Tuesday, June 11, 2013

మధురస్మృతులు

ఈ ఫొటోలో వున్నది మా అత్తగారు శ్రీమతి పరచ అనసూయ  , మామాగారు శ్రీ పరచ కిషన్ రావు గార్లు.. ఈ రోజు వాళ్ళు ఎందుకు గుర్తొచ్చారా అంటారా  పోయిన వారం మా అత్తగారి వూరు "పోలంపల్లి"వెళ్ళి వచ్చాము . ఆ వూరి గురించి చెప్పేముందు మా మామగారిని , అత్తగారిని తలుచుకున్నానన్నమాట.


"పోలంపల్లి" లో మా మామగారి పూర్వీకులు అంటే తరతరాలుగా అక్కడే స్తిరపడ్డారు . ఇది ఆంధ్రాకు , తెలంగాణాకు బార్డర్ ఏరియా. ఈ సంగతి ప్రత్యేకం గా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే , రజాకార్ మూమెంట్ సమయం లో ఈ వూరు కూడా పాల్గొంది . జమలాపురం కేశవరావు గారి ఆధ్వర్యం లో మా మామగారు , వూరి కరణం అప్పారావు గారు మరి కొందరు వూరి యువకులు వాళ్ళ వుద్యోగాలు వదులుకొని వచ్చి పాల్గొన్నారట. రజాకారులు తరుముతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడి కి వచ్చేవారు.బార్డర్ లో వున్న గ్రామాలలో వారి కాంప్ లు ఏర్పాటు చేసుకునేవారు.అలాంటి వక కాంప్ , పరిటాలకు కాంప్ కమాండర్ మా మామగారు. ఇక్కడ కరణం గారింట్లో ఉద్యమం వ్యూహ రచనలు చేస్తుండేవారు. ఇళ్ళలో ఆడవాళ్ళు నూలు వడకటం చేసేవారు.కార్యకర్తలకు మా ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసారు . మా అత్తగారు , ఆవిడ ఆడపడుచు అందరి కీ వండేవారట.అసలు రోజంతా వండుతునే వుండేవాళ్ళము అనేవారు మా అత్తగారు ఈ వూరి నుంచి మొదటిసారిగా చదువు కోసం బయటకు వెళ్ళింది మా మామగారేనట.

మావారి బాల్యం ఇక్కడే గడిచింది. మా పెళ్ళైన కొత్తల్లో మా బంధువులు , స్నేహితులు అందరూ మావారు చిన్నప్పుడు చేసిన అల్లరి గురించి తెగ చెప్పి భయపెట్టారు.ఓసారి మా అత్తగారి మీద కోపం వచ్చి నాలుగు కిలోల నెయ్యిని ఇంటి ముందు వేపచెట్టు కింద పారబోసారట. ఎంత అల్లరి చేసినా పిల్లలను కొట్టకూడదు , తిట్ట కూడదు అని మామాగారి రూలట. ఈయన అల్లరి భరించలేక ఓసారి , ఇంటి వెనుక వున్న గోతిలో ఈయనను దింపి మా అత్తగారు ఏడుస్తూ కూర్చున్నారట. అలాంటివి బోలెడు సంగతులు , నేను మా పెళ్ళైన కొత్తల్లో అక్కడ వున్నప్పుడు ఎదురింటి వాళ్ళు చెప్పారు.మేము కొన్ని రోజులు ఆ ఇంట్లో వుండాలని , మామాగారు ఆయన చెల్లెలిని తోడిచ్చి వుంచారు. అప్పటికే ఆక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేసి చాలా ఏళ్ళైందిట.కాని పొలాలు చూసుకోవటానికి ఆయన వెళుతూనే వుండేవారు.అప్పుడే ఎదురింటి వాళ్ళు మావారి చిన్నప్పటి ఫొటోలు చూపించారు. నేను అడుగుతే అన్నీ ఇచ్చారు కాని వకటి మాత్రం ఇవ్వలేదు . అందులో మావారు చాలా చిన్నగా , బహుషా నాలుగేళ్ళు వుండ వచ్చు , తెల్ల పైజామా కుర్తా వేసుకొని , చేత్తో జంఢాపట్టుకొని వూరేగింపు ముందు వున్నారు . అది రజాకార్ మూమెంట్ ఐపోయిన తరువాత వూళ్ళో వూరేగింపు చేసారట అప్పడు తీసారుట. ఆ తరువాత ఇన్ని సంవత్సరాలకు అక్కడకు పోయిన వారం వెళ్ళము.మధిరలో మా వారి కజిన్ కూతురు పెళ్ళైతే అక్కడికి వెళుతూ పోలంపల్లి వెళ్ళాము. మా ఇద్దరి తోపాటు మావారి కజిన్ సంధ్య కూడా వచ్చింది. ముందుగా తిరుమలగిరి లో వెంకటేశ్వరస్వామి దర్షనము చేసుకున్నాము. ధర్షనం అయ్యాక అక్కడ వున్న క్లర్క్ ను , పోలంపల్లి ఏ రూట్ లో వెళ్ళాలి అని అడిగారు. ఆయన పోలంపల్లి వాళ్ళదే ఇక్కడ పెళ్ళవుతోందండి అని చెప్పారు. అక్కడి వెళి కనుక్కుంటే అప్పుడే పెళ్ళైపోయి అంతా కిందకు దిగారని తెలిసింది. వాళ్ళలో తులశమ్మగారి అబ్బాయి అంటే మా ఇల్లు కొనుక్కున్నావిడ కొడుకు కూడా వున్నట్లు తెలిసింది . అంతే అప్పటి నుంచి మావారి ఆనందం , ఎక్సైట్మెంట్ చెప్పలేనివి . మీరు కార్ లో కింది కి రండి నేను మెట్ల మీదుగా దిగి వాళ్ళను అందుకుంటాను అని వడి వడిగా వెళ్ళిపోయారు.మేము కింది కి వెళ్ళేసరి కి తులశమ్మగారి అబ్బాయి , మావారు చాలా సంతోషంగా మాట్లాడుకుంటున్నారు.ఇప్పటికీ ఆయన పేరు తులశమ్మగారి రెండో అబ్బాయి అనే తెలుసు .ఆయన వెంట పోలంపల్లి బయిలుదేరాము . మీరూ మాతో పాటు రండి.


వూళ్ళో కి వెళ్ళే ముందు భోజనం చేసి వెళ్ళాలి కదా , అక్కడ ఎవరిని ఇబ్బంది పెడతాము . ఇది పోలంపల్లి కి ముందు వున్న 'వత్సవాయి 'అనే వూళ్ళోని హోటల్.భోజనం వేడి వేడిగా వడ్డించారు. ముఖ్యం గా ఎందులోనూ వెల్లుల్లిలేదు :)పెరుగైతే ఎంత రుచిగా వుందో .హాయిగా కడుపు నిండా తినేసాము.
ఈ ఫొటో ఆ హోటల్ ముందుదే. మావారి పక్కన వుంది తులశమ్మగారి రెండో అబ్బాయి ఆపక్కవారు హోటల్ నడుపుతున్న దంపతులు .
ఇహ పోలంపల్లి లోకి పదండి. వూళ్ళోకి వెళుతూనే గుడి పక్కన మా మాష్టారు ఇల్లు అని ఆపారు . ఆయన గురించి అడుగుతే పాపం పోయారు లేరు:( ఇంట్లో కూడా ఎవరూ లేరు.


ఇదే మా యిల్లు. మట్టి ఇంట్లో వాళ్ళ అమ్మ ఇబ్బంది పడుతున్నది అని , వుద్యోగం రాగానే ఈ ఇల్లు అమ్మ కోసం కట్టించారట మామాగారు. కార్ ఆగటం ఆలశ్యం మావారు ఎలా పరుగెత్తుతున్నారో !అప్పటి నుంచి నేనూ, సంధ్యా ఫొటోలు తీస్తూ మావారి ఆనందాన్ని చూస్తూవున్నాము:)
"అరే ఇంటి ముందు పెద్ద వేపచెట్టుండాలి లేదే" మావారి ఆశ్చర్యం.
"దాని కిందేనా మీరు రెండు కిలోల నెయ్యి వంపేసింది ?"నా ఆరా.
"రెండు కాదు నాలుగు కిలోలు "
"మరే వదినా మా అన్నయ్యను తక్కువ అంచనావేయకు ."
మా ఇద్దరి మాటలు ఆయనెక్కడ విన్నారు . ఇంట్లోకి దూరిపోయారు. ఆ ఇంటిని రెండు భాగాలుగా చేసి తులశమ్మగారి రెండో అబ్బాయి , మూడో అబ్బాయి వుంటున్నారట. ఇల్లు చూసేలోపల తులశమ్మగారి రెండో అబ్బాయి వెళ్ళి తెలిసినవాళ్ళను తీసుకొచ్చాడు. మాధవయ్యగారు వచ్చారు అంటూ వాళ్ళూ సంతోషంగా వచ్చారు .








మావారి పక్కనే బుజం మీద చేయి వేసి నిలుచున్నది , ఆయన చిన్నప్పటి గోలీలాడిన ఫ్రెండ్ లచ్చుమయ్య.


ఇది తులశమ్మగారి రెండో అబ్బాయి ఇల్లు . ఆయన భార్య, కొడుకు . ఆవిడ మంచిటీ చేసి ఇచ్చింది.టీ తాగమన్నప్పుడు ఎలాంటి టీ ఇస్తుందో అనుకున్నాను. కాని చాలా బాగుంది . ఆవిడతో టీ బాగుందండి అంటే , మీ మామగారు కూడా వచ్చినప్పుడల్లా "తులశమ్మా నీ రెండో కోడలు టీ చాలా బాగాపెడుతుంది " అనేవారు అంది .మాకు బొట్టుపెట్టి జాకెట్టుబట్టలు పెట్టింది .


ఇది మావారి చిన్ననాటి స్నేహితుడు మన్నెం గోపాలారావుగారి ఇల్లు. ఆయన కొడుకు , కోడలు , మనవడు. ఆవిడా బొట్టుపెట్టి జాకెట్టుబట్టలు పెట్టింది.
అందరూ చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. ఇన్నిసంవత్సరాల తరువాత వెళ్ళినా వూళ్ళో కొంతమందైనా గుర్తుపట్టేవాళ్ళు వున్నారని చాలా సంతోషపడిపోయారు.
అప్పుడు పెట్టిన ముగ్గులు కూడా అలానే వున్నాయి అని తరువాత అన్నారు. ముందే చెపితే అవి కూడా ఫొటోలు తీసే వాళ్ళము కదా అనుకున్నాము . ఎదురింటి వారు వుంటే మావారి ఫొటో అడుగుదామనుకున్నాను . ఇప్పుడైతే వాళ్ళకంత ఆసక్తి వుండదుకదా అనుకున్నాను. ఆ పెద్దవాళ్ళు లేరు . వాళ్ళ పిల్లలు ఖమ్మం లో సెటిలయ్యారు. వాళ్ళ పిల్లలు అమెరికావెళ్ళారు.






ఇదీ మా అత్తగారి వూరు , ఇల్లు.



16 comments:

Anonymous said...

Very good AtTayYa and touching. -Ravi Komarraju

Unknown said...

మధుర స్మృతులు మరింత మధురం చేసుకున్నారిలా...

శ్రీలలిత said...

మధురస్మృతులు చాలా మధురంగా ఉన్నాయి.

శశి కళ said...

mala garu mee oori viseshalu,photolu bhale unnayi.mukyanga aavu,dooda

Anonymous said...

బావున్నాయి మీ విశేషాలు.

వనజ తాతినేని/VanajaTatineni said...

Chaalaa BaavunnaayaMDee! ilaagainaa appudappuDu velli teeraali.. aa madhura smRtula kOsam.

chaalaa nachhayi ..

వనజ తాతినేని/VanajaTatineni said...

మీరు వ్రాసిన కథల లొ మీ బ్లాగ్ లొ ఉన్న కథలలొ మీకు నచ్చిన కథని పంపండి. వివరాలకు నా బ్లాగ్ చూడండి
http://vanajavanamali.blogspot.in/2013/06/blog-post_12.html

సి.ఉమాదేవి said...

మధుర స్మృతులు పరచిన సాహితీ పూదోటలో జ్ఞాపకాల పరిమళం సౌగంధభరితం!

ranivani said...

చాలా బావున్నాయి మీ మధుర స్మృతులు .మావారి ఉద్యోగ రీత్యా మేము మధిరలో 7 సంవత్సరాలు ,ఖమ్మం దగ్గరగా 7 సంవత్సరాలు ఉన్నాం .మీతో పాటు నేనూ ఆ ఊళ్ళన్నీ చూసి వచ్చినట్లైంది .

Hima bindu said...

Good andee Heart touching

Kottapali said...

excellent. thanks for sharing

మాలా కుమార్ said...

రవీ,
మీరంతా కూడా వస్తే బాగుండేది . మిమ్మలిని మిస్ అయ్యాము.ముఖ్యంగా అన్నయ్యగారిని.

*చిన్ని ఆశగారు,
*శ్రీలలితగారు,
థాంక్స్ అండి.
*శైశికళ గారు,
ఆవుదూడ భలే ఫోజిచ్చాయి కదండి:)

మాలా కుమార్ said...

అనూ గారు,
థాంక్స్ అండి.
*వనజవనమాలి గారు అవునండి మేమూ అనుకున్నాము అప్పుడప్పుడైనా వెళ్ళాలి అని .
*సి.ఉమాదేవి గారు,
థాంక్స్ అండి.

మాలా కుమార్ said...

నాగరాణి గారు,
మీరూ ఖమ్మం వైపు వున్నారా:)మావారు 5థ్ క్లాస్ వరకూ మధిర లోనే చదువుకున్నారు.ఆ తరువాత ఖమ్మం లో కొన్నేళ్ళు వున్నారు.మా అత్తగారి వైపు వాళ్ళంతా ఖమ్మం , మధిరనే:)
*చిన్ని గారు,
నారాయణస్వామిగారు,
థాంక్స్ అండి.

వేణూశ్రీకాంత్ said...

కబుర్లు ఫోటోలూ కూడా బాగున్నాయండీ. :)

మాలా కుమార్ said...

thank you venu .