కళ్ళు తెరవగానే కిటికీ లో నుంచి కనిపిస్తున్న వెలుతురు. . . గోడ మీద గడియారంలో టైం . . . గాలిలో తేలి వస్తున్న ,పారిజాతం , మాలతీ సౌరభాలు. . . చెట్టు మీది పక్షుల కూతలు . . . రోడ్ మీద ఆకుకూరల వాళ్ళ అరుపులు . . . పక్కింటి నుంచి నల్లాలో పడుతున్న నీళ్ళ చప్పుడు . . . ఎక్కడి నుంచో , కాదు మా ఫోనే రింగవుతోంది :) కింద నుంచి అమ్మ " కమలా లేచావా ? కాఫీ పంపనా ?" "వద్దమ్మా నేను కలుపుకుంటాను " కాఫీ గ్లాస్ తో బాల్కనీలోకి రాగానే ఎదురు కరెంట్ తీగ మీద పరిగెడుతున్న ఉడతమ్మ పరుగాపి , నా వైపు చూసి " హాయ్ వచ్చావా ? " పలకరింపు . . . "హాయ్ చిన్నారీ ఎలా వున్నావు ? ఐ మిస్ యు ". . . "ఐ టూ " అంటూ పరుగో పరుగు . . . బుజ్జిపాపాయి బోర్లా పడుకున్నట్లు మెట్ల మీద ముద్దుముద్దుగా బోర్లా పరుచుకున్న పారిజాతాలు . . . మణి పైకి వస్తూ "అమ్మా కాఫీ డికాక్షన్ వేసాను . ఫ్రిడ్జ్ లో పాలున్నాయి. చూసుకున్నారా ? కూరలు తెచ్చాను కాని , పండ్లు తెచ్చుకోవాలి. గాస్, కాఫీ పౌడర్ బుక్ చేయాలి. బియ్యం , సరుకులు తెచ్చుకోవాలి." ఊం , గీజర్ ఆన్ చేసుకోవాలి నల్లా తిప్పగానే వేడి వేడి నీళ్ళు రావు :)మినియాపోలీస్ లో లేను , హైద్రాబాద్ లో ఉన్నాను :)
" అత్తగారిని హీరోయిన్ గా పెట్టి రాసేసిన భానుమతిగారు . వూళ్ళో వాళ్ళ మీద రాస్తే దెబ్బలాటకి రారూ ! మాఇంట్లో వాళ్ళమీద రాస్తే ఏగోలా ఉండదు అన్న బీనాదేవిగారు , తన బాల్యం .తనఫాక్టరీ నేపధ్యంగా ,తీసుకుని కధలు అల్లిన సోమరాజు సుశీలగారూ , తన పల్లెటూరూ తన అనుభవాలని కధల రూపంలో చెప్పే పొత్తూరి విజయలక్ష్మీ (అంటే నేనే ) వీళ్ళందరూ ఆకోవకే చెందుతారు . వీళ్లకధల్లో ఏముంది అని అంటే ఏమీ ఉండదు . కానీ పాఠకులకు వీళ్లంటే వల్లమాలిన అభిమానం . వీళ్ళ పుస్తకాలు బాగానే అమ్ముడవుతాయి . ఆ రచయిత్రుల్లాటి ఓ ఇల్లాలే ఈ మాలాకుమార్ . ఈవిడ అనుభవాలను అలవోకగా చెప్పటం తో. అవన్నీ హాయిగా చదివిస్తాయి . మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి సాహితి అనే బ్లాగ్ లో రాసుకున్న వన్నీ ఒక మాలగా కట్టి ఈ బుక్ గా మనకు అందిస్తున్నారు . ఈ సువిశాలమైన సాహితీ ప్రపంచంలో ఇది నాతొలి ప్రస్థానం అంటూ భారీగా చెప్పలేదు . నా చిన్నిప్రపంచం . పొదరిల్లు అన్నారు ఆమె తరహాలో . నిజమే .పొదరింట్లో కి అడుగు పెడితే కలిగే అనుభవం వేరుకదా. " అని నా అభిమాన రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి గారు , " ఎంతో తెలివైనపని చేసేననుకుని గొప్పలు పోయే అమాయకపు ముదిత ముచ్చటైన కబుర్లు వినాలన్నా, ముఖ్యంగా మురిసిపోతూ చెప్పే “ఏవండీ” గారి కబుర్లు ముగ్ధులై వినాలన్నా ఈ సాహితి పుస్తకం వెంటనే చదివెయ్యడం ఒక్కటే మార్గం." అని జి.యస్.లక్ష్మి గారు ( రచయిత్రి బ్లాగర్ ) , "షడ్రసోపేతమైన విందు ఆరగించబోతున్నారు కదా, దాని రుచి నేను చెప్పటమెందుకు. మీరే ఆస్వాదించండి.అని పి.యస్.యం లక్ష్మి గారు (రచయిత్రి,బ్లాగర్), తన పిల్లల్లూ, తన పిల్లల పిల్లలూ వారి ముచ్చట్లూ గురించి రాస్తున్నప్పుడు సంపూర్ణమైన కుటుంబజీవితంలోని ఆనందాన్ని మాధుర్యాన్ని ఆస్వాదించిన గృహిణిగా తల్లిగా కనిపిస్తారు. అలాగే కంప్యూటర్ నేర్చుకోవడంలో ఆవిడ పట్టుదల, పూల పెంపకంలోనూ ఇతర కార్యక్రమాలలోనూ ఆవిడ సౌందర్యారాధనా - వెరసి పాఠకులకి ఒక చక్కని ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. " అని సీనియర్ బ్లాగర్ కొత్తపాళీ గారు అభినందించిన, (అడిగి పోగిడించు కున్నాను అని ఏమండి అంటున్నారు కాని ఆయన మాట వినకండి ) ఈ సాహితి నా స్వంతం . . నా ఊహల ప్రతి రూపం.. నా చిన్ని ప్రపంచమైన నా కుటుంబములోని సరదా సంఘటనలను పోడుపుకున్న చిన్ని పొదరిల్లు.ఈ నా "సాహితీ" బ్లాగ్ పోస్ట్ ల తో చేసిన ఈ బుక్ "సాహితీ " నిన్న మా ఏమండి గారు ఆవిష్కరించారు. నా సాహితిని , నీ జతగా నేనుండాలి కథా సంపుటిని , అనగనగా ఒక కథ పుస్తక సమీక్శలను ఇంత చక్కగా , ఓపిక గా ఈబుక్స్ చేసి ఇచ్చింది మా కోడలు అను. తన ప్రోత్శాముతోనే తొమ్మిదేళ్లుగా నేనూ చేసుతున్న రచనలన్నీ ఈబుక్స్ గా మారాయి. థాంక్ యు అను. ఈ మూడు పుస్తకాలూ , ఇక్కడ సైడ్ బార్ లో ను ,