిచిపోతూ వుండగా ఓ సంవత్సరము నుంచి శ్రీలలితగారు మొదలయ్యారు . ఆవిడ కు ఉమాదేవి గారు తోడయ్యారు . అబ్బే అప్పటికీ మనం ఏమి వ్రాయగలం లే అనె అనుకున్నాను . ఇలా కాదని వాళ్ళు ముగ్గురూ కలిసి దండెత్తారు . అదేమిటో పాపం వాళ్ళకు నా మీద అంత నమ్మకం :)

"నిన్న ఉమాదేవి గారితో మాట్లాడానండి . మీ టాపిక్ కూడా వచ్చింది . మీరు కథలు వ్రాస్తే బాగుంటుంది అనుకున్నాము ఇద్దరమూ "అన్నారు శ్రీలలిత చాట్ లో. మరునాడు ఉమాదేవిగారు కాల్ చేసి "మాలా ,నేను శ్రీలలిత గారు మీరు కథ లు వ్రాస్తే బాగుంటుంది అని నిన్న మాట్లాడుకున్నప్పుడు అనుకున్నామండి "అన్నారు . నాకేమి మాట్లాడాలో తోచలేదు .సరే పోనీ వాళ్ళు ముగ్గురూ అంత ముచ్చటపడిపోతున్నారు . వాళ్ళ కోరిక తీరుస్తే పోలా అనుకొని ఎడమ చేత్తో , కుడి చేత్తో ఓ నాలుగు కథలు వ్రాసేసాను :)

వాటిని నా మొదటి శ్రోతలైన , మా అమ్మాయి , మాచెల్లెలు జయ లకు వినిపించేసి కాసిని మార్పులు చేసేసి శ్రీలలిత గారి మీద దండెత్తాను . మీరు చదవాల్సిందే నని మొహమాట పెట్టి చదివించేసాను . పాపం ఏదో పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు బలైపోయారు .మావారి కి కూడా వినిపించాను కాని పాపం వెరీ గుడ్ వెరీ గుడ్ అనేసారు .

సరే నాలుగు లో ఒహటి విహంగ కు పంపాను . మిగితావి పరిశీలనలో వున్నాయి .(నా పరిశీలన లోనే )దాని సంగతి అటో ఇటో తేలాక , మిగితావి చూద్దామనుకున్నాను :)
అప్పటి నుంచి టెన్షన్ . ఏమంటారో . బాగాలేదనంటారో , బాగుందంటారో అబ్బో చెప్పలేను .వారం క్రితం హేమలత గారు మీ కథ ఈ నెల విహంగ లో వేస్తున్నామండి అని చెప్పగానే వావ్. . . నిజంగా వేస్తున్నారా ? మీకు నచ్చిందా ? అని ఎన్ని ప్రశ్నలు వేసాను .పాపం ఆవిడ ఓపిక గా జవాబిచ్చారు :)

అదీ సంగతి . అలా నా మొదటి కథ వచ్చేసింది .ఇదో ఇక్కడుంది . చదివేసి మీ అభిప్రాయాలు కూడా చెప్పండి .

పట్టుబట్టి నాతో కథ వ్రాయించిన మామంచి స్నేహితులు , శ్రీలలిత గారి కి , పి.యస్. యం లక్ష్మి గారి కి , ఉమాదేవి గారికి బోలెడు ధన్యవాదాలు . నా మొదటి కథ ను ఆదరించిన హేమలత గారి కి చాలా చాలా ధన్యవాదాలు .

9 comments:

Anonymous said...

Advanced congrats. I will read the story now

శ్రీలలిత said...


హృదయపూర్వక అభినందనలండీ.
మీరు ఇలాంటి మంచి కథలు ఇంకా చాలా చాలా రాయాలని కోరుకుం టున్నాను.



Anonymous said...

కధ ఏక బిగిన చదివించారు, మంచి ప్రయత్నం. ఇక మీ నుంచి కధలే వింటామనమాట, :)

సి.ఉమాదేవి said...

మీ మనసులో కథాసాహిత్యం చిగురువేయడంలో మేము నిమిత్తమాత్రులమే!మొగ్గతొడిగిన మీ తొలి కథాపుష్పానికి సుస్వాగతం.మరిన్నిమంచికథలు మీనుండి తప్పక వస్తాయి. కథాభినందనలు అందుకోండి.

మధురవాణి said...

మొదటి కథ అచ్చయినందుకు అభినందనలు. కథ బాగుంది మాలా గారూ.. రాస్తూ ఉండండి. :)

Ennela said...

విమలల అవసరం ఎంతో ఉందండీ. నాకు తెలిసిన ప్రతి శాంభవి కీ విమలలు దొరకాలని ఆశ కలుగుతోంది.
మీరు కథలు ఇంకా చాలా చాలా రాయాలని కోరుకుం టున్నాను

మాలా కుమార్ said...

కష్టేఫలేగారు, మీ బ్లాగ్ లో నాకు కామెంట్ పెట్టేందుకు రావటం లేదండి .చాలాసార్లు ప్రయత్నించి వూరుకున్నాను .కామెంట్ పెట్టలేను కాని , మీ పోస్ట్ లు అన్నీ చదువుతూనే వుంటానండి . మీ వాఖ్యకు ధన్యవాదాలు .

శ్రీలలితగారు , థాంక్స్ అండి .

ఉమాదేవి గారు ,
మీ అందరి ప్రోత్సాహమేనండి:) చాలా థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

మధురవాణి ,
వెన్నెల గారు ,
మీకు నా కథ నంచ్చినందుకు , మీ ప్రోత్సాహానికి థాంక్స్ అండి.

Anonymous said...

very good and touching AtTaYya. -Ravi Komarraju