Monday, March 8, 2010

మరుజన్మ అంటూ వుంటే * * * * *




కూ . . . కూ . . .
కుహూ . . . కుహూ . . .
కూ అనగానే కుహూ అని బదులిచ్చే కోయలమ్మను , మానుకోటలో ( మహబూబాబాద్ ) లో ఇంటి వెనుకనున్న మామిడి తోటలో వెతకటము మధురమైన , మరపురాని బాల్యస్మృతి . నల్లగా వుంటుంది . పొట్టి పిట్ట . అవునా ??? ఐతే ఏమిటంట ? పిట్ట కొంచం కూత ఘనం . ఎంత మధురం గా పలకరిస్తుందో !!! ఆ పలకరింపులో , ఆ ఆత్మీయతలో దాని రూపం గుర్తుకొస్తుందా ? కవి కలం నుండి కవిత గా ప్రాణం పోసుకుంటుంది . కుహూ కుహూ అనే కోయిల అంటూ ప్రేయసి ప్రియులను మధురూహలలో తేలిస్తుంది . వూరి పొలిమేరలోకి రాగానే కూ అంటూ అభిమానంగా కుశల మడుగుతుంది . గానకోకిలై , వసంత కోకిలై గాయణీమణుల గళసీమ నుండి మధురం గా తేనలొలికిస్తుంది . దానికెంత మంది ఆత్మీయులో ! అసలు కోకిలమ్మ పెళ్ళికి వూరంతా సందడే సందడి .

రూపం కాదు కావలసినది , చక్కటి , ఆత్మీయమైన మాటలు , మంచి ప్రవర్తన అనేందుకు సాక్షం కోకిలమ్మే ! నోరు మంచి దైతే వూరు మంచి దౌతుందనే సామెత , కోయిలమ్మను చూస్తే నిజమనిపిస్తుంది .

నాకు , మరుజన్మ అంటూ వుంటే , ఆ జన్మను ఎంచుకునే అవకాశమే వుంటే , కోయిల గా పుట్టి * * * గున్నమామిడి గుబురులో కొమ్మమీద హాయిగా వాలి , మావి చిగురు తింటూ కుహూ . . . కుహూ . . . అని గొంతెత్తి పాడుకుంటూ , అందరి అభిమానాన్ని పొందుతూ , అమాయకంగా , రాగ ద్వేషాలకు అతీతం గా వుండాలని వుంది !!!!!!!!!!!!

విరుద్ధ రూపాలు, స్వభావాలు కల వారి మధ్యనే స్నేహితము బాగా కుదురుతుందట కదా !!!

Get this widget | Track details | eSnips Social DNA




ఇంకా కొన్ని కోయిల కుహు కుహు లు ఇక్కడ .

14 comments:

సుభద్ర said...

అప్పుడు కూడా ఇప్పటిలానే మన౦ ఒకరికి ఒకరు కుహు కుహు లు చెప్పుకు౦ద్దా౦.....
నేను కుహు అనగానే మీరు కూహు కుహూ అనాలి ఎప్పటికి..

పరిమళం said...

మాలా గారు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.మీరు కోయిలైతే నేను చాలా అల్లరిదాన్ని మీకు విసుగొచ్చేవరకు కుహూ అంటూనే ఉంటా ఇక ఆలపించండి మరి వసంత గీతిక ....ప్రాక్టీస్ గా ఉంటుంది :)

psm.lakshmi said...

మీ కోరికలన్నీ తీరాలని కాక్షిస్తున్నా. మరి బదులుగా నేనే రూపంలో కనబడ్డా ఇద్దరూ కుహూ కుహూ అనాలి. సరేనా
psmlakshmi

శ్రీలలిత said...

మాలాగారూ,
మీతో స్నేహం కోసం నేను ఇప్పట్నించే కుహు..కుహూలు ప్రాక్టీస్ చేస్తున్నా..

జయ said...

ఎస్...నేను కూడా కుహూ..కుహూ..అని పలకరిస్తాను. కావాలంటే కోకిలమ్మ పాటలన్ని పాడ్తాను. నేను ఎంతైనా పంతులమ్మగా పుడ్తానుగా మరి. "ఇచుక దాన..బీ చుక దానా..దానే ఊపర్ దానా"...అనికూడా పాడేసి, అక్షరాలన్నీ నేర్పేస్తాను. ఒకేనా!!!

మధురవాణి said...

"రూపం కాదు కావలసినది , చక్కటి , ఆత్మీయమైన మాటలు , మంచి ప్రవర్తన అనేందుకు సాక్షం కోకిలమ్మే ! నోరు మంచి దైతే వూరు మంచి దౌతుందనే సామెత , కోయిలమ్మను చూస్తే నిజమనిపిస్తుంది."
నిజంగా బంగారం లాంటి మాట చెప్పారు మాలా గారూ..!
"రూపం కాదు కావలసినది , చక్కటి , ఆత్మీయమైన మాటలు , మంచి ప్రవర్తన అనేందుకు సాక్షం కోకిలమ్మే ! నోరు మంచి దైతే వూరు మంచి దౌతుందనే సామెత , కోయిలమ్మను చూస్తే నిజమనిపిస్తుంది."
నిజంగా బంగారం లాంటి మాట చెప్పారు మాలా గారూ..!
అలాగే, నా తరపు నుంచి కూడా ఓ రెండు కుహూ కుహూ వేస్కోండి మరి ;-)
వచ్చే జన్మగా మీకు కోయిల జన్మ ప్రాప్తిరస్తు! :-)

Unknown said...

గున్నమావిడి కొమ్మలోనా.. మీకు చిలకలాంటి స్నేహితులు కూడా దొరకాలని.. కోరుకుంటూ..

మాలా కుమార్ said...

ఐతే నాకు మరు జన్మలోని స్నేహితులు కూడా వచ్చేసారన్న మాట!! కుహు . . . కుహూ లు మన కోడ్ అన్నమాట . బాగుంది బాగుంది . మరింకేం అదిగో పంతులమ్మ గారు కుడా వచ్చేసారు . సుభద్రా , పరిమళం గారు , లక్ష్మిగారు , శ్రీ లలిత గారు , మధురవాణి , రండి రండి కుహు కుహూ లు నేర్చుకుందాము .

Anonymous said...

మాల గారూ, అయితే నా తరువాతి జన్మలో నేను విని ఆనందించే " పేరులేని పక్షి పాట " మీదే అన్నమాట. ( అంటే నేను గడ్డిమొక్కను కదా మరి అందుకే నాకు మీపేరు కోకిల అని తెలీదు )

మాలా కుమార్ said...

సరే లలిత గారు , మీరూ మితృబృందము లో చేరి పోయారన్న మాట .
ఓ నా మరుజన్మ లో కాబోయే మితృలారా , ఈ జన్మలోనే మీలాంటి మితృలొకరు ,అడిగినంతనే , నాకీ కవిత రాసిచ్చారు . అదెవరో చెప్పుకొండి చూద్దాం .

కోకిలమ్మ నవ్వింది
కొత్త రాగాలు తానుగ పరవశించింది
కోకిలమ్మ తృళ్ళింది
కూత లేఖలు రెమ్మరెమ్మకి రాసి పంపింది
కోకిలమ్మ ఆడింది
కాకి గూటిలో చిలిపి దాగుడుమూతలాడింది
కోకిలమ్మ వచ్చింది
మావి చివురు ఎరుపు మగువమోమున అద్దింది
కోకిలమ్మ నచ్చింది
నా మరుజన్మకి నాకొక రూపు ఇచ్చింది...

మాలా కుమార్ said...

ప్రసీద గారు ,
ధన్యవాదాలండి .

Srujana Ramanujan said...

ilaa aithe manchi naayanammalu maaku elaa dorukuthaaru?

SRRao said...

మాలాకుమార్ గారూ !
మీకు శ్రీ వికృతి నామ ఉగాది శుభాకాంక్షలు.
- శిరాకదంబం

మాలా కుమార్ said...

ఉషా గారు ,
రెండు నిమిషాలలో చక్కటి కవిత రాసి ఇచ్చినందుకు , మీకు , ప్రత్యేక ధన్యవాదాలండి .