నాకు చిన్నప్పటి నుంచి పేంటింగ్ అంటే ఇంటరెస్ట్ వుండేది . ఎప్పుడూ ఏదోవకటి వేస్తూవుండేదానిని . పి. యు . సి లో గ్రూప్ లో కూడా డ్రాయింగ్ వుంది . పెళ్ళైనాక , పూనా లో , సికింద్రాబాద్ లో కోర్స్ లు కూడా చేసాను . ఆ తరువాత చిన్నగా ఇంట్రెస్ట్ ఎలా తగ్గిందో తగ్గిపోయింది . అదంతే నాకు దేనిమీదా పట్టుమని పది సంవత్సరాలు ఇంట్రెస్ట్ వుండదు . చిన్నప్పటి నుంచీ సమ్మర్ వెకేషన్స్ లో ఏదో ఒకటి నేర్చుకోవటం అలవాటు . దానితో కొద్ది రోజులు కాగానే పాతది వదిలేసి కొత్తదాని మీద పడతాను :) అలా చాలా కోర్స్ లు చేసాను :)
పారేసినవి పారేయగా , గిఫ్ట్ లిచ్చినవి ఇయ్యగా మిగిలినవి ఇవీ నా పేంటింగ్స్ . ఇవి కూడా ఎక్కడో పడేసి వుంటే మా అమ్మాయి తీసి , "సిరి " ఆర్ట్ థియేటర్ లో కొంచం క్లీనప్ చేయించి , ఫ్రేంస్ పెట్టించి వాళ్ళింట్లో పెట్టుకుంది . ఆ మద్య జ్ఞానప్రసూన గారి పేంటింగ్స్ చూడటాని కి వెళ్ళినప్పుడు , వాళ్ళ సర్ తో , లాస్ట్ వీక్ నా పేంటింగ్స్ అన్నీ క్లీన్ చేసి ఇచ్చారు మీరు అనగానే ఆయనకు గుర్తొచ్చి అవునండి , చాలా బాగా వేసారు , ఎందుకు మానేసారు అని అడిగాడు . నేను నవ్వేసి వూరుకున్నాను . ఇప్పుడంత ఓపిక , ఇంట్రెస్ట్ లేవని ఎలా చెపుతాను :)
సెవంటీస్ ల లో మంచి మంచి కాలెండర్స్ వచ్చేవి . ఇవి ఆ కాలెండర్s చూసి వేసినవే :)
Tuesday, August 7, 2012
Subscribe to:
Post Comments (Atom)
34 comments:
wow...It's beautifully drawn...Nice to know about you అండి :)
నిజంగా అన్ని చిత్రాలు చాలా బాగున్నాయండీ..
మీరు మంచి పైంటర్ కూడా అన్నమాట!!
మీ ఆర్ట్ ని అంత శ్రద్ధ తీసుకుని భధ్రపరచి మీ అమ్మాయి మంచి పని చేశారండీ..
చాలా చాలా బాగున్నాయండీ,ఒక మంచి చిత్రకారిణిని కోల్పోయిందన్నమాట దేశం
చాలా బాగున్నాయండి..మీ అమ్మాయి శ్రద్దకి అభినందనలు.
ఓర్నాయనో... మీరింత పెద్ద ఆర్టిస్టా?
సూఊఊఒపర్ అండీ....
చాలా చాలా బాగున్నాయండీ. మీ అమ్మాయి శ్రద్దగా రెస్టోర్ చేయించినందుకు ధన్యవాదాలు చెప్పండి. ఓపికా ఇంట్రెస్ట్ లేవు అంటే మేం ఒప్పుకోం మళ్ళీ మొదలెట్టాల్సిందే మీరు :)
మాలా ,
మీలో ఈ కోణం ఇంత అందంగా వుందని తెలీదు నాకు.చాలా బాగున్నాయి .
నన్ను మీ శిష్యురాలుగా చేర్చుకోరూ.. ప్లీజ్...
చిత్రాలన్నీ బాగున్న్నాయి...
మళ్ళీ మొదలుపెట్టండి చిత్రాలు గీయటం..
@శ్రీ
చక్కని చిత్రాలతో అలరించారు.మాటలకందని భావాలను పలికించారు.అనినందనలు మాలా గారు.
వావ్ మాలా కుమార్ గారు...చాలా చాలా బాగున్నాయి....కొనసాగించాల్సింది :(
పెయింటింగ్స్ చాలా బాగున్నాయి.అందరికీ ఇటువంటి కళ అబ్బదు.అబ్బిన వారు దానిని అశ్రధ్ధ చేయడం తగదు. కృషిని కొనసాగించండి.
బాగున్నాయి మాలగారూ మేము ఇంట్లో పిక్షనరీ ఆడేటప్పుడు ఒక ఆవు బొమ్మో మేక బొమ్మో అంటే అసలది జంతువో వస్తువో కూడా తెలియకుండా వేసేదాన్ని నేను.
చక్కగా రిస్టోర్ చేసి పెట్టిన మీ అమాయిని మెచ్చుకోవాలి ముందు.
క్రిష్ణ వేణి
చాలా చాలా బాగా వేశారు మాల గారు.మళ్ళీ మీ కళాపోసన మొదలు పెడతారని ఆశిస్తున్నాను...
nice paintings, keep painting.
రమణీయ భావనా రసపుష్టి గల్గించు
‘తరుల – డేరాల ’ చిత్రమ్ము జూడ
పల్లె వారల ప్రతిభా విభావరి దెల్పు
‘కడలి – పడవల’ పోకడలు జూడ
అజుని కైనను లోన నాకలి పుట్టించు
అతులిత ‘ ఫల భక్ష్య ’ తతులు జూడ
ప్రకృతే స్త్రీ యను పరమార్థమును దెల్పు
వనమున ‘ జవరాలి ‘ వరుస జూడ
పరవశము గల్గు సృష్ఠికే – సరసు లైన
‘ పాదుషా – బేగము ’ ప్రణయ పథము జూడ
చిత్రములు ప్రాణములు దాల్చి విచిత్ర గతుల
మాకు కథలు విన్పించె మాలా కుమారు !
------ సుజన-సృజన
శేఖర్ ,
థాంక్ యు .
* రాజి ,
అవునండి ఏదో అప్పుడు అలా వేసేసాను . థాంక్స్ అండి .
*పప్పు శ్రీనివాస్‌గారు ,
మీ కాంప్లిమెంట్ కు థాంక్స్ అండి :)
సిరిసిరిమువ్వగారు ,
ఎక్కడో మూలపడున్నవాటిని దుల్పింది మా అమ్మాయి :)థాంక్స్ అండి .
*రాజ్ ,
అంత హాచర్యమా :) థాంకు .
*వేణూ శ్రీకాంత్ ,
మీరంటూ వుంటే మళ్ళీ పేంటింగ్స్ వేయాలనే అనిపిస్తోంది :) థాంక్ యు .
*లక్ష్మీ రాఘవగారు ,
థాంక్స్ అండి .
శ్రీలలిత గారు ,
ఎప్పుడు జాయిన్ అవుతున్నారు :)
*శ్రీ గారు ,
థాంక్స్ అండి .
*ఉమాదేవి గారు ,
ధన్యవాదాలండి .
కిరణ్ గారు ,
థాంక్స్ అండి .
*పంతుల గోపాలకృష్ణ రావు గారు ,
ధన్యవాదాలండి .
*కృష్ణవేణి గారు ,
అవునండి మా అమ్మాయి శ్రధ్ధ తీసుకోకపోతే బయటకు వచ్చేవి కాదు . థాంక్స్ అండి .
స్పురిత గారు ,
థాంక్స్ అండి .
* ట్రీ గారు ,
మీరందరూ అంటుంటే మళ్ళీ బ్రష్ పట్టుకోవాలనే అనిపిస్తోందండి :) థాంక్ యు .
*వెంకట రాజారావు గారు ,
నా పేంటింగ్స్ ఏమో కాని మీ కవిత చాలా చాలా బాగుందండి .చెప్పేందుకు మాటలు రావటం లేదు . థాంక్ యు . థాంక్యు వేరీ మచ్ .
మాలగారూ...ఎంత బాగా వేసారండీ! మీలో ఇంత కళ ఉందని ఇన్నాళ్ళు మాకు తెలియనేలేదే! మీరు మళ్ళీ ప్రయత్నించడి. వయసైపోయింది, ఓపిక లేదు లాంటి మాటలు చెప్పండి....మేం ఒప్పుకోము. మీకేంటి...మీరు మాకన్నా యంగ్, ఉత్సాహవంతులు. కాబట్టి తక్షణమే మొదలెట్టండి.
బాగా వేసారు. మరి మళ్ళీ మొదలు పెడతారా?
చాలా ..చాలా బాగా వేసారు.మల్లి గీయండి...
కల దేవుని వరం.వదల కూడదు
నా మొదటి కామెంటు లో చిన తప్పు దొర్లింది. నేనేమి రాయాలనుకున్నానంటే...
"వయసైపోయింది, ఓపిక లేదు లాంటి మాటలు చెప్పకండి....మేం ఒప్పుకోము. మీకేంటి...మీరు మాకన్నా యంగ్, ఉత్సాహవంతులు. కాబట్టి తక్షణమే మొదలెట్టండి".
సౌమ్యా ,
వయసైపోయింది అనుకోవటం నాకూ ఇష్టం లేదు . మీరిచ్చిన కాంప్లిమెంట్ కు థాంకు :)
మీరందరూ ఇంతగా ప్రొత్సహిస్తుంటే నాకూ వెంటనే బ్రష్ పట్టుకోవాలనిపిస్తోంది :) థాంక్యు .
*అనిల్ అట్లూరిగారు ,
శశి ,
థాంక్స్ అండి .
చాలా బావున్నాయండి !
ఇవ్వన్నీ మీరేసినవే అంటే నేనస్సలు నమ్మటంలేదు. నన్ను నమ్మించాలంటే మీరు అర్జంటుగా ఇంకో పైంటింగ్ వేసి అందరికీ చూపెట్టెయ్యండి మరి. అర్జంట్. all the best.
psmlakshmi
ఇవ్వన్నీ మీరేసినవే అంటే నేనస్సలు నమ్మటంలేదు. నన్ను నమ్మించాలంటే మీరు అర్జంటుగా ఇంకో పైంటింగ్ వేసి అందరికీ చూపెట్టెయ్యండి మరి. అర్జంట్. all the best.
psmlakshmi
శ్రావ్య ,
థాంక్స్ అండి .
*లక్ష్మి గారు ,
నమ్మనంటారా ? వాకే :)
వావ్! మీ పైంటింగ్స్ చాలా బాగున్నాయండీ! ఆపకండీ కొనసాగించండి.
బాగున్నాయండి.మళ్ళీ మొదలెట్టి గీస్తూ ఉండండి.
చాలా బాగున్నాయండి.నాలా రాని వాళ్లు నేర్చుకుంటే బాగుండును అంకుంటాము.మీరు వచ్చిన దానిని వదిలేశారేమిటండి?
వావ్.. మాలా గారూ.. మీరింతందంగా పెయింటింగ్స్ వేస్తారా.. అద్భుతంగా ఉన్నాయండీ.. మీరు అర్జెంటుగా మళ్ళీ కుంచె చేతిలో పట్టుకోవాలని గట్టిగా అడుగుతున్నాం.. :)
Post a Comment