Friday, May 22, 2009

ఆమె ఏవరు?


ఆమె ఎవరు


పాప సొఫా,లో బాబు నా వడిలో పడుకొని నిద్రపొతున్నారు.పనమ్మాయి గీత సోఫా పక్కన ముడుచుకొని కూర్చొని కునికి పాట్లు పడుతోంది.గీత ని చూసినప్పుడల్లా మనసు భాధ తో నిండిపోతుంది.పాకిస్తాన్ వార్  లో , బంగ్లాదేశ్  తెలిసిన వాళ్ళతో కలసి పారిపోయి వచ్చిందట.తల్లీ ,తండ్రీ,తమ్ముడు తన కళ్ళముందే చనిపోయారట.పదహారు ,పదిహేడు సంవత్సరాలు వుండవచ్చు.ఇక్కడ అందరి ఇళ్ళలో ఇలా బంగ్లాదేశీ రెఫ్యూజీ లే పనిచేస్తున్నారు.ఈ యుద్దాలు ఎంత మందిని నిరాశ్రయులుగా చేస్తున్నాయో!ఒకక్కరి గాధలు వింటుంటే మనసు ద్రవించి పోతుంది.
కిటికీ పక్కన నక్క గట్టిగా అరిచింది.పిల్లలు వుల్లిక్కి పడ్డారు.నేను ఆలోచనల నుంచి తేరుకొని ,వెధవ నక్కలు చిరాకు పుట్టిస్తున్నయి అనుకొని కిటికీ తలుపువేద్దామని,చిన్నగా బాబు ని పక్కకి పడుకో పెట్టి లేచాను.
"దీదీ"
"ఏంటి గీతా?"
"టైం ఎంతయ్యింది?"
గడియారం వైపు చూసాను.ఇంకా 8గంటలే అయ్యింది.సత్నా లో పార్టీ వుందని వెళ్ళారు.పిల్లలు కొద్దిగా నలతగా వున్నారని నేను ఆగి పొయాను.లేకపోతే అందరమూ వెళ్ళే వాళ్ళము .పిల్లలని లేడీ స్ రూంలో వుంచే దానిని !
గాలి కి పరదాలు చిన్నగా వూగుతున్నాయి.లేచి కిటికి తలుపులు వేస్తూ బయటకి చూసాను.ఎనిమిది గంటలకే చీకటి పడిపోయింది.బయట రోడ్ పక్కన ఒక జవాన్ నెగడు వెలిగిస్తున్నాడు.అడవి పాకిస్తాన్ యుద్దం తరువాత బంగ్లాదేశ్ ఏర్పడ్డాక , షిలిగురి దగ్గర ఉన్న బార్డర్ లోని అడవిని కొద్దిగా చదును చేసి, కొన్ని క్వాటర్స్ కట్టి, సేవక రోడ్ అని ఓ కాలినీ ఏర్పాటు చేసి,కొన్ని డిఫెన్స్ కుటుంబాలకు ఇచ్చారు.) కదా ఏనుగు ల బెడద ఎక్కువ .అందుకని ఈ నెగడు వెలిగించటము.ఎమో . . కొంచము ఈదురుగాలి మొదలయిందంటే ఆరిపోతాయి.పోనిలే అప్పటి వరకు అయినా వుంటాయి అనుకుంటూ కిటికీ తలుపులు వేసి ,పరదాలు వేసాను .లేకపోతే తలుపు దగ్గరికి మూతి పెట్టి మరీ అరుస్తాయి .ఇక్కడి కి వచ్చిన కొత్తలో కుక్కలేమిటి ఇలా వున్నాయి అనుకున్నాను.అవి కుక్కలు కావని నక్కలని తెలిసుకొని విస్తుపోయాను.కుక్కల లాగే కాంప్ అంతా ,ఊళ పెట్టుకుంటూ తిరుగుతుంటాయి.
దీపాలు డిం గా వెలుగుతున్నాయి . . .
నేను రానంటే వినకుండా నిన్న యూనిట్ లో ఓ కౌన్ థీ సినిమా కి తీసుకు పోయిన మిస్సెస్.షేర్గిల్ మీద చాలా కోపం వస్త్తొంది.ఆవిడకు ఆ సినిమా చూడాలని ఉందని 'తుసీ చలో నా జీ ' అంటూ నా ప్రాణాలు పీకింది.కాలేజీ లో వున్నప్పుడు ఆమె ఎవరు సినిమా వస్తే ఫ్రెండ్స్ ఎంత బలవంత పెట్టినా వెళ్ళలేదు.ఇప్పుడేమో మా ఏమండీ గారి, బాస్ గారి పెళ్ళాం గారి వొత్తిడికి లొంగాల్సి వచ్చింది.అసలే ఇలాంటి సినిమా లన్నా ,కథలన్నానాకు చాలా భయం. మొహమాట మోక్షాలు . . . హుం తప్పలేదు.చుట్టూ సాధన ' నైనా బరిసే ' అని ,తెల్లచీర కట్టుకొని ,జుట్టు విరబోసుకొని తిరుగుతున్నట్టుగానే అనిపిస్తొంది.దానికి తగ్గట్టు వాతావరణమూ అలాగే వుంది.అంతటా నిశబ్ధము .ఏదైనా బుక్ చదువుదామంటే గుడ్డి దీపాలు.అబ్బ ఎంతసేపటి కీ టైం గడవటము లేదు.ఏమండి వెళ్ళి అరగంట కూడా కాలేదు.కనీసము పన్నెండు అయితేకాని రారు.నిశబ్ధం అయినా తగ్గుతుందని రేడియో ఆన్ చేసాను. వెంటనే . "నైనా బరిసే ,రిమ్మ్ జిమ్మ్ రిమ్మ్ జిమ్" అని మొదలయింది . ఓరి దేవుడా ఇక్కడా ఇదేపాటా అని తిట్టుకుంటూ వెంటనే బంద్ చేసాను. టిక్ , , , టిక్ , , , టిక్ , , ,
గడియారం ముల్లు తిరుగుతొంది.
"దీదీ" ,
'"క్యా గీతా "
"డర్ లగరై " .
'"వుండవే తల్లీ నేనే చస్తుంటే నువ్వొదానివి మాట్లాడకుండా పడుకో. "
టైం ఎంతకీ గడవదు.ఇంతా చేస్తే ఇప్పటికి ఎనిమిదీ పది అయ్యింది అంతే.
టక్. . . టక్ . . . టక్ . . .
ఏదో అలాపన ఏమొలే అనుకొని వూరుకున్నాను
అసలు నేనూ పిల్లలని తీసుకొని వెళ్ళా ల్సింది.అక్కడే పడుకో పెడితే అయిపోయేది. . . మళ్ళీ
టక్ . . . టక్ . . . టక్ . . .
ఇంత రాత్రి ఎవరొచ్చరబ్బా !
గీతా జావ్ దేఖొ ."
"నయ్ దీదీ మేరొకొ డర్ లగరా "
మళ్ళీ..
టక్ . . . టాక్. . . టక్ . . .
భయపడుతూ వెళ్ళి తలుపు తీసాను.ఎదురుగా....
తెల్ల చీర కట్టుకొని,మోచేతులవరకు తెల్ల జాకెట్ వేసుకొని ,మోకాళ్ళ వరకు జుట్టు విరబోసుకొని ఒక ఆకారము నిలబడి వుంది.తలుపు తీసిన నాచేయి ఎత్తి అలాగే వుంది .నిశ్చేష్టురాలనయి అలా గే నిలుచుండి పోయాను.ఇంతలో వెనక నుంచి గీత అరుపులు
కెవ్వ్ కెవ్వ్ ………


16 comments:

cbrao said...

దెయ్యాలున్నాయంటారా? ఉన్నా, అవి బతికున్నవాళ్లనేమీ చెయ్యవులెండి.

జ్యోతి said...

వచ్చింది ఎవరు?? పక్కంటావిడా? ???దయ్యమైతే కాదు.. దానికంత ధైర్యమా??

పరిమళం said...

ఇంట్రస్టింగ్ గా ఉంది .తర్వాత ?

మధురవాణి said...

హమ్మో.. మాల గారూ..
ఎంత భయపెట్టేసారండీ బాబూ.. నాకసలే ఇలాంటివి భయం.. పైగా రాత్రి పదిన్నరకి చదివాను.
ఏమవుతుందో ఏంటో :-( ఇంతకీ ఆ తరవాత ఏమయిందో చెప్పెయ్యండి. హమ్మయ్యా.. అనుకుంటాను.

మరువం ఉష said...

ఇదేంటండోయ్ "వినరా సూరమ్మ కూతురు మొగుడా" పాట మాదిరిగా చివరికి "అది మా బాల" అంటారా మాల గారు? ;)

Srujana Ramanujan said...

aa nakkalu ekkada?

గీతాచార్య said...

భలే సరదాగా భయ పెట్టారే? చాలా ఆసక్తికరంగా ఉంది. మిగతాది రాయండి.

మాలా కుమార్ said...

cbrao gaaru,
పాపం దయ్యలు ఎవ్వరిని ఎమి చేయవండి.

మాలా కుమార్ said...

జ్యొతి నా బ్లాగ్ కొచ్చారోచ్

మాలా కుమార్ said...

పరిమళ గారు,
థాంక్ యు.

మాలా కుమార్ said...

మధురవాణిగారు,
నన్ను భయపెట్టేస్తున్నారేమిటండి బాబూ.

మాలా కుమార్ said...

ఉషా గారు,
కాస్తాగండీ,చెబుతాను.

మాలా కుమార్ said...

స్రుజనా
చెపుతానుగా తొందరెందుకూ!

మాలా కుమార్ said...

గీతాచార్య గారూ,
థాంక్స్ అండి.

ప్రియ said...

ఐ బాబోయ్ బైపెట్టేసినారండీ.

మాలా కుమార్ said...

ఎవరిదీ ప్రియనే (నన్ను నేను గిల్లి చూసుకుంటున్నాను.)బాబోయ్