Monday, September 3, 2012

లక్ష్మీనారాయణ యజ్ఞంమావారు , ఆయన ఫ్రెండ్ అనుకోకుండా , జూబిలీహిల్స్ లోని పూరీజగనాథ ఆలయాని కి వళ్ళారుట . అక్కడ లక్ష్మీనారాయణ యజ్ఞం జరుగుతొందిట . మావారి కి ఆ యజ్ఞం చూడగానే , ఆయజ్ఞం లో కూర్చోవాలి అనిపించి , కార్యకర్త లను , మాకూ కూర్చునే అవకాశం ఇవ్వగలరా అని అడిగారట . ఆయనేమో , లేదండి అన్ని బుక్కైపోయాయి అన్నారట . ఐనా సరే నా నంబర్ తీసుకోండి , ఒకవేళ ఏకారణం చేతైనా , ఎవరైనా డ్రాప్ అవుతే మాకు అవకాశం ఇవ్వండి అని ఆయన ఫోన్ నంబర్ ఇచ్చి వచ్చారట .ఆ మరునాడే కార్యకర్త శంకర్ నారాయణజీ కాల్ చేసి మీ సంకల్పం చాలా బలంగా వుంది , 31 న ఒకరు డ్రాపైపోయారు , మీకు వీలైతే మీరు రావచ్చు అన్నారు . అంతే మావారు చాలా సంతోషపడిపోయి ఓ తప్పకుండా వస్తాము అన్నారు . అలా లక్ష్మీనారాయణ యజ్ఞం లో పాలుపంచుకునే అవకాశం మాకు వచ్చింది .
శుక్రవారం 31 వుదయం 8 గంటలకే యజ్ఞవాటిక కు వెళ్ళాము .మావారి కి దీక్షా వస్త్రాలు ఇచ్చారు . అవి వేసుకొని , గుడిలోకి వెళ్ళి స్వామివారి ధర్షనం చేసుకొని వచ్చాము . 8.30 కు యజ్ఞం మొదలైంది . మొత్తం ఐదు యజ్ఞ కుండాలు వున్నాయి . వాటి దగ్గర ఐదుగురు బ్రాహ్మలు , ఇద్దరు దంపతులు కూర్చున్నారు . యజ్ఞ ప్రధాన ఆచార్యులవారు లక్ష్మీకాంత్ జీ ధీక్షిత్ వారణాశి నుంచి వచ్చారు . ఇంకా పదహారుగురు ఆచార్యులు కూడా వారణాశి నుంచి , మిగిలిన ఆచార్యులు ఇక్కడివారు వున్నారు . మేము వెళ్ళిన ది యజ్ఞం మొదలైన ఆరోరోజు న . ఇలా యజ్ఞం లో కూర్చొవటం మాకు ఇదే మొదటిసారి . శుక్రవారం , పౌర్ణమి , శతబిషం నక్షత్రం వున్న రోజున మేము యజ్ఞం లో కూర్చోవటం చాలా మంచిదైంది అన్నారు ఆచార్యులవారు . అక్కడివారి పద్దతి ప్రకారము దంపతులలో మొగవారి కండువాకు , ఆడవారి వోణీ కొసకు , తొమ్మిది ముడులు వేసారు . అందులో రూపాయి కాసును , బియ్యం , ఇంకా ఏవో పెట్టారు . పూజలో వున్నంతసేపూ ఇద్దరి ముడులనూ అలాగే వుంచారు .

ముందుగా గణపతి పూజను ఆ తరువాత వాస్తుదేవుని పూజను చేయించారు . ఆ తరువాత యాగ కుండాల దగ్గర కూర్చోబెట్టి , అగ్ని లో నెయ్యి ని , నవధాన్యాలు వేయిస్తూ , ఉదయము , స్త్రీ సూక్తం తోనూ , మధ్యాహ్నము పురుష సూక్తం తోనూ యాగం చేయించారు . 12 .30 విరామం ఇచ్చి ప్రసాదం ఇచ్చారు . మళ్ళీ మధ్యాహ్నం 3.30 మళ్ళీ మొదలు పెట్టారు . మధ్య విరామ సమయంలో లలితాసహస్రనామం చేసారు . అప్పుడు తామరపూవులతో అమ్మవారిని పూజించారు . 6.30 యజ్ఞం ముగిసిన తరువాత లక్ష్మీనారాయణులకు హారతి , నివేదన చేసారు .
మరునాడు శనివారం సాయంకాలం 4.30 కు పూర్ణాహుతి కోసం వెళ్ళాము . ముందుగా ఈ ఏడురోజులూ యజ్ఞం చేసిన వారినందరినీ యాగస్తలం ఉత్తర్దిశగా తీసుకెళ్ళారు . అక్కడ అందరి మధ్యలో ఒక బుట్టలో శనిదేవుని విగ్రహం పెట్టి అందరూ దక్షణలను సమర్పించారు . ఆ తరువాత పూజ చేసారు . ఆపైన ఆ బుట్టను ఒకతను ( అతని ని ఏదో అన్నారు , మర్చిపోయాను ) నెత్తిన పెట్టుకొని అందరి చుట్టూ తిరిగాడు . అప్పుడు అందరిని తలలు వంచుకొని కళ్ళు మూసుకోమన్నారు . ఆ కార్యక్రమము చూడకూడదుట . అలాగే యజ్ఞవాటిక చుట్టూ కూడా తిప్పించారు . అప్పుడు మా అందరినీ దూరం గా వుండమన్నారు . ఆ తరువాత కాళ్ళూ చేతులు కడుక్కొని మళ్ళీ యజ్ఞవాటికలోకి వళ్ళాము . అందరినీ అన్ని కుండాలచూట్టూ నిలబెట్టి , కుండాలలో నెయ్యిని పోయించారు . దానికి అరటిబోదలతో పైపులా చేసి . కుండం ముందు వెదురుకర్రల సపోర్టుతో నిలబెట్టారు . దాని ద్వారా నెయ్యిని పోయించారు .( అగ్ని కి కి ఆజ్యం తోడవటం ఏమిటో అప్పుడు నాకు తెలిసింది ) ఆ తరువాత ప్రధాన ఆచార్యులవారు అందరి నీ ఆశీర్వదించి లక్ష్మీరూపును , ప్రసాదాన్ని ఇచ్చారు . కొంగుకు వేసిన ముడులను విప్పదీసి , అందులోని అక్షితలను మా శిరస్సున వేసారు . దాని తో యజ్ఞం ముగిసింది .

అలా మా రిటైర్మెంట్ రోజులు మొదలయ్యాయి :)


15 comments:

srknedunuri@gmail.com said...

మీ విశ్రాంత జీవనానికి ఆధ్యాత్మికత గొడుగు పట్టింది. భవిష్యత్ అడుగులు భగవంతుడి ప్రదక్షిణాలకు ప్రతిస్పందింపచెయ్యండి.

Anonymous said...

మాలగారు అదృష్టవంతులు

శ్రీలలిత said...


ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీకూ, మీ కుటుంబానికీ ఎప్పటికీ వుండాలని ప్రార్ధిస్తూ,
ఆనందంతో...శ్రీలలిత..

psm.lakshmi said...

చాలా బాగుంది మాలాగారూ. మీకు తెలియకుండానే మీవారు యజ్ఞానికి ఏర్పాటు చేసి మీకు సర్ ప్రైజ్ ఇచ్చారుకదా. మొత్తానికి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. ఆ లక్ష్మీ నారాయణులు కృపాకటాక్ష వీక్షణాలు మీమీద ఎల్లప్పుడూ ప్రసరించాలని కోరుకుంటూ
psmlakshmi

durgeswara said...

స్వామి అనుగ్రహం మీపై అలాప్రసరించినది

పరిమళం said...

స్వామి అనుగ్రహం లేనిదే మనం అనుకున్నా అవకాశం రాదు.అదృష్టవశాత్తూ మీదంపతులకు లభించింది.మాతో పంచుకున్నారు సంతోషంగా ఉంది.

జ్యోతి said...

ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం మీకూ, మీ కుటుంబానికీ ఎప్పటికీ వుండాలని కోరుకుంటున్నాను..

భమిడిపాటి సూర్యలక్ష్మి said...

శ్రీలక్ష్మీనారాయణుల అనుగ్రహం సదా మీ యందు వుండాలని ప్రార్ద్తిస్తూ ....,
అంత ఆనందంగా రిటైర్మెంటు రోజులు ప్రారంభమైనందుకు , శుభాకాంక్షలు.

Meraj Fathima said...

mee jeevitham prashaanthamgaa gadapaalani korukuntu

Lakshmi Raghava said...

అనుగ్రహం లేనిద్దె ఇలా జరగదు మాలా గారూ .ఆ దేవుడు మీ చేత ఇలా సేవ చేయించు కున్నాడు.అదృష్టవంతులు..వారి అనుగ్రహం మీ కు ఎల్లవేళలా వుండు గాక
లక్ష్మీ రాఘవ

రాజ్యలక్ష్మి.N said...

మాలాకుమార్ గారూ ..
"యజ్ఞం"విశేషాలు బాగున్నాయండీ..
పూజ విషయాలు మాకు కూడా చెప్పినందుకు చాలా సంతోషం..

మాలా కుమార్ said...

srknedunuri గారు ,
అనొనమస్ గారు ,
శ్రీలలిత గారు ,
లక్ష్మిగారు ,
దుర్గేశ్వర గారు ,
పరిమళం గారు ,
జ్యోతి గారు ,
భమిడపాటి సూర్యలక్ష్మి గారు ,
ఫాతిమా గారు ,
లక్ష్మీరాఘవగారు ,
రాజి ,
అందరి కీ ధన్యవాదాలండి .

Anonymous said...

wassup sahiti-mala.blogspot.com admin discovered your site via search engine but it was hard to find and I see you could have more visitors because there are not so many comments yet. I have found website which offer to dramatically increase traffic to your website http://xrumer-service.com they claim they managed to get close to 4000 visitors/day using their services you could also get lot more targeted traffic from search engines as you have now. I used their services and got significantly more visitors to my site. Hope this helps :) They offer most cost effective services to increase website traffic Take care. Jeremy

భాస్కర్ కె said...

వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు.

Lasya Ramakrishna said...

మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

లాస్య రామకృష్ణ

బ్లాగ్ లోకం