హలో హలో,
అందరూ ఎలా వున్నారు ? సాహితి వైపు రాక చాలారోజులైంది .ఏమీ లేదు కొంచం బద్దకం , కొంచమేమో కథలు వ్రాయమని మా మితృలు మొహమాట పెట్టేస్తుంటే , బద్దకం లేనప్పుడు కథలు ఆలోచిస్తున్నానన్నమాట.అంతే ఇంకేమీలేదు! మరి ఈ రోజేమో సాహితి పుట్టినరోజు.హాపీ బర్త్ డే సాహితీ!
అసలు సాహితి పుట్టినరోజు తలుచుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యంగా వుంటుంది.అవి బ్లాగ్ అంటే అమితాబచన్ మాత్రమే వ్రాస్తాడని , అదో పేద్ద ఘనకార్యం అనుకుంటున్న రోజులు . అకస్మాత్తుగా మనము కూడా బ్లాగ్ వ్రాయవచ్చు , అదేమీ పెద్ద ఘనకార్యం కాదు అని జ్ఞానోదయం ఐయింది. అంతే నా " సాహితి " జన్మించేసింది . నా మదిలోని మధురానుభూతులు అలా . . . అలా . . . వచ్చేసాయి. నాకు వినిపిస్తూనే వున్నాయి మీ కిచ కిచ కిచలు . ఎవరైనా మొదట్లో బాగావ్రాయగలరేమిటి :) ఏదో డైరీ లా వ్రాసానే అనుకొండి , అంత మాత్రాన అలా నవ్వేయాలా :( ఏదీ ఇప్పుడు నవ్వండి చూద్దాం :) ఊరికే సరదాకి అన్నాను.మీరెవరూ నవ్వటం లేదు , పైగా నా వ్రాతల్ని ప్రోత్సహిస్తున్నారు నాకు తెలుసు. మీ అందరి ప్రోత్సాహంతోనేగా ఈ రోజు చిరు రచయిత్రిగా ఎదిగాను :)

2008 డిసెంబర్ 27 న మొదలైన నా నూతనాద్యాయం ఎన్నెన్నో మలుపులు తిరుగుతూ ఇలా సాగింది.
జూన్ 2013 లో మొదటగా నా కథ " మట్టిలో మాణిక్యం " ప్రచురించి విహంగ పత్రిక బుక్కైపోయింది . అప్పటి నుంచి ప్రతినెల నా పుస్తక సమీక్ష లు వేసుకోక తప్పటం లేదు పాపం .
అంతేకాదండోయ్ ఆంధ్రభూమి వాళ్ళు కూడా నా కథలు ప్రచురించారు. నిజం!
ఇహపోతే స్వప్న మాసపత్రిక వాళ్ళు కూడా నా కథలు వేసుకున్నారండోయ్!
ఈ
మధ్య మాలిక వెబ్ మాగ్జిన్ వారు నా కథ " చాందిని" పబ్లిష్ చేసారు. దీనికో ప్రత్యేకత వుంది. అది , తండ్రి- కూతురు అనుబంధం అనే విషయం మీద ఇరవైఐదు మంది రచయిత్రి లు కథలుగా వ్రాశారు. ఆ కథ లన్నీ కలిపి " ఈండ్రి-తనయ" అనే పేరు తో ప్రమదాక్షరి గ్రూప్ ( ఫేస్ బుక్ లోని రచయిత్రుల గ్రూప్) జే.వి పబ్లిషర్స్ ద్వారా పుస్తకం గా ముద్రించారు.పేరు పొందిన ప్రముఖ రచయిత్రుల కథల సరసన నా కథ కూడా చోటుచేసుకుంది. అదీ ఈ సంవత్సరం నా సాహితి
నాకు ఇచ్చిన గొప్ప కానుక!
ఇంకా జాగృతి మాసపత్రిక వారు నిర్వహించిన కథలపోటీలో నా కథ " ఆత్మీయబంధం" సాధారణ ప్రచురణకు ఎన్నికైంది.
రచన మాసపత్రిక లో " నీ జతగా నేనుంటాను" అనే కథ ప్రచురణకు తీసుకున్నారు. ఈ రెండూ ఇంకా పబ్లిష్ కాలేదు . ఐనప్పుడు తప్పక చెబుతాను కదా !
ఇంకో మూడు కథలు వివిధపత్రికలలో పరిశీలనలో వున్నాయి.
సో ఇదన్నమాట సంగతి. ఇదంతా మీ తప్పే! మీరంతా నన్ను ఇంతలా ప్రోత్సహించకపోతే నేను వ్రాసేదాన్నా చెప్పండి!
మరోసారి సాహితి కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ , మీ అభిప్రాయాలతో ప్రోత్సహిస్తూ , తప్పొప్పులు దిద్దుతూ నన్ను ముందుకు నడిపిస్తున్న మితృలకు , కుటుంబసభ్యులకు , ఆత్మీయులైన మీకందరి కీ , కొత్త రచయిత్రిని ఐనా నా కథలను ప్రచురించి ప్రోత్సహించిన పత్రికాధిపతులకు ,నా హృదయపూర్వక ధన్యవాదాలు.నా "సాహితీ" ప్రయాణం కు
మీ ప్రోత్సహాన్ని , ఆశీస్సులను ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తూ,
మీ మాల.
5 comments:
హ్యాపీ హ్యాపీ బర్త్డే to సాహితీ :) Keep writing and keep posting :)
Happy Birthday Sahithimala...
Happy Birthday Sahiti
తెలుగు సాహితీవనంలో మీరొక మణి మాలలా వర్ధిల్లాలని ఆశిస్తూ...
you are ideal for us mala garu.keep writing :)
Post a Comment