Saturday, June 20, 2009

పుట్టినరోజు జేజేలు



ఈరోజు మా మనవడి పుట్టినరోజు . వాడికి ఈ రోజు
10 సంవత్సరాలు నిండుతాయి. కొన్ని మరపురాని ముచ్చట్లు..
వాడి మూడో ఏట వాడి బిపు మామ వాడిని ఘట్టిగా పట్టుకొని ,చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి లో వాడిని గుండప్ప చేసాడు. అదో అప్పటి నుండి వాడి కష్టాలు మొదలయ్యాయి. ప్రతినెల వాడి డాడీ నో మమ్మీ నో వాడిని తీసుకొచ్చి,మావారి కి వాడి హేర్ కట్ చేయించమని అప్పగిస్తారు.ఎందుకంటే మా వారి బార్బర్ బాగా కట్ చేస్తాడట. చిన్నప్పుడు పెద్దగా పేచీ పెట్టలేదు కాని పెద్దవాడవుతున్నా కొద్దీ, గుండుకు ఎక్కువ, క్రాఫ్ కు తక్కువ అయిన ఆ డిప్ప మిలటరీ కట్ వాడికి ఏమాత్రము నచ్చటము లేదు. వాడికి రకరకాల లంచాలు లాలిపాప్ దగ్గర మొదలై ఐ మాక్ సినిమా దాకా వచ్చాయి. అపై పెద్ద రాహుల్ , చిన్న రాహుల్, రాజేష్ (వాడి ఫ్రెండ్స్) వాళ్ళ డాడీలు ఫొన్ చేసి అడిగారు, మీ విక్కి హేర్ కట్ బాగుంది ఏక్కడ చేయించారు అని తాత చెప్పిన కథలు పాపం పిచ్చి సన్నాసి నమ్మి తాత తో వెళ్ళేవాడు.
అలా అలా కొన్ని సంవత్సరాలు వాడిని మబ్యపెట్టగలిగారు. కాలం ఎప్పుడూ ఒకే రకముగా వుండదుగా! తాత కథలు నమ్మటము మానేసి ,మా ఇంటికి రావటానికి కూడా సందేహించే పరిస్తితి ఏర్పడింది. కట్ కాదు మేఘ గౌరవ్ తో ఆడుకుందువుగాని అని ఏలానో తీసుకొచ్చి, కొంచంసేపు ఆడుకున్నాక మరిపించి తీసుకెళ్ళి , డిప్ప కట్ చేయించేవారు. వాడి తీసుకెలుతుంటే మా అబ్బాయి డాడీ విక్కీ ని హేర్ కట్ కు తీసుకెలుతుంటే గౌరూను తీసుకుపో అని అప్పగించేసాడు. అంతే. వాడూ డిప్పకట్ తో తయారు.
ఇక లేటెస్ట్ గా ,వాడిని వాడి తోపాటు గౌరవ్ ని షరా మాములుగా తీసుకెల్లటము వాళ్ళతో పాటు తాతా ముగ్గురు ముచ్చటగా ....... కట్తో వచ్చారు కాని ఈసారి విక్కీ ఏంత గోల చేసాడంటే ,మరి మరునాడే వాడి క్లాస్ అమ్మాయి బర్త్ డే ఇలా ఎలా వెళ్ళుతాడు?దానికి తగ్గట్టు గౌరు కూడా నేను ఇంక జెల్ రాసి స్టైల్ చేసుకోలేనుగా అని వాడూ గోల. మనవళ్ళ బాధ చూడ లేక జీవితం లో మొదటి సారి మావారి మీద, వాళ్ళనేమైనా మిలిటరీలో చేర్పిస్తున్నారా, లేకపొతే కనీసం పేరేడ్ కి వెళ్ళాలా అని ఘాట్టిగా అరిచాను (అనుకున్నాను). విక్కీ భీకరం గా ప్రతిజ్ఞ చేసాడు, ఇకపై హేర్ కట్ చేసుకోనని బర్త్ డే కల్లా, పోనీటైల్ వేసుకుంటానని. అంతే మా మనవరాళ్ళిద్దరూ వాళ్ళ రబ్బర్ బాండ్స్ అర్జెంట్ గా దాచేసు కున్నారు .
ఈ రోజు వాడి బర్త్ డే పార్టీకి వెళ్ళినప్పుడు చూడాలి పోనీ టేల్ వేసుకున్నాడా లేదా అని. ఏందుకంటే ఆ తరువాత
మాకు వాడు కనపడలేదుగా! ఈ మధ్యే తెలిసింది. మా మనవరాలు చెప్పింది. విక్కి తలకు వాటర్ రాసి సెట్ చేసుకుని స్కూలుకు వస్తే ప్రిన్సిపల్ తిట్టిందంట...పాపం .. ఎన్ని తిప్పలో వాడికి..

ఇంతకీ వాడి పూర్తి పేరు చెప్పలేదు కదూ!
విక్రం మాగల్
5
వ తరగతి, చైతన్యా విద్యాలయ

15 comments:

psm.lakshmi said...

Happy birthday Vikram. Very many happy returns of the day. Hope you have nice hair now.
psmlakshmi

భావన said...

Many Many Happy Returns of the Day Vikram. How does it feel to be double digit? feeling big???Have fun.

Anonymous said...

విక్రం కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

హరే కృష్ణ said...

Vikram,Many Many happy returns of the day

జ్యోతి said...

Happy Birthday Vicky..

Srujana Ramanujan said...

Very happy birthday Vickey.

K Phani said...

HAPPY BIRTHDAY TO VICKEY.slide show bhagundi.

మాలా కుమార్ said...

ఆశీర్వదించిన పియస్.యం లక్ష్మి గారికి,
భావన,గారికి,
హరెఫల గారి కి,
హరే క్రిష్ణ గారి కి,
జ్యోతి గారి కి,
సృజన గారికి,
ఫణి గారికి
నీహరిక గారికి ధన్యవాదములు.
ఆపద్భాంధవి జ్యొతి గారి కి మరీ మరీ ధన్య వాదాలు

Anonymous said...

బంగారుకొండకి పుట్టినరోజు జేజేలు, ఇంకా సుభాకాంక్షలు, ఇంకాఏమో ....బోలెడన్నిదీవెనలూను.
హమ్మయ్య చెప్పేసాను. మాలగారూ మరి నా చాక్లెట్ నాకిచ్చెయ్యాలి.

మాలా కుమార్ said...

చాకొలెట్ ఎందుకండీ ! మీకు కావలసినంత కేక్ కోసుకొని తినండి.
థాంక్ యు.

Unknown said...

My Dear Vikram
Wish you many happy returns of the day. have a wonderful Birthday
Ravi mava
Rama, sanjana and meghana

లక్ష్మి said...

Many many happy returns of the day Vikram.

Enjoy your day

పరిమళం said...

Happy birthday Vikram.

loggerblogger said...

Very nice slideshow! This year to play it safe we did not cut Vik's hair atleast a month before his b'day.

Thank you mom we enjoyed the slideshow and script!

Great effort and congratulations to you and Jyoti gaaru on excellent use of the media (internet and slide show) !

Sanju.

మాలా కుమార్ said...

ravi mama,rama atta,sanjana ,meghana,
laxmi garu,
parimalam garu,

thank you very much