Showing posts with label ఆ పాత మధురాలు. Show all posts
Showing posts with label ఆ పాత మధురాలు. Show all posts

Tuesday, April 4, 2017

స్నేహమా ఎక్కడా!





స్వాహాదేవి మీద కోపం వచ్చిందో, చాయాదేవి మీద కోపం వచ్చిందో సూర్యాదేవ్ గారు తెగ మండిపోతున్నారు!చివరాఖరుకి వరణుడు సంధి కుదిర్చి చల్లబర్చాడు!
హమ్మయ్య అనుకుంటూ బాల్కనీ లోని నా చేర్ లో సెటిల్ అయ్యాను.పారిజాతాల సీజన్ ఐపోయినట్లుంది అక్కడక్కడా పూసి పరిమళాలు వెదజల్లుతున్నాయి.కాంపౌండ్ వాలంతా అల్లుకొని విరగపూసిన రాధామాధవాల నుంచి సన్నని సువాసనలు వస్తూ ఏవో జ్ఞాపకాలను తట్టిలేపాయి.ఓ పూవు, ఓ పుస్తకం మనసును కదిలిస్తాయి.మ్నేను పి.యు.సీ గుంటూర్ వుమెన్స్ కాలేజీ లో చదివేటప్పుడు హాస్టల్ లో ఉండేదానిని.హాస్టల్ టెరస్ మీదకి రాధామాధవం ఓ పొదరిల్లు లా అల్లుకొని తీగ నిండా గుత్తులు గుత్తులుగా పూసేది.ఆ తీగ కింద మా స్నేహితులం నలుగురం, నేను, మణి,రత్న, కాంతి కూర్చొని కృష్ణశాస్త్రి కవితలు ,జంధ్యాల పాపయ్య కరుణశ్రీ,పుష్పవిలాపం చదువుకుంటూ ఉండేవాళ్ళం.మా సీనియర్ హేమ ఇది మల్లెల వేళ యనీ పాట ఎంత బాగా పాడేదో!ఆ పాట, పుష్పవిలాపం మమ్మలిని భలే ఏడిపించేవి.వెక్కి వెక్కి ఏడేచేవాళ్ళం . ఆ పాటలు, కవితలు , కబుర్లు, రాధామాధవుల పరిమళలాలు మమ్మలిని అక్కడి నుంచి కదల నిచ్చేవికావు.వాచ్ మాన్ వచ్చి డేస్కాలర్స్ బయటకు వెళ్ళిపోవాలి అనేవరకూ అలానే కూర్చునే వాళ్ళం.రత్న, కాంతి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళిపోయేవారు.నన్ను అందరూ రాధామధవం లోని తెల్ల పూవని,మణి ఎర్రపూవని అనేవారు.ఒకే గుత్తిలో రెండు రంగులు ఉన్నట్లు మేమిద్దరమూ ఎప్పుడూ కలిసే వుండేవాళ్ళం.
అప్పుడే ఆంధ్రప్రభ వీక్లీ లో ఒక సీరియల్ వచ్చింది.అందులో నలుగురు అమ్మాయిలు ఫ్రెండ్స్.వాళ్ళూ మాలాగే కాలేజ్ ఐపోయాక,మేడ మీద కూర్చొని కవితలూ , కబుర్లూ చెప్పుకునేవారు.అందులో ఒక అమ్మాయికి తమిళనాడులో ఉన్న అబ్బాయి తో పెళ్ళవుతుంది.అత్తగారు తమిళ సాంప్రదాయం ప్రకారం , డైమండ్ దిద్దులు పెట్టమంటుంది.పెడతారు ఐనా ఆ అమ్మాయిని అష్టకష్టాలు పెడుతుంది అత్తగారు.అవి చదువుతూ ఎంత ఏడ్చేవాళ్ళమో!అదేమిటో అప్పుడు ప్రతిదానికి చలించిపోయేవాళ్ళము.కాంతి వాళ్ళ అమ్మ ప్రభ తెప్పించేది.అనుకోకుండా కాంతి ఆ సీరియల్ చదవటమూ , మాలాగే ఆ ఫ్రెండ్స్ ఉన్నారని తీసుకొస్తే మేము చదవటమూ జరిగింది.ఇక వారం వారం ప్రభ సంపాదించటానికి కాంతి తెగ తిప్పలు పడేది.ఎందుకంటే అప్పుడు మాకు అలాంటి పుస్తకాలు చదివటానికి పర్మిషన్ లేదు! అదే సంవత్సరం లో దాదాపు నాకు, కాంతి కి, రత్నకు పెళ్ళి కావటమూ మేమంతా విడిపోవటమూ జరిగింది.ఆ తరువాత సంవత్సరానికి మణి పెళ్ళి కూడా ఐపోయింది.పిట్టల్లా ఎగిరిపోయాము.ఆ తరువాత రెండుమూడేళ్ళు ఉత్తరాలు నడిచాయేమో .ఆ తరువాత అవీ లేవు.ఎవరెక్కడ ఉన్నారో కూడా తెలీదు :( ఇక్ ఆ సీరియల్ పేరేమిటో, అది రాసిన రచయిత్రి పేరేమిటో ఎంత ఆలోచించినా గుర్తురావటం లేదు.ఆ రాధామాధవాలు,ఆ స్నేహమూ మనసుపొరలల్లో వుండిపోయాయి.ఆ గుర్తుగానే రాధామాధవ తీగ తెప్పించి వేసాను.నాలుగేళ్ళ కు ఇప్పుడు కాంపౌండ్ వాలంతా అల్లుకొని, గుత్తులు గుత్తులుగా పూస్తూ మాస్నేహపు పరిమళాలను వెలికిదీస్తోంది :)

ఇలా ఓపూవు,ఓ నవల ,ఓ పాట తీపిగుర్తులు :)
నా కుర్చీలో కూర్చొని, మల్లాది నవల "ష్ గప్ చుప్ " చదువుతూ, పూల పరిమళాలను ఆస్వాదిస్తూ,ఇష్టమైన పాట వింటూ, చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నాను.కొద్ది రోజులు రాతల కు విరామమిచ్చి ఇలా హాయిగా కూర్చోవాలని నా ప్లాన్ :( 

Tuesday, June 11, 2013

మధురస్మృతులు

ఈ ఫొటోలో వున్నది మా అత్తగారు శ్రీమతి పరచ అనసూయ  , మామాగారు శ్రీ పరచ కిషన్ రావు గార్లు.. ఈ రోజు వాళ్ళు ఎందుకు గుర్తొచ్చారా అంటారా  పోయిన వారం మా అత్తగారి వూరు "పోలంపల్లి"వెళ్ళి వచ్చాము . ఆ వూరి గురించి చెప్పేముందు మా మామగారిని , అత్తగారిని తలుచుకున్నానన్నమాట.


"పోలంపల్లి" లో మా మామగారి పూర్వీకులు అంటే తరతరాలుగా అక్కడే స్తిరపడ్డారు . ఇది ఆంధ్రాకు , తెలంగాణాకు బార్డర్ ఏరియా. ఈ సంగతి ప్రత్యేకం గా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే , రజాకార్ మూమెంట్ సమయం లో ఈ వూరు కూడా పాల్గొంది . జమలాపురం కేశవరావు గారి ఆధ్వర్యం లో మా మామగారు , వూరి కరణం అప్పారావు గారు మరి కొందరు వూరి యువకులు వాళ్ళ వుద్యోగాలు వదులుకొని వచ్చి పాల్గొన్నారట. రజాకారులు తరుముతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడి కి వచ్చేవారు.బార్డర్ లో వున్న గ్రామాలలో వారి కాంప్ లు ఏర్పాటు చేసుకునేవారు.అలాంటి వక కాంప్ , పరిటాలకు కాంప్ కమాండర్ మా మామగారు. ఇక్కడ కరణం గారింట్లో ఉద్యమం వ్యూహ రచనలు చేస్తుండేవారు. ఇళ్ళలో ఆడవాళ్ళు నూలు వడకటం చేసేవారు.కార్యకర్తలకు మా ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేసారు . మా అత్తగారు , ఆవిడ ఆడపడుచు అందరి కీ వండేవారట.అసలు రోజంతా వండుతునే వుండేవాళ్ళము అనేవారు మా అత్తగారు ఈ వూరి నుంచి మొదటిసారిగా చదువు కోసం బయటకు వెళ్ళింది మా మామగారేనట.

మావారి బాల్యం ఇక్కడే గడిచింది. మా పెళ్ళైన కొత్తల్లో మా బంధువులు , స్నేహితులు అందరూ మావారు చిన్నప్పుడు చేసిన అల్లరి గురించి తెగ చెప్పి భయపెట్టారు.ఓసారి మా అత్తగారి మీద కోపం వచ్చి నాలుగు కిలోల నెయ్యిని ఇంటి ముందు వేపచెట్టు కింద పారబోసారట. ఎంత అల్లరి చేసినా పిల్లలను కొట్టకూడదు , తిట్ట కూడదు అని మామాగారి రూలట. ఈయన అల్లరి భరించలేక ఓసారి , ఇంటి వెనుక వున్న గోతిలో ఈయనను దింపి మా అత్తగారు ఏడుస్తూ కూర్చున్నారట. అలాంటివి బోలెడు సంగతులు , నేను మా పెళ్ళైన కొత్తల్లో అక్కడ వున్నప్పుడు ఎదురింటి వాళ్ళు చెప్పారు.మేము కొన్ని రోజులు ఆ ఇంట్లో వుండాలని , మామాగారు ఆయన చెల్లెలిని తోడిచ్చి వుంచారు. అప్పటికే ఆక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేసి చాలా ఏళ్ళైందిట.కాని పొలాలు చూసుకోవటానికి ఆయన వెళుతూనే వుండేవారు.అప్పుడే ఎదురింటి వాళ్ళు మావారి చిన్నప్పటి ఫొటోలు చూపించారు. నేను అడుగుతే అన్నీ ఇచ్చారు కాని వకటి మాత్రం ఇవ్వలేదు . అందులో మావారు చాలా చిన్నగా , బహుషా నాలుగేళ్ళు వుండ వచ్చు , తెల్ల పైజామా కుర్తా వేసుకొని , చేత్తో జంఢాపట్టుకొని వూరేగింపు ముందు వున్నారు . అది రజాకార్ మూమెంట్ ఐపోయిన తరువాత వూళ్ళో వూరేగింపు చేసారట అప్పడు తీసారుట. ఆ తరువాత ఇన్ని సంవత్సరాలకు అక్కడకు పోయిన వారం వెళ్ళము.మధిరలో మా వారి కజిన్ కూతురు పెళ్ళైతే అక్కడికి వెళుతూ పోలంపల్లి వెళ్ళాము. మా ఇద్దరి తోపాటు మావారి కజిన్ సంధ్య కూడా వచ్చింది. ముందుగా తిరుమలగిరి లో వెంకటేశ్వరస్వామి దర్షనము చేసుకున్నాము. ధర్షనం అయ్యాక అక్కడ వున్న క్లర్క్ ను , పోలంపల్లి ఏ రూట్ లో వెళ్ళాలి అని అడిగారు. ఆయన పోలంపల్లి వాళ్ళదే ఇక్కడ పెళ్ళవుతోందండి అని చెప్పారు. అక్కడి వెళి కనుక్కుంటే అప్పుడే పెళ్ళైపోయి అంతా కిందకు దిగారని తెలిసింది. వాళ్ళలో తులశమ్మగారి అబ్బాయి అంటే మా ఇల్లు కొనుక్కున్నావిడ కొడుకు కూడా వున్నట్లు తెలిసింది . అంతే అప్పటి నుంచి మావారి ఆనందం , ఎక్సైట్మెంట్ చెప్పలేనివి . మీరు కార్ లో కింది కి రండి నేను మెట్ల మీదుగా దిగి వాళ్ళను అందుకుంటాను అని వడి వడిగా వెళ్ళిపోయారు.మేము కింది కి వెళ్ళేసరి కి తులశమ్మగారి అబ్బాయి , మావారు చాలా సంతోషంగా మాట్లాడుకుంటున్నారు.ఇప్పటికీ ఆయన పేరు తులశమ్మగారి రెండో అబ్బాయి అనే తెలుసు .ఆయన వెంట పోలంపల్లి బయిలుదేరాము . మీరూ మాతో పాటు రండి.


వూళ్ళో కి వెళ్ళే ముందు భోజనం చేసి వెళ్ళాలి కదా , అక్కడ ఎవరిని ఇబ్బంది పెడతాము . ఇది పోలంపల్లి కి ముందు వున్న 'వత్సవాయి 'అనే వూళ్ళోని హోటల్.భోజనం వేడి వేడిగా వడ్డించారు. ముఖ్యం గా ఎందులోనూ వెల్లుల్లిలేదు :)పెరుగైతే ఎంత రుచిగా వుందో .హాయిగా కడుపు నిండా తినేసాము.
ఈ ఫొటో ఆ హోటల్ ముందుదే. మావారి పక్కన వుంది తులశమ్మగారి రెండో అబ్బాయి ఆపక్కవారు హోటల్ నడుపుతున్న దంపతులు .
ఇహ పోలంపల్లి లోకి పదండి. వూళ్ళోకి వెళుతూనే గుడి పక్కన మా మాష్టారు ఇల్లు అని ఆపారు . ఆయన గురించి అడుగుతే పాపం పోయారు లేరు:( ఇంట్లో కూడా ఎవరూ లేరు.


ఇదే మా యిల్లు. మట్టి ఇంట్లో వాళ్ళ అమ్మ ఇబ్బంది పడుతున్నది అని , వుద్యోగం రాగానే ఈ ఇల్లు అమ్మ కోసం కట్టించారట మామాగారు. కార్ ఆగటం ఆలశ్యం మావారు ఎలా పరుగెత్తుతున్నారో !అప్పటి నుంచి నేనూ, సంధ్యా ఫొటోలు తీస్తూ మావారి ఆనందాన్ని చూస్తూవున్నాము:)
"అరే ఇంటి ముందు పెద్ద వేపచెట్టుండాలి లేదే" మావారి ఆశ్చర్యం.
"దాని కిందేనా మీరు రెండు కిలోల నెయ్యి వంపేసింది ?"నా ఆరా.
"రెండు కాదు నాలుగు కిలోలు "
"మరే వదినా మా అన్నయ్యను తక్కువ అంచనావేయకు ."
మా ఇద్దరి మాటలు ఆయనెక్కడ విన్నారు . ఇంట్లోకి దూరిపోయారు. ఆ ఇంటిని రెండు భాగాలుగా చేసి తులశమ్మగారి రెండో అబ్బాయి , మూడో అబ్బాయి వుంటున్నారట. ఇల్లు చూసేలోపల తులశమ్మగారి రెండో అబ్బాయి వెళ్ళి తెలిసినవాళ్ళను తీసుకొచ్చాడు. మాధవయ్యగారు వచ్చారు అంటూ వాళ్ళూ సంతోషంగా వచ్చారు .








మావారి పక్కనే బుజం మీద చేయి వేసి నిలుచున్నది , ఆయన చిన్నప్పటి గోలీలాడిన ఫ్రెండ్ లచ్చుమయ్య.


ఇది తులశమ్మగారి రెండో అబ్బాయి ఇల్లు . ఆయన భార్య, కొడుకు . ఆవిడ మంచిటీ చేసి ఇచ్చింది.టీ తాగమన్నప్పుడు ఎలాంటి టీ ఇస్తుందో అనుకున్నాను. కాని చాలా బాగుంది . ఆవిడతో టీ బాగుందండి అంటే , మీ మామగారు కూడా వచ్చినప్పుడల్లా "తులశమ్మా నీ రెండో కోడలు టీ చాలా బాగాపెడుతుంది " అనేవారు అంది .మాకు బొట్టుపెట్టి జాకెట్టుబట్టలు పెట్టింది .


ఇది మావారి చిన్ననాటి స్నేహితుడు మన్నెం గోపాలారావుగారి ఇల్లు. ఆయన కొడుకు , కోడలు , మనవడు. ఆవిడా బొట్టుపెట్టి జాకెట్టుబట్టలు పెట్టింది.
అందరూ చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నారు. ఇన్నిసంవత్సరాల తరువాత వెళ్ళినా వూళ్ళో కొంతమందైనా గుర్తుపట్టేవాళ్ళు వున్నారని చాలా సంతోషపడిపోయారు.
అప్పుడు పెట్టిన ముగ్గులు కూడా అలానే వున్నాయి అని తరువాత అన్నారు. ముందే చెపితే అవి కూడా ఫొటోలు తీసే వాళ్ళము కదా అనుకున్నాము . ఎదురింటి వారు వుంటే మావారి ఫొటో అడుగుదామనుకున్నాను . ఇప్పుడైతే వాళ్ళకంత ఆసక్తి వుండదుకదా అనుకున్నాను. ఆ పెద్దవాళ్ళు లేరు . వాళ్ళ పిల్లలు ఖమ్మం లో సెటిలయ్యారు. వాళ్ళ పిల్లలు అమెరికావెళ్ళారు.






ఇదీ మా అత్తగారి వూరు , ఇల్లు.



Friday, January 9, 2009

ఆ పాత మధురాలు

ఆనంద్ వచ్చాడు నన్ను వైదేహీ అత్తయ్య తీసుకొని రమ్మన్నదట.వెళ్ళాను.పాప విజయ్ ,చారి మామయ్యగారు అందరూ ఇంట్లోనే వున్నారు.అప్పుడే మా మూర్తి తాత అవుతున్నాడు. నాకు మేము ఇంక స్కూల్ కి వేల్లుతున్నట్లుగాన్నే వుండి అని మామయ్యగారు అన్నారు.అత్తయ్య కి ఎప్పుడు నన్ను చూసిన పాత రోజులు గురుతుకు వస్త్తాయి.ఇప్పుడు ఇంత జుట్టు వుండి కాని పుట్టిన్నప్పుడు గుండె.ఆముదము రాస్తే జారి పోయేది.అంది.చిత్లపాడు ను గర్తుచేసింది చ్చిన్నప్పుడు చింతలపాడు వెళ్ళాలంటే కీసర దగ్గర బస్ దిగి బండి లో వేల్లీవాల్లము అమ్మమ్మ అన్నం ,కందిపచ్చడి,పెరుగు, పంపేది.వాగు దగ్గర తిని వెల్లేవాల్లము.పెద్దిల్లు.,వాకిలి మెట్లు ఎక్కి ఇంట్లో కి వెళ్ళే ముందు వరండా లో తాతగారు వుండేవారు.ఆయన పడక కుర్చీ దాని కింద రాగి చెంబు తో నీళ్లు వుండేవి.కింద కూర చోని రాయటానికి చిన్న బల్ల వుండేది.వెనక పెరడు లో చిన్న బొమ్మరిల్లు వుండేది.తిరనాళ్ళ అప్పుడు ఊరంతా కిట కిట లాడేది. అప్పుడు ఊరి అల్లుళ్ళు ను బస్ టాప్ ఎక్కించి తీసుకు రావటము (బస్ లో చోటు లేక )పద్దతి అని మా చిన్న మామయ్య అంటే చాల రోజులు నిజమే అనుకున్నాను.ఇంటి ముందు పెద్ద పెద్ద అరుగులున్దేవి.రధం వచినప్పుడు అవి ఎక్కి కూర్చొని చూసేవాళ్ళము.పీ.యు.సి.ఇంగ్లీష్ అక్కడే వుండి మురళి మాస్టార్ దగ్గర చదువుకున్నాను.అప్పుడే కొంచం సంగీతం కూడా నేర్చు కున్నాను.చిన్నపుడు ఒకసారి వెళ్ళినప్పుడు పిన్ని తో బాబాయిగారి ఊరు కోడూరు వెళ్ళాను.వల్ల కి నిమ్మ తోట మల్లె తోట వుండేవి.నాకు పిన్ని అత్తగారూ కొన్ని బొమ్మలు ఒక చిన్న చేక్కపెట్టే లో పెట్టి ఇచ్చింది.అది పరుపు చుట్ట లో పెట్టిబస్ పైన పెట్టారు.దిగేటప్పుడు తీసు కోవతము మరచి పోయాము.ఆ పెట్టె ఇంకా మరచి పోలేదా అని అందరూ నవ్వారు.బహుశా ఆ సంగతి పాప మరచి పోయి వుంటుంది.మా పెళ్లి లో ఆనంద్ బావమరిది పాత్ర పోషించాడు.(అప్పుడు భాస్కేర్ రాలేక పోయాడు.)నేను,జయ సెలవల్లో మిర్యాలగూడెం వెల్లేవాల్లము. లేకపోతే,ఆనంద్,విజయ్,పాప పోట్టిచేలమ వచ్చేవాళ్ళు.అప్పుడు అందరమూ కలిసి పినిక్ వెల్లేవాల్లము.అట్లా అందరమూ కలిసి వెళ్లి చాల రోజులు అయ్యింది,సినిమా కి వెళ్దామా అని పాప అంది .కాని అత్తయ్య ఒప్పుకోలేదు.కావాలంటే కమల దేలిఎవరీ అయ్యాక వెళ్ళండి అంది(ఆ రోజు ఇంత వరకు రాలేదు.ఎప్పుడు అన్కోవటమే కాని వీలవలేదు.)విరజాజి పూలు కోసి కట్టి ఇచ్చింది.నేను kuttina fracks choopinchaanu.mee అమ్మ కూడా kuttadi అంది అత్తయ్య అవును నాకు gurthundi అప్పుడు కొన్న kutlu allikalu,maalathi chandoor బుక్ naakichchindi annanu.pottichala లో intita grandalayam లో కట్టి books theppinchedi.taamsayar,hakalberiphin chadivanu annanu. అవును mee అమ్మ చాల pusthakalu chaduvuthundi naakantha opika లేదు అంది.నాకూ చిన్నప్పుడు chandamama ,balamithra,chadavatamu alvatu చేసింది., budugu ,dumbu ,nethagi,karna అన్ని కథలు cheppedi.dairy raayatamu కూడా choopinchidi కాని nake రోజు rase opika లేదు.కాని దాని moolanga rooju karchulu raasukov atamu,edyna పని వున్నా ,party వున్నా vivaranga rasukovatamu alavatu అయ్యింది. saayankalamu daaka ఇలాగే kabrlu cheppukunnamu.అప్పుడే kaadu ippudina koddisepu naa chinnappati సంగతులు ఆవిడ ఎప్పుడు గుర్తు చేసుకుంటూ వుంటారు.అత్తయ్య cheputhunte nakoo బాగుంటుంది.అందరి కి వల్ల chinnapati సంగతులు vintamu istamega.అత్తయ్య chesipettinavi తిని అందరి తో kabrlu cheppukoni ఇంటికి bayaluderanu.ఆనంద్ ఇంటి దగ్గర vadiladu.thripuraram vella లేక poyanu అన్నా bada కొంచం teerindi.

Thursday, January 8, 2009

ఆ పాత మధురాలు

త్రిపురారం వెళ్లి కొన్ని రోజులు వుందామని బయిలు దేరాను.మళ్లీ eక్కువ రోజు లైతే ప్రయాణము చేయలేను.డెలివరీ కి హైదరాబాద్ లో నే బాగుంటుందని అనుకోని అమ్మని నాన్నగారిని ఒప్పించారు.ఈ లో వెళ్లి రావాలని అనుకున్నాను.యెవీనిగ్ బస్ లో బయిలుదేరము.నార్కెట్పల్లి లో బస్ ఆగి పోయింది.బయిలు దేరటానికి ఎదురు చూస్తూ కూర్చోన్నాము.నా చిన్నతనం అంతా గుర్తుకు వచ్చింది. నాన్నగారు రాయచూర్ లో పని చేస్తుండగా నిన్తీన్ ఫిఫ్టీ వన్ జూలై ట్వంటీ ఫిఫ్త్ న పుట్టాను. అప్పటి సంగతులు వైదేహీ అత్తయా చెపుతూ వుంటుంది.అందరూ నన్ను చాల ముద్దు చేసే వారట.చారి మామయ్యగారు ఎప్పుడూ ఎత్తుకునేవారట. అత్తయ్య చెపుతుంది నన్ను ఎత్తుకొని బంగారు పాపాయి బహుమత్లు పొందాలి పాట పాదేదట అనుడుకేనేమో నాకు ఆ పాట అన్నా అది పాడిన రావు బాల సరస్వ్వతి అన్నా ఇష్టం.ములుగు కొద్ది కొద్ది గా గురుతు.నాన్నగారి ఆఫీసు .లో పున్నాగ చెట్టు కింద పూలు ఎరుకోవతము బద్రవతి అత్తయ్య పెద్ద పెద్ద రొండు జడలు మాత్రమే గుర్తున్నాయి.తరువాత మానుకోట వెళ్ళాము.అక్కడ స్కూల్ లో చేర్చటని కి నాన్నగారు తిసుకేల్లారు హెడ్మాస్టర్ ఒక సర్ ని పిలిచి నాకు టెస్ట్ పెట్టమన్నారు.నేను రాసిన పేపర్ చూసి నాన్నగారి తో మాథ్స్ బాగా చేసింది.థర్డ్ క్లాసు లో కాదు ఫిఫ్త్ క్లాసు లో చేరచ్చు కుంటాము అన్నారు. అలా ఫిఫ్త్ క్లాసు లో చేరాను.అప్పటి నుండి మాథ్స్ అంటే చాల ఇస్టం.మా యింటి పక్కన బామ్మగారు మాకు పేపర్ లు మెంతులు కలిపి రుబ్బి చిన్న చిన్న గిన్నెలు చేసి అందు లో పప్పులు వేసి ఇచ్చే వారు.వారి మనవరాలు భాను ,నేను ఆడు కునే వాళ్ళము.సెలవల్లో అత్తయ్య పార్వతి,శ్యామల వచ్చేవారు.జయ,శ్యామల ఆడుకుంటూ వుంటే నేను,పార్వతి స్కూల్ లో నేర్చు కున్న పాటలు,డాన్సు లు ఒకరి కి ఒకరం చూపించు కునే వాళ్ళం.భలే తాత బాపూజీ బాలల తాత బాపూజీ,ఆటలు ఆది పాట లు పాడి అలసిపోయమే ,లాటి పాటలు చిన్న చిన్న నాటకాలు చేసు కొనేవాళ్ళం .చదమామ లో భేతాళ ఖాతా లో పజిల్ చేసే వాళ్ళము.ఇద్దరి కి చిన్న కుండ లో డబ్బులు దాచుకునే అలవాటు వుండేది.అదేమిటో ఎప్పుడూ పార్వతి కుండ దొంగలు ఎత్తుకేల్లెవారు.నా మని తో ప్రతి సంక్రాంతి కి బొమ్మ కొనుకునే దాన్ని.దీపావళి కి నాన్నగారు బుట్ట నిండా టపాకాయలు తెచ్చే వారు.మేము కూడా వల్ల ఊరి కి వెల్లేవాల్లము.కారీమ్నగర్ ఆసిఫాబాద్,బూర్గుమ్పాద్ వెళ్ళిన గురుతు.బూర్గంపాడ్ లో ఒక సవత్సరము కలిసి వున్నాము.ప్రతి శని ,ఆది వారాలు బాలానందం,బాలవినోదం తప్పక వినేవాళ్ళము.మానుకోట లో స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు రైల్ పట్టాలు దాటి వెళ్ళటము,ఇంటి పక్కన మామిడి తోట లో ఆడుకోవతము కొద్దిగా గురుతే.అక్కడి నుంచి వరంగల్ వెళ్ళాము.అక్కడే ఉష పుట్టింది.ఉదయ అని పెట్టాలా,ఉష అని పెట్టాలా అని అందరమూ చర్చించి ఉష అని సెటిల్ చేసాము.అప్పుడే శాంతి నివాసం సినిమా చూసి అత్తయ్య అందు లో వున్నా చిట్టి అనే పేరు నచ్చి చిట్టి అని పిలవతము మొదలు పెట్టింది. కాని ఉష కి అలా పిలి స్తే ఎంత కోపమో.నేను,జయ,భాస్కేర్ ,సీత రోజు వేయిస్థంబాల గుడి లో ఆడుకునే వారము.స్కూల్ లో పంకజ టీచర్ కి నేనంటే అభిమానం వుండేది.ఎప్పుడూ మాథ్స్ లో ఫాస్ట్.మార్క్ వచ్చేది.స్కిప్పింగ్ లో కూడా ఫస్టే .మా హెడ్ మిస్త్రెస్స్ సుజాత రెడ్డి చాల బాగుండేది.అద్దాల జాకెట్ ,గద్వాల్ చీర కట్టేది.(ఈ మద్య బర్మింగ్హాం లో నాథ్ ఇంట్లో కలిసాను.చాల మారి పోయింది.హెల్త్ కూడా బాగా లేదట.చాల బాధ అన్పించింది.మీ స్టూడెంట్ ని అని చాలమంది వస్తారు.చాలా సంతోసన్ గా వుంతుడి అన్నారు.)నాకు ఎప్పుడు టెన్త్ లోపలే రాంక్ వచ్చేది.అక్కడనుంచి నాగార్జున సాగర్ వెళ్ళాము.మరి ఎట్లా తప్పు రాసాడో క్లార్క్ కమల రాణి బదులు కమల దేవి అనిమారి పోయింది.టెన్త్ కాబట్టి ఆప్షనల్ తిసుకోవలత.జనరల్ న కామ్పోసిత అని అడిగాడు.నాకు తేలి లేదు.అమ్మాయిలంతా జెనరల్ లో వున్నారు నువ్వు అదే తీస్కో అన్నాడు.సరే అన్నాను.మాథ్స్ సర్ రాజూ మాస్టర్ నా పేపర్ అందరి కి చూపి నన్ను మెచ్చుకునే వారు.మాడపాటి అని పిలిచే వారు.ఏజ్ తక్కువ మూలంగాయస్.యస్.సి. రిజల్ట్స్ ఆపారు.ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అయ్యి రేసల్త్స్ వచ్చేసరికి లేట్ అయ్యింది.గుంటూర్ వుమెన్స్ కాలేజ్ లో పే .యు.సి.లో చేరతని కి వెళ్ళాను. మాథ్స్ కావాలని అడిగాను.కాని నాది జెనరల్ ఒప్తిఒన్ కాబట్టి రాదు అన్నారు.కపోసిట్ వుండలత.అప్పుడు ఏమి చేయగలను.నాకు కావలసి న ఇష్టమైన మాథ్స్ ని వదులు కో వలసి వచ్చింది.నా జీవితం లో పెద్ద అశాబంగం.హాస్టల్ లో చేరాను.ఎదుగురము ఒక రూమ్ లో వుండే వాళ్ళము.మని చాల క్లోజ్ ఫ్రెండ్ అయ్యింది.హాస్టల్ లైఫ్ చాల ఎంజాయ్ చేశాను.మని తో వల్ల ఊరు ఒంగోలు కూడా వెళ్ళాను.తను కూడా పోట్టిచలమ వచ్చింది.ఆ రోజు ల లో నాగార్జున సాగర్ లో సినిమా శూటింగ్స్ అవుతుండేవి.మేము వెళ్ళినప్పుడు ఏదో జానపద సినిమా షూటింగ్ అవుతోంది.నాన్నగారు తీసు కెళ్ళారు.కాంత రావు రాజనాల పోత్తోపోట్టి ఫ్రాక్స్ వేసుకొని వున్నారు.రాజశ్రీ పక్కన కూర చోని వుండి.కాసేపు చూసి నవ్వుకొని వచ్చేసాము.మా ఇంటి తోట మని కి చాల నచ్చింది.మా తోట చాల బాగుండేది.నాకు కూడా మనీ వల్లఊరి బీచ్ సముద్ర స్నానం చాల నచ్చాయి.నేను గుంటూర్ నుండి ఎప్పుడు వచ్చిన జయ అన్ని సంగతులూ అడిగి తెలుసుకుంటూ వుండేది.అప్పటికి ఇప్పటికి జయ నాకు పెద్ద శ్రోత.పీ.యు.సి ఇంగ్లిష్ లో ఫెయిల్ అయ్యాను.సేప్తంబెర్ లో రాసి పాస్ అయ్యాను. డిసెంబెర్ లో పెళ్లి అయ్యింది.అప్పుడు పాస్ అయ్యి వుంటే గుంటూర్ లోనే బి.ఏ చే సే దనినేమో.రాగిణి,మనోరం ,సూర్యలత ,అందరూ హైదరాబాద్ లో కూడా కలి సారు.అప్పుడు సూర్యలత ఇంటికి శ్రీనగర్ కాలనీ వచ్చినప్పుడు బిపు ఇక్కడ ఇల్లు కొంతదని కాని మేము ఇక్కడవుంతమని కాని అనుకోలేదు.ఇంతలో ఈయన పిలవతము తో నా ఆలోచనల లో నుండి బయటకి వచ్చాను.మా బస్ బగావలేదు.హైదరాబాద్ వెళ్ళే బస్ రావటము తో వెనక కి వచ్చేసాము.

Monday, December 29, 2008

అత్తవారిల్లు

చిన్న ఛిన్నగా ఇక్కడ అలవాటు పడుతున్నాను. కుంపటి అంటించటము వచ్చింది.కొన్నిటికి కుంపటి బాగుంటుందని అనిపిస్తుంది ..వదిన,అత్తయ్య పిలుపులకు అలవాటు పడ్డాను.మొదట్లో ఎవరినో అనుకునే దాన్ని.ఉమా ,శ్రీదేవి ముందు పెళ్ళికూతురు అత్తయ్య అన్నారు.తరువాత కొత్తతయ్య,అత్తయ్య,ఇప్పుడు పెద్ద అత్తయ్య.వదినగారు పిల్లలకి ఎగ్జిబిషన్ చూపించాలని తీసుకొని వచ్చారు.శ్రీదేవి ఉమా వెంటవెంట తిరిగారు కాని రమ దూరంగానే వుంది.ఇంకా చిన్నది కదా !ఉమా ఖమ్మం వెళ్ళినప్పుడు కూడా మా వెంటే తిరిగింది.మాతో పాటు రిక్షా లో వచ్చేది.తన పెళ్లి అయనప్పుడు నువ్వు మాతో వచ్చావు కదా ఇప్పుడు నీతో బిపు ను పంపన అంటుంటే వాడు ముందే నేను వెళ్లను అనేసాడు.పిల్లలంతా సరదాగా వున్నారు.విజయ క్లోజ్ అయ్యింది.వెంకట్ ఫ్రెండ్స్ బాబి, మీనా,రాజగోపాల్ అందరు నన్ను కూడా వాళ్లవెంట పబ్లిక్ గార్డెన్ కి సినిమా కి తీసుకెళ్ళేవారు.పాపం అందరు నాకు అన్ని నేరిపించే పని వాళ్లభుజాల మీద వేసుకున్నారు.మొత్తానికి మూడు నెలలు గడచి పోయాయి.కాని చపాతీ లు చేయటము పూర్తిగా రాలేదు.నేను చేసిన ప్రతి చపాతి కిఒక పేరు పెట్టేవారు మా మరిదిగారు వెంకట్. ఇది వరల్డ్ మాప్న ఇందులో అమెరికా ఏది ఇండియా ఏది అని ఏడిపించే వారు.ఏప్రిల్ లో ఆయన వచ్చారు. రెండు నెలలు బిజీ గా అయిపోయాయి.ఆయన ఫ్రెండ్స్ మూడు జంటలు ప్రేమికులు వున్నారు.అందులో ఒకరు శ్యాం లీల. వాళ్ల పెళ్లి మార్చ్ ఆరున అయ్యినిది. దానికి నేను అత్తయ్యగారు వెళ్ళాము.ఆర్య సమాజ్ పద్దతి లో అయ్యింది.అందరిని ఎదిరించి చేసుకున్నారు సినిమా లో ల. ఒకసారి అందరమూ బయటి కి వెళ్ళాము. అప్పుడు ఆ మూడు జంటల లోని ఒక అమ్మాయి ని తీసుకు రావటానికి ఆమె హాస్టల్ కి నేను లీల వెళ్ళాము.వేల్లూ ప్రేమికులేనా అని లీల ని అడిగాను. తరువాత ఆయన నన్ను కోపం చేసారు .ఎదైనా అడగాలంటే నన్ను అడుగు అన్నారు.. ఏమిటో గోల .జూన్ లో తిరిగి పటియాఅల వెళ్ళాలని టికెట్స్ బుక్ చేసారు.వెళ్లేందుకు కావలసిన సామానులు కొన్నాము. అమ్మ ఏవో ఇత్తడి సామానులు ఇచ్చింది.స్టీల్ ఇవ్వకూదదట.భాటియా షాప్ లో స్టీల్ సామానులు కొన్నాము.ఆ కంచాలు గ్లస్స్లూ స్పూన్స్ ఇప్పటికి వున్నాయి.అవి గౌరవ కి ఇస్త్తారట.నగేష్ పెళ్లి లో కుక్కర్ ఇచ్చాడు.అమ్మ కొన్ని చీర లు ఇచ్చింది.అందులో నేను పెళ్లి చూపుల కు కట్టుకున్న క్రీం కలర్ చీర కూడా వుండి.అయన ఫేవరేట్ కలర్ క్రీం కలర్ .అన్ని సామానులు ఒక చేక్కపెట్ట లో వచ్చాయి.చీరలు ఒక సూట్ కేస్ లో సరి పోయాయి.ప్రయాణానికి సిద్దం.

అత్తవారిల్లు

ఆయనని ట్రైన్ ఎక్కించి వచ్చాము.జనవరి సెకండ్ పంతోమిది వందల అరవయ్ తొమ్మిది.అరవయ్ ఎనిమిది డిసెంబర్ నన్ను ఉక్కిరి బిక్కిరి చేసి వెళ్ళిపోయింది.అనుకోకుండా పెళ్లి కావటము,తిరుపతి,ఖమ్మం మధిర చేలకుర్తి వెళ్లి రావటము అన్ని హడావిడిగా జరిగి పోయాయి.(ఈరోజే పేపర్ లో కృష్ణ వంశీ ఇంటర్వ్యూ చదివాను.అయన కొత్త సినిమా శశిరేఖా పరిణయం ఒక పద్దెనిమిది సవంత్యరాల అమ్మాయి పయనం అట.ఇప్పుడు నేను రాస్తున్నడానికి ఆ మాట సరిగ్గా సరి పోయింది అనుకున్నాను.)ఈ రోజు నుండి అత్తగారింటి కాపురం మొదలయింది.పొద్దునే లేవగానే భాగేరతి అత్తయ్య గారు కఫ్ఫే చేయటము చుపిస్త్తను రా అన్నారు.అన్నట్లు ఇంట్లో ఎవరెవరు వుంటారంటే అత్తయ్యగారు, మామయ్యగారు ,మా మరిది (యమ్.బి .బి.యస్ ఫైనల్ చదువు తున్నారు,)పేరు వెంకటేశ్వర్ రా వు (పెళ్లి లో ఆయనని పరిచయం చేస్తే నేను నమస్తే అన్నని అందరు నవ్వారు. మరి అయన నా కంటే పెద్దే కదా),రేన్దో ఆడపడుచు విజయ ఎనిమిదో క్లాసు చదువుతోంది ,మూడొ ఆడపడుచు ఉష ఫిఫ్త్ క్లాసు చదువుతోంది .వీళ్ళు కాకుండా భాగిర్తి అత్తయ్యగారు (మమయ్యగారి వదిన) ఆవిడా కొడుకు కాంతారావు ,కూతురు సీతమ్మ వుంటారు.అంటే కాకుండా వేచి పోయే చుట్టాలు స్నేహితులు చాలమంది వున్నారు.సో ,అలా ఎంటర్ అయ్యాను.అక్కడి నుంచి అంటీ స్కూల్ కి వెళ్లి రావటము వంటయింట్లో సహాయము చేయటము .నాకు ఏడింటికే అన్నము తిని తొమ్మిదింటికి పడుకోవతము అలవాటు.ఇక్కడ తొమ్మిది అయితేనే గాని వంట మొదలు కాదు. మొగవాళ్ళు పిల్లలు తిన్నాక అడవ్వల్లు తిని వంటిల్లు భోజనాల గది కడిగి పడుకునే సరికి పదకోడు దాటుతుంది.ముందు చాల ఇబ్బంది అయ్యింది.ఇప్పుడు నాకూ అదే aలవటు అయ్యింది.వంటలు కూడా వేరే.టమాటా పాలకూర కలిపి చేస్త్తారు.టమాటా కూర ఎంత బాగుంటుంది.అది చేసుకోరు.అమ్మ చేసే టమాటా కూర, చుక్కకూర పులుసుకూర,గోంగూర పచడి ,ఆలు ఫ్రై చాల తినలన్పిస్తుంది.రాత్రి పడు కాగానే జయ ,ఉష, అమ్మ ,నాన్నగారు గుర్తుకోస్త్తారు.ఉష పుట్టినప్పటినుంచి నా దగ్గరే చాలా అలవాటు.ఎట్లా వుందో జగన్ గాడి తో పోట్లాడు తు సైకిల్ తొక్కుతూ జయ ఇంటికి ఎప్పుడు వచ్చిందో ఇవే ఆలోచనలు.రోజులు గడుస్తున్నాయి.అయన దగ్గరనుంచి లెటర్ వచ్చింది.మొదటి ప్రేమలేఖ. చాల thrilling .reply rayataniki koorchunnanu.అయన పేరు raastunte మొదటి సరి ఆయన పేరు telusukunna insidenet గుర్తుకు వచ్చింది.అమ్మ anni చెప్పింది కాని పేరు చెప్పలేదు.adagalante mohamatam. ఆ రోజు చీర kattukuntoo వుంటే tabel meeda wedding kards kanipinchayi.తీసి పేరు చూసాను prabhath.పేరు bagunde అనుకున్నాను. sankranthi కి చేలకుర్తి vellanu.sixteenth నా మంచి రోజు thirigi rammani మామయ్యగారు చెప్పారు.ఆ రోజు ఉష పుట్టినరోజు. raanu అని cheppataniki bayyam.iyina vellanu.జయ తో కబుర్లు ఉష తో ఆటలు thondaraga ayipyindi.vachche రోజు చాల bada anpinchindi.malli classes ఇల్లు mamoole. aanty కూతురు నా letarlu chupicha మంది. కాని naku chupin chalani anipincha ladu.english లో reply rayatamu choopistanani అంది.emo chupinchalanipichaledu. ఒక రోజు pattu చీర style gaa కట్టి make up hair style చేసింది.ఇంటికి alage vellanu.evaro vachchivunnaru.అత్తయ్య గారు venakanunchi వెళ్లి dress marchu కొని rammannaru.ఒక రోజు mamayya గారు నన్ను vijaya ni hindi సినిమా కి tee su kellaru.అయన కి cinama lante istam ledata.కాని నాకు hindi nerpin chatani kani tisu kellarata.liberty theater లో choosamu.ఒక రోజు venat నన్ను english సినిమా కి teesu kelladu. మొదటి english cinima sound of music ramakrishna theater లో అయన తో చూసాను. esaari venkat ,kantharoovu నేను nataraj theater కి vellamu.thirigi vachche tappati కి andaaru బయట నిలబడి వున్నారు.entante bhoo kampam va chchindita.rondosari కూడా అలా ge అయ్యింది.malli memmidaramu కలిసి సినిమా కి vella లేదు.

Sunday, December 28, 2008

కల్యాణం కమనీయమ్

అమ్మ కొత్త చీర క్రీం కలర్ ది కట్టుకున్నాను.రెండు సవరల తో గిరిజ జడ వేసింది.పెళ్ళికొడుకు ఆర్మీ లో కెప్టెన్ అట.గిరిజ లోపలికి వచ్చి పెళ్ళికొడుకు బాగున్నాడు ఆతను కూడా క్రీం కలర్ డ్రెస్ వేసుకున్నాడు అని చెప్పింది.చూసి వెళ్ళిపోయారు.పదిహేను రోజుల తరువాత నవంబర్ 30 న మళ్ళివచ్చారు.ఈసారి వాళ్లతో పాటు ఇంకో అతను కూడా వచ్చాడు. అతనూ ఆర్మీ లో కెప్టెన్ అట .అందరమూ కలిసి డ్యాం దగ్గరికి వెళ్ళాము.అక్కడ శివాలయము వుంది.గుళ్ళోకి వెళ్దామా అని అడిగారు.అదె మొదటి మాట. గుడి లోకి వెళ్ళాము .అప్పుడే అమ్మ నాన్నగారు వాళ్లతో పాటే వెళ్లారు.
.తరువాతంత హడావిడి.అందరమూ హైదరాబాద్ వెళ్ళాము.డిసెంబర్ పదకొండు న పెళ్లి. చెల్లాయి పిన్ని ఇంట్లో ఒక పోర్షన్ రెంట్ కి తీసుకున్నాము.పక్కనే సినిమా హాల్ .బసంట్టకీస్ అందులో సినిమా ఏమిటో గుర్తు లేదు కానీ దాంట్లో ని పాట జీవితాన మరువలేము ఒకే రోజు అదె పెళ్లిరోజు అనే పాట పదేపదే వేస్తున్నాడు.సందర్భానికి తగ్గ పాట కదా అని పార్వతి అంది. అసలే తనకి భావుకత ఎక్కువ. వెంటనే పట్టేసింది.ఇద్దరమూ ఆ పాట ని ఎంజాయ్ చేసాము.
మీ అత్తగారు వస్తుందట. నిన్ను షాపింగ్ కి తిసుకేల్తారట.వాళ్లు ఏది కొంటే అదే తీసుకో అని అమ్మ చెప్పింది.షాప్ లొ వదినగారు నీకే కలర్ ఇస్తం అంటే పింక్ అని చెప్పాను .మళ్ళీ అమ్మ చెప్పింది గుర్తుకు వచ్చింది.మీ ఇష్టం అన్నాను. కాని క్రీం కలర్ కి పర్పుల్ బార్డర్ చీర చాలా నచ్చింది .దాన్ని వదల లేక పోయాను . కావాలని చెప్పలేక పోయాను . మొత్తనికి ఆ చీరైతే తీసుకున్నాము .
పెళ్లిరోజు పొద్దున్నే ఇడెన్ బాగ్ మారేజ్ హాల్ కి వెళ్ళాము .నన్ను చూడతానికి ఆయన ఫ్రెండ్స్ దామోదర్ , నగెష్ వచ్చారు.కూర్చొమని పార్వతి చాప వేసింది.వద్దని నిలబడే మట్లాడి వెళ్లి పోయారు. తరువాత ఆయన జెంట్స్ కి చాప వేస్తారా అని అన్నారు.మీ ఫ్రెండ్స్ కదా మర్యాద చెద్దమనుకున్నము .ఇంకెమి చెయలొ మకు తెలిదు. అప్పుడు మెమిద్దరమె వున్నము.అని చెప్పాను . కానీ ఎప్పుడు గుర్తుకు వచ్చినా నవ్వు వస్తుంది.

పెళ్లి చాలా బాగా అయ్యింది అని అందరు అన్నారు.నా తో పిన్ని బాబాయి గిరిజ పార్వతి మూడు నిద్రలకి వచ్చారు.బాబాయి గారు అత్తగారింట్లో ఎలా వుండాలి హితబొధ చేసారు .అయన చెపుతునంతసేపూ గిరిజ, పిన్ని ఒకటే జొకెస్.సత్యనారాయణవ్రతం కి మా అత్తగారి చీర ఏడు గజాలది కాస పోసి కట్టారు.ఎవరు కట్టారో గుర్తు లేదు.పెళ్లి తరువాత అమ్మ పిన్ని నన్ను తీసు కొచ్చి అత్తగారింట్లో వదిలారు. వాళ్ళు వెళ్లి పొతోంటే చాలా భయ్యం అయోమయం ఏం చేయలో తెలీలేదు . వచ్చేటప్పుడు జయ బిక్కమొహం వేసింది.అప్పటి వరకు అక్క పెళ్లి హడావిడి లో వుండి అక్కవెల్లి పొతుంది అనుకొలెదు.
ఆ రొజె తిరుపతి వెళ్ళాము.అమ్మావాల్లు తిరిగి చలకుర్థి వెల్లుతున్నారు. మమ్మలిని పంపటానికి స్టేషన్ కి వస్థా మన్నారు. రాలేదు ఎందుకొ అను కున్నాను. తరువాత తెలిసింది.వాళ్ళు బయిలు దెరుతుంటే చిన్న చెల్లెలు ఉష కింద పడిందట .అత్తయ్యగారు మామయ్యగారు మేమిద్దరం తిరుపతి వెళ్ళాము.అటినుంచి మేము మద్రాస్ వెళ్ళాము.దాష్ ప్రకాష్ హొటేల్ లో వున్నాము .బీచ్ లో తిరగటము , ఫస్ట్ హింది మూవి బ్రహ్మచారి చూడటం , హైదరాబాద్ వచ్చాక ఫ్రెండ్స్ గండిపేట పిక్నిక్ వెల్లటము రోజులు ఫాస్ట్ గా అయిపోయాయి. టాంక్ బండ్ మీద ఇద్దరమె చలిలొ ఐస్ క్రీం తింటూ వాకింగ్ చేయటము మరుపురానిది. అప్పుడే పాపం కోరరాని కోరిక కోరారు .బలవంతం చేసారు .తప్పుతుందా జీవితమే సఫలమో రాగసుధా భరితమో అని పడాను .ఆతరువత మల్లి ఇంత వరకు నన్ను పాట పాడ మని అడుగుతే వట్టు .నేను ముందే చెప్పను పాడలేనని వింటేగా .కాని నా పాట సందర్భాని కి తగినట్లు వుండి. నకు నచ్చింది. పదిహేను రోజులు ఎలా గడిచాయో తెలీదు .జనవరి సెకండ్ న లీవె ఐ పోయింది. ఏప్రిల్ లో వచ్చి తీసు కెల్తాను ఈలోపల అమ్మ దగ్గర వంట నేర్చుకో అని, ఇంగ్లిష్ నేర్చుకో అని ఆంటీ స్కూల్ లో జాయిన్ చేసి పటియలా వెళ్ళిపోయారు.

పెళ్లిరోజు

పదకొండో తేది డిసెంబెర్ ఈ రోజు కి పేళ్లి అయి నలభయ్ సవత్సరాలు అయ్యింది.గుడి కి వెళ్లి అమ్మ దగ్గరకు వెళ్ళాము.సాయంకాలము సంజు సతీష్ విక్కి వచ్చారు. అదితి ఎగ్జామ్స్ మూలంగా రాలేక పోయింది. గ్రీటింగ్కార్డ్ స్వీట్స్ తెచ్చారు.మేఘ ఆ కార్డ్ లో తన పేరు గౌరవ్ పేరు కూడా రాసింది.అందరమూ నవ్వుకున్నాము.నేను బాల్కనీ లో కూర్చొని వుంటే సంజు కూడా వచ్చింది అమ్మ ఈ ఫార్టీ ఇయర్స్ లో నీకు ఆనదం కలిగిన సంగతులు పెళ్లి రోజు పిల్లలు పుట్టిన రోజు కాకుండా ఏమున్నాయి? అంది.పెళ్లి జీవితం లో అవి కాకుండా ఇంక ఏముంటాయి?అయ్నాఆ ప్రశ్న నన్నుఆలోచనలో పడేసింది.ఆరోజు నవంబెర్ ఫస్ట్ .అమ్మ ఇంటికి చుట్టాలు వస్త్తున్నారు అని కొత్త లంగా వోని వేసుకొని తాయారు అవమంది.చాలమంది వచ్చారు.ముగ్గురు పిల్లలు కూడా వున్నారు.వాళ్ళపేర్లు ఉష విజయ శ్రీదేవి అట.వాళ్ళలో పెద్దాయన రామారావు మమయ్యగారి ఫ్రెండ్ అట.ఆయన ఏవేవో ప్రశ్నలు చాల అడిగారు.చాలాసేపు కూర్చున్నారు.ఇల్లంతా చూసారు.వెళ్ళేటప్పుడు అందులో పెద్దావిడ నాకు బొట్టు పెట్టి చిట్టి చామంతి పూలు ఏవో పళ్ళు ఏవో గుర్తు లేదు ఇచ్చారు.నాకెందుకు ఇస్తున్నారా అనుకున్నాను.ఆతరువాత ఆ సంగతి మరచి పోయాను.పదిహేను రోజుల తరువాత మల్లి వస్తున్నారు అని ఈసారి చీర కట్టుకోమని చెప్పింది అమ్మ .పక్కనే వున్నా గిరిజ కి నాకు చీర కట్టమని చెప్పింది.ఈ సారి వాళ్ళతో పాటు వక అబ్బాయి కుడా వస్తాడు,అతను పెళ్లి కొడుకు అని చెప్పింది.