Wednesday, March 17, 2010

మల్లెలు మల్లెలు - 2



గల గల పారే సెలయేళ్ళు . . . పక్షుల కిల కిలా రావాలు ... రా రమ్మంటూ ఆహ్వానించే కోయిల స్వరాలూ ..... నెమళ్ళ నృత్యాలూ ... చల్ల గాలులూ .... ఆహ్లాదపరిచే చెట్లు ......
" అమ్మా , మల్లెపూలు కావాలా ? "
చదువుతున్న పుస్తకం లోనుంచి తలెత్తి చూసి , ఓహో మల్లెపూలొచ్చేసాయా అనుకుంటూ , రా బాబూ అని పిలిచి , మల్లెపూలు చూస్తే హామ్మ్ ఎంటి బాబూ ఇవి మల్లెపూలేనా ? ఇంత చిటుకు పుటుకు వున్నాయి ? అని అడిగితే , అమ్మా చిన్న పూలే మంచి వాసన వస్తాయమ్మా అన్నాడు . " సరే కానియ్ మూర ఎంత ? "
" 15 రూపాయలమ్మా "
" పదిహేనే !!! "
" అవునమ్మా , మీకు కాబట్టి పదిహేను . వేరేవాళ్ళకైతే 20 "
" ఎందుకేమిటి ? "
" మీరు దేవుడి కోసం అని కూడా ఐదు మూరలు తీసుకుంటారు కదమ్మా అందుకని " .
ఇంత సెంట్ ( సెంటిమెంట్ కు మేము పెట్టుకున్న పేరు ) కొట్టాక తీసుకోక చస్తానా ?????



ఇదిగో ఈ మల్లెల దండ ఖమ్మం ది . అదేనండి బాబు , మా అత్తగారి వూరిది . ఎంత సువాసనలను వెదజల్లుతోందో కదా ? ఎంతైనా అత్తింటిది కదా !!!



ఇదిగిదిగో ఈ సుమమాల భద్రాది రామయ్య , గళసీమను అలంకరించిన పుణ్యాత్మురాలు . " మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి " అని సీతమ్మను వేడుకుంటే , దయతో , రాములవారు మాకు అనుగ్రహించిన మాల ఇది .



అహా , ఓహో ఏమి వగలు పోతున్నాయండి !! అవును మరి ఎంతైనా గొదావరమ్మ వడిలోని , రాజమహేంద్రవరం పూలు కదా మరి .



" ఆ అంటే అమలాపురం " అయ్య బాబోయ్ ఇదేమిటి ? , అమలాపురం లోని ఈ మల్లెలను చూడగానే ఈ పాట గుర్తొచేసింది ?????



మా విజయవాడ మల్లెల రూటే వేరండి బాబు . ఎంతైనా మా కృష్ణా జిల్లావి కదా . ఏదేశమేగినా పుట్టింటి మమకారమే వేరు మరి .

ఏవూరైనా మల్లెల సౌరభాలే సౌరభాలు ..... పాపం మల్లెకు ,ఈ వూరని , ఆ వూరని , ఈ దేశమని , ఆ దేశమని బేధభావమే లేదు . తెల్లని స్వచ్చమైన పాల వంటి రంగు , సుకుమారము , మృదుత్వము కలగలుపుకొని , ఒక్క పువ్వు వున్నా చక్కటి సువాసనలతో తన వునికిని చాటుకుంటుంది . భగవంతుని అర్చించినా , అమ్మాయి జడకు ఆభరణ మైనా దాని అందమే అందం !!! మల్లెల తో ఎన్ని రకాల జడలు వేయవచ్చో . వంకీ జడ , చందమామ జడ , నిలువు జడ , అబ్బో ఎన్నో రకాలు . అందులోనూ , కనకాంబరాలు , మరువం కలిపి వేస్తే , ఆ జంపు జడ , సొగసు చూడ తరమా ? వేసవి అంతా పూజా గది లో మల్లెల పరిమళాలే . వేసవి వేడి నుండి , మనలని రక్షించేందుకు వచ్చిన దేవదూత కదా ఈ బుజ్జి మల్లె పూవు .....

సరిగ్గా సంవత్సరము కిందట ,యాదృచికంగా జరిగిన సంఘటన తో (నేను అనుకోకుండా లింక్ వేసిన ), కూడలి లో వచ్చిన , నా మొదటి టపా " మల్లెలు మల్లెలు " . దానికి సీక్వెల్ రాద్దామనిపించి , ఈ వారం మేము చేసిన ప్రయాణము లో కొన్న మల్లె పూల తో ఇలా రాసేసాను .

మా అబ్బాయి తో పోట్లాడి , వాడి సెల్ తీసుకెళ్ళాను . కెమెరా కోసమే లెండి (.ఏం చేయను మరి , నాకు అలవాటైన మా వారి సెల్ ను దొంగోడెత్తు కెళ్ళాడు ). దానికి చార్జర్ తొందరగా ఐపోతుంది . పైగా దానిలో బోలెడు ఫీచర్స్ వున్నాయి . దాని తో ఏదో క్లిక్ చేయ బోయి ఏదో క్లిక్ చేసేయడము , అందులో రక రకాలా మెసేజ్ లు రావటము , నేను హైదరాబాద్ కాల్ చేసి మా అబ్బాయిని అడగటము , అబ్బో , బోలెడు కష్టాలు . ఎలాగో నానా తంటాలు పడి ఫొటోలు తీసాను . కాస్త నిద్ర మబ్బుల్లో వున్నట్లున్నాయి . ప్లీజ్ ప్లీజ్ ఎలాగో సద్దేసుకొండి . మిమ్మలిని కష్ట పెట్టినందుకు మన్నించేసెయండి . మనలో మనం అలా అలా అడ్జెస్ట్ ఐపోవాలన్నమాట !!!!!!!!!!!

Get this widget | Track details | eSnips Social DNA


ఇంకా కొన్ని మల్లెల పాటలను ఇక్కడ వినవచ్చు .

అందరికి ఉగాది శుభాకాంక్షలు .

9 comments:

హను said...

mallepulu sequal chala bagumdi anDi, naa maTa vini meeru kuDa oka phone konesukomDi.

Srujana Ramanujan said...

:-) I misse the first one.

Hima bindu said...

విజయవాడ పూలు అంత మసకబారి వున్నాయి :) మీ మల్లెలు మొదటి టపా చదివాను ఇప్పుడే చాల బాగా రాసారు .

భావన said...

అబ్బ ఎన్ని మల్లెపూలో.. నాకు కుళ్ళు వేస్తోంది మీ మీద. :-(

పరిమళం said...

మల్లెలతో సవత్సరారంభం బావుందండీ ...ఈ ఏడాదంతా మల్లెల సౌరభం పంచుతూ సాగిపోవాలి మీ సాహితీయానం!

మురళి said...

ఉగాది శుభాకాంక్షలండీ..

మధురవాణి said...

మల్లెల గుభాళింపు బాగుందండీ! ఫోటోల కంటే, మీ కబుర్ల సుగంధం బాగుంది :-)
అసలే చాలా కష్టపడి తీశారంటున్నారు కదా! కాబట్టి, ఈ సారికి ఓకే గానీ, మరోసారి మాత్రం ఇంకా మంచి మంచి ఫోటోలు తీసి పెట్టాలి మీరు. అప్పుడే కదా నాలాంటి వాళ్ళు కనీసం ఫోటోల్లోనయినా మల్లెల్ని, జాజుల్ని చూసి ఆనందించగలిగేది ;-)

మాలా కుమార్ said...

హను గారు ,
ఎంత ఈజీగా చెప్పేసారండి , కొత్తది కొనుక్కోమని !! ఏం చెప్పనండి నా కష్టాలు పగవాడి కి ( వుంటే ) కూడా వద్దు బాబు.

@సృజనా థాంక్ యు .

@చిన్ని గారు ,
నన్నేమైనా అనండి కాని మా విజయవాడ పూలని ఏమీ అనకండి . ఆ ఫొటో నా తప్పిదమే , నా తప్పిదమే !!!

మాలా కుమార్ said...

భావనా ,
బాగా కుళ్ళుకున్నారా ? థాంక్ యు .

@పరిమళం గారు ,
నా మొదటి పోస్ట్ లో కూడా మీరు కామెంట్ రాసారు . ఈసారి వస్తారా రారా అని ఎదురుచూసాను . వచ్చారు . థాంక్ యు .

@మురళి గారు : థాంక్ యు అండి .

@. మధురవాణి ,
భద్రాచలం మల్లెల మాల బాగా వచ్చింది కదా ? మిగితావి సద్దేసుకో . మళ్ళీసారి బాగా తీయటానికి ప్రయత్నం చేస్తాలే .ఓకేనా ? థాంక్ యు .