కళ్ళు తెరవగానే కిటికీ లో నుంచి కనిపిస్తున్న వెలుతురు. . .
గోడ మీద గడియారంలో టైం . . .
గాలిలో తేలి వస్తున్న ,పారిజాతం , మాలతీ సౌరభాలు. . .
చెట్టు మీది పక్షుల కూతలు . . .
రోడ్ మీద ఆకుకూరల వాళ్ళ అరుపులు . . .
పక్కింటి నుంచి నల్లాలో పడుతున్న నీళ్ళ చప్పుడు . . .
ఎక్కడి నుంచో , కాదు మా ఫోనే రింగవుతోంది

కింద నుంచి అమ్మ " కమలా లేచావా ? కాఫీ పంపనా ?"
"వద్దమ్మా నేను కలుపుకుంటాను "
కాఫీ గ్లాస్ తో బాల్కనీలోకి రాగానే ఎదురు కరెంట్ తీగ మీద పరిగెడుతున్న ఉడతమ్మ పరుగాపి , నా వైపు చూసి " హాయ్ వచ్చావా ? " పలకరింపు . . .
"హాయ్ చిన్నారీ ఎలా వున్నావు ? ఐ మిస్ యు ". . .
"ఐ టూ " అంటూ పరుగో పరుగు . . .
బుజ్జిపాపాయి బోర్లా పడుకున్నట్లు మెట్ల మీద ముద్దుముద్దుగా బోర్లా పరుచుకున్న పారిజాతాలు . . .
మణి పైకి వస్తూ "అమ్మా కాఫీ డికాక్షన్ వేసాను . ఫ్రిడ్జ్ లో పాలున్నాయి. చూసుకున్నారా ? కూరలు తెచ్చాను కాని , పండ్లు తెచ్చుకోవాలి. గాస్, కాఫీ పౌడర్ బుక్ చేయాలి. బియ్యం , సరుకులు తెచ్చుకోవాలి."
ఊం , గీజర్ ఆన్ చేసుకోవాలి నల్లా తిప్పగానే వేడి వేడి నీళ్ళు రావు


2 comments:
మాలగారు పారిజాత సుమాలను పేరిచి కొలిచిన తీరు - భళా !
thanks andi :)
Post a Comment