ఆరు
సంవత్సరాల క్రితం మేము యు.యస్ వచ్చినప్పుడు కాలిఫోర్నియా లో పార్క్ వాకింగ్
ఫ్రెండ్ పటేల్ సాబ్,ఇక్కడ సీనియర్ సిటిజన్ సెంటర్స్ ఉంటాయి.అక్కడ చాలా ఆక్టివిటీస్ ఉంటాయి అని
చెప్పి, మా ఇంటి దగ్గర నుంచి ఏ బస్ ఎక్కాలో అంతా వివరంగా
చెప్పారు.అప్పుడు మా అమ్మాయి అన్ని వివరాలు కనుక్కొని మొదటి రోజు మమ్మలిని
తీసుకెళ్ళింది.అక్కడ నాకు మాజాంగ్ అంతగా నచ్చలేదు కాని మా ఏమండీ అక్కడున్నన్ని
రోజులూ బస్ లో వెళ్ళి బ్రిడ్జ్ ఆడి వస్తుండేవారు.తరువాత మినసోటా మా అబ్బాయి
దగ్గరకు వచ్చినప్పుడు మా కోడలు కనుక్కొని మామ్మలిని తీసుకెళ్ళింది.ఇంటి కి దగ్గరగా
నే ఉండింది.మంగళ వారం ,గురువారం మాజాంగ్, మనగళవారం ,శుక్రవారం బ్రిడ్జ్ ఉండేవి.ఇంకా చాలా
ఆక్టివిటీస్ వున్నాయి కాని మేము జాయిన్ అవలేదు.మొదటి రోజు మా ఏమండీ నన్ను మాజాంగ్
రూం కు తీసుకెళ్ళి "నా వైఫ్ మాల.తను ఇండియాలో మాజాంగ్ ఆడుతుంది.ఇక్కడ కూడా
ఆడాలని వచ్చింది.ఇంగ్లీష్ వచ్చు కాని కొంచం మీ ఆక్సెంట్ ఫాలో కాలేక పోవచ్చు "
అని నన్ను వాళ్ళకు పరిచయం చేసారు.వాళ్ళూ నన్ను బాగానే రిసీవ్
చేసుకున్నారు.అక్కడున్నన్ని రోజులూ ఆడాను.నేను ఆడుతున్నంత సేపూ మా ఏమండీ మధ్య మధ్య
వచ్చి నేను కంఫర్టబుల్ గా ఉన్నానా లేదా చూసి వెళుతుండేవారు. అక్కడ కాఫీ ఉంది
తాగవచ్చు అని చెపుతుండేవారు.గురువారం బ్రిడ్జ్ లేకపోయినా నా కోసం వచ్చి అక్కడి
వాళ్ళతో కబుర్లు చెపుతూ బుక్స్ చదువుకుంటూ ఉండేవారు.బ్రిడ్జ్ గ్రూప్ వాళ్ళు ఒక్కోసారి
ఎవరో ఒకరు కేక్స్ , పేస్ట్రీస్ వగైరా తెస్తుండేవారు. మేము
వచ్చేసే ముందు రవ్వాకేసరి చేసి తీసుకెళ్ళాము.మా అబ్బాయి అట్లా పెట్టకూడదు అని
భయపడ్డాడు కాని వాళ్ళు మటుకు హాపీగా తిన్నారు.రసిపీ కూడ అడిగి తెలుసుకున్నారు.
ఒకొళ్ళిద్దరు ఇండియన్ ఫ్రెండ్స్ అయ్యారు.వాళ్ళు మమ్మలిని డ్రాప్
చేస్తుండేవాడు.సెంటర్ వాళ్ళు కూడా ముందుగా చెపితే నాలుగు డాలర్ లకు ఇంటి దగ్గర
దింపేవాళ్ళు .అలా మేము బాగానే ఎంజాయ్ చేసాము.రెండేళ్ళ క్రితం వెళ్ళినప్పుడు కూడా
వెళ్ళాము.
మొన్న
మేము వచ్చే ముందు నుంచీ మా మనవడు " అమ్మమ్మా ఈ సారి నేను నిన్ను సెంటర్ కు
తీసుకెళుతాను."అంటుండేవాడు."నేను చూద్దాం లేరా నాకేమీ వెళ్ళే ఇంట్రెస్ట్
లేదు" అన్నాను."కాదు నువ్వెళ్ళాలి,
మాజాంగ్ ఆడాలి." అనేవాడు.ఇక్కడికి వచ్చాక కూడా అడుగుతూ వుంటే
నేను మూడ్ లేదురా అని వెళ్ళలేదు.మొన్న మంగళవారం పట్టుబట్టి
తీసుకెళ్ళాడు.నువ్వెళ్ళు నేను లోపలికి వెళుతాను లే అన్నా వినకుండా, నాతో పాటు లోపలికి వచ్చి, వాడే ఎక్కడాడుతున్నారో
కనుక్కొని నన్ను తీసుకెళ్ళి,అక్కడి వాళ్ళతో " షి ఈజ్ మై
గ్రాండ్ మదర్ మాల. "అంటూ అప్పుడు వాళ్ళ తాత ఏమి చెప్పారో అవే డైలాగ్ లు
చెప్పి నన్ను పరిచయం చేస్తుంటే నేను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను.నేను
తీసుకెళ్ళటానికి వస్తాను అమ్మమ్మా , అక్కడ కాఫీ ఉంటుంది నీకు
కావాలంటే తాగవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు.
అందులో
ఇద్దరు నన్ను గుర్తుపట్టి హాయ్ మాలా అని పలకరించారు.అందరూ చాలా బాగా మాట్లాడారు.
కాకపోతే నాకే అక్కడ ఉన్నంతసేపూ ఏమండీ నే గుర్తొచ్చి ఆడలేక పోయాను.ఎట్లాగో పూర్తి
చేసి బయటకు వచ్చి , కాసేపు బ్రిడ్జ్ రూం లోకి వెళ్ళి చూసి,మేమిద్దరమూ
తిరిగిన ప్లేస్ లన్నీ తిరిగి బయటకు వచ్చి ,విక్కి వచ్చేవరకూ
కూర్చుందామని అక్కడున్న బెంచ్ దగ్గరకు వెళుతుంటే అమ్మమ్మా అని వినిపించింది.చూస్తే
అక్కడే కార్ పార్క్ చేసుకొని ఉన్నాడు.నువ్వెప్పుడొచ్చావురా అంటే "చాలా
సేపైంది.నువ్వు ఎమోషనలైపోయి ఎట్లా ఉంటావో నని వచ్చి ఇక్కడ ఉన్నాను.మధ్య మధ్య వచ్చి
చూసాను నువ్వు నన్ను చూడలేదు."అన్నాడు.ఎవరో వస్తూ పోతూ ఉంటారు అని నేను అంతగా
పట్టించుకోలేదు.వాడు చెపుతుంటే నా కళ్ళు మసక బారిపోయాయి.నోట మాట రాలేదు అలాగే
వాడిని చూస్తూ థాంక్యూ కన్నా అని అస్పస్టంగా అన్నాను.థాంక్స్ ఎందుకమ్ముమ్మా యు ఆర్
మై అమ్మమ్మ.అన్నాడు.మేము హైదరాబాద్ నుంచి వచ్చే ముందు ఓ రోజు మా అమ్మాయి ఆఫీస్
కెళ్ళాక ,వాడి ఫ్రెండ్ తో కలిసి ఎటో
వెళ్ళాడు.ఎక్కడికెళ్ళావురా అని వచ్చాక అడుగుతే చిలుకూరు బాలాజీ కి ప్రదక్షణలు చేసి
వచ్చాను అన్నాడు.ఎందుకురా నీకేమీ వీసా ప్రాబ్లం లేదు కదా అంటే నవ్వి
ఊరుకున్నాడు.తరువాత మా అమ్మాయి చెప్పింది , వాడి ఫ్రెండ్
చిలుకూరి బాలాజీ చాలా స్ట్రాంగ్ గాడ్ మనముఏమైనా కోరుకొని ప్రదక్షణలు చేస్తే ఆ
కోరిక తీరుంది అని చెప్పాడుట అందుకని వీడు వెళ్ళి మా అమ్మమ్మకు పీస్ ఆఫ్ మైండ్
రావాలి అని పదకొండు ప్రదక్షణలు చేసి వచ్చాడుట అని .
ఈ
రోజు మా అబ్బాయి కూతురు తీసుకెళ్ళింది.బామ్మా నీకేమి కావాలన్నా చెప్పు.నేను చేసి
పెడుతాను అంటూ మాటి మాటికీ అడుగుతూ ఉంటుంది.చిన్న మనవడైతే నా చుట్టు పక్కలే
కూర్చొని వాడి గేంస్ ఆడుకుంటూ ఉంటాడు.కాకపోతే వాడు తెలుగు పూర్తిగా
మర్చిపోయాడు.వాడి ఇంగ్లిష్ నాకు అర్ధం కాదు నా ఇంగ్లిష్ వాడికి అర్ధం కాదు ఏదో
సైగలతో మాట్లాడుకుంటూ ఉంటాము.మా అబ్బాయి అమ్మా ఎక్కడ అనగానే "ఐ ఆం విత్
బామ్మా " అని సమాధానం ఇస్తూ ఉంటాడు :) ఇక మా పెద్ద మనవరాలు ఒక మెట్టు పైకి
వెళ్ళి "అమ్మమ్మా నువ్వు జి ఆర్ ఈ ఎగ్జాంస్ రాయి ఏదో ఒక కోర్స్ లో
చేరుదువుగాని .ఊరికే ఉంటే ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటావు." అంటుంది."లేదా
నాతో పిట్స్ బర్గ్ వచ్చేయి నేను టు బెడ్ రూం ఎపార్ట్ మెంట్ తీసుకున్నాను నేను మా
ఫ్రెండ్ ఉంటున్నాము నువ్వు నా రూం లో ఉందువు గాని. అప్పుడు డప్పుడు ఇద్దరమూ టూర్స్
కెళ్ళవచ్చు అంటుంది"తను అక్కడ ఈ సంవత్సరం మాస్టర్స్ లో చేరుతోంది.ఈ పిల్లలు
నేను పెంచిన పిల్లలేనా ? ఎంత పెద్దవాళైపోయారు.నా గురించి ఎంత ఆరాట పడుతున్నారు.
ఈ
రోజు మాజాంగ్ పరవాలేదు ఆడగలిగాను.అందరూ చాలా ఫ్రెండ్లీ గా ఉన్నారు.చాలా
మాట్లాడారు.ఎన్ని ప్రశ్నలేసారో.వాళ్ళ ఆక్సెంట్ అర్ధం చేసుకోవటం అంత కస్టం
కాలేదు.నన్ను తీసుకెళ్ళటానికి మా అబ్బాయి వస్తే మీ అమ్మను ఇక్కడున్నన్ని రోజులూ
తీసుకురా అని చెప్పారు.ఒకావిడైతే మీ ఇల్లు ఎటువైపు నేనుండేవైపైతే పికప్ అండ్
డ్రాప్ చేస్తాను అంది కాని వాళ్ళ ఇల్లు మా ఇంటికి కంటే ముందు .మా అమ్మాయి ఒక చిన్న
బుక్ , పెన్
ఇచ్చి వాళ్ళ పేర్లు అడిగి రాసుకో అని చెప్పింది.అప్పుడు మా ఏమండీ కూడా అలాగే
చెప్పారు. అడగగానే అందరూ వాళ్ళ పేర్లు రాసి ఇచ్చారు. అనుకుంటాము అమెరికన్స్ మనతో
మాట్లడరు అని కాని నాతో బాగానే ఉన్నారు మరి.
పిల్లలంతా
నన్ను సంతోషంగా ఉంచేందుకు పడుతున్న ఆరాటం చూస్తుంటే కళ్ళు మసకబారిపోతున్నాయి.
ఏమండీ అకస్మాత్తుగా వదిలేసిపోయారని బాధపడనా ?
ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చిపోయారని సంతోషపడనా :( నా బాధను , సంతోషాన్ని ఏదీ పట్టించుకోకుండా కాలం సాగిపోతునేవుంది :( కలలా
కాలం కరిగిపోయి జ్ఞాపకాలే మిగిలాయి.ఇదేనా జీవితం ?
1 comment:
touching....sorry to hear!!
Post a Comment