Sunday, May 2, 2021

థాంక్ యు

మా మనవడు విక్కీ చెప్పిన కథ తో పాత జ్ణాపకాలు వచ్చి, ఆ తరువాత, మా వారు, మా అబ్బాయి నా బ్లాక్ మనీ ని తీసేసుకోవటము వలన కలిగిన ఉక్రోషము తోనూ ఈ డబ్బులోయ్ డబ్బులు వ్రాశాను . అప్పుడే పేపర్ లో చిన్న మొత్తం పధకాల గురించి , రూపాయి గుర్తు కోసము జరిగిన పోటీ గురించి చదివి ఆ ఆర్టికల్ ను పొడిగించాను . అప్పుడే సృజన చదివి చాలా బాగుంది , మన బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్ బ్లాగ్ లో దీని గురించి రెవ్యూ రాయనా అంది . దీనిమీద రెవ్యూ ఏముంటుందా అనుకున్నా , పరిచయం చేస్తానన్నప్పుడు ఎందుకు కాదనాలిలే అనుకొని , చాలా హాపీగా వాకే అనేశాను . అలా నా కాసులపేరు ఇక్కడికి చేరుకోవటము చాలా సంతోషముగా వుంది . ఆ సంతోషాన్ని కలిగించిన , సృజన , గీతాచార్య , జ్యోతి , చైతన్య కల్యాణి గార్లు బోలెడు బాంకులలో ఎకౌంట్స్ తెరవాలని కోరుకుంటూ , చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను .

3 comments:

కృష్ణప్రియ said...

మాల గారూ,
నేను మీ నల్ల ధనం కథ (Books and Galfriends) చదివాను. అవే కాదు మీ పాత టపాలు కూడా చదువుతున్నాను, 2008 వి చదివాక, ఇప్పుడు 2009 లో ఒక 20 టపాలు చదివినట్టున్నాను. మీరు ఇలా బ్లాగ్ రాయటం, పైగా పిక్చర్లు, సౌండ్ ఎఫెక్ట్ లు ఇస్తూ మరీ.. Simply Amazing.. Please do keep it up..

శ్రీలలిత said...

మాలాగారూ,
అందుకోండి మరి మా అభినందనలు..

మాలా కుమార్ said...

కృష్ణప్రియ గారు ,
నా బ్లాగ్ మీకు నచ్చినందుకు థాంక్స్ అండి . పైగా నా 2008 పోస్ట్ లు కూడా చదివానంటున్నారు . నా ధన్యవాదాలు ఎలాతెలపాలో అర్ధం కావటము లేదండి .
నా బ్లాగ్ ఇంత మాత్రము రావటానికి మా గురూజీ జ్యోతి గారు , మా అబ్బాయి బిపిన్ , మా కోడలు అనుపమ చాలా కష్టపడ్డారండి పాపం . వాళ్ళ కష్టం కొద్దో గొప్పో పలించిందన్నమాట . థాంక్ యు వెరీమచ్ .

& శ్రీలలిత గారు ,
థాంక్ యు .