Wednesday, September 3, 2025

#digidarshan Ep: 24| Bala tripura sundari aalayam | tripurantakam | tri...

మా పారిజాతం-సత్యాకృష్ణ

మా పారిజాతం మాటున సత్యాకృష్ణుల సరాగాలు! “పారిజాతం తెచ్చేదాకా మాట్లాడానయ్యా మగడా అంటే అది పట్టించుకోకుండా అమావాస్య, అర్థరాత్రి బృందావనం రమ్మని కబురు పెట్టాడు. ఎందుకు వెళ్ళాలి ఫో... నేను అసలే పోను” కాసేపు మూతి బిగించుకుంది సత్య. కానీ ఎక్కువ సేపు ఆగలేకపోయింది. ఆ కృష్ణయ్య మీద ఎంత సేపు అలిగినా ఇంతే రాడు ఈ మొండివాడు ! దుమధుమలాడుతూ విసురుగా బృందావనం చేరుకుంది. కన్ను పొడుచుకున్నా కనిపించని కటిక చీకటి! ఎటు చూసినా చీకటి ఎక్కడ ఏమీ కనిపించటం లేదు. ఈ చీకట్లో ఎక్కడున్నాడు? ఎందుకు నన్ను రమ్మన్నాడు? ఒకవైపు భయం ఒకవైపు ఆరాటం! ఈ చీకటిలో ఎక్కడని వెతకను? వెతికినా కనిపించనంత నల్లనివాడు. ధుమధుమలాడుతూ, విసురుగా నడుస్తున్న సత్య కాలికి ఒక రాయి తగిలింది. ముందుకు పడపోయి కృష్ణా అని అరిచి తల ఎత్తింది. అద్భుతం మహాద్భుతం! కటిక చీకటిలో ఆకుపచ్చని ముదురాకు పచ్చని ఆకుల మీద తెల్లగా నక్షత్రాల్లాగా మెరిసిపోతున్న పారిజాత పుష్పాలు! ఎంత బాగున్నాయి పరవశించిపోతున్న సత్య భుజం మీద చేయి పడింది. తిరిగి చూసింది కృష్ణయ్య! "ఎలా ఉన్నాయి? పారిజాతాలు నచ్చాయా?" చిలిపిగా అడిగాడు. "కృష్ణా!ఎంతటి అల్లరి వాడివయ్యా" కిష్ట్టయ్యను చుట్టుకుపోయింది సత్య. "అల్లరివాడినే కాదు నల్లటివాడిని కూడా కదా" అలిగాడు. "కాదుకాదు, అందాలు చిందేటి చందమామవి, ఓ జాబిలీ, ఈ తారక నవ్వులే నీవని" కృష్ణయ్య మోమును దోసిలిలో తీసుకుంది ప్రేమగా!