Thursday, February 17, 2011

ఈ పోస్ట్ అమ్మాయిలకు మాత్రమే ! అబ్బాయిల కు ఎంతమాత్రము కాదు గాక కాదు !!!



ఎందుకో తలెత్తి ధీర్ఘం గా అలోచిస్తూ వుంటే , , , , , పై కిటికీ లోనుంచి చంద్రుడు కనిపించాడు . అరె ఎల్లుండి కదా పౌర్ణిమ అప్పుడే ఇంతబాగా వెలిగిపోతున్నడేమిటి చెప్మా అనుకొగానే , , , చమక్కుమని గుర్తొచ్చింది ఈ సారి మాఘపౌర్ణిమ అని . ఏమిటో ఈసారి మఘమాసం వచ్చింది కూడా గుర్తుంచుకోలేదు ! చిన్నప్పుడు అమ్మమ్మ , పెరట్లో తులసి గట్టు మీద , రధసప్తమికి , మాఘపౌర్ణిమ కు పాలు పొంగించి , చిక్కుడాకులలో పాయసం నైవేద్యం పెట్టి , అబ్బ . . ఎంత కమ్మగా వుండేదో ఆ పాయసం స్స్స్స్స్స్ . . . . . అబ్బ నోరూరిపోతొంది . నా పెళ్ళైయాక కూడా ఆ అలవాటుపోలేదు . అదే పాలు పొంగించటము , పాయసం వండటము . . . చిక్కుడాకులలో నైవేద్యమూ . . లొట్టలేసుకుంటూ తినటమూ . . . ఆ ((( అది నా గొప్పేమీ కాదు , మా అత్తగారికీ ఆ అలవాటు వుండటము వల్ల అలా కొన్సాగిందన్నమాట . కాక పోతే మా అత్తగారు రెండు గిన్నెలలో పొంగించేవారు . పిడకల తో వెనుక సందు బండల మీద రెండు పిడక పొయ్యి (?) లు చేసి వాటి మీద రెండు ఇత్తడి గుండు గిన్నెలు పెట్టి పొంగించేవారు . ముందు రోజు సాయంకాలమే ఆ బండలన్నీ బోలెడు సర్ఫ్ , సోడా వేసి శుభ్రంగా కడిగించేవారు . పొద్దున్నే మా మామగారు కేశవమెమోరియల్ స్కూల్ దగ్గర , పాలు పితికేవారి దగ్గరకు వెళ్ళి , స్వయం గా పాలు తెచ్చేవారు . మాఘమాసం లో అదివారాలు , రధసప్తమి , పౌర్ణిమ అన్ని రోజులూ పాలు పొంగించేవారు . అప్పుడు పిల్లలంతా అక్కడే కూర్చొని ఆవిడ చేసే పూజ శ్రద్ధగా చూస్తూ , ఆవిడ చెప్పే కథలకు ఊ కొడుతూ వుండేవారు . అది పూజ మీది శ్రద్దా ???లేక కథ మీద శ్రద్దా ??? లేక పాయసం మీద శ్రద్దా ?? ? అంటే చెప్పటము కాస్త కష్టమే :)



శ్రావణ శుక్రవారము , మంగళగౌరీ వ్రతము తప్ప , కొత్త పెళ్ళికూతురుల తో ఏవైనా నోములు నోమించాలంటే , రధసప్తమి రోజున , ఆ రోజు వీలుకాకపోతే మాఘపౌర్ణమి రోజు న , అప్పుడూ వీలుకాకపోతే మాఘపాదివారము రోజున నోమించటము మాకు ఆనవాయితి . మా పెళ్ళైన మొదటి రధసప్తమి రోజున నాతో పదహారుఫలాల నోము పట్టించారు మా అత్తగారు . ఆ మద్య , మావారి మేనత్త రధసప్తమి రోజు మా ఇంట్లో వున్నారు . అపుడావిడ , మీ అత్తగారు పట్టించిన నోములేనా , నువ్వు ఇంకేమైనా పట్టావా అన్నారు . ఏదండి , ఇప్పుడు మీరు , పెద్ద ముత్తైదువ ఇక్కడ వున్నారుగా కొత్తవి చేస్తా అన్నాను . ఆవిడా ఉత్షాహం గా తలూపారు . అంతే ఇద్దరమూ శకరమఠం కు వెళ్ళి అక్కడి నుంచి ఇదో ఈ పుస్తకం , ఇంకా పూజా సామగ్రీ కొనుక్కొచ్చేసాము . ఆవిడ అందులోనుంచి , చిట్ట్టిపొట్టీ నోములు ఏరి పెట్టారు . ఇహ బోలెడు నోములు నోమేసుకున్నాను . అదే ఉత్సాహం లో మా అమ్మాయి తోనూ , కోడలి తోనూ పదహారుఫలాల నోము నోమించేసా ! రోజూ పసుపు కుంకుమ , తాంబూలం తీసుకొని పక్కిళ్ళకు వెళ్ళి వాయనాలిస్తుంటే , అబ్బా మీరు ఎంతా బాగా నోముకుంటున్నారండి . ఎంత శ్రద్దగా చేసుకుంటున్నారండి అని అందరూ మెచ్చుకోవటమే ! అదేమిటో నేనేది చేసినా అందరూ అలా మెచ్చేసుకుంటారు :)

స్చప్ . . . ఆ ధిష్టే కొట్టిందో ఏమో ( బుగ్గన చేయి ) రెండు సంవత్సరాల నుంచి ఏమీ చేసేందుకు ఓపిక లేకుండా పోయింది . ఈ రధసప్తమి కి ముందు శారడ ఫోన్ చేసి అమ్మా , రధసప్తమి రోజున , రధం ముగ్గు మన ఇంట్లోకి వచ్చేట్టుగా వేయాలి కదా మర్చిపోకండి శైలజకు చెప్పండి అని గుర్తుచేసింది . అవును సంక్రాంతి ( కనుమ ) రోజున రధం ముగ్గు వేసి పక్కింటికి కలుపుతారు . అలా వూరంతా కలుపుకుంటూ , వూరి చివరనున్న గ్రామ దేవత గుడి కి తీసుకెళుతారు . అలా చేస్తే వూరు సుభిక్షం గా వుంటుంది అంటారు . అదే రధసప్తమి రోజున , రధం ముగ్గు మన ఇంట్లోకి రధం వస్తున్నట్లుగా వేయాలి . అప్పుడు ఆ రధం మీద సూర్యభగవానుడు మనైంట్లో కి వచ్చి ఆరోగ్యం ప్రసాదిస్తాడుట . హుం . . శారద గుర్తు చేసినా నేను మర్చిపోయాను ((( . . .

ఇదిగో కొత్తగా పెళ్ళైన , పెళ్ళి కావలసిన అమ్మాయిలూ , ఇలా బ్లాగులలో , బజ్ లలో అల్లరి చాలించి ఇలా వచ్చేయండి . రేపు మాఘ పౌర్ణిమ . ఎంచక్కా అందరమూ నోములు నోచుకుందాము . మీ అందరి తో నోమించేందుకు పెద్దవాళ్ళము వున్నాము వచ్చేయండి . ఆ ఆ లక్ష్మి గారూ , మీరేమీ పని చేయక్కరలేదండి . మీ మార్కు జోకులేస్తూ అందరితో పూజ చేయించేయండి . అందరినీ చూసుకునేందుకు శ్రీలలిత గారు , జ్యోతి గారు వున్నారుగా . ఐనా మనం వంటలు , పని చేయటమెందుకండి . ఈ పిల్లలే తలా వొకటి తెస్తారు . ఎవరదీ ? నేను చాక్లెటే తెస్తా , మా ఆయన చూసొకటి చూడకొకటీ నోట్లో ఆడించటము నా అలావాటు అంటారా . అలాగే గౌరమ్మ మటుకు చాక్లెట్ తినదేమిటి ?

ఎవరా బుంగమూతి ? నా మొగలి జడా అనా ? అలాగే అమ్మా మరి సుజాత గారింటి కుండిలో మొగలిపువ్వు విచ్చుకుందేమో తెచ్చేసుకో , జడ వేయటమెంత సేపు అరగంట పని !

ఓ అమ్మాయి లంగామీద డిజైన్ కుట్టుకుంటున్నానంది . ఐందా అమ్మడూ ? ఎంచక్కా ఆ పట్టుపరికిణీ వోణీ వేసుకొని వచ్చేయ్ మరి .
అందరికీ పేరు పేరు నా ఇదే పిలుపు . ఏంచేయను నాకు కొన్ని పేర్లే గుర్తుంటాయి . అన్నీ చప్పున గుర్తురావు . అందుకని ఎవరూ అలగకుండా అందరూ వచ్చేయండి . తెల్లవారు ఝామునే చక్కగా తలంటుకొని వచ్చేస్తే , మా డాబా పైన ఉయ్యాల లేయించాను ఊగొచ్చు . గోరంటాకు పెట్టుకోవటము మర్చిపోకండేం ! మెరిసిపోతున్న వెన్నెల్లో , కిల కిలా రావాల తో అమ్మాయిలు . . . . . జయా నువ్వు కాస్త త్వరగా వచ్చేయి అమ్మవారి అలంకరణ చేయాలిగా .

ఎంతపని వుందో !!! అన్ని రెడీ చేసి పెడతాను వచ్చేయండమ్మ .

( అబ్బాయిలూ టైటిల్ చూసి ఏదో వూహించుకొని , ఇటుతొంగి చూసి నిరాశ పడితే నాది బాద్యత కాదు . ఇది అచ్చంగా అమ్మాయిలను పేరంటానికి పిలుపే ! )

22 comments:

లత said...

బావుంది మాలగారూ
వెన్నెల్లో ఉయ్యాల ఊపుతారు అంటే నిజంగానే వచ్చెయ్యాలనిపిస్తోంది

జ్యోతి said...

వంటలు,వడ్డనలు గట్రా అంటే నేను రాను. ముందే చెప్తున్నా. ఊరికే అలా కూర్చుని ముచ్చట్లు పెట్టమంటేనూ, తినమంటేనూ, గోరింటాకు పెట్టమన్నా, పెట్టించుకోమన్నా , ఉయ్యాల వద్దండి. ఎంత పెద్ద ఉయ్యాల కట్టినా మీ స్లాబు విరిగిపోతుంది. ఈ కండీషన్లకు ఓకే అంటే వస్తాను.. లేకపోతే రామ్ రామ్..

మనసు పలికే said...

మాలా కుమార్ గారూ.. మీది చిక్కడ పల్లి అని చెప్పినట్లు గుర్తు. నేను వచ్చేద్దామని డిసైడ్ అయిపోయాను:))

Admin said...

Bagundi Maala garu.

శ్రీలలిత said...

మాలగారూ,
అందర్నీ పిలిచేసారుగా.. ఇంకేం.. మీరలా కూర్చోండి..మేవన్నీ చూస్తాంగా..
రండర్రా.. రండి.
పసుపు కుంకుమలక్కడా..పళ్ళూ, పూలూ ఇక్కడ..
ఇదిగో పిల్లలూ.. అలా వయ్యారి నడకలు పోతే కాదు.. కాస్త చురుగ్గా తిరగాలి..
మా రోజుల్లో మేవిలాగే ఉండేవాళ్ళమా..
హేమిటో.. ఇంత తినలేరు.. ఇంత పని చెయ్యలేరు.. ఈ కాలం పిల్లలు..
మరీ ఇంత నాజూకులు మేవెరగమమ్మా...
"ఇస్తినమ్మ వాయినం..పుచ్చుకొంటినమ్మ వాయినం"

జయ said...

అబ్బబ్బా...ఆ పౌర్ణమిని ఆదివారం రమ్మనొచ్చుకదా!!!

విరిబోణి said...

అయ్యో నేను హైదరాబాద్ లో వుంటే తప్పకుండా వచ్చేదాన్నే :(( మిస్ ఐ పోతున్నా (:(

Anonymous said...

nijamgaane chestunnara.. ayyo ragaligithe enta bagundo.

ఇందు said...

అర్రె, జెర్రాగుండ్రమ్మా...నన్ను మిస్ అయితున్నరని నాకెర్కలేదా యేంది...మనసు తెల్సుకోని ఒచ్చేస్తున్న గద....నాకు గోరింటాకు ఉంచిన్రా లేదా..నేనేందేవాలే..జెరన్ని ఓడప్పలు చేసుకొద్దునా? గర్జలు చెయ్యమంటరా...జెర బిరాన జెప్పాలే...లేకుంటె...ఎన్నెలమ్మ రాకుంటనే గాలి మోటరెల్లిపోతది...
యాద్మర్సినా...మాలమ్మో...ఉయ్యాల జెర్రంత గట్టిగ ఉండాలే...110 కిలోల బొండుమల్లెలు కూకున్న గాని యేం కాకుంట చూసుకోవలె మల్ల!

-Ennela


Ennela garu comment post cheyadaniki vari computer anumatinchakapothe nannu adigaru papa! ee comment mala gari blog lo post cheyamani anduke ennelagari taraphuna naa comment :)

psm.lakshmi said...

హమ్మయ్య...నాకు పని చెప్పటం లేదుకదా. అయితే ముందే వచ్చేస్తాను..కొంచెం హడావిడి చెయ్యద్దూ.
psmlakshmi

మాలా కుమార్ said...

లత గారు ,
నిజంగా రమ్మనే పిలిచానండి .

& జ్యోతి గారు ,
మరే మాకెందుకు వండి వడ్డిస్తారు ? వూళ్ళో వాళ్ళకైతే వడ్డిస్తారు మాకుతెలీదేమిటి ?

& మనసుపలికే ,
మీరు వద్దామని డిసైడ్ అవటము సంతోషమే కాని మాది చిక్కడపల్లి కాదు ఎలా మరి ?

మాలా కుమార్ said...

లక్ష్మి పి గారు ,
థాంక్యు అండి .

&శ్రీలలిత గారు ,
మీరు వచ్చేసారా అమ్మయ్య నాకు నిశ్చింత .
అమ్మాయిలూ శ్రీలలిత గారు చెప్పినట్లు వినండి :)

& జయా ,
పాపం అది మనచేతిలో లేదమ్మడు . పౌర్ణమి ఎప్పుడొస్తే అప్పుడే ఎంజాయ్ చేయాలి మరి :)

మాలా కుమార్ said...

విరబోణి గారు ,
థాంక్ యు .

& అనానస్ గారు ,
రాగలిగితే తప్పకరండి , మాఘపౌర్ణిమ కాకపోతే ఇంకో పౌర్ణిమ రోజున గోరంటాకు పండగ చేసుకుందాము .

& ఎన్నెలెమ్మా ,
స్వాగతం . మీరేమి తెచ్చినా మాకిష్టమేనండి .
జర భాష మార్చరాదురే పోరి . ఈ భాష తో నా మతి బోతాండే :)

మాలా కుమార్ said...

ఇందు గారు ,
చాలా దూరము నుండి వార్త తెచ్చారు . అలా కూర్చోండి చాక్లెట్ ఇస్తా :)

& లక్ష్మి గారు ,
హడావిడి చేయమే నండి మిమ్మలిని పిలుస్తా :)

శివరంజని said...

ఉహూ....... ఆ పరికిణి మీద డిజైన్ ఇంకా పూర్తి కాలేదు మాల గారు ...ఇంకో పరికిణి వేసుకుని వస్తా .. వెన్నెల్లో నొము అని మా ఫ్రెండ్ పూర్ణ వాళ్ళింట్లో ఛేసేవారు ...ఆ నోము గురించేనా మీరు చెప్పేది .. ఈ పోస్ట్ కి కామెంట్ పెట్టే టైం కే కరెంట్ పోతుంది ఇలా 3 టైంస్ జరిగింది

Anonymous said...

Mari nenoooo

Anonymous said...

మరి నేనో :(

నాకు పిలుపు రాలేదు అయినా నే వచ్చేశా

Ennela said...

సారీ మాలా గారూ...అది నా 'అమ్మ నాలుక(మదర్ టంగు) కదా...ఉత్సాహం వచ్చిన ప్రతి సారీ...వచ్చేస్తుంది...భాషని బట్టీ..నేను ఎంత ఉత్సాహ పడ్డానో అర్థం చేసుకొవాలన్న మాట....మీ కోసం కొంచెం ఉత్సాహం తగ్గించుకుంటాలెండి...
సరే కానీ, మా ఆల్వాల్ ఎప్పుడు వెళతారూ? ఫొటోలు పెడతారేమో చూసి ఆనందిద్దామని ఒహటే వెయిటింగు..

మాలా కుమార్ said...

శివాని ,
మీ ఇష్టం ఏ పరికిణీ ఐనా పరవాలేదు . పరికిణీ వోణీల లో అమ్మాయిలు ముద్దుగా వుంటారు .
మీ పూర్ణా వాళ్ళింట్లో చేసే నోము ఏమో కాని ,నేనూ నా మనవరాళ్ళు వెన్నెల్లో పండుగ , వెన్నెల రోజులలో మాకు మూడ్ వచ్చినప్పుడల్లా చేసేసుకుంటూ వుంటాము :)
మాఘపౌర్ణిమ నోము అంటే అ రోజు వుదయము పాలు పొంగించి , పాయసము చేసి , సూర్య భగవానునికి నివేదన పెడతాము అది వేరు .

ఆహ్లాద గారు ,
మీరు లేకుండా ఏ పండుగైనా ఆహ్లాదం గా వుంటుందా చెప్పండి ? యు ఆర్ ఆల్వేస్ వెల్ కం .
మీ బ్లాగ్ చూసాను . బాగుంది . కామెంట్ రాద్దామంటే మరి ఎందుకో రాలేదు . వర్డ్ వేరిఫికేషన్ తరువాత , పబ్లిష్ కామెంట్ లింక్ నాకు తెలీలేదు . అందుకే ఇక్కడే చెప్పేస్తున్నాను మీ బ్లాగ్ , మీ ప్రొఫైల్లోని అమ్మాయి బబాగున్నాయని .

మాలా కుమార్ said...

ఎన్నెల గారు ,
అయ్యో సారీ ఎందుకండి . వద్దు వద్దు . అలా ఐతే నేనూ సారీ చెప్పాలి కదా మీ ఉత్సాహం తగ్గించినందుకు .
ఎన్నెలమ్మ ఉత్సాహం గా వుంటే నే వూరంతా ఉత్సాహం గావుంటుంది .
మీ అల్వాల్ వెళుతానమ్మా వెళుతాను . ఫొటోలు పెడతాను సరేనా ! అసలు దాదాపు వారానికో సారైనా అటువైపు వెళుతునే వుంటాను , కాని ఇంకా అక్కడి వెంకటేశ్వర స్వామి కి ఇంకా నామీద దయ కలగలేదు ఎందుకో !

సుమలత said...

నిజంగానే చేస్తున్నారా ....
మరి నేను ...
;)

Anonymous said...

hahahahahha nice 1