Wednesday, April 13, 2011

రామయ్య మాకు కొడుకు సీతమ్మ మా కోడలు



అవునండి అవును నిజమే !
రెండు రోజుల క్రితము మావారు , "సీతారాముల కళ్యాణం " లో మనము పీటల మీద కూర్చుందామా అని అడిగారు . అంతకన్నానా అన్నాను నేను . మా కాలనీలో సీతారామళ్యాణం , ప్రతి "శ్రీ రామనవమి " కీ పెద్ద ఎత్తున చేస్తారు . ఈ సారి రామయ్యకు తలితండ్రులుగా కూర్చునే భాగ్యము మాకు కలిగింది .
కాలనీ సెక్రటరీ నరసిమ్హరావు గారి ఇంట్లో వున్న , సితా , రాముడు , లక్ష్మణుడు , హనుమంతుని విగ్రహాలను ఉదయము 10 గంటలకు ఊరేగింపుగా మా కాలనీ చుట్టూ మేళ తాళాల తో ఊరేగించాము . ప్రతి ఇంటి ముందూ స్వామివారికి హారతులు ఇచ్చి మము బ్రోవమని వేడుకున్నారు . శాస్త్రొక్తముగా కళ్యాణ మంటపాని కి తీసుకొచ్చాము . మేము వరుని తలితండ్రులుగా , నరసిమ్హరావుగారు , వారి శ్రీమతి మారుతి గారు వధువు తల్లితండ్రులుగా వ్యవహరించాము . ముగురు పెద్దలను సీతమ్మవారికి వరుని వెతుకుటకై , తాంబూలము ఇచ్చి పంపటముతో కళ్యాణ సంబరము మొదలైంది . ప్రవర చదవటము , తెరపట్టటము , జీలకర బెల్లం పెట్టటము , తలంబ్రాలు అన్నీ యధావిధిగా జరిగాయి . ప్రతి దానిలోనూ మా అబ్బాయి పెళ్ళి చేస్తున్నట్లుగానే లీనమయ్యాము . అవును మరి కొద్ది సేపైనా శ్రీరాముని కి తల్లి తండ్రులు కావటమంటే ఎంత అదృష్టము ! ఈ జన్మకీ భాగ్యము చాలు స్వామీ అనిపించింది .



" సీతమ్మ మాయమ్మ , శ్రీరాముడు మాకు తండ్రి "

11 comments:

Unknown said...

Mala kumar garu meru nijamga adrustavantualandi...

లత said...

నిజంగా అద్రుష్టమేనండి ఫొటోస్ చాలా బావున్నాయి

శ్రీలలిత said...

వింటుంటేనే చాలా సంతోషంగా వుందండీ...ఆ శ్రీరామచంద్రులు సదా మిమ్ము రక్షించుగాక...

రుక్మిణిదేవి said...

maa marriage aina kottalo nagpurlo maaku aa adrushtam dakkindi.. appudu raamuni viluva teliyadu.. nice maala gaaru... u really enjoyed no....

రాజ్యలక్ష్మి.N said...

మాలాకుమార్ గారు..
కళ్యాణం చాలా బాగా జరిపించారండీ..
ఫోటోస్ చాలా బాగున్నాయి..
శ్రీరామనవమి శుభాకాంక్షలు.

మాలా కుమార్ said...

శైలబాల గారు ,
లత గారు ,
శ్రీలలిత గారు ,
రుక్మిణీదేవి గారు ,
రాజి గారు ,
అందరికీ ధన్యవాదాలండి .

చెప్పాలంటే...... said...

మాలాకుమార్ గారు..
కళ్యాణం చాలా బాగా జరిపించారండీ..
ఫోటోస్ చాలా బాగున్నాయి..మీ ఆనందాన్ని మేము పంచుకుంటున్నాము....

కృష్ణప్రియ said...

చాలా బాగుంది.. :) ముఖ్యం గా మీరు అలాగ బంధుత్వం కలపటం..

మాలా కుమార్ said...

చెప్పాలంటే గారు ,
థాంక్స్ అండి .
కృష్ణప్రియ గారు ,
రామయ్య , సీతమ్మ అండరి బంధువులండి . అప్పుడు మాకు ఇంకొంచం దగ్గర బంధువులయ్యారు :)
థాంక్స్ అండి .

krishnaveni said...

మాలగారూ, చాలా బాగా జరిగించేరండి. బాగుంది. ఇలా రాములవారికి తల్లితండ్రులయే అదృష్టం కూడా కలుగుతుందని నాకు తెలియదే!

మురళి said...

అభినందనలు కౌసల్యగారూ :))
...చాలా బాగా రాశారండీ, చక్కని అనుభూతిని పంచుకున్నందుకు ధన్యవాదాలు.