Sunday, March 21, 2010

మిస్టర్ . పెళ్ళాం ?????


మాఏమండీ గారు  , రాజమండ్రి పని మీద వెళుతున్నాను వస్తావా ? అని అడగ్గానే సరే సరే అని ఎగిరి గంతేసి ఒప్పుకున్నాను . కాని మీకు పని వుందన్నారు ఎంతసేపో అని అనుమానం వెలిబుచ్చితే , అదెంత సేపులే , ఓ గంట లో ఐపోతుంది , ఆ తరువాత ఐ విల్ బి అట్ యువర్ సర్వీస్ . అని వాగ్దానం చేసేసారు . రాజమండ్రి ఎన్ని సార్లు వెళ్ళినా , పూర్తిగా చూడ లేదు , పోయినసారి గుళ్ళూ గోపురాలు చూపించారు , ఈ సారి కోనసీమ సైట్ సీయింగ్ కెళుదాము అనగానే , నీ ఇష్టం ఒక గంట లో నా పని పూర్తికాగానే , నువ్వెన్ని రోజులన్నా , ఎక్కడికన్నా నేను రెడి .అనేసారు అహా ఏమి నాభాగ్యమూ అని పాడుకుంటూ , నేను రాజమండ్రి వెళుతున్నానోచ్ అని వూరూ వాడా చాటింపేసి కార్ ఎక్కాను .

పొద్దున బ్రేక్ ఫాస్ట్ కాగానే , ఓ గంటలో వచ్చేస్తాను , రెడీ గా వుండు అన్నారు మావారు . ఈ లోపల నువ్వు రెండు నవల్స్ తెచ్చుకున్నావుకదా , అవి చదువు , ఇక్కడి నుండి గోదావరి ని చూడు అని సలహా ఇచ్చారు . గంట అంటే , నేను రెండు నవలలు చదివేంత సేపా ? రెండు నవలలేం ఖర్మ , స్వాతి కూడా తెచ్చుకున్నాను అన్నాను . మరింకేం, ఓ గంటలో రాగానే ఐ విల్ బి ఎట్ యువర్ సర్వీస్ మేడం అంటూ వెళ్ళి పోయిన మనిషి , సాయంకాలం ఏడు గంటలకు వచ్చారు . రాగానే సినిమా చూస్తావా ? అంటూ పక్కనున్న అసిస్టెంట్ తో ఏం సినినా బాబూ అది , ఏం మాయచేసావోకాని కదా , పద పద అని హడావిడిగా , నన్ను ఇంకో మాట మాట్లాడ నీయకుండా తీసుకెళ్ళారు . హుం వెళ్ళిన కాసేపటికే ఇంటర్ వెల్ !!! నేనొప్పుకోను నేనొప్పుకోను అంటున్నావా అని ఓ జోక్ . ఏమన్నా ఏం లాభం ?? తిరిగొచ్చేటప్పుడు , మహేష్ మనము వెళ్ళిన సినిమా హాల్ పేరేమిటి ? అని డ్రైవర్ ని అడుగుతే ఏమో మేడం అని చాలా వినయంగా జవాబిచ్చాడు .

పొద్దుటి నుండి మల్లాది నవల , ఎంతేంత దూరం చదువుతూ , మద్య మద్య లో గోదావరిని తీసిన ఫొటోలు ఇదిగో ఇవి .ఆ నవల కూడా పూర్తిగా చదివేసానకోండి



మరునాడు పొద్దున షరా మామూలే !! ఓ గంటలో వచ్చేస్తాగా , రాగానే ఐ విల్ బి ఏట్ యువర్ సర్వీస్ . అప్పటిదాకా ఇంకో నవల చదివేయి . ఇంచక్కా గోదావరిని చూస్తూ వుండు . గోదావరినా ? అసలు ఇక్కడి నుండి కనిపిస్తోందా అని ఉక్రోషం గా అన్నాను . మాట్ల్లడకుండ వెళ్ళి , ఐదు నిమిషాలలో వచ్చేసారు . వచ్చేసారా అని ఆనందం ప్రకటించేలోపలే , పద పద అన్నారు . ఎక్కడికి అంటే చెప్తాగా పద అన్నారు . వెనుకాలే బాయ్ లగేజ్ తీసుకొని వస్తోంటే , ఏమిటీ అంటే పెద్ద సస్పెన్ మేంటేన్ చేస్తూ లిఫ్ట్ లో పై ఫ్లోర్ కు తీసుకెళ్ళారు . ఇదో చూడు , ఈ ఫోర్ నాట్ వన్ రూం నుండి , గోదావరి వ్యూ ఎంతబాగుందో అన్నారు . మరి త్రీటెన్ నుండి గోదావరి వ్యూ సరిగ్గా లేదన్నావు కదా అందుకే రూం మారిపించాను . ఏమిటీ నా మొహం అలా చూస్తున్నావు ? అన్నారు . ఏం లేదండి , మిస్టర్ పెళ్ళాం లో ఆమనిని బురిడీ కొట్టించిన రాజేంద్ర ప్రసాద్ , మీ మొహం లో కనిపిస్తున్నాడు అన్నాను . సరె సరె లే ఓగంట లో వస్తాను రాగానే . . . ఒకే వెళ్ళిరండి అని పంపించి , "నమ్మరాదే చెలి ఈ మగవరిని నమ్మరాదే చెలి" అని ఆమని పాటి కూనిరాగాలు తీస్తూ, వల్లూరి లక్ష్మి రాసిన అనూహ్య తీరాలు నవల చదువుతూ మధ్య మధ్య లో గోదావరిని చూస్తూ తీసిన ఫొటోలు ఇవి !!!



త్రీ టెన్ రూం నుండి , ఫౌర్ నాట్ వన్ రూం నిండి గోదావరి ని ఇంకా చాలా ఫొటోలే తీసాను . అన్ని పెడితే నా బ్లాగ్ గోదాట్లో మునిగి పోతుందేమో ననే భయం తో అన్నీ పెట్టటము లేదు .

ఏమండీ , సాయంకాలము వస్తూనే సారీ మాలా రేపు పొద్దున్నే హైదరాబాద్ వెళ్ళాలి .అనుకోకుండా డైరెక్టర్ గారి తో మీటింగ్ వచ్చింది . నెక్స్ట్ వీక్ వద్దాము . అప్పుడు నీ ఇష్టం వచ్చినన్ని రోజులు వుందాము . కోనసీమ అంతా తిగుదాము . ఈ పని కాగానే ఐ విల్ బి . . .
అవునులెండి , యూఅర్ ఆల్ వేస్ ఎట్ మై సర్వీసే . ఇహ చేసేదేముంది ? పదండి పోదాం . . . . .
ఇంకేముంది ? ఇహ ఇంతేసంగతులు చలో హైదరాబాద్ .

23 comments:

Anonymous said...

అడ్డెడ్డే.....అంత పని జరిగిందా! చూసారా మరి మీరు వస్తున్నట్టు నాకో ముక్క చెపితే ఇలా జరిగేదా ! ఎంచక్కా
మనమిద్దరం కల్సి షికార్లు కొట్టేవాళ్ళం కదా .

నీహారిక said...

మాల గారు,
బాగున్నారా?
photos బాగున్నాయి.లలిత గారితో చెపితే బాగుండేది కదా! నవలలు ఇక్కడ చదవకూడదేంటి?
ప్చ్....ప్చ్...

రాధిక(నాని ) said...

అయ్యోయ్యో ఒక మాట చెపితే మ ఊరు తిసికుపోదునా.మళ్ళి వస్తే చెప్పండి

జయ said...

అంతే, అంతే, నన్ను తీసుకు పోకుండా పోతే అంతే మరి. మనిద్దరం ఏప్రెల్ లాస్ట్ వీక్ లో పోదాం, కోనసీమ చూద్దాం అంటే నాకు చెప్పకుండా అలా వెళ్ళిపోటమే. పోన్లే, మీ ఫ్రెండ్స్ అంతా తీసుకుపోయి చూపిస్తామంటున్నారుగా. హాయిగా వాళ్ళతోటే వెళ్ళిపో. అయినా ఇప్పటికి ఎన్ని సార్లు చూసావమ్మా. నాకు కుళ్ళుబుద్ధి పుడితే అంతే మరి.

Anonymous said...

మీరు తీసిన ఫొటోల కన్నా, మేము రాజమండ్రీ లో అద్దెకు ఉన్న ఫ్లాట్ నుండి ఫొటోలు ఇంకా బాగా వచ్చుండేవి.మేము అక్కడ ఉండగా, ఎంతమందిని ఆహ్వానించినా, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా రాలేదు. హాయిగా మా కోనసీమలోని బండార్లంక వెళ్ళి శుభ్రమైన చీరలు కూడా తీసికొని ఉండేవాళ్ళమా! కేవలం నవలలు చదివి,రాజమండ్రీ ట్రిప్ ని వేస్ట్ చేశాశారు !!

శ్రీలలిత said...

మాలాగారూ,
ఎక్కడో నాసికా త్ర్యయంబకంలో పుట్టి,
ఎక్కడెక్కడో ప్రవహించి, రాజమండ్రి దాటి,
పట్టిసం దగ్గర సముద్రంలో కలిసే గోదావరి...

రాజమండ్రీ దగ్గర పున్నమి రాత్రి వెన్నెల వానలో గోదావరి ఎలా వుంటుందంటే...

జిలుగు వెన్నెల వెలుగు చీర కుచ్చెళ్ళలో
నీలి దేహపు కాంతి నిండుకొనగ
రంగారు పొంగారు బంగారి జిగిమేను
సింగారముగ వంగి వగలు పోవ
త్వరలోనె తన భర్త దరి చేర గలనంచు
ఆనందమున మేను జలదరింప
ఇన్నినాళ్ళీ సంసార మెటులీద గలనంచు
వంగి భారము మదిని నిండుకొనగ
తనదు పతిని మదిని నిండుగా నిలిపి
నిదురరాక గోదావరి నిదురపోయె....

గోదావరి గుర్తొస్తే మనసు పరిగెడుతుంది..

మధురవాణి said...

ప్చ్..ఎంత పని జరిగింది! :-(
ఏ మాట కామాటే, 401 నుంచి గోదావరి వ్యూ బాగా ఎంజాయ్ చేశారన్న మాట! ఫోటోలు బాగా వచ్చాయిగా మరి! ;-)

@శ్రీలలిత గారూ,
గోదారిని అద్భుతంగా వర్ణించారు. మీ వ్యాఖ్య చూశాక అర్జెంటుగా గోదావరిని చూడాలనిపిస్తోంది :-)

మాలా కుమార్ said...

లలిత గారు ,
మీరు కనిపిస్తారేమో నని తెగ వెతికానండి . ఈ సారి మీ మీద అటాక్ చేస్తాను లెండి .

$నీహారిక గారు ,
ఎలా వున్నారు ? చాలా రోజులకు వచ్చారు .
$రాధిక గారూ ,
మీరూ రాజమండ్రి లోనే వుంటారా ? ఐతే ఈ సారి మిమ్మలిని తప్పక కలుస్తాను . థాంక్ యు అండి .

మాలా కుమార్ said...

సృజన ,
చూసారా , నాకు రాజమండ్రి చూపిస్తానని ఎంత మంది ప్రామిస్ చెసారో . ఈ సారి చూసి వచ్చి బాగా రాస్తాను . అప్పటి దాకా నవ్వుతునే వుండండి .
$ఇదిగో జయా ,మరీ అంత కుళ్ళకు . ఏప్రిల్ లో వెళుదాములే . నా ఫ్రెండ్స్ ని నీ ఫ్రెండ్స్ గా భావించు . ఇద్దరినీ ఆదరిస్తారులే .
$హరేఫలే గారు ,
మీరు పిలిచింది నాకు తెలీదండి . పోనీ పూనా రామా ? కిర్కీ మా ఫస్ట్ ఫామిలీ స్టెషన్ . అక్కడ కూడా పూనా చీరలు కొనుక్కోవచ్చు :D

మాలా కుమార్ said...

శ్రీలలిత గారు ,
ఎంతబాగా రాసారండి . అప్పుడప్పుడు ఇలా మీ కవితల తో నా సాహితి ధన్య మౌతోంది . థాంక్ యు . థాంక్ యు వెరీ మచ్ .
$మధురవాణి ,
భద్రాచలం లో గోదావరి స్నానం , 401 నుండి గోదావరిని వ్యూని , యానాం లో గోదావరి లో లాంచి ప్రయాణాన్ని ఈ ట్రిప్ లో బాగా ఎంజాయ్ చేసాను .
నేను తీసిన ఫొటోలు బాగున్నాయని నువ్వైనా అన్నావు థాంక్ యు .

Anonymous said...

తప్పకుండా రండి. మీ మొదటి స్టేషన్ చూసుకోవచ్చు.ఎప్పుడు వస్తున్నారూ?

మాలా కుమార్ said...

హరెఫలె గారు ,
మీ ఆహ్వానానికి ధన్యవాదాలండి . ఎప్పుడు వస్తామంటే చెప్పలేను , మావారి దయ .

సుభద్ర said...

మాలగారు,
హ్హమ్మ..నేను లేని టై౦ చూసి కోనసీమ చుసేద్దామనే!!!ఆశ, దోశ ,అప్పడ౦ ,వడ.....
అ౦దుకే అలా అయ్యి౦ది..కాని మీరు గోదాట్లో లాహిరి లాహిలో అని పాడుకోన౦దుకు ఓకి౦త బాధపడుతున్నా...
ప్రార్ధన...........
ఓ దేవుడా మా మ౦చిదేవుడా..........ఈ మాలగార్కి జులై మూడవవార౦ ను౦చి మొదలుకుని ఆగష్టునెల మూడవవార౦ వరకు మాత్రమే కోనసీమాట్రిప్ జయగారితో కలిసి కుదేరేలా చూడు స్వామి...అ౦తవరకు మేజర్ గార్కి డైరెక్టుర్ మీటి౦గ్ క౦టిన్యూ చెయ్యి౦చి ప్లీజ్......లలితాక్క నేను వస్తా మలగారితో పాటు...నన్ను లెక్కవేసుకో మరి..

శేఖర్ పెద్దగోపు said...

మాలా గారూ..
"రాదే చెలి..నమ్మరాదే చెలి..మగవారినిలా నమ్మరాదేచెలీ.." అంటూ పాడుకుంటున్న మిస్టర్ పెళ్ళాం సినిమాలో ఆమని గుర్తొచ్చిందండీ మీ టపా చదవటం పూర్తవ్వగానే...:)

మొదటి ఫోటో చాలా బాగా వచ్చిందండీ..

నా హోమ్ టవున్ తర్వాత నాకు అత్యంత ఇష్టమైన ప్లేస్ రాజమండ్రి..కానీ ఇప్పటివరకూ ఆ నేలను తాకే అదృష్టం రాలేదు...:(

భావన said...

మీ పోస్ట్ కు కామెంటు రాద్దామని వచ్చాను టీవీ లో రాజమండ్రీ బ్రిడ్జ్ మధ్య గా సూర్యుడి ని చూపిస్తున్నారు. బలే అందంగా వుంది, మొత్తానికి మేజర్ సాబ్ హేండ్ ఇచ్చారన్నమాట. ఈ సారి వెళ్ళీ గోదారందాలు ఇంకా మన స్నేహితులందరిని కలిసి రండి ఎంచక్క గా.

మాలా కుమార్ said...

సుభద్రా ,
అలాగే ఈసారి మీరొచ్చినప్పుడే ప్లాన్ వేసుకుందాము .

$శేఖర్ గారు ,
మంచి పాటే గుర్తొచ్చింది మీకు :D

$భావనా ,
థాంక్ యు .

మురళి said...

గోదారి ఫోటోలు మీరు ఎన్ని పెట్టినా మేము చూడ్డానికి సిద్ధంగా ఉన్నామండీ.. మీరు రాసిన విధానం మాత్రం భలేగా ఉంది..

మాలా కుమార్ said...

మురళి గారు ,
ఇక్కడ ఇంకా గోదావరి ఫొటోలు చూడొచ్చండీ . ఇప్పుడే పెట్టాను .
థాంక్ యు .

మాలా కుమార్ said...

సారీ ఇందాక లింక్ ఇవ్వలేదు . ఇదిగోండి లింక్
http://prayanamlopadanisalu.blogspot.com/2010/04/2.html

కొత్త పాళీ said...

రివర్ బే లో ఉన్నారా?

Unknown said...

జిలుగు వెన్నెల వెలుగు చీర కుచ్చెళ్ళలో
నీలి దేహపు కాంతి నిండుకొనగ
రంగారు పొంగారు బంగారి జిగిమేను
సింగారముగ వంగి వగలు పోవ
త్వరలోనె తన భర్త దరి చేర గలనంచు
ఆనందమున మేను జలదరింప
ఇన్నినాళ్ళీ సంసార మెటులీద గలనంచు
వంగి భారము మదిని నిండుకొనగ
తనదు పతిని మదిని నిండుగా నిలిపి
నిదురరాక గోదావరి నిదురపోయె....

వెన్నెల్లో గోదావరిని చూసాను
అద్భుతం.ఇంకో మాట లేదు.
శ్రీ లలితా గారు చాలా బాగా చెప్పారు.
మాలా కుమార్ గారు మీరు రాసిన విధానం బావుంది.

మాలా కుమార్ said...

sailabala gaaru ,
thanks anDi .

రాధికాప్రసాద్ said...

మీ కవిత అద్భుతః... చాలా బాగా రాశారు..