Friday, May 28, 2021

Anaganaga Oka Katha By Mala Kumar | EP 21 కథా రచయిత్రి శ్రీమతి పెయ్యేటి...

బియ్యం లో రాళ్ళు నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం. ప్రముఖ రచయిత్రి , కార్టూనిస్ట్ , గాయని శ్రీమతి పెయ్యేటి శ్రీదేవి గారు( 69 సం.లు) ఫిబ్రవరి 25 వతేదీ ,2021న గుండెపోటు తో హఠాన్మరణానికి గురికావటం వారి కుటుంబ సభ్యులను మాత్రమే కాదు మిత్రులను , బంధువులను ,సాహితీ మిత్రులను అందరినీ కూడా విచారసాగరంలో ముంచివేసినది. వారికి నివాళిగా ఈ రోజు నేను పెయ్యేటి శ్రీదేవి గారిని చేసిన ఇంటర్వ్యూను వినిపిస్తున్నాను. ఇది 16/06/2017 న విహంగ అంతర్జాల పత్రికలో ప్రచురించబడింది.

Tuesday, May 18, 2021

స్నేహితురాలికి లేఖ

ప్రియమైన స్నేహితురాలికి, మీ మేసేజెస్ అన్నీ చదివానండి. వాట్స్ అప్ లో కాకుండా మీకు ఉత్తరంతో జవాబిద్దామనిపించి మీ ఒక్కో మెసేజ్ కు అదేలెండి ప్రశ్నకూ జావాబులివిగో. నేను బాగానే ఉన్నానండి. మొన్న 7 న మా మనవడు, మా అమ్మాయి కొడుకు విక్కీ గ్రాడ్యుయేషన్ కోసం వాడి యూనివర్సిటీ ఐయోవాకు, మా అమ్మాయి, అల్లుడు, మనవరాలు తో వెళ్ళాను. బాగా జరిగింది. ఇక్కడకు వచ్చి ఆరునెలలయ్యింది ఇంక ఇండియాకు ఎప్పుడోస్తానంటారా? మా పిల్లలు అక్కడ అసలే రోజులు బాగాలేవు వెళ్ళి ఒక్క దానివి ఏమి చేస్తావు? తొందరేమిటి అంటున్నారు. పైగా ఇక్కడే ఉండే ఏర్పాట్లు చేస్తున్నారు. వాకింగ్ చేసేందుకు కూడా వీలు లేక బోర్ అంతే తప్ప ఇంకేమీ ఇబ్బంది లేదు. అడ్జెస్ట్ అయిపోతున్నాను ఇక్కడ చిన్నగా. అక్కడ మా ఇంట్లో మా డ్రైవర్ మహేష్ ఫామిలీ ఉన్నారు. రత్న, భారతి అందరినీ మానిపించేసాను. ఎంచక్కా నాడబ్బులన్నీ దాచుకుంటున్నాను. ఎంత హాపీసో కదా :) మా పిల్లలు నాకు పిసినారి అని పేరు పెట్టారు. పెడితే పెట్టారుగాక :) నాకేంటట. నాకు మా పిల్లలిద్దరూ వాళ్ళ ఇళ్ళల్లో పెద్ద కిటికీ ఉన్న గది ఇచ్చారు. అందుకే హాపీగా చలి తగ్గలేదు బయటకు పోలేను కానీ నా గది కిటికీ లో నుంచి బయట ప్రకృతి ని చూస్తూ చాలా ఆనందిస్తున్నాను. నేను వచ్చినప్పుడు తెల్లని మంచు పూలుపూలుగా రాలుతూ కనువిందు చేసింది. అబ్బ ఎంత తెల్లని తెలుపో! ఎటుచూసినా తెలుపే. ఆ తెల్లని చెట్ల మీదనే రంగురంగుల పిట్టలు వాలేవి. ఆరెంజ్, బ్లూ, బ్రౌన్ అబ్బ ఎన్ని రంగుల పిట్టలో. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవి. వీటికి చలి లేదా అనుకునేదానిని. అందులో రెండు ఆరెంజ్ కలర్ పిట్టలు నా కిటికీ పక్కనే ఉన్న కొమ్మ మీద వాలి, నాతో ముచ్చట్లు పెట్టేవి. ఒక్కోసారి అవి రెండూ కీచులాడుకొని ఒకటి ఎగిరిపోయేది. రెండోది నా వైపు దీనంగా చూసేది. "అలిగి వెళ్ళిపోయాడా? దిగులు పడకు. నీలాంటి బంగారుతల్లిని విడిచి ఎక్కడికీపోడూ వచ్చేస్తాడులే" అని నేను ఓదారుస్తుండగానే ఆయనగారు రివ్వున వచ్చేసేవారు. ఈవిడగారు నావైపు చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఏమండితో కలిసి తుర్రుమనేది. వాటి సరాగాలు చూస్తుండగానే….. చూస్తుండగానే తెలుపు కరిగిపోయి చెట్లు, ఇంటి ముందు రోడ్ అన్నీ బయట పడ్డాయి. కాకపోతే చెట్లన్నీ ఎండిమోడు బారిపోయి ఉన్నాయి. రంగుల పిట్టలు మాయమయి, బ్రౌన్ పిట్టలూ, పెద్దపెద్ద సైజు ఉడతలూ, పిల్లులూ, అడపాదడపా కుందేళ్ళు ఎక్కడి నుంచో బయట పడ్డాయి. పిల్లలు, పెద్దలూ పెద్దపెద్ద కోట్లు వేసుకొని, కుక్కలను పట్టుకొని కొద్దికొద్దిగా బయటకు రావటం మొదలయింది. అంతకు ముందు కుక్కలను వాకింగ్ కు తెచ్చినా వెంటనే లోపలికి వెళ్ళిపోయేవారు. నేనూ సరదాగా వెళుదామని బయట వరండా లోకి వచ్చాను కానీ అమ్మో ఎంత చలో! రయ్ మని లోపలికి పారిపోయాను. సూర్యారావుగారు హలో అని కిటికీలో నుంచి పలకరిస్తుంటే, పవన్ గారు నువ్వు బయటకు వచ్చావో ఊదేస్తా ఖబడ్దార్ అని బెదిరిస్తున్నారు. సూర్యారావుగారు కాస్తాగమ్మాయ్ అన్నింటికీ తొందరేనీకి అని అభయమివ్వగా, ఎండిన చెట్లు, లాన్ పచ్చపడ్డాయి. కిటికీ లో నుంచి ఇదివరకు లేక్ గడ్డకట్టి తెల్లని మునిలా, మౌనంగా నిశ్చలంగా ఉండేది. కనిపించేది కాని ఇప్పుడు పచ్చనాకుల మధ్య ఎండ పడి తళతళా మెరుస్తూ భలే ఉంది. ఘనీభవించి ఐసయిన నీరు కరిగి పారుతున్నాయి. అవి ఎటూపోలేవు కానీ, గాలికి అలలు అలలుగా ఊగుతున్నాయి నా ఆలోచనలలాగే తెగవు ముడి పడవు అన్నట్టుగా! లేక్ మధ్య లో టెంట్ వేసుకొని, బోట్స్ పెట్టుకున్న వాళ్ళు తీసేసారు. రెండు తెల్లని బాతులూ, తెల్లని కొంగలూ వచ్చాయి. హాయిగా జలకాలాడుకుంటూ ఉన్నాయి. వాటిని పలకరిస్తూ వాకింగ్ చేస్తున్నాను. వాటి వయ్యారాలు ఫొటో తీసూనే ఉన్నానా ఒకటి తుర్ మంది. హిస్టరీ రిపీట్స్! పిట్టల కథే బాతులదీనూ :) ఇక నా పని గురించి అంటారా, ఈ మధ్య శరత్ నవల ఆధారంగా వచ్చిన సినిమాల గురించి చెబుతున్నాను కదా నా ప్రభాతకమలం లో, నా దగ్గర ఉన్న శరత్ నవలలు అయిపోయాయి రాయటము. ఇంకా నాలుగు సినిమాలున్నాయి రాయాల్సినవి. ఆ బుక్స్ ఆన్ లైన్ లో కానీ షాప్ లల్లో కాని దొరకటం లేదు. ఔట్ ఆఫ్ స్టాక్. అందుకని కోడూరి కౌసల్యాదేవివి రెండు పంపాడు మా మేనల్లుడు. ఇప్పుడు అవి చదివి రాయాలనుకుంటున్నాను. పుస్తకాలు ఎవరూ చదవటం లేదంటారు కానీ నేను వెతుకుతున్న పుస్తకాలన్నీ ఔట్ ఆఫ్ స్టాక్! ఇంకా నీ జతగా నేనుండాలి కథామాల లోని కథలు కూడా అయిపోవచ్చాయి. అవయ్యాక ఫేస్ బుక్ లో నేను రాసినవి చదువుదామనుకుంటున్నాను. మీ తరువాతి అనుమానం నా సమయం ఎట్లాగడుపుతున్నాననేగా. పిల్లలు, ప్రకృతి, ప్రభాతకమలం, పుస్తకాలు, ఫేస్ బుక్ ఇన్ని ఉండగా టైం పాస్ కేమిలోటు. ఇప్పటికి ఇంతే సంగతులండి. మీ ఏమండీగారికి నా నమస్కారాలు చెప్పండి. మీ జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీ మాల.

Friday, May 14, 2021

Nee Jathaga Nenundaali | Kathaa maala Podcast by Mala Kumar | E11 - విధి...

నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం. ఓ చల్లని సాయంకాలం నేనూ, మా ఏమండీ వాకింగ్ చేస్తుండగా, "ఏమండీ నేను కథ రాసి చాలా రోజులైంది. ఏదైనా రాద్దామంటే ఏ టాపిక్ తోచటం లేదు. మీరేదైనా టాపిక్ చెప్పండి" అని అడిగాను. కాసేపు ఆలోచించి, "నేను ఆర్మీలో చేరిన కొత్తల్లో జరిగిన మా ఫ్రెండ్స్ లో జరిగిన ఒక సంఘటన చెపుతాను. కాని అది మరి పాఠకులకు నచ్చుతుందో లేదో నువ్వు ఆలోచించుకో" అని ఈ కథ చెప్పారు. నేను కాసేపు ఆలోచించి, సబ్జెక్ట్ వెరైటీగా ఉంది. కల్పితం కాదు. జరిగిన కథనే రాసి చూద్దాం అనుకొని "రాస్తాను" అన్నాను. అయితే టైటిల్ దగ్గర నుంచి, అందులోని ముఖ్య పాత్రలకు అన్నీ ఒక అక్షరం సూచించి దానితోనే పేర్లు రావాలి అని కండీషన్ పెట్టారు. ఇక ఏక దీక్షగా మరి ఆర్మీ ప్రేమ కథ కదా అని కాస్త ప్రేమ కూడా జోడించి రాసి, ఏమండీకి చూపిస్తే నచ్చింది కాని పంచ్ రాలేదు అన్నారు. అలా అలా ఏమండీకి నచ్చే పంచ్ వచ్చే వరకూ రాసేసరికి కాస్త పెద్దదయింది. ఇది 16-12-2016 గోతెలుగు.కాం అంతర్జాలపత్రిక లో ప్రచురించబడింది. ఏమండి సూచించిన అక్షరమేదో కొంచం చదవగానే అర్ధమైపోతుందిలెండి. ఇక కథలోకి పదండి. 11. విధివిన్యాసాలు చదువుతున్న పుస్తకం లో నుంచి తలెత్తి వేళ్ళు విరుచుకుంటూ ఉంటే ఎదురుగా లలిత విచారంగా కూర్చొని కనిపించింది వసుధకు. వసుధ లలిత చేతిని తట్టి ఏమిటీ సంగతి అనట్లు సైగ చేసింది. లలిత ఉలిక్కి పడి బయటకు వెళుదాం అన్నట్లు లేచింది. వసుధ తన పుస్తకాన్ని రాక్ లో పెట్టి లలిత ను అనుసరించింది. లెక్చర్ జాబ్ నుంచి రిటైర్ అయ్యాక, ఇంట్లో పనంతా ముగిసాక మధ్యాహ్నం లైబ్రరీ లో గడపటం అలవాటు చేసుకుంది వసుధ. లలిత తో అక్కడే లైబ్రరీ లో స్నేహం కలిసింది. ఇద్దరికీ పుస్తకాలు చదవటం ఇష్టం. దానితో లైబ్రరీ లో చదవటం అయ్యాక, ఇంకో పుస్తకం ఇంటికోసం తీసుకొని, లైబ్రరీ ఆవరణలోని పున్నాగచెట్టు కింద కూర్చొని, కాసేపు పుస్తకాల గురించి చర్చించుకోవటం ఇద్దరికీ అలవాటు. చాలా అరుదుగా సొంత విషయాలు మాట్లాడుకుంటారు. ఇది గత కొద్ది కాలంగా సాగుతోంది. ఇద్దరూ పున్నాగ చెట్టుకింద, బెంచ్ మీద కూర్చున్నారు. అప్పుడప్పుడు చెట్టు మీద నుంచి పున్నాగపూలు రాలుతున్నాయి. వాటి సువాసన సన్నగా గాలిలో తేలి వస్తూ, చుట్టూ ఉన్న చెట్ల నుంచి గాలి వీస్తూ, పరిసరాలు చాలా ఆహ్లాదంగా ఉన్నాయి. కాసేపు ఇద్దరూ నిశబ్ధంగా కూర్చున్నారు. చివరకు, "నన్ను కూడా గమనించ కుండా అలా మూడీ గా కూర్చున్నావు ఏమిటి సంగతి?" అని అడిగింది వసుధ. "నీకు తెలుసుగా వసూ, నాకు ఒక్కడే కొడుకని, వాడీ మధ్య సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పెద్ద కంపెనీలో మంచి సాలరీ తో చేరాడని, వాడి కి పెళ్ళి సంబంధాలు చూస్తున్నామని” అని ఆగింది లలిత. "ఊ తెలుసు ఏదైనా మంచి సంబంధం వచ్చిందా?" అడిగింది వసుధ. "సంబంధాలకేమి బోల్డు వస్తున్నాయి. వాడే నా నెత్తిన నిప్పులు పోసాడు” కోపంగా జవాబిచ్చింది లలిత. "ఏమిటీ ఎవరినైనా ప్రేమించాడా? ఈ మధ్య ఇది మామూలైపోయింది కదా దానికి విచారమెందుకు?” అంది వసుధ. "మామూలు ప్రేమైతే విచారమెందుకు?" చికాకుగా అంది లలిత. "మరి కులాంతరమా? ఖండాంతరమా? ఖండాంతరం కూడా ఈ మధ్య ఎక్కువగానే జరుగుతున్నాయిగా” అంది వసుధ. "అదైనా బాగానే వుండు. ఎలాగో అడ్జెస్ట్ అయ్యేవాళ్ళం. ఇద్దరు పిల్లలున్న విధవను పెళ్ళి చేసుకుంటాడుట. వీడికేమైనా కాలొంకరా? కన్నొంకరా? అందగాడు, పెద్ద ఉద్యోగస్థుడు, ఒక్కగానొక్క కొడుకు. ఆమెనే పెళ్ళి చేసుకుంటాడుట. లేకపోతే అసలు పెళ్ళే చేసుకోడుట. ఇదేమి పోయేకాలమో! ఆ పిల్ల ఎవరో బాగానే బుట్టలో వేసుకుంది” కసిగా కన్నీళ్ళతో అంది లలిత. లలిత వైపు సాలోచనగా చూసి ”ఏమిటట, ఆ అమ్మాయిని ఉద్దరిస్తాడటనా?" అడిగింది వసుధ. "కాదుట, ప్రేమట. అదేమి ప్రేమో మరి” కోపంగా అంది లలిత. "ఓ" నిశబ్ధంగా ఆలోచనలో పడింది వసుధ. ఇద్దరూ కాసేపు మౌనంగా కూర్చున్నారు. "నేను చెప్పేది నమ్మలేకపోతున్నావా వసూ మాట్లాడటం లేదు” అడిగింది లలిత. దానికి జవాబివ్వకుండా, నేనొకటి చెపుతాను వింటావా లలితా అడిగింది వసుధ. "ఊ చెప్పు” అనాసక్తిగా అంది లలిత. · * * * * * * * * మరి వసుధ ఏమి చెపుతుందో విందాం పదండి నా ప్రభాతకమలం కు.

Tuesday, May 4, 2021

Nee Jathaga Nenundaali | Kathaa maala Podcast by Mala Kumar | E10 - గుం...

మాలిక అంతర్జాల మాసపత్రిక ఎడిటర్ జ్యోతి వలబోజుగారు 'స్నేహం' టాపిక్ మీద కథ వ్రాయమని మా రచయిత్రుల గ్రూప్ 'ప్రమదాక్షరీ లో టాస్క్ ఇస్తే ఈ కథ వ్రాశాను. ఇది డిసెంబర్ - 2016- మాలిక అంతర్జాల మాసపత్రిక లో పబ్లిష్ అయ్యింది. దీనిని ప్రముఖ రచయిత్రి మంథా భానుమతి గారు విశ్లేషించారు.

Sunday, May 2, 2021

థాంక్ యు

మా మనవడు విక్కీ చెప్పిన కథ తో పాత జ్ణాపకాలు వచ్చి, ఆ తరువాత, మా వారు, మా అబ్బాయి నా బ్లాక్ మనీ ని తీసేసుకోవటము వలన కలిగిన ఉక్రోషము తోనూ ఈ డబ్బులోయ్ డబ్బులు వ్రాశాను . అప్పుడే పేపర్ లో చిన్న మొత్తం పధకాల గురించి , రూపాయి గుర్తు కోసము జరిగిన పోటీ గురించి చదివి ఆ ఆర్టికల్ ను పొడిగించాను . అప్పుడే సృజన చదివి చాలా బాగుంది , మన బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్ బ్లాగ్ లో దీని గురించి రెవ్యూ రాయనా అంది . దీనిమీద రెవ్యూ ఏముంటుందా అనుకున్నా , పరిచయం చేస్తానన్నప్పుడు ఎందుకు కాదనాలిలే అనుకొని , చాలా హాపీగా వాకే అనేశాను . అలా నా కాసులపేరు ఇక్కడికి చేరుకోవటము చాలా సంతోషముగా వుంది . ఆ సంతోషాన్ని కలిగించిన , సృజన , గీతాచార్య , జ్యోతి , చైతన్య కల్యాణి గార్లు బోలెడు బాంకులలో ఎకౌంట్స్ తెరవాలని కోరుకుంటూ , చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను .

Saturday, May 1, 2021

డబ్బులోయ్ డబ్బులు . . . . . 4

నా చిన్నప్పుడు డబ్బులు దాచుకోవటానికి మట్టి ముంతలు దొరికేవి . మా అమ్మ అది కొనిచ్చి, అందులో చిల్లర పైసలు దాచుకోవటానికి అప్పుడప్పుడు ఇచ్చేది. ఇహ ఆ కుండకు రక రకాల రంగులు పూసి, డిజైన్స్ వేసి ముస్తాబు చేసేదానిని. ఆ కుండ నిండాక చిన్నప్పుడతే బుక్స్ కొనుక్కునేదానిని. ఆ కుండలకు వేసే పేంటింగ్స్ లకు, నింపే డబ్బులకు, నాకు , మా అత్తయ్య కూతురు పార్వతికి ఎప్పుడూ కాంపిటీషన్ వుండేది. అదేమిటో పాపం మా పార్వతి కుండ నిండగానే, వాళ్ళింట్లో దొంగలు పడి తన కుండ పగులకొట్టి, డబ్బులెత్తుకెళ్ళేవారు. తన కెప్పుడూ మట్టి పెంకులే మిగిలేవి. ఐనా అధైర్య పడకుండా మళ్ళీ నింపడము మొదలు పెట్టేది. మళ్ళీ హిస్టరీ రిపీట్స్! నేను నా అలవాటు ప్రకారము మా పిల్లలిద్దరికీ చెరొక ముంత కొనిచ్చాను. మా అమ్మాయి సంజు కు దానిని అలంకరించి చూసుకోవటమే సరిపోయేది. మా అబ్బాయి బిపు మటుకు దానిని నింపటానికి ఇంట్లో చిల్లర పైసలు లేకుండా చేసేవాడు. మా మామగారు కిడ్డీ బాంక్ కొనిచ్చినా పిల్లలు దీనిని చూసుకునే మురిసి పోయేవారు. నాకు కూడా ఇంట్లోకి ఏఅవసరం వచ్చినా కిడ్డీ బాంకైతే తాళం తీసి వాడుకుంటాము ముంతలైతే అంత తొందరగా పగులకొట్టము కదా అనిపించి ఎక్కువగా ముంతలలోనే డబ్బులు వేసేదానిని. ప్రతి నెల మొదటితారీకున ఇద్దరి ముంతలు తీసి , ‘బాంక్ ఆఫ్ బరోడా’ లోని వాళ్ళ ఎకౌంట్ లో వేసేసేదానిని. అందులో కనీసం 100 రూపాయలు వేయాలి అంటే ఎక్కడెక్కడి చిల్లర వాడి ముంతలో చేరి పోయేది. మేము వేరే వూళ్ళలో వున్నప్పుడు, హైదరాబాద్ వచ్చేటప్పుడు, మూడు రోజుల ప్రయాణము లో ఖర్చు పెట్టుకోవటము కోసము ఏమండి పిల్లలిద్దరికి చెరి పది రూపాయలు ఇచ్చేవారు. మేము హైదరాబాద్ చేరుకున్నాక కూలీకి ఇవ్వటానికి మావాడి దగ్గరే ఆ పది రుపాయలు అప్పుచేసేవారు ఏమండి. ఖర్చు దగ్గర కూడా మహా పినాసీ. అందుకే ఏమండి ముద్దుగా ‘డబ్బులుగా’ అని, ‘రామనాథ్ గోయింకా’ అని పిలుచుకుంటారు. ఇప్పుడైతే డబ్బులన్నీ బాంక్ లోనే వుంటాయి. ఎప్పుడైనా అడుగుతే, గిడుగుతే పర్స్ లో లేవు మాతే ఏ. టి .యం కెళ్ళి తేవాలి. ఇప్పుడైతే నువ్విచ్చేయ్ తరువాత ఇస్తాను అంటాడు. ఎప్పుడూ ఆ ప్లాస్టిక్ మనీ తప్ప ,నొట్ మనీ వుండ నే వుండదు. అత్యవసరమైతే ఎలారా? అంటె నువ్వున్నావుగా అంటాడు. మా కోడలు మొహమాట పడి ఆంటీ నా క్రెడిట్ కార్డ్ వాడుకోండి అంటుంది. కూరలమ్మాయి, పూలవాడు క్రెడిట్ కార్డ్ తీసుకోరుకదమ్మా. నా షాపింగులు అవేకదా అంటాను నేను. వరేయ్ బేటా మీ ఆవిడకి పూలు కొనియ్యటనికి నువ్వేమీ శోభన్ బాబు కాలం వాడివి కాదు కాని కనీసము మొక్కజొన్న పొత్తులు కొనివ్వటానికైనా దగ్గర కాసిని డబ్బులుంచుకోరా అంటే చిద్విలాసం గా నవ్వేస్తాడు. ఈ కాలం లో అందరూ క్రెడిట్ కార్డ్ లూ, ఏ. టి .యం లూ అంటారు. అక్కడ దొంగల చేతికి చిక్కని మాట నిజమే కాని అత్యవసరమైతే మన చేతికి చిక్కేదెలా? ఈ మద్య బందుల తో ఏ.టి .యం లు కూడా బందే వుంటున్నాయి. ఇళ్ళళ్ళో ఐతే చిల్లర పైసలు ఎక్కడపడితే అక్కడే పడేస్తారు. ఓసారి మా మామగారు ఒక ప్లాట్ అమ్మినప్పుడు కొనుక్కున్నతను ఒక సంచీ నిండా చిల్లర పైసలు తెచ్చి పేమెంట్ చేసాడుట. ఇంట్లో పిల్లలంతా కూర్చొని ఆ చిల్లర లెక్కబెట్టారుట. మా మామగారు అలాగే బాంక్ లో డిపాజిట్ చేసేసారుట! అప్పుడు నేను ఇక్కడ లేను. సెలవలో వచ్చినప్పుడు మా ఆడపడుచులు చెపుతుంటే అయ్యో నేను మిస్సయ్యానే అనుకున్నాను. “ఏటా పొదుపు దినోత్సవం రోజు "ఉత్తమ పొదుపు ఏజెంట్లు" అవార్డులను ప్రభుత్వం అందజేస్తుంది. ఇలాంటి అవార్డులను వరుసగా ఆరేళ్ళపాటు అందుకుంది,మహబూబ్ నగర్ జిల్లాలోని, వనపర్తి లోని బాలస్వామి కుటుంబము. రోజూ మదుపరుల నుంచి సేకరించిన డబ్బును పోస్టాఫీస్ లో జమచేస్తే వీరికి కమీషన్ వస్తుంది. అదే ఈ కుటుంబానికి ఆధారం . ఫామిలీ మొత్తానికి ఫుల్ టైం జాబ్. ఏటా వీరి ద్వారా చిన్న మొత్తాల పొదుపు సంస్థకు వెళ్ళే సొమ్ము కోటిరూపాయల పైనే. వీరి సంపాదన నెలకు లక్షా ఇరవై వేలు పైనే! అదీను వనపర్తి లాంటి ఓ మోస్తరు టౌన్ లో. కుటుంబము లోని తల్లి ఇంద్రావతమ్మ, తండ్రి బాలస్వామి, ఇద్దరు కొడుకులు చంద్రశేఖర్, శ్రీకాంత్ ఇదే పని చేస్తారు. కుటుంబ పెద్ద బాలస్వామి ఇలా చెపుతున్నారు ‘ ఈ రోజులలో అందరూ విడిపోయి బతకటానికే ఇష్టపడతారు. కానీ మా ఇంట్లో అందరం కలిసి జీవిస్తున్నాము. కష్టపడి సంపాదిస్తున్నాము. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళ తో చాలా హాపీ గా వుంటున్నాము. చిన్న మొత్తాల పొదుపు పధకం మన సొమ్ముకు ఎంత భద్రతను ఇస్తుందో, ఉమ్మడి కుటుంబం కూడా అంతే సామాజిక భద్రతను ఇస్తుంది. అందుకు మేమే ఉదాహరణ. ప్రేమపూర్వక సంబందాలుంటే మన ఇంటికి సిరి సంపదలు వాటంతట అవే నడిచి వస్తాయి.’ “ ఇది నేను ఆంధ్రజ్యొతి దిన పత్రిక లో చదివాను. వార్త రాసి పెట్టుకున్నాను కాని డేట్ రాసుకోవటం మర్చిపోయాను. నేను డబ్బుల గురించి, పొదుపు గురించి రాస్తున్నప్పుడే ఈ వార్త రావటము నాకు చాలా త్రిల్ కలిగించింది. ఇంకో వార్త కూడా పేపర్ లో వచ్చింది. అదేమిటో రేపు చెపుతాను. కొన్ని సంఘటనలు ఎంత యాదృశ్చికమో అని హాశ్చర్యపోయాననుకోండి! ఏతా, వాతా చెప్పొచ్చేదేమిటంటే, చిల్లర మా లక్ష్మిని చిన్న చూపు చూడకండి. చిల్లర ఎన్ని వండర్ లైనా చేస్తుంది." పిల్లలకు చిన్నపటినుండే పొదుపు అలవాటు చేయాలి. డబ్బులు కూడ బెట్టుకొని, కొనుక్కోవటములోని ఆనందాన్ని అనుభవించనీయాలి . . . ధనమే కదా అన్నింటికీ మూలము. ఆ ధనము విలువ తెలియజేయాలి. “ఇల్లన్న చోట, పిల్లలున్న చోట 10,000 రూపాయలు, ఓ మనిషి భోజనం ఎప్పుడూ సిద్దముగా వుంచుకోవాలి." మా అత్తగారి టైం లో పది రూపాయలైతే నా టైం వచ్చేసరికి 10,000 అయ్యాయి. తప్పదు మరి! వచ్చేవారము మరి కాసిని కాసుల కబురులతో కలుసుకుందాము . ఏమిటీ ఇంకా వుందా అంటే వుండదేమిటి? మనీ నా మజాకా ? వచ్చే వారము దాకా టా టా.