Thursday, April 5, 2012

ప్రజ్ఞాధురీణ ప్రసూన



ఉరకలు వేసే ఉత్సాహానికి వయసు అడ్డు వస్తుందా ? అంటే రాదనే చెపుతున్నారు "సురుచి " బ్లాగర్ 'జ్ఞానప్రసూన ' గారు . ఆవిడ కు ఖాళీ సమయము ,సమయాన్ని వేస్ట్ చేయటము , తోచక పోవటము అంటే తెలియదు . టీచర్ గా ఉద్యోగ బాధ్యల నుంచి విరమించుకున్న తరువాత , రచనలు చేయటము , వివిధ విషయాల పైన రేడియో లో ప్రసంగించటము , కుట్ట్లు , బొమ్మల తయారీ , అబ్బో ఆవిడ చేయని పని లేదేమో !వారిని "సాయి కల్పం" అనే అసోషియేషన్ వారు ' విశిష్ఠ వ్యాకుల ' పురస్కారం తో సత్కరించారు .

ఇలా ప్రసూన గారి గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు . అందుకే ఈనాడు ' వసుంధర ' లో ప్రసూన గారి గురించిన వ్యాసం వచ్చింది .

ప్రస్తుతము ప్రసూన గారు "సిరి " లో పేంటింగ్ ( చిత్రకళ ) ను నేర్చుకుంటున్నారు . ఇప్పటి వరకు 30 క్లాసులకు అటెండ్ అయ్యారట. . పెన్సిల్ స్కెచ్ లు ఎంత బ్రహ్మాండం గా వేసారో చూడండి . మొన్న మార్చ్ 31 నుంచి నుంచి నిన్న 3 వ తారీకు వరకు , సిరి వారు ,' హోటల్ మార్రిట్ట్ ' లో నిర్వహించిన పేంటింగ్ ఎక్షిబిషన్ లో జ్ఞానప్రసూన గారివి రెండు పేంటింగ్స్ ప్రదర్షించారు .

ఆ పేంటింగ్స్ ఇవే ;






నిన్న నేనూ , పి. యస్ .యం . లక్ష్మిగారు , శ్రీలలిత గారు ప్రసూనగారి పేంటింగ్స్ చూసి వచ్చాము . ఇంటి కి రండమ్మా ఇంకా చాలా వున్నాయి చూపిస్తాను అన్నారు . మేము వీలుచూసుకొని ఒక రోజు వారి ఇంటి కి వెళ్ళి మిగితా పేంటింగ్స్ కూడా చూసి రావాలనే అనుకుంటున్నాము . ప్రసూన గారు పెట్టిన బిస్కెట్స్ తిని , వారిని అభినందించి వచ్చాము .


జ్ఞానప్రసునగారి నుంచి నేర్చుకోవలసిన వి ఎన్నో వున్నాయి . జ్ఞానప్రసూన కాదు ప్రజ్ఞా ప్రసూన గారు. ఆవిడ ఉత్సాహం చూస్తునే మనమూ వున్నం ఎందుకు అనుకున్నాం మేము ముగ్గురం :)

జ్ఞాప్రసూన గారు మీరు చిరకాలం ఇలాగే ఉత్సాహం గా ఉండి మాలాంటి వారందరికీ మార్గదర్శం కావాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను . మరో సారి మీకు హృదయపూర్వక అభినందనలండి .

7 comments:

సి.ఉమాదేవి said...

నేర్చుకోవడానికి కావలసినది వయసుకాదు,మనసు.నిత్య యవ్వనం మనసుది.అందులో కళాకారులది స్పందించే మనసు.సంకల్పం తోడైతే కళారాధనకు అడ్డంకులే వుండవు.

జలతారు వెన్నెల said...

చాలా మంచి స్పూర్తి అండి ప్రసూన గారు.

Lakshmi Raghava said...

చాలా బాగున్నాయి ప్రసునగారు ,నాకు చూసే అవకాసం ఎప్పుడువస్తుందో చూడాలి
థాంక్స్ మాలా గారూ

oddula ravisekhar said...

మీ అన్ని బ్లాగు లు చూశాను.చాలా అనందం గా అన్ని విషయాలు మీరు పంచుకోవటం అభినందనీయం.మహిళలు వ్రాసే బ్లాగుల గురించి చాలా వివరంగా వ్రాశారు.అన్ని బ్లాగులు చూస్తారా!

మాలా కుమార్ said...

ఉమాదేవి గారు ,

చాలా బాగా చెప్పారండి . థాంక్ యు .


& జలతారు వెన్నెల గారు ,
అవునండి . థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

లక్ష్మి రాఘవ గారు ,

మీరు ఈ సారి ఇక్కడికి వచ్చినప్పుడు అందరినీ కలుద్దురుగాని లెండి :)
థాంక్ యు .

&ఒద్దుల రవి శేఖర్ గారు ,

మీలాంటి పర్సనాల్టీ డెవలప్ ట్రైనర్ గారు నా బ్లాగ్ ను మెచ్చుకోవటం చాలా సంతోషం గా వుందండి . థాంక్ యు .

అన్నీ బ్లాగులూ చూస్తానా అంటే , కథలు , కబుర్లు , పాటలు , ఫొటోలూ , చిత్రాలు వున్నవి , సరదా పోస్ట్లూ చూస్తానండి . కవితలవి అప్పుడప్పుడు చూస్తాను :) మీ బ్లాగ్ మొన్ననే మొదటి సారి చూసాను . చాలా ఉపయోగకరమైనవి , మంచి విషయాలు రాస్తున్నరు . కొన్ని పోస్ట్లు చదివాను . వీలు చూసుకొని మిగితావి కూడా చదువుతాను . మీ స్పందనకు ధన్యవాదాలండి .

జ్యోతిర్మయి said...

జ్ఞాన ప్రసూనాంబ గారే కాదు, మీరు కూడా మాలాంటి వాళ్ళందరికీ స్ఫూర్తిదాయకులు. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి. బొమ్మలు చాలా బావున్నాయండీ..