Showing posts with label ఆత్మీయులు. Show all posts
Showing posts with label ఆత్మీయులు. Show all posts

Monday, July 26, 2010

థాంక్ యు ఫ్రెండ్స్




నువ్వు సీనియర్ సిటిజన్ వి కాదు అని మా వారు , నేను జూనియర్ సిటిజన్ ని అని నేనూ అప్పుడప్పుడు ఒకరినొకరిని టీజ్ చేసుకునేందుకు ఇంకొక్క సంవత్సరము మాత్రమే అవకాశం వుంది . లాస్ట్ ఆఫ్ ద ఫిఫ్టీస్ కు వచ్చేసాను . అందుకే ఈసారి పుట్టిన రోజు వెరైటీగా చేసుకుందామా అనుకున్నాను ! ఏలా అని అలోచించగా . . . చించగా . . . ప్రతిసారి , అందరూ నాకు బర్త్ డే విషెస్ చెపుతారు . ఈ సారి అందరికంటే ముందుగా నాకు , నేనే విష్ చేసుకుంటే ఎలావుంటుంది ?? అందరూ నవ్వుతారేమో !!! నవ్వనీ అని ధైర్యం తెచ్చుకున్నాను . అందుకే ' కమల ' పోస్ట్ తయారు చేసుకున్నాను . ' హాపీ బర్త్ డే టు మి ' అని ప్రమదావనం లో పెట్టేందుకు మేయిల్ రెడీ చేసుకున్నాను . రాత్రి 11 .30 అయ్యింది . పొద్దున్నే 6 గంటలకు పబ్లిష్ చేద్దామనుకున్నాను . అమ్మో ఈ జ్యోతి ని నమ్మేందుకు లేదు . అసలే నిన్న సొరకాయ రసిపీ లు అడుగుతాను , మీ నంబర్ కావాలి ఇవ్వండి అని అడిగి తీసుకుంది . హమ్మా జ్యోతీ మీ సంగతి నాకు తెలీదు . . రసిపీల కోసం అవుతే చాటింగ్ లో అడుగుతారు . లేదా మేయిల్ ఇవ్వండి అంటారు కాని ఫోన్ నంబర్ ఎందుకు ? అనుకుంటునే సరే చూద్దాం అని నంబర్ ఇచ్చాను . ఆ సంగతి ఇప్పుడు గుర్తు రావటం ఎంత మంచిదైంది . 12 కల్లా నా పోస్ట్ పబ్లిష్ చేయక పోతే , నా మేయిల్ ప్రమదావనం లో పెట్టకపోతే ఇంకేమైనా వుందా ? ? ? ఇలా ఆలోచించుకుంటూ నా పోస్ట్ కు తుది మెరుగులు దిద్దుతూ . . . వుండగా . . .

ట్రింగ్. . . ట్రింగ్ . . . అని టెలిఫోన్ రింగైంది . మాలా చూడు ఇంత రాత్రి పూట ఎవరు ఫోన్ చేసారో అన్నారు మావారు . ఫోన్ లిఫ్ట్ చేసి , హలో అనగానే మాలా గారున్నారాండి అని ఎవరో ఆడవాళ్ళు అడిగారు . ఒక్క క్షణం భయం వేసి , టెన్షన్ వచ్చింది . ఇంతరాత్రి 11. 30 కు నన్ను అడిగేది ఎవరూ , అని ఆ వన్ సెకన్ లోనే , విద్యానగర్ లోని మా అమ్మ పక్కింటి సరళ , మా అమ్మాయి సంజు తోటి కోడలు లక్ష్మి గుర్తొచ్చి , ఏం వార్త వింటానో అని గుండె దడ దడ లాడుతుండగా మాట్లాడుతున్నాను అన్నాను . హాపీ బర్త్ డే మాలా గారు అని చాలా సంతోషం గా అటు నుండి వినిపించింది . ఒక్క క్షణం ఏం వింటున్నానో అర్ధం కాలేదు . సారీ అండి , మిమ్మలిని నిద్రలేపానా ? అసలు 12 గంటలకు చేద్దామనుకున్నాను . కాని నాకు నిద్ర వస్తోంది అందుకే ఓ అరగంట ముందుగా చేసాను . అన్నారు . అప్పటి కి తేరుకొని , థాంక్స్ అండీ , ఇంకా పడుకోలేదండీ అన్నాను . నేనెవరో చెప్పుకోండి చూద్దాం అని చిలిపిగా అడిగారు . అప్పటికి నా బుర్ర యధా స్తానానికి వచ్చి అమ్మా ఈ ప్లాన్ వేసారా ప్రమదలూ , ఇహ రాత్రంతా ఇలా ఫోన్ లు చేస్తారన్న మాట అని స్వగతం అనుకుంటూ కృష్ణ వేణి గారే నా అన్నా . అంతే ఈసారి అటునుండి అవాక్ !! అమ్మా అమ్మా మాలా గారు ఎలా తెలుసుకున్నారండీ ? అని బోలెడు హాచర్య పోయాక , కాస్త హస్కేసుకొని ఫోన్ పెట్టేసాము .
ఇంకొక పది నిమిషాలు , పది యుగాలుగా ఎదురు చూసి , 12. 05 కు , అటు నా 'కమల ' ను , ఇటు నా మేయిల్ ను పంపేసి ఊపిరి పీల్చుకున్నాను . చూసారా అప్పటికే ఓ ఫోన్ కాల్ వచ్చేసింది . అమ్మయ్యా ఈ లోపల ఇంకెవరూ కాల్ చేయలేదు అనుకుంటూ వుండగా ట్రింగ్ . . . ట్రింగ్ . . ఆ ట్రింగ్ లు ఈ రోజు ఉదయము వరకూ వస్తూనే వున్నాయి . కాదు కాదు ఇప్పుడు ఇది రాస్తుండగా కూడా వచ్చిందోచ్ !
నాకూ డాక్టరేట్ వచ్చేసిందోచ్ టంట టంటా . . . నిజమే * * * సచ్చీ $ $ $ . మహా దానందంగా మా వారికి నా డాక్టరేట్ చూపించాను . ఎవరు ఈ అమ్మాయి ? అన్నారా ఏకధాటిగా చెప్పాను . అదే నండి , చెన్నై లో వుంటుంది . చాలా ఇంటలిజెంట్ . ఫొటో కూడా చూపించాను . తిరుచూర్ణం పెట్టుకుంది . గడ్డం మీద సొట్ట , ఆ అవునవును గుర్తొచ్చింది . చాలా ముచ్చటగా వుంది అన్నాను కదూ , ఆ అమ్మాయా ?? నీకు స్నేహశీలివి అని డాక్టరేట్ ఇచ్చిందా ?? అని తెగ హాచర్య పోయారు . అవును మరి , ' ఎవరి తో మాట్లాడవు . ఎక్కడికెళ్ళినా నోరు బిగించుకొని కూర్చుంటావు . కనీసం చిన్న నవ్వైనా నవ్వవు ' అని 42 ఏళ్ళుగా నాకు క్లాస్ లు తీసుకుంటున్న ఆయన హాచర్య పోయారంటే పోరు మరీ ! మా ఇంట్లో మా వారు , మా అమ్మాయి , మా మనవరాలు మేఘ కు వున్నంత మంది స్నేహితులు ఇంకెవ్వరి కీ లేరు . మా వారి నస భరించలేక , మేఘ ను ఓసారి అడిగాను . అమ్మలూ కొత్తవాళ్ళ తో ఫ్రెండ్షిప్ ఎలా చేసు కోవాలిరా అని . చాలా సింపుల్ బామ్మా , చూడగానే ముందు స్మైల్ ఇవ్వాలి . ఆ తరువాత హాయ్ మై నేం ఈజ్ మేఘ అని చెప్పాలి అని చెపుతుండగా , బంగారూ నేను మైనేమీజ్ మేఘ అంటే నవ్వుతారేమోరా అని అనుమానం వ్యక్తీకరించాను . పో బామ్మా అందుకే నీకెవరూ ఫ్రెండ్స్ లేరు అని తేల్చేసింది . సో మనది అంతటి ఘన చరిత్ర ! నాకు ఆరోజు ఇంకా గుర్తు . కంప్యూటర్ లో సాలిటర్ ఆడుకుంటూ వున్నాను . చిన్నగా , సున్నితంగా పక్కనుండి హాయ్ అని వినిపించింది . ఉలిక్కి పడి ఎవరా అని చూసాను . హాయ్ మాలాగారు నా పేరు సృజనా రామానుజం అండి అంది . నేను మొహమాటం గా హాయ్ అన్నాను . ఆ తరువాత ఏం మాట్లా డాలో తెలీ లేదు . ఆ తరువాత రోజూ సృజన తో మాట్లాడకుండా వుండలేని పరిస్తితి వచ్చింది . తనిచ్చిన ధైర్యం తోనే అందరి తో మాట్లాడాను . ఈ రోజు నా వయసులో సగము కన్న తక్కువ గా వున్న మధురవాణి , సుజ్జి , ప్రియ , సుభద్ర , మంచుపల్లకి , అశోక్ పాపాయ్ లాంటి పిల్లల తో మాట్లాడ గలుగుతున్నాను అంటే అదంతా సృజన మహత్యమే . అయ్యో ఇదేమిటీ సృజనా నాకు రావటము లేదు అనగానే మీరు ఊరికే కంగారు పడకండి అదే వస్తుంది అని ధైర్యం ఇచ్చేదీ సృజననే . నా తొలకరి పోస్ట్ కు రాజ్ కపూర్ , నర్గిస్ ఫొటోలు వెతికి పెట్టింది . చేయి తిరిగిన రచయతలు రాస్తున్నారు , నేనేమి రాయగలు అని భయ పడితే , ప్రోత్సహించి బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ లో తొలి అథిది గౌరవాన్ని తెప్పించిందీ సృజననే . అలాంటి సృజన నాకు స్నేహము లో డాక్టరేట్ ను , నా పుట్టిన రోజున బహుకరించింది . చెప్పలేనంత సంతోషం గా వుంది . కొత్త పెళ్ళికూతురు , నా చిన్నారి స్నేహితురాలు సృజనకు ఆశీస్సులు తప్ప ఇంకేమి ఇవ్వగలను ? ధీర్ఘ సుమంగళీభవ .
ఫోన్ రింగ్ కాగానే లిఫ్ట్ చేస్తే ఎవరో అబ్బాయి ఫోన్ . రాత్రి నుండి ప్రమదావనం ఫ్రెండ్స్ దగ్గర నుండి విషెస్ రిసీవ్ చేసుకుంటున్న నేను , అబ్బాయి గొంతు విన గానే అయోమయం అయ్యాను . పైగా హపీ బర్త్ డే మాలా గారు అన్నడు . ఎవరు చెప్మా ? మొహమాటపడుతూ మీ పేరండి ? అని అడిగాను . కాసేపు పేరు చెప్పకుండా భయపెట్టి , భరద్వాజ నండీ అని నాకు అర్ధం కాలేదని తెలుసు కొని , మలక్పేట్ రౌడీ నండి అన్నాడు . వెంటనే రిసీవర్ చేతి లోనుండి జారి పోయింది . కాళ్ళూ చేతులూ గజ గజ లాడి పోయాయి . ఓ ఎప్పుడో మీరు మలక్ పేట్ రౌడీ ఐతే మాకు యూసుఫ్ గూడా రౌడీ లున్నారు జాగ్రత్త అన్నాను . అప్పుడు అన్నానే కాని చాలా భయపడ్డాను . ఈ రౌడీ కొట్టటానికి వస్తాడే మో నని . ముందు జాగ్రత్త చర్యగా , మా అబ్బాయిని నీకెవరన్నా రౌడీ లు తెలుసారా అని అడుగుతే ఎందుకు మాతే అన్నాడు . చెపితే బ్లాగ్ వొద్దు ఏ వద్దూ మానేయ్ అంటాడని ఊరికే అడిగాను లేరా అన్నాను . మావారిని అడగాలంటే భయం . మా పనమ్మాయ్ శారద , అమ్మా సరస్వతి పనిచేసేది ఒక రౌడీ ఇంట్లో నే నమ్మా అని చెప్పింది . సరస్వతి పనికి రాగానే అడిగాను , నువ్వు పని చేసే ఇంకో ఇల్లు రౌడీ దా అని . అవునమ్మ దేనికి అన్నది . అవసరమొచ్చినప్పుడు చెపుతానులే అని , రోజూ బాల్కనీ లో కూర్చున్నప్పుడు ఎవరైనా రౌడీలు ఇంటి మీదికి గొడవకు వస్తున్నారా అని భయపడుతూ వుండే దాని . రాలేదు . చిన్న చిన్న గా ఆ సంగతి మర్చి పోయాను . ఇప్పుడు ఫోన్ లో మలక్ పేట్ రౌడీని అనగానే అంతా గుర్తొచ్చింది . సంవత్సరం తరువాత , ఇప్పుడు పోట్ల్లాటకు వచ్చాడా ఈరౌడీ . అందులోనూ పుట్టిన రోజున . ఏం చేయనురా దేవుడా అని భయ పడ్డాను . విష్ చేసి ఫోన్ పెట్టేసారు కాని భయపడుతూనే వున్నాను .
ఇంతలో ప్రమదావనం లో మలక్ పేట్ రౌడీ గారు ఓ పొస్ట్ వేసారు అని లింక్ వచ్చింది . అంతే ఈ రౌడీ గారు ఏ రాసారురా దేవుడా అను కుంటూ పడుతూ లేస్తూ అటు పరుగెత్తాను . నా కళ్ళను నేను నమ్మలేక పోయాను . ' మాలకు విరుల స్వర మాలిక ' వావ్ . ఎంత ఆచర్యం ! ఎంత ఉద్వేగం ! ఏమాత్రమూ ఊహించనిది . భరద్వాజ గారు , రౌడీలను వెంటవేసుకొని వచ్చి కొట్టిస్తారనుకున్నాను కాని ఇలా మీ అమ్మగారిని , పాపను వెనకేసుకొచ్చి పాట తో కొడతారనుకోలేదు . సీతా లక్ష్మిగారూ , నేనెవరో తెలీక పోయినా , నా కోసం చాలా అద్భుతమైన పాటరాశారు . మీకు చాలా చాలా ధన్యవాదాలండి . బంగారుతల్లి అనఘ , చాలా బాగా పాడావురా . అలా వింటూనే వుండి పోయానురా అమ్మలూ . నీ పాట కు మా మేఘ , గౌరవ్ డాన్స్ చేసారు . అందరికీ ఎంత నచ్చిందో చెప్పలేను . నిన్న మా ఇంటికి వచ్చిన వారందరికీ నీ పాట వినిపించాము . ఇండియా వచ్చినప్పుడు నీకు పెద్ద ట్రీట్ ఇస్తాను . ప్రామిస్ . ఈ లోపల మీ డాడీని నాతరుపున పెద్ద కాడ్బరీ చాక్లెట్ , ఐస్క్రీం కొనివ్వమని చెప్పు . డబ్బులు మాత్రం నేనివ్వను . థాంక్ యూ బంగారు థాంక్ యూ వెరీమచ్ . రౌడీ గారు , మీకు , మీ వెనకనున్న లేడీ డాన్ కు కూడా థాంక్స్ అండి .( కొంచం దూరం నుండి చెపుతున్నాను . ఎంతైనా రౌడీ గారు కదా భయం )
నా పుట్టినరోజున , వారి మొదటి అతిధి రచయిత్రి గౌరము నిచ్చి , ఈ పోస్ట్ ను ప్రచురించిన బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ టీం కు ధన్యవాదాలు .

రాత్రి కృష్ణ వేణి గారి తో మాట్లాడాక , నా పోస్ట్ , మేయిల్ పెడుదామని సిస్టం ఓపెన్ చేయగానే గా , సత్యవతి గారి విషెస్ కనిపించాయి . సత్యవతి గారు థాంక్ యు అండి .

అసలు కూర్చునేందుకు ఓపిక లేదు అన్నారు తృష్ణ . కాని ఓపిక చేసుకొని నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు మేయిల్ ద్వారా పంపిన తృష్ణ గారూ , మీరు దిగులును మర్చిపోయి , తొందరగా తేరుకొని , మళ్ళీ మాకు మీ బ్లాగ్ ద్వారా రచనలు అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలండి .
కృష్ణ వేణి నైతే వెంటగుర్తుపట్టేసాను కాని తరువాత వచ్చిన ఫోన్ ఎవరిదో తొందరగా గుర్తుపట్టలేక పోయాను . చెపుకోండి చూద్దాం , మీరు అండి అనే దానిని కాదు అన్నది ఎవరబ్బా ? ఐతే సుజ్జి వి కాదు అన్నాను . ఏం సుజ్జి చేసేసిందా ఆరాటం వినిపించింది గొంతులో . అవును మరి 12 కాగానే చేస్తే , తనకన్నా ముందు సుజ్జి చేసేసి వుంటే ? చేయలేదు కాని తన గొంతును గుర్తుపట్టగలను అంటుండగానే గుర్తొచ్చింది , ఆ మధురవాణి వి కదూ ? అవునండి . ఓకే నెక్స్ట్ ఎవరో అనుకుంటూ వుండగా మొహమాటం గా చిన్నగా మాలాగారాండీ , హాపీ బర్త్ డే అండి , నేను దుర్గనండి అన్నారు అమ్మయ్య కాస్త మెదడుకు పని తగ్గింది . ఇంతలో ఫో రింగ్ కాగానే లిఫ్ట్ చేసి థాంక్ యు అన్నాను . అరే నేను విషెస్ చెప్పకుండానే థాంక్ యు చెప్పేస్తున్నారే ,గుర్తుపట్టారా ? మరి ఇప్పుడు మీరంతా కాల్ చేసేది విష్ చేయటానికేకదా అన్నానే కాని ఎవరైవుంటారు అని ఆలోచిస్తూనే వున్నాను . పాపం ఎక్కువ కష్ట పెట్టకుండా నే భావన నండీ అన్నారు . వాళ్ళ అబ్బాయి తో కూడా విషెస్ చెప్పించరు . భావనగారబ్బాయి , నువ్వు సిగ్గు పడుతూ చెప్తుంటే నేనూ , నీ పేరు అడగ లేదు . థాంక్ యూ కన్నా . తెల్ల వారు ఝాము నుండి ప్రయతిన్స్తున్నా , ఇంత బిజీ ఏమిటీ తల్లీ ? ఇంకెవరు జయ నే . సంగతి చెప్పగానే సరే సరే నేను పెట్టేస్తున్నా , ఇంకెంత మంది ఎదురుచూస్తున్నారో అంటూ విష్ చేసి పెట్టేసింది . నెక్స్ట్ ఎవరబ్బా . . మాలాగారండి హాపీ బర్త్డే నేనెవరో చెప్పుకోండి . బాబ్బాబు చెప్పేద్దురూ . నేనండీ శ్రీలలితను . అమ్మో వీరితో జాగ్రత్తగా మాట్లాడాలి . లేక పోతే ఇంకేమైనా వుందా నా మీద , పద్యమో పాటో రాసేస్తారు . ఒహో నెక్స్ట్ ఎవరు చేస్తున్నారా అని క్యూరాసిటీ . . . నేనండీ ఎవరూ ? రాజమండ్రి యాస ',ఆ సుభద్ర కదూ ' ' కాదండీ ' .' ఓ ఐతే లలిత అవునా ' అవునండీ బాబూ కనిపెట్టేసారే .' ' మరి మీ బాష పట్టించింది లెండి . ' గొప్పగా అన్నాను . అటునుంచి నవ్వు . ' కావాలనే అలా మాట్లాడానండి ' . తుస్ . . . ఎంతైనా హాస్యపు జల్లు కదా ! అసలు కథా నాయకి ఏదీ ఇంకా రాదే ?? ఆ వస్తున్నానండి , ఇప్పటి దాకా మీ పని మీదే వున్నానంటూ రానే వచ్చారు , ఫోన్ కాల్ తో జ్యోతి . పొద్దున్నే నేనెవరో చెప్పుకోండీ అంటూ ఫోన్ . మీకు బాగా తెలిసిన దానిని అంటూ కాసేపు ఊరించి ఊరించి , జాజిపూలు పేరు విన్నారా అన్నారు . హేమిటీ , నేస్తం గారా , అయ్య బాబోయ్ భూమి పైకి తేలి పోతున్నానే . . వుండండి వుండండి కుర్చీ తెచ్చుకుంటా . అంతే ఆ తరువాత బోలెడు కబుర్లు . పెట్టేసాక , అయ్యో పేరైనా అడగలేదే , సెల్ నంబరైనా అడగలేదే . ఎంత గడుసుగా పేరు , నంబర్ చెప్పకుండా , అసలు అడగకుండా మాటల్లో పెట్టేసారు ! అందరూ చెప్పేసినట్లే ఇక పోస్ట్ రాద్దామని మొదలు పెట్టాను . అంతే ట్రింగ్ అంటూ పలకరించారు పి.యస్ .యం లక్ష్మి గారు . ఆవిడనూ వెంటనే గుర్తుపట్టేసాను . ఇద్దరమూ చాలా సేపు కబుర్లేసుకున్నాము .
బయట వాన జల్లు - ఇంట్లో శుభాకాంక్షల జల్లు ల తో ఈ పుట్టిన రోజు ను చాలా త్రిల్లింగ్ గా చేసాయి . చాలా చాలా సంతోషాన్ని పంచారు మితృలు .

ఫోన్ ద్వారా , ప్రమదావనం ద్వారా , శుభాకాంక్షలు తెలిపిన కృష్ణ వేణి , భావన , మధురవాణి , శ్రీలలిత , జాహ్నవి ,నీహారిక ,మంజూష , ప్రియ , లలిత , లక్ష్మీ కామకోటి ,మంజు , పరిమళం , పద్మకళ , టీం లీడర్ జ్యోతి గారు ల కు , బుక్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్ లో ' మాలకు విరుల స్వర మాలిక ' లో శుభాకాంక్షలు తెలిపిన , రామకృష్ణా రెడ్డి , స్వప్న , బద్రి , గార్లకు , ' భలే డాక్టర్ కమాలా కాయ ' లో పాట రాసిన శ్రీలలితకు , ఇతర మితృలకు , నా ' కమల ' లో శుభాకాంక్షలు తెలిపిన , భావన , శ్రీలలిత , భాస్కర రామిరెడ్డి , జయ ,సునీత , హరే కృష్ణ , సి. ఉమాదేవి , మేయిల్ ద్వారా నూ , బ్లాగ్ లోనూ విష్ చేసిన అశోక్ పాపాయి , రాజి , శిశిర , లలిత , అ. సౌమ్య చాటింగ్ లోనూ , బ్లాగ్ లోనూ విష్ చేసిన సుజ్జి , చక్కటి అన్నమయ్య పాటలో విష్ చేసిన కొత్త పాళి గారు , జ్యోతి , నేస్తం , మధురవాణి , పి. యం .యస్ లక్ష్మి గార్ల కు , మేయిల్ ద్వారా విష్ చేసిన మంచుపల్లకి గారికి ,

కమాలాసని , కమల ప్రియ ,
కమలముల తో పూజించిన సంతృష్టు రాలగు ,
ఆ నారాయణి , మీ కందరికీ శుభాలను ఇవ్వాలని కోరుకుంటూ ,

పద్మాసనే , పద్మకరే , సర్వ లోకేకపూజితే
నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా .

" థాంక్ యు ఫ్రెండ్స్ "

Sunday, June 20, 2010

హపీ బర్త్ డే




ఈ రోజు మా మనవడు విక్కి పుట్టిన రోజు . ఇప్పుడే పార్టీ నుండి వచ్చాను . ఎంత ఎంజాయ్ చేసామో . థాంక్ యు విక్కీ ఫర్ నైస్ పార్టీ .

హాపి బర్త్ డే విక్కీ .


Tuesday, April 20, 2010

మనస్వి కి జన్మదిన శుభాకాంక్షలు



సరిగ్గా సంవత్సరము క్రితము " నాలోనేను " అంటూ ఓ చిన్ని కవిత తో మయూఖను మొదలు పెట్టింది జయ . నీ పనేమిటమ్మా అంటే ఏదో అమాయకపు పిల్లలు దొరికారు కదా అని పొద్దుటినుండి సాయంకాలము వరకు లెక్చర్ లు దంచటమే నట . ఆ అనుభవ మే కావచ్చు ఏది రాసినా ఆకట్టుకునేటట్లుగా , అలవోకగా రాసేస్తుంది . పాపికొండల విహారము , అసంధర్భపు పాటలు , మాస్టార్ కి సెల్యూట్ , వాణిశ్రీ వీణా నాదము మొదలైన మంచి టపాలు పదమూడు రాసాక , అనివార్య కారణాల వలన మయూఖ , మనస్వి గా మారింది !!!

" వినీల గగనపు వేదికపై నే పాడిన జీవనగీతం " మనస్వి కి టాగ్ లైన్ . అందుకే కాబోలు వంటలు , నా చిత్రలేఖనాలు ,వాక్యాల గారడి తో ప్రేమలేఖ , చర్చావేదిక , తను చదివిన పుస్తకాల గురించి , ప్రతి స్పందనా బ్లాగ్ మిత్రుల తో పంచుకుంటుంది . నేను తప్పు చేసానా అని బేలగా , బిక్క మొహం తో అడుగుతుంది పాపం . వరుడు లాంటి సినిమాలు చూడకండి బాబోయ్ అని హెచ్చరిస్తుంది . మరుజన్మలోనైనా నేనునేనుగానే మళ్ళీ పంతులమ్మ గా పుట్టాలి , అంటూ , లాంతర్ పట్టుకున్న చిత్రం ను చూస్తుంటే చిన్నప్పుడు చదువుకున్న , " లేడి విత్ ద లాంప్ " పాఠం గుర్తొచ్చింది .

అలా చుక్ చుక్ అని ముందుకు ప్రయాణిస్తున్న మనస్వి కి యాభై పెట్టెలు చేరాయి అని సంతోషించిన , అల్ప సంతోషి జయ . మనస్వి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లా , ఇంకా ఎన్నో ఎన్నో డబ్బాల ను చేర్చుకొని , ముందుకు , మునుముదుకు సాగిపోవాలని ఆశిస్తూ ,

మనస్వి కి జన్మదిన శుభాకాంక్షలు .

కోడలు కి జన్మదిన శుభాకాంక్షలు




కంప్యూటర్ నాకు లో మొదటి గురువు , నా సాహితి టెంప్లెట్ రూపకర్త ,
మా కోడలు అనుపమ కు జన్మదిన శుభాకాంక్షలు .

Friday, March 5, 2010

హాపీ బర్త్ డే మేఘ

చెన్నైలో , మొదటిసారి మేఘ , బూరెబుగ్గల తో , నల్లటి కర్లీ హేర్ తో , చక్రాలాంటి కళ్ళు గుండ్రంగా తిప్పుతూ నా వైపు చూడగానే , అబ్బ ఎంత ముద్దుగా వుందో ! నా మనవరాలేనా !!! నా దిష్టే తగిలేట్టుగా వుంది అనుకొని మురిసి ముక్కలైపోయి , అప్పుడే " రాణీ యమ్మ " అని పేరు పెట్టేసుకున్నాను .

కొత్తగా మాటలు వచ్చేటప్పుడు , నా మీద ఏమైనా కంప్లైంట్ చేయాలంటే " చూడు తాతా నీ నైఫ్ " అనేది . " అవునమ్మా మీ బామ్మ నాకు నైఫే " అనేవారు తాత . ఏమిటీ నేను నైఫ్ నా అంటే కాదు బామ్మా నువ్వు తాత లైఫ్ అనేది . అంతే అంతే అని తాత తలాడించేవారు . పాపం చాలా సంవత్సరాలవరకు , వైఫ్ అంటానికి , నైఫ్ అనో , లైఫ్ అనో తడబడి పోయేది . నిద్ర లో " డాడీ " అని కలవరించగానే " వస్తున్నా బంగారుతల్లీ " అంటూ తాత లేచి పరుగెత్తుతారు . అయ్యో అది మీ అమ్మాయికాదు , మిమ్మలిని పిలువలేదు , వాళ్ళ డాడీ ని పిలిచింది అని నేనంటున్నా వినీపించుకోరు . ఎంతైనా మా రాణియమ్మ తాత కూచ్ .

" ఈస్ట్ ఆర్ వెస్ట్ " అని మేఘ అనగానే , పక్కనుండి తమ్ముడు " మేఘా ఈజ్ బెస్ట్ " అనాలన్నమాట .( కాకపోతే , మేఘ లేనప్పుడు , వాడు ఈస్ట్ ఆర్ వెస్ట్ అంటే నేను గౌరవ్ ఈజ్ బెస్ట్ అనాలనుకోండి , అది వేరే సంగతి .)

సో, ఈస్ట్ ఆర్ వెస్ట్ మా రాణీయమ్మ ఈజ్ బెస్ట్ !!! మా రాణీయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు .


Friday, February 5, 2010

బంగారుతల్లి కి బర్త్ డే గ్రీటింగ్స్




"కంగ్రాట్యులేషన్ యంగ్ గ్రాన్మా" అంటూ వీసా స్టాంప్ వేసి పాస్ పోర్ట్ ఇస్తూ అతను విష్ చేయగానే ," నీ పేరేమిటి ? నీ ఏజ్ ఎంత ? మీ అమ్మాయి ఏం చేస్తుంటుంది ? " అని రక రకాల ప్రశ్నల తో వేదించి , నువ్వు చెప్పేవి నేను నమ్మటము లేదు నీకు వీసా ఇవ్వనుపో అని ఇంతకు ముందు పంపించేసిన ఆవిడలా ఇతనూ , ఏమేమి అడుగుతాడో , అసలు ఆవిడ నేను చెప్పినది ఏది నమ్మలే దో , ఈ సారి కూడా వీసా రాకపోతే ఎలానో అని టెన్షన్ ... టెన్షన్ గా వున్న నాకు ఒక్క నిమిషం అతను ఏం చెబుతున్నాడో అర్ధం కాలేదు . అర్ధం కాగానే థాంక్ యు , థాంక్ యు అన్నానే కాని , ఏమీ అడగకుండా నే ఈయనకు , నేను గ్రాండ్ మా ను కాబోతున్నానని ఎలా తెసింది ? అయినా నాకెందుకులే అతను మళ్ళీ మనసు మార్చుకుంటే కష్టం అనుకొని గబ గబా నా పాస్ పోర్ట్ తీసుకొని , బతుకుజీవుడా అనుకుంటూ బయట పడ్డాను .

ఇహ అప్పటినుండి ఒకటే టెన్షన్ . మొదటిసారి అంత దూరం ఒక్క దాన్నే ప్రయాణం చేయటము . గ్లోబ్ లో అటువైపు కనిపిస్తున్న అమెరికా కు ఎలా వెళుతాను ? తలుచుకుంటేనే భయం . ప్రమోషన్ రాబోతున్న త్రిల్ల్ , మనవడా , మనవరాలా ? అనే సస్పెన్స్ ( అమ్మాయా ? అబ్బాయా ముందే తెలుసు కోవద్దని , మా అమ్మాయి , అల్లుడు తెలుసుకోలేదు ) మొత్తానికి అమెరికా ఐతే చేరుకున్నాను . అదేమిటో పగలు ఎప్పుడూ పడుకునే అలవాటు లేదు అయినా ఒకటే నిద్ర . అమ్మా కొంచం నిద్ర ఆపుకో జెట్ లాగ్ పోతుంది అన్నది సంజు . అదేమిటో ఏం రోగమో ఏం పాడో అనుకొని , నాకు అలాంటివి ఏవీ రావులే అంటూనే నిద్ర పోతున్నాను . అమ్మా అది రోగం కాదు , ఇలా నిద్ర పోవటమే అని నవ్వింది . ఎంతసేపు గడిచిందో , ఆంటీ , ఆంటీ లేవండి సంజును హాస్పెటల్ కి తీసుకెళ్ళాలి అని సతీష్ లేపేసాడు . అంతే మళ్ళీ టెన్షన్ మొదలు .

ఏం అమెరికా నో ఏం పాడో తల్లి , వీళ్ళకు ఏమైనా పిచ్చా ? లేబర్ రూంలో సంజు తో పాటు నేను , సతీష్ వుండటమేమిటి ? అసలే హాస్పెటల్ పేరు చెబితేనే కళ్ళు , కడుపు లో , గిర గిరా తిరిగిపోతుంది . అసలు నాకెక్కువ భయమా ? సతీష్ కెక్కువా తెల్చుకోవటము కష్టమే . అంతా అయోమయం , అస్తావిస్తం ! మాటి మాటికి బయటకు పరుగెత్తటము , సోఫా లో కాసేపు కూర్చొని రావటము . నా ఇబ్బంది చూసి సంజు ఫ్రెండ్ , శాంతిని పిలిచింది . ఏమిటో ఈ చిన్న పిల్లల తో నేను అనుకుంటూ మళ్ళీ బయట సోఫా లోకి చేరుకున్నాను . అంత టెన్షన్ లోనూ అక్కడ ఓ అమెరిక భర్త , ప్రెగ్నెంట్ భార్య తో చేయిస్తున్న ఎక్సర్సైజులు చూడగానే నవ్వొచ్చింది . పక్కున నవ్వేసాను . పాపం వాళ్ళూ నవ్వేసి , హాయ్ అన్నారు .( ఆ తరువాత సంజు , అలా నవ్వకూడదు అని కోపం చేసింది . అది వేరే సంగతి .) వీళ్ళ గోల నాకెందుకులే అనుకొని ,కళ్ళు మూసుకొని ,అమ్మాయైయనా , అబ్బాయైయనా పనికొస్తుంది అనుకుంటూ లలితా సహస్రనామాలు , హనుమాన్ చాలీసా చదువుకుంటూ కూర్చున్నాను .

* * * * * * * * * * * * * *

అమ్మవారి ముందు చేతులు జోడించి వేడుకొని , అందరి తో పాటు ముందుకు కదిలాను . వెంటనే పూజారి అలా వెళ్ళిపోతున్నావేమిటి ? ఈ ప్రసాదము తీసుకో , అమ్మకు ఎర్రంచు పసుపు చీర పెడుతాను అని మొక్కుకో అంటూ నా తలపైన అక్షితలు చల్లారు .

* * * * * * * * * * * * * *


ఆంటీ ఆంటీ అన్న పిలుపుతో అదేమిటి , గుడిలో ఈ పిలుపేమిటి అని చూద్దును కదా ఎదురుగా శాంతి , ఆంటీ పాప పుట్టింది అని చెపుతోంది . ఐతే ఇందాకటిది కల అన్నమాట !
అమ్మ పక్కన పాపాయి , అప్పుడే కళ్ళు తెరిచి చుట్టూ చూసేస్తోంది ." హాయ్ అమ్మమ్మా ఎలావున్నాను ? "
" బంగారుతల్లిలా వున్నావురా అమ్మలూ . ఎంత ముద్దొస్త్తున్నావో "
" అమ్మమ్మా నేను నీకు గాడ్స్ గిఫ్ట్ కదా ? "
" అవునురా బుజ్జీ "
" ఏయ్ అమ్మమ్మా , నేనిప్పుడు టీన్స్ లోకి వెళుతున్నాను . నన్నింకా , బుజ్జీ , కన్నా అనొద్దు ."
అమ్మో అప్పుడే మా బంగారుతల్లి టీనేజ్ గర్ల్ ఐపోతోందా ? కాలం ఎంత వేగంగా పరిగెడుతోంది . నిన్న మొన్న నే ఇవన్నీ జరిగినట్లుగా వుంది . ఇంకా పొత్తిళ్ళ లో పాపాయిగా నే అనిపిస్తోంది .

కాని కాదుట ! పెద్ద అమ్మాయిట ! నాకెంటే పొడుగుట ! ఓకే ఓకే . ఒప్పుకుంటున్నాం మేడం .

మా బంగారుతల్లి అదితి కి జన్మదిన శుభాకాంక్షలు .



పై ఫొటో అదితి సొంతముగా వేసుకున్న సెల్ఫ్ పోట్రేట్ ది .

Friday, November 13, 2009

మా అమ్మానాన్నలు



ఈ ఫొటో మా నాన్నగారి చిన్నప్పటిది . బహుషా అప్పుడు ఆయనకి ఐదారుసంవత్సరాలు వుండవచ్చు. మా తాతగారి దూరపు బందువు ఒకరు , మా బామ్మగారి తో , "వదినా , బాబుకు ( మా నాన్నగారిని బాబు అనే పిలిచేవారు .) నగలన్నీ వేసి తయారు చేసి ఇవ్వు , ఫొటో తీయిస్తాను " అన్నాడట. ఆవిడ నగలు వేసి చక్కగా ముస్తాబు చేసి వెంట పంపారట . ఆయన ఫొటో మటుకు తీయించి , నగలు తీసేసుకొని , రోడ్ మీద వదిలేసి చక్కా పోయాడట. అప్పట్లో మా తాతగారు , విజయవాడ టు నందిగామ ప్రైవేట్ బస్సులు నడిపించేవారట . విజయవాడనుండి వస్తున్న ఓ బస్ డ్రైవర్ , రోడ్ మీద ఏడుస్తున్న మా నాన్నగారిని చూసి , అరే ఓనర్ గారి అబ్బాయిలా వున్నాడే అనుకొని బస్ ఆపి , నాన్నగారిని ఎక్కించుకొని , తీసుకొచ్చి ఇంట్లో వొప్పచెప్పారట !


మానాన్నగారు , చిన్నప్పుడే పరిస్తితులవలన , చదువు కొరకు , నల్లగొండ లో హాస్టల్ లో చేరారట. ఇక అప్పటి నుండి నాన్నగారి ఒంటరి పోరాటం మొదలయ్యింది . అప్పుడే పరిచయం అయ్యారు , అన్నమాచారి మామయ్య గారు . ఆయనే మా నాన్నగారి ఆత్మీయుడు , ఆప్తుడు , సహోదరుడు అన్నీనూ . ఇద్దరు కలిసే చదువుకున్నారు .. ఒకేసారి , 17 సంవత్సరాలకే , రాయచూర్లో తుంగభద్ర ప్రాజెక్ట్ లో సూపర్ వైజర్ గా చేరారు . పెళ్ళి కూడా ఇద్దరికీ ఇంచుమించు ఒకేసారి జరిగింది . చివరి వరకు ఒకే చోట కలిసేవున్నారు . బహుషా భగవంతుడు అలా ఓ ఆత్మీయుని తోడు ఇచ్చాడేమో ! కాని అదీ ఎక్కువ రోజులు వుంచలేదు . చారి మామయ్య గారిని ఆయన 50 వ సంవత్సరానికే తన దగ్గరికి తీసుకెళ్ళాడు . కాని మా కుటుంబాల మధ్య ఇప్పటికీ చెదరని ఆత్మీయతాబంధం అలానే వుంది . నా పెళ్ళి లో బావమరిది డ్యూటి , మా అమ్మాయి పెళ్ళిలో మేనమామ డ్యూటీ చేసింది వారి అబ్బాయిలు ఆనంద్ , విజయ్ లే .వారి అమ్మాయి సత్య , మేమూ ఒకే కుటుంబపు అక్క చెళ్ళెలలా వుంటాము . . ఇప్పటికీ వైదేహి అత్తయ్య , మా అమ్మా ఒకే ప్రాణం గా వుంటారు .



మా నాన్నగారు స్వతహాగా చాలా తక్కువగా మాట్లాడేవారు . ఎపుడూ ఏదో ఆలోచనలో వుండేవారు . ఆయనకు అసలు కోరికలనేవి వున్నాయా అనిపించేది . మమ్మలిని ఎప్పుడూ కోపం చేసిన గుర్తు కూడా లేదు . ఒక యోగి లా వుండేవారు . నా పెళ్ళి తరువాత ఎప్పటికో నాకు నాన్నగారి తో చనువు ఏర్పడింది . మా వారితో మటుకు ఒక స్నేహితునిలా వుండే వారు . మామా అల్లుళ్ళు కలిసి సినిమాలకు వెళ్ళేవారు .



ఇక అమ్మ విషయానికి వస్తే , కరణం గారి పెద్ద అమ్మాయిగారు . ఇంట్లో నుండి బయటకు కదలటాకి లేదు . మరి పుస్తకాలలో , సినిమాలలో చూపించే పల్లెటూరి పిల్లల సంబరాలు తనకేవీ తెలీదుట ! పైగా 11 సంవత్సరాలకే దొంగ పెళ్ళి ! అంటే ఏమీ లేదు , అమ్మ పెళ్ళప్పుడు , శారదా ఆక్ట్ అమలు లో ( పెద్దమనిషి కాని ఆడపిల్లకు పెళ్ళి చేయకూడదు అనే రూల్ ) వుండటము వలన విజయవాడలో ఓ సత్రములో దొంగతనముగా పెళ్ళిజరిపించారన్న మాట. అమ్మ , నాన్నగారి పెదమేనమామ కూతురు . అమ్మ లోకాన్ని చూసింది మాలతీ చందూర్ పుస్తకాలలో . చదువు అంటే చాలా ఇష్టము . ఇప్పటికీ ఏ వో గ్రంధాలు చదువుతునే వుంటుంది .


,

మా నాన్నగారికి చదువులో ఎప్పుడూ మొదటి రాంకే ఉండేది. చాలా తెలివైన వాళ్ళు.నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో చాలా ముఖ్యమైన దశలో అక్కడ ఇంజినీర్ గాపనిచేసారు. లంచగొండి తనమన్నది మా నాన్నగారికి తెలియదు. ఆ రోజుల్లో ఎంతోమంది ఇంజినీర్లు,హైదరాబాద్ లో స్తలం కొని ఇళ్ళు కట్టుకుంటు మానాన్నగారిని కూడా ఇక్కడ స్థలం తీసుకో మన్నారు. తను అక్కడ స్థలం కొనేస్థాయిలో లేనని అనేవారు. ఒక పెద్ద ఇంజినీర్ అయిఉండికూడా చివరి వరకు సొంతఇల్లు లేని ఇంజినీర్ ఆ రోజుల్లో ఒక్క మా నాన్నగారే. మా నాన్నగారుఅనుసరించే నీతినియమాలకు ఈ ఒక్క ఉదాహరణ చాలు. తోటి వాళ్ళంతా ఎంతో గౌరవించేవారు. రిటైర్ అవ్వటానికి ముందుగా ఖమ్మంలో మాత్రం ఒక చిన్న ఇల్లుకట్టుకున్నారు. అందులో కూడా కాంట్రాక్టర్స్ మోసం చేసారు. అయినా ఎవ్వరినీ,ఏనాడు ఒక్క మాట కూడా పరుషంగా మాట్లాడి ఎరుగరు. రిటైర్ అయిన తరువాత కూడామా నాన్నగారు ఏనాడు ఊరికే కూర్చోలేదు. అంతవరకు తనకు పరిచయమే లేనిజ్యొతిష్య శాస్త్రాన్ని, స్వయంగా ఎన్నో గ్రంధాలు చదివి, ఎందరో పండితులనుకలిసి నేర్చుకున్నారు. పూర్తి పరిపక్వత పొందారు. అందరికి ఉచితంగాజ్యోతిష్యం చెప్పేవారు. ఎక్కడెక్కడినుంచో, ఎందరో ఒచ్చి మా నాన్నగారిదగ్గిర జ్యొతిష్యం చెప్పించుకునే వారు. ఏనాడు ఎవరి దగ్గిర ఒక్క పైసా కూడాతీసుకోలేదు. చివరికి ఎంత స్థాయికి ఎదిగారంటే, జ్యొతిష్య సమావేసాలకుఆహ్వానించే వారు. ఢిల్లీ లో అంతర్జాతీయ సమవేశాలకు కూడా అహ్వానించారు.ఎన్నో సన్మానాలు పొందారు. చక్కటి ఉపన్యాసాలు ఇచ్చే వారు. అప్పటి ఆ ఫొటోలేఇప్పడు మాకు మిగిలిన తీపిగుర్తులు.


మా అమ్మ కూడా ఎప్పుడూ మా నాన్నగారిని అనుసరించే ఉండేది. మా నాన్నగారికిఒచ్చే తక్కువ జీతం లోనే మా మామయ్యలకు చదువు చెప్పించారు. మా పెద్ద మామయ్యసంస్కృత పండితుడవ్వటానికి మూల కారణం మా అమ్మా, నాన్నగారే. మా అమ్మ తరువాతమా ఇంట్లో ఒక పెద్ద గ్రంధాలయాన్నే ఏర్పాటు చేసింది. మేము ముందుగా పుస్తకాలు చదివింది మా అమ్మ లైబ్రరీ లోనే. మా అమ్మకు చదువంటే చాలా ఇష్టం.చిన్నప్పుడు చదువుకోలేక పోయినందుకు ఎంతో బాధ పడేది. మా నాన్నగారు మాఅమ్మతోటి అప్పుడు మెట్రిక్ పరీక్ష రాయించారు కూడా. మా పెద్ద మామాయ్యవొచ్చినప్పుడల్ల, అమ్మ కి మామయ్యకి సాహిత్య గోష్టి జరిగేది. మా మామయ్య మాఇంట్లోని ఒక అల్మైరా నే బోర్డ్ గా చేసి ఎన్నింటినో మా అమ్మకి నేర్పించేవాడు. కళా పూర్ణోదయం వంటి గ్రంధాలను చదివింది. మా అమ్మ స్వయంగా రామాయణంకూడా రాసుకుంది. దానిగురించి నేను ఇప్పటికే మీకు పరిచయం చేసాను.మా నాన్న గారితోటి అప్పుడు రేడియో లో జరిగే సమష్యా పూరణం కార్యక్రమాలకిపద్యాలను వ్రాయించి పంపించేది. మా తల్లి దండ్రుల గురించి మేము ఎంతచెప్పినా అది తరగని సముద్రం. వారికి పిల్లలవటం మా పూర్వ జన్మ సుకృతం. మానాన్నగారిని తొందరగా కోల్పోవటం మా దురదృష్టం.

నేను కూడలి లో చేరిన కొత్తలో , ఒక బ్లాగ్ లో మీ తలితండ్రుల బాల్యము గురించి మీకు తెలుసా ? అన్న ఆర్టికల్ చదివాను . ఏ బ్లాగో గుర్తులేదు . ఈ రోజు మా నాన్నగారి జన్మదిన సంధర్భముగా ,అప్పుడు నాలో కలిగిన ఆలోచనలకు రూపమే మా ఈ మాల - జయ ల భావాల కలయిక .

Tuesday, November 3, 2009

అమ్మాయికి ,అల్లుడికి ఆశీస్సులు .



మా గారాలపట్టి ,సంజ్యొత్ ను ,

3- 11- 1993, సత్యసాయి కళ్యాణమంటపములో , ఆత్మీయులైన ఆహుతల సమక్షములో , వేదమంత్రాలనడుమ , మా అల్లుడు సతీష్ మాగల్ కు ,సాలంకృతకన్యాదానము చేసి ,

అపురూపముగా అప్పగించి , 16 సంవత్సరములైనా ఇంకా నాలో అదే భావన ,

అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ !


నవ్వుతే మీ కళ్ళు ముత్యాలు రాలు , ఆ నవ్వే మిము వీడక వుంటే పదివేలు
కలతలూ , కష్టాలు మీ దరికి రాక కలకాలము మీ బ్రతకు కలలదారి నడవాలి .


సంజు ,సతీష్ లకు వివాహవార్షికోత్సవ శుభాకాంక్షలు .



Monday, September 21, 2009

పుట్టినరోజు జేజేలు




పెద్దోడు విక్కీ కి చిన్నోడు గౌరవ్ వీరాభిమాని. ఎప్పుడూ విక్కీ లా మారి పోతూ వుంటాడు. కాక పోతే నాకొచ్చిన తిప్పలేమిటంటే వీడెప్పుడు విక్కీ అయిపోతాడో తెలీదు ! గౌరవ్ , గౌరవ్ అని ఓ రెండు సార్లు పిలిచి పలకక పోతే ఓహో విక్కీ ఐపోయాడన్నమాట అని అర్ధం చేసుకొని విక్కీ అనిపిలుస్తే పలుకుతాడు. అంతటి తో ఐపోదు , నేనూ అమ్మమ్మగా పరకాయ ప్రవేశం చేయాలి . నాకైతే అలవాటైపోయింది కాని పాపం తాత బోల్తా పడిపోతారు. తాతా ఈ రోజు విక్కి వచ్చాడు అనగానే గాభరా పడిపోయి ఏమైంది ? వాడెందుకొచ్చాడు ? సంజేమీ చెప్పలేదే ? వాడికి జ్వరం రాలేదుగా ? ( ఎందుకంటే జ్వరం వంక పెట్టి స్కూల్ డుమ్మా కొట్టీ , అమ్మమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేయటం వాడి సరదా ) అంటూ బోలెడు ప్రశ్నలు వేయగానే హే తాత ఫూల్ అయ్యారు అని వీడు డాన్స్ ! అప్పుడు చూడాలి తాత ఫేస్ !

ఒక విక్కి ఐతే ఎలాగో సర్దుకోవచ్చు. కాదే ఎప్పుడే రూపం ఎత్తుతాడో తెలీదు.దాని కి తగ్గట్టు నేనూ మారకా తప్పదు ! అంతేనా రాత్రి కాగానే మా పక్క నిండా బెన్ 10 లు , సుపర్ మాన్ , బాట్ మాన్ అబ్బో చెప్పనవసరం లేదు అందరు సూపర్ హీరోస్ వచ్చి చేరుతారు . మేమెటో ఓ మూలకి సర్దుకోవాలి ! ఇక తాత కి నీరసమొచ్చి , నొబడీ కెన్ స్లీప్ ఆన్ మై పిల్లో అనేస్తారు. అమ్మో అదీ మరీ డేంజర్ . అందుకే వెంటనే , నో తాతా ఇట్స్ మి గౌరు అని మా గౌరు వచ్చేస్తాడన్న మాట . ఇట్స్ మి గౌరు అన్నది తారక మంత్రం .గౌరవ్ ఐతే అన్నిటికీ ఓకే ! పిల్లో మీదా పడుకోవచ్చు. తాత బొజ్జ మీదా పడుకోవచ్చు !
సరే ఇదీ రోజూ తాతా మనవడికి వుండే పోట్లాటే ! ఇప్పుడు సమస్య ఏమిటంటే ఈ రోజు వాడి బర్త్ డే . మరి నేనెవరికి శుభాకాంక్షలు చెప్పాలి ?
జెర్రీ కా ?
బుడుగుకా ?
సూపర్ మాన్ కా ?
బాట్ మాన్ కా ?
పవర్ రేంజర్ కా ?
నేను గౌరవ్ ని బామ్మా నాకే చెప్పలి .
మరే నాకు ఇంగిలిపీసు రాదు కదా అందుకే తెలుగులో చెప్పాడన్న మాట.
అబ్బా బామ్మా నీకెన్ని సార్లు చెప్పాలి ? ఇంగిలిపీసుకాదు ,ఇంగ్లిష్ .
ఏమోరా బుడుగ్గా , నేనైతే తెలుగులోనే జన్మదిన శుభాకాంక్షలు అంటాను .ఇదో నీ ఫ్రెండ్ ఇంగ్లిష్ లో చెప్తుతాడు . ఎంజాయ్ !
హాపీ బర్త్ డే టు యు , హాపీ బర్త్ డే టు యు.
హాపీ బర్త్ డే డియర్ గౌరవ్ , హాపీ బర్త్ డే టు యు.





నువ్వు అడిగావని ఈ గ్రీటింగ్ కూడా పెట్టాను కదా ! ఇప్పుడు సంతోషమేనా ?
ఐ లైక్ యు సో మచ్ బామ్మా ,యు ఆర్ మై బెస్ట్ ఎస్ట్ బామ్మ .
ఈవెన్ ఐ టూ లైక్ యు సో మచ్ గౌరవ్ .
రాత్రి నేను చేసిన పొస్ట్ వాడికి పొద్దున్నే నేను చూపించగానే మా ఇద్దరి స్పందన్ ఇది . వాడి కోరిక మీద ఇంకో గ్రీటింగ్ పెట్టాను.సాయంకాలం లోపు ఇంకెన్ని ఆడ్ అవుతాయో !

Tuesday, September 15, 2009

బాల్యమిత్రులు



నిన్ను శ్యాం వాళ్ళింట్లో దింపి నా పనిచూసుకొని, వస్తాను. అందరము పంచరతన్ కి లంచ్ కి వెళుదాం .శాంతి లో మూవీ చూద్దాం .

ఏమిటీ మాట్లాడవు .నీకేమైనా పనులున్నాయా ?

నా మొహం నాకేం పనులు ? కాకపోతే మాట్లాడుతున్నది మావారేనా ? ,వింటున్నది నేనేనా ? ఇది మా ఇల్లేనా ? ఏమిషో ...... అంతా మాయా .నా స్వగతం లో నేనుండగా ? మళ్ళీ వినిపించింది , ఇది మాయ ,కల కాదు అంటూ మావారి గొంతు, ఏమిటీ సరేనా ?

ఆ సరే సరే ! మళ్ళీ మనసు మార్చుకునే లోపల ఘట్టిగా చెప్పాలిగా !

మావారి ప్రోగ్రాం వినగానే అటునుంచి లీల నమ్మలేక , ఫోన్ నా కిమ్మంది.

ఏమిటి మాలా ప్రభాత్ చెపుతోంది నిజమేనా ?

ఇద్దరమూ ఆ షాక్ లో వుండగానే ఇంకో షాక్ ఫొటో కూడా తీయించుకుందాం !

ఇంతకీ ఈ హడావిడి ,ఈ షాక్ లు ఎందుకంటే సెప్టెంబర్ 13 మావారి బర్థ్ డే , 14 మావారి జిగిరి దోస్త్ శ్యాం బర్త్ డే . ఓ అల్లనప్పుడు 13 రాత్రి 12 గంటలకు ఇద్దరితో కేక్ కట్ చేయించి పిల్ల పెద్ద అందరమూ తెగ అల్లరి చేసేవాళ్ళమన్నమాట !

మేము ఆరునెలలు అమెరికా ,ఆరునెలలు ఇండియా ప్రదక్షణలు పూర్తికాగానే ,శ్యాం లీలా ఓ ఆరు నెలలు సింగపూర్ , ఓ ఆరు నెలలు బెంగుళూర్ ప్రదక్షణ మొదలు పెట్టారు. మా ఈ భూప్రదక్షణలలో మా ప్రోగ్రాములు మా తో పాటు తిరగలేక ఆగిపోయాయి ! మా ప్రదక్షణలాగాయి కాని వాళ్ళవి ఇంకా ఆగలేదు !

మరి మీరు మీ దూడలని మీ పెరట్లో కట్టేసుకున్నారు .మా దూడలింకా దేశాల మీదే వున్నాయి అని లీల ఉవాచ ! ఇదో అనుకోకుండా ఇలా కాలం కలిసిరావటము ,మావారికి బర్త్ డే కి ప్రొగ్రాం వేసుకుందా మనిపించటము జరిగింది.

కార్ లో మావారిని అడిగాను మీకు, శ్యాం కి ఎప్పటినుంచి ఫ్రెండ్షిప్ అని . బహుషా 61 నుంచి అనుకుంటా , ఇద్దరము ట్యూషన్ లో కలిసాము . అంతే ఆ తరువాత సెల్ లో మునిగి పోయారు.

శ్యాం ని విష్ చేసి మావారు మళ్ళీ వస్తాను అని వెళ్ళిపోయాక , శ్యాం మిమ్మలిని ఇంటర్వ్యు చేద్దామనుకుంటున్నాను అన్నాను.

ఓ కే అడుగు ఏమడుగుతావో

మీరు ,ప్రభాత్ ఎలా ,ఎప్పటినుండి ఫ్రెండ్స్ ?

1960 లో నరసిం హ రావు సార్ దగ్గర మాథ్స్ ట్యూషన్ లో కలిసాము ,అప్పుడు అంటూ ఉత్షాహం గా మొదలు పెట్టగానే ,లీల లోపలి నుండి వచ్చి ఏంచెప్తున్నారు ? అంది.

వీళ్ళిద్దరి స్నేహితం ఎప్పుడు మొదలయిందా అని అడుగుతున్నాను.

అవునుకదూ ఇన్ని సంవత్సరాలయినా నేనెప్పుడూ అడగలేదు. నేను మటుకు ప్రభాత్ ని 61 లో క్వాలిటీ హోటల్ లో కలిసాను . అప్పుడు టీ తాగాము కదా శ్యాం , ఆ హోటల్ ఆబిడ్స్ మేన్ రోడ్ మీద వుండేది ,ఇప్పుడు అక్కడంతా మారి పోయింది అంటూ ఇంకా ఏమో చెప్ప బోతూ శ్యాం ను చూసేసరికి ఆయన మొహానికి అడ్డం గా పేపర్ ! ఇదేమిటి ?

నన్ను మాల అడుగుతుంటే నువ్వే చెప్పేస్తున్నావు నేనెందుకు మాట్లాడాలి ? నువ్వే చెప్పు . నేను చెప్పను .

అంతే బర్త్ డే బాయ్ అలక తో నా ఇంటర్వ్యూ కి బ్రేక్ !

నా బిక్క మొహం చూసి లీల , వంక లేనమ్మ డొంక వెతికిందిట ! పొద్దటి నుండి మా ఆయన గారు పేపర్ చదవలే అదీ బడాయ్ ! అంది.

హన్నా ! నన్నే ఇంత మోసం చేస్తారా ? చూడండి ఏం చేస్తానో ! వచ్చే సంవత్సరం ఇదేరోజున మీ ఫ్రెండ్షిప్ గొల్డెన్ జూబ్లీ డే సెలబ్రేట్ చేసి మిమ్మలిని సెల్ నుంచి, పెపర్ నుంచి బయటపడేసి , మీతోటే మీ బాల్యమిత్రుల కథ చెప్పించక పోతే ఏం చేద్దాం ఏదో వొకటి ఇదే నా ప్రతిజ్ఞ !

మిత్రులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు .

Tuesday, August 11, 2009

వివాహవార్శికోత్శవ శుభాకాంక్షలు



మా అబ్బాయి బిపిన్, కోడలు అనుపమ కు
13 వ వివాహవార్షికొత్షవ శుభాకాంక్షలు.

Saturday, June 20, 2009

పుట్టినరోజు జేజేలు



ఈరోజు మా మనవడి పుట్టినరోజు . వాడికి ఈ రోజు
10 సంవత్సరాలు నిండుతాయి. కొన్ని మరపురాని ముచ్చట్లు..
వాడి మూడో ఏట వాడి బిపు మామ వాడిని ఘట్టిగా పట్టుకొని ,చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి లో వాడిని గుండప్ప చేసాడు. అదో అప్పటి నుండి వాడి కష్టాలు మొదలయ్యాయి. ప్రతినెల వాడి డాడీ నో మమ్మీ నో వాడిని తీసుకొచ్చి,మావారి కి వాడి హేర్ కట్ చేయించమని అప్పగిస్తారు.ఎందుకంటే మా వారి బార్బర్ బాగా కట్ చేస్తాడట. చిన్నప్పుడు పెద్దగా పేచీ పెట్టలేదు కాని పెద్దవాడవుతున్నా కొద్దీ, గుండుకు ఎక్కువ, క్రాఫ్ కు తక్కువ అయిన ఆ డిప్ప మిలటరీ కట్ వాడికి ఏమాత్రము నచ్చటము లేదు. వాడికి రకరకాల లంచాలు లాలిపాప్ దగ్గర మొదలై ఐ మాక్ సినిమా దాకా వచ్చాయి. అపై పెద్ద రాహుల్ , చిన్న రాహుల్, రాజేష్ (వాడి ఫ్రెండ్స్) వాళ్ళ డాడీలు ఫొన్ చేసి అడిగారు, మీ విక్కి హేర్ కట్ బాగుంది ఏక్కడ చేయించారు అని తాత చెప్పిన కథలు పాపం పిచ్చి సన్నాసి నమ్మి తాత తో వెళ్ళేవాడు.
అలా అలా కొన్ని సంవత్సరాలు వాడిని మబ్యపెట్టగలిగారు. కాలం ఎప్పుడూ ఒకే రకముగా వుండదుగా! తాత కథలు నమ్మటము మానేసి ,మా ఇంటికి రావటానికి కూడా సందేహించే పరిస్తితి ఏర్పడింది. కట్ కాదు మేఘ గౌరవ్ తో ఆడుకుందువుగాని అని ఏలానో తీసుకొచ్చి, కొంచంసేపు ఆడుకున్నాక మరిపించి తీసుకెళ్ళి , డిప్ప కట్ చేయించేవారు. వాడి తీసుకెలుతుంటే మా అబ్బాయి డాడీ విక్కీ ని హేర్ కట్ కు తీసుకెలుతుంటే గౌరూను తీసుకుపో అని అప్పగించేసాడు. అంతే. వాడూ డిప్పకట్ తో తయారు.
ఇక లేటెస్ట్ గా ,వాడిని వాడి తోపాటు గౌరవ్ ని షరా మాములుగా తీసుకెల్లటము వాళ్ళతో పాటు తాతా ముగ్గురు ముచ్చటగా ....... కట్తో వచ్చారు కాని ఈసారి విక్కీ ఏంత గోల చేసాడంటే ,మరి మరునాడే వాడి క్లాస్ అమ్మాయి బర్త్ డే ఇలా ఎలా వెళ్ళుతాడు?దానికి తగ్గట్టు గౌరు కూడా నేను ఇంక జెల్ రాసి స్టైల్ చేసుకోలేనుగా అని వాడూ గోల. మనవళ్ళ బాధ చూడ లేక జీవితం లో మొదటి సారి మావారి మీద, వాళ్ళనేమైనా మిలిటరీలో చేర్పిస్తున్నారా, లేకపొతే కనీసం పేరేడ్ కి వెళ్ళాలా అని ఘాట్టిగా అరిచాను (అనుకున్నాను). విక్కీ భీకరం గా ప్రతిజ్ఞ చేసాడు, ఇకపై హేర్ కట్ చేసుకోనని బర్త్ డే కల్లా, పోనీటైల్ వేసుకుంటానని. అంతే మా మనవరాళ్ళిద్దరూ వాళ్ళ రబ్బర్ బాండ్స్ అర్జెంట్ గా దాచేసు కున్నారు .
ఈ రోజు వాడి బర్త్ డే పార్టీకి వెళ్ళినప్పుడు చూడాలి పోనీ టేల్ వేసుకున్నాడా లేదా అని. ఏందుకంటే ఆ తరువాత
మాకు వాడు కనపడలేదుగా! ఈ మధ్యే తెలిసింది. మా మనవరాలు చెప్పింది. విక్కి తలకు వాటర్ రాసి సెట్ చేసుకుని స్కూలుకు వస్తే ప్రిన్సిపల్ తిట్టిందంట...పాపం .. ఎన్ని తిప్పలో వాడికి..

ఇంతకీ వాడి పూర్తి పేరు చెప్పలేదు కదూ!
విక్రం మాగల్
5
వ తరగతి, చైతన్యా విద్యాలయ

Wednesday, June 3, 2009

వారే వీరు





అక్కడ బుడుగున్నర బుడుగు చదివారుకదా !
ఆ బుడుగులు వీరే .నా మనవలు.నా పొస్ట్ లలో వీరి గురించి ఎక్కువగానే రాసాను. మనవల గురించి మాట్లాడుతుంటే నీకు వళ్ళు తెలిదు అంటారు మా వారు. ఏం చేయను చెప్పండి, వాళ్ళ తో నాకు అంత అనుబంధం ఏర్పడింది.

నా చిన్నప్పుడు ఎప్పుడు చదివానో గుర్తులేదు కాని బుడుగు నా అభిమాన హీరో అయిపోయాడు.నాకంటే రెట్టింపు అభిమానము మా పిల్లలకి. రోజూ ముందుగా బుడుగు కథ చెప్పుకున్నాకే వేరే కథలు చెప్పుకుంటాము.
చైతన్య కళ్యాణి ఏ దైనా పుస్తకము గురించి రాయండి అని అడగగానే నాకు బుడుగు గుర్తుకువచ్చాడు.
అక్కడ రాసాక మా బుడుగులను మీకు చూపించాలని పించింది.
ఇది వారి కుఠో నే.

వీరే మా బుడుగులు . పెద్దొడు విక్రం,చిన్నోడు గౌరవ్.వారే వీరు.
అదీ సంగతి











Thursday, February 26, 2009

జ్ఞ్యాపకం

నాన్నగారు జ్ఞ్యాపకం గా మిగిలి పోయి ఈ రోజు కి పది సంవత్సరాలు అయ్యింది.అయినా ఇంకా నాకు మాథ్స్చెపుతున్నట్లు,బజారు కి తేసి కేలు తున్నట్లు చిన్నప్పటి జ్ఞ్యపకా లే .ఖమ్మం వెళ్ళ gఆనే లూనా మీద వెళ్లి,పిల్లల కోసం స్వీట్స్ ,బిస్కెట్స్ పళ్ళు అన్ని తెచ్చేవారు.ఎండలో ఎందు కు తరువాత వెళ్ళండి అన్నా వినేవారు కాదు.వకసారి బిపు ని వెళ్ళ gఆనే లెటర్ రాయరా అన్నారు.అప్పుడు వాడు నీకు ఇంగ్లీష్ రాదు కదా తాతయ్యా అన్నాడు.పోనిలేర ఎవరి తో నయనా చదివించు కుంటాను అన్నారు.ఆ సంగతి ఎప్పుడు గురుతు చేసుకునే వారు.సంజు ఎన్ని సార్లు అడిగినా విసుగు కోకుండా దాని జాతకం చెప్పేవారు.హాబీ గా జాతకం చెప్పటము నేర్చుకున్న అందరి కి కరెక్ట్ గా చెప్పేవారు.ఎవరి దగ్గరా వక్క పైస కూడా తేసుకోలేదు.
నిన్న అనుకోకుండా యద్దనపూడి సులోచనా రాణి ఇంటికి వెళ్ళాము నేను ,లక్ష్మి.లక్ష్మి కృష్ణ మూర్తి పెదనాన్న కూతురు అని ఆవిడ కి ఆవిడ భర్త స్వామి రా వు గారికి పరిచయం చేసింది.ములుగు బాబు కుతురివా అని నన్ను చూసి సంతోషించారు.ఆయన నాన్నగారికి మేనత్త కొడుకు.కాని నాకు తెలిసి వాళ్లు ఎప్పుడు కలుసు కో లేదు.వై.ఎం .సి దగ్గర వున్నప్పుడు దూరము నుండే ములుగు బాబు రావటము చూసే వాళ్ళము.వాడు వచ్చి నప్పుడు అందరమూ ఎంజాయ్ చేసే వాళ్ళము.వాడు, నేను,రాముడు బావ అంటు ఇంకా కొంతమంది పేర్లు చెప్పారు అందరమూ చాలా ఫ్రెండ్స్ మీ .అందరు వెళ్లి పోయారు నేను వక్క డి నే మిగిలాను అని బాధ పడ్డారు.అనుకోకుండా నాన్నగారి తిది ముందే అక్కడి కి వెళ్ళటము,నాన్నగారి చిన్ననాటి ముచ్చట్లు వినటము మంచిగా అని పించింది.
నాన్నగారు అందరి తో బాగానే వుండేవారు.ఆయన మీద ఎవ్వరు చెడు గా చెప్పటము వినలేదు.ఎప్పుడు తామరాకు మీద నీటి బొట్టు లాగా వుండాలి అని చెప్పేవారు.అనవసరము అయిన మాటలు ఏవి మాట్లాడే వారు కాదు.అల్లుళ్ళ తో కుడా ఫ్రెండ్స్ లాగా వుండేవారు.ఈయన తో సినిమాలకు కూడా వెళ్లేవారు.మా వారు నన్ను నాన్న కుచి అంటుంటే ముసిముసి గా నవ్వు కునే వారు.ఆయన మరణించిన తరువాత అప్పుడప్పుడు జయ కి కలలో కనిపిస్తున్నారు.వకసారి ,కమలని వినాయకు డి పూజ చేయమ న్నను.నువ్వు గుర్తు చేయి అన్నారట.ఆయన చెప్పింది నేను ఎవరికీ చెప్పలేదు,మరచిపోయాను.చివరికి మరణము తరువాత కూడా నా గురించిఆలోచిం చారన్న మాట.నేను ఆయనకి తిరిగి అంత ప్రేమ అందిచ గలిగానా.ఆయనకు నేను ఏమి చేయలేక పోయాను.అయన జబ్బు పడ్డప్పుడు కూడా నేను ఇక్కడ లేను అమెరికా లో వున్నాను.ఆయన మరణించే ముందు పనమ్మాయి తో నన్ను రమ్మని కబురు చేసారు.వేలుదామని బయిలు తెరాను కింది కి వెళ్ళే సరి కి చుతి కి కోసం ఆగవలసి వచ్చింది.ఇంత లో ఎవరో మాటలు పెట్టారు.సరే లేట్ అయ్యింది కదా వంట చేసు కొని పోదామని తిరిగి వెళ్లి వంట చేస్తుండగా ఆయన మాట్లాడటము లేదని పక్కిన్ టి వాళ్ళు ఫోన్ చేసారు మేము వెళ్ళే సరికి అయన పోయారు .నేను తిరిగి వేల్లకుడా అప్పుడే అక్కడి కి వెళ్లి వుంటే ఆకరి చూపు దక్కేది కదా అయన రమ్మని పిలిచినా వెల్ల లేదే అని ఎప్పుడు బాధ పడతాను.కాని ,వకటే తృప్తి ఆయన కర్మ కాండలు మా వారు చేసారు.దాని కి నేను ఎప్పుడు మా వారికీ క్రుతగ్యు రాలీని.
నేను ట్టు తౌసండ్ ఇయర్ చూడను అని వక సారి నాతో అన్నారు కాని అప్పుడు ఆయన అన్నది నాకు అర్దము కాలేదు.ఆయన న్యంటి నయన్ ఫిబ్రవరి లో పరమపదిన్ చినప్పుడు అర్దము అయ్యిది.ఆయన మరణము గురించి ఆయన కే తెలిసిన యోగి ఆయన.