Tuesday, November 6, 2012

ఒప్పుల కుప్పా వయ్యారి భామా




 
ఒప్పులకుప్పా వయ్యారి భామా ,
సన్నా బియ్యం చాయాపప్పూ ,
బిస్తీ బిస్తీ బీరాకాయా .

గుడు గుడు గుంచం గుండేరాగం ,
పాముల పట్టం పడగేరాగం,
పెద్దన్నపెళ్ళీ పోదము రండీ ,
చిన్నన్న పెళ్ళీ చూతము రండి .

ఏకాలమైయిందీ ఈ ఆటలన్నీ ఆడి . ఈ మద్య మా ఫ్రెండ్ ఈ బొమ్మలు ఎక్కడి నుండో తెచ్చి చూపించింది . అంతే తేనతుట్టె కదిలింది :)
బిస్తి గీస్తూ ఎంత గిర్రున తిరిగే వాళ్ళమో :) ఎవరు ముందు వదిలేస్తే వాళ్ళూ ఓడినట్లు . నా మొహం గెలిచినవాళ్ళూ , అంత స్పీడ్ లో తిరుగుతూ వాళ్ళు వదిలేయగానే వీళ్ళూ  ధన్ మని కింద పడిపోయేవారు :) కాని కళ్ళు తిరిగే వరకూ తిరగటం ఎంత మజా :)

గుడు గుడు గుంచం నుంచి , కాళ్ళా గజ్జా దాకా వచ్చి చక్కిలింతలు కలిగితే అదో ఆనందం .

రింగులు తిప్పికుంటూ బాల్యం లోకి వెళ్ళిపోయాను :)

ఈ మధ్య ఎక్కడో చదివాను , ఈ పాటలల్లో సైంటిఫిక్ రీజన్ వుంది అని వివరిస్తూ రాసారు . ఎక్కడ చదివానో గుర్తు రావటం లేదు .గుర్తొచ్చి , దొరికితే పెడతాను :)






19 comments:

చెప్పాలంటే...... said...

marchi poyina aatalu malli gurtu chesaaru nice post thank u mala garu

Padmarpita said...

మళ్ళీ ఈ ఆటలన్నీ ఆడుకుంటూ ఆదమరిస్తే ఎంతబాగుంటుందో!

రాధిక(నాని ) said...

baagunnayandi photolu.

జలతారు వెన్నెల said...

Lovely memories

వనజ తాతినేని/VanajaTatineni said...

మర్చి పోయిన వాటిని మళ్ళీ గుర్తుకు తెచ్చారు.

ఇప్పటి తరంకి పరిచయం చేయడం అవసరం. ధన్యవాదములు

సి.ఉమాదేవి said...

ఒకనాటి ఆటలు,పాటలు మనసుపై చెరగని ముద్రలు.మరోమారు గుర్తుచేసి సంబరపరిచారు.

మాలా కుమార్ said...

చెప్పాలంటే గారు ,
థాంక్ యు .

* పద్మార్పిత గారు ,
మళ్ళీ ఈ ఆటలన్నీ ఆడుకుంటూ ఆదమరిస్తే నిజం గా ఎంత బాగుంటుందో కదా :)

*రాధిక గారు ,
థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

జలతారువెన్నెల గారు ,
నిజమే లవ్లీ మెమొరీసే :)

*వనజా వనమాలి గారు ,
బాల్య స్మృతులన్నీ గుర్తొచ్చాయా :) థాంక్స్ అండి .

*సి.ఉమాదేవి గారు ,
ఇలా అప్పుడప్పుడు ఆ మధురస్మృతులను గుర్తుతెచ్చుకుంటూ వుంటేనే ఆ ఆనందమే ఆనందం కదండీ :) థాంక్స్ అండి .

రాజ్యలక్ష్మి.N said...

మీ స్వీట్ మెమొరీస్ బాగున్నాయండీ..
ఈ ఆటల్లో సైంటిఫిక్ రీజన్స్ గురించి ఎప్పుడో స్వాతి వీక్లీ లో వచ్చినట్లు గుర్తున్నాయి ..

పరిమళం said...

Beautiful memories....:)

శిశిర said...

నిజమేనండీ. ఈ ఆటలు ఆరోగ్యానికీ, జ్ఞాపకశక్తికీ మంచివట. మంచి శారీరిక, మానసిక వ్యాయామం.

శ్రీలలిత said...


ఒక్కసారి మనసులో ఒప్పులకుప్ప తిరిగేసానంతే...
యేమిటో ఆ రోజులు..ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా వుండే రోజులు...

శ్రీలలిత said...


ఒక్కసారి మనసులో ఒప్పులకుప్ప తిరిగేసానంతే...
యేమిటో ఆ రోజులు..ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా వుండే రోజులు...

జ్యోతిర్మయి said...

బొమ్మలు చాలా అందంగా వున్నాయి.

మాలా కుమార్ said...

రాజి ,
పరిమళం గారు ,
శిశిర,
శ్రీలలిత గారు ,
జ్యోతిర్మయి గారు ,
థాంక్ యు .

ధాత్రి said...

ఎంత మంచిపోస్టో..
బాల్యాన్ని గుర్తుచేసారు...:)

మాలా కుమార్ said...

dhaatri garu ,
thank you .

సుభ/subha said...

దీపావళి శుభాకాంక్షలండీ..

మాలా కుమార్ said...

సుభ గారు ,
థాంక్స్ అండి . మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు .