Sunday, August 29, 2021

saampradaayaalu EP:01 మీరజాలగలడా Sahiti blog telugu kathalu Telugu Audio...

మీరజాలగలడా నా ఆనతి! AT SUNDAY, AUGUST 21, 2011 కృష్ణాష్టమి రోజున, నా బ్లాగ్ సాహితిలో రాసుకున్న ఈ పోస్ట్ ప్రతి కృష్ణాష్టమికి, చిరుచీకట్లు అలుముకుంటున్నవేళ, పారిజాతాలు విచ్చుకుంటూ పరిమళాలు పంచుతున్నవేళ, నా బాల్కనీ లో కూర్చొని పారిజాత పరిమళాలను ఆస్వాదిస్తూ, సత్యాకృష్ణులను తలుచుకుంటూ గుర్తుచేసుకుంటూ ఉంటాను.ఈ సారి మీ అందరికీ నా ప్రభాతకమలంలో వినిపిస్తాను సరేనా? విని మీరూ నా పారిజాతపరిమళాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ కృష్ణాష్టమి శుభాకంక్షలు.

Thursday, August 26, 2021

saampradaayaalu వరలక్ష్మీ నమోస్థుతే Telugu Audio Books - telugu kathalu...

వీడియో చేయటము నేర్చుకుంటున్నాను. అమ్మవారిని ఈ విధముగనైనా సేవించుకుందామని మా వాళ్ళు అందరూ పూజించిన అమ్మవారి రూపాలను తీసుకొని చేసాను. కొంచము ఎడిటింగ్ సరిగ్గా రాలేదు. నేపధ్యగానం పార్వతి, DR.బిందు.

Monday, August 23, 2021

Face Book Kathalu EP06 - సహచరి Telugu Audio Books - telugu kathalu - pod...

నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం. ఈ రోజు నేను చెప్పబోయే కథ పేరు "సహచరి." ఇది ఫేస్ బుక్ లోని మనకథలు - మనభావాలు గ్రూప్ లో ఇచ్చిన చిత్రము కు, 400 పదాలల్లో నేను రాసిన చిట్టికథ. కథ విని ఆ చిత్రానికి సరిపొయేట్టుగా రాసానో లేదో చెబుతారుగా? వినండి మరి!

Tuesday, August 17, 2021

Face Book Kathalu #EP#o5 మా మంచి మాష్టారు Telugu Audio Book telugu kath...

నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం. కరోనా వచ్చినప్పటి నుంచి ప్రపంచమంతా ఇంటి నుంచే పని చేస్తోంది కదా. సాఫ్ట్ వేర్ వాళ్ళకు ఎలాగూ వర్క్ ఫ్రం హోం అలవాటే కానీ ఒక్క పనివాళ్ళు తప్ప మిగితా అందరూ వర్క్ ఫ్రం హోమే. పాపం దానితో ఇంటి ఇల్లాలికీ, ఆమెతోపాటు ఇంటిల్లిపాదికీ పనే పని. బళ్ళు తెరిచాకా ఆన్ లైన్ క్లాస్ లొకటి. వాటితో ఇంట్లోని పెద్దవాళ్ళందరూ పిల్లలతో పాటు మళ్ళీ బళ్ళో చేరాల్సి వచ్చింది. ఎన్ని తిప్పలో కదా! వీటి మీద బోలెడు కథలూ, జోకులూ వస్తున్నాయి పనిలోపని మీరూ ఆన్ లైన్ క్లాస్ ల మీద ఓ కథ రాసేయండి అన్నారు ఫేస్ బుక్ లోని, పొన్నాడవారి పున్నాగవనం గ్రూప్ కథల నిర్వాహకురాలు భారతిగారు. నాకు తెలుసు ఇలాంటి అవసరం ఎప్పుడో వస్తుందని. అందుకే మామేనకోడలు హరిణి వాళ్ళ అబ్బాయి శ్రేయాన్స్ ఆన్ లైన్ క్లాస్ టీచర్ గురించి, ఆ క్లాసుల గురించి మా ఫామిలీ గ్రూప్ లో చెప్పిన విషయము నక్షత్రం వేసి దాచుకున్నాను. గ్రూప్ లో టాస్క్ రాగానే దాని మీద సమాచార సేకరణ మా హరిణి దగ్గర చేసి ఇదో ఈ కథా రాసేసాను. నేను అడిగిన ప్రశ్నలన్నింటినీ ఓపికగా సమాధానాలిచ్చిన హరిణికి థాంకూలూ, వారి పేర్లు, వారి ఫొటో నా కవర్ పేజ్ కోసమూ, కథ కోసమూ వాడుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన బుజ్జిగాళ్ళు శ్రేయాన్స్, ఆయాన్స్ లకు బోలెడు హగ్స్, ఆశీర్వాదాలు. అయ్యో అన్నట్లు కథపేరు చెప్పలేదు కదూ. కథ పేరు "మా మంచి మాష్టారు." ఇక కథ, ఆ కథకు భారతిగారి సమీక్ష వినండి మరి. మా మంచి మాష్టారు

Monday, August 9, 2021

Face Book Kathalu EP:04 నొప్పింపక తానొవ్వక Telugu Audio Book podcast ...

నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం. ఇప్పుడు నేను ఫేస్ బుక్ కథలు చెపుతున్నాను కదా. ఈ రోజు నేను చెప్పబోయే కథ "నొప్పింపక తానొవ్వక" ఫేస్ బుక్ కథల గ్రూప్ లో రాసింది. ఈ కథ కొంత వరకూ ఎడ్మిన్స్ ఇచ్చారు. ఆ కథకు కొనసాగింపు మనం రాయాలన్నమాట. అదీ 400 పదాలల్లో. ఈ టాస్క్ పేరు కథ మాది- ముగింపు మీది. సరే వారిచ్చిన కథకు సరిపోయేట్టుగా రాయాలంటే కాస్త ఆలోచించాలిగా. పైగా నాకు నేను పెట్టుకున్న నియమం ప్రకారము నేను విషాదము కానీ, నెగిటివ్ మెసేజ్ వచ్చేట్లుగా కానీ, కాంట్రవర్సియల్ గా కానీ రాయకూడదు. ఈ కథలో ఒకే ఒక్క పాయింట్ చుట్టూ నా ఆలోచనలు తిరిగాయి. అదేమిటంటే భర్త చనిపోతే, శారద పిల్లలను చక్కగా పెంచి, ప్రయోజకులని చేస్తుంది. వాళ్ళు బాగానే సెటిల్ అవుతారు. కానీ తను రిటైర్ అయ్యాక గోల్డేజ్ హోం లో ఉంటుంది. ఇక ఇంకో వాక్యము జానకి తో మాట్లాడేటప్పుడు, "అదేంటీ!? నువ్వు ఓల్డేజ్ హోంలో ఉన్నావా!?" పట్టలేని ఆశ్చర్యంతో శారదవైపు చూస్తూ అంది జానకి. "అవును!? ఏం!? అయినా...! అక్కడ చాలా సౌకర్యంగా ఉంటుంది. నువ్వూ ఒంటరిగానే ఉంటున్నావని అడిగాను!?" చప్పబడిన ఉత్సాహం జానకికి దొరకనివ్వకూడదనే ప్రయత్నం చేస్తూ, చిన్నగా తన చేతులు వెనక్కు తీసుకుంది శారద." శారద ఓల్డేజ్ హోం లో ఎందుకుంది? చేయి ఎందుకు వెనకకి తీసుకుంది? ఈ రెండూ పాయిట్స్ ను హైలైట్ చేస్తూ నెగిటివ్ ఆలోచన రాకుండా పాజిటివ్ గా చూపించాలి. చాలా ఆలోచించాను. ఒకానొక సారి శారద గురించి ఎందుకు, జానకి గురించి రాయొచ్చుగా అని కూడా అనుకున్నాను. కానీ మనసొప్పలేదు. ఇక అమెరికాలో ఉన్నట్లుగా ఎందుకు రాయాలి? ఇండియాలో ఉన్నట్లుగానే రాయవచ్చుగా అంటే, ఇండియాలో ఉండేవాళ్ళు ఉంటున్నారు కానీ అమెరికాలో పిల్లలు ఉన్న పేరెంట్స్, అమెరికా వెళితే పిల్లలతోనే సద్దుకొని ఉండాల్సివస్తోంది ఇప్పటి వరకు. అలా కాకుండా అమెరికాలోనే సిటిజన్ సెంటర్ లో ఉన్నట్లు రాస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనే ఈ కథకు రూపం. అదో చాలెంజ్ గా తీసుకొని రాసాను. మరి మీరూ విని ఎలా రాసానో చెపుతారుగా. ఇక కథ వినండి. నా కథ, నా ఛానల్ మీకు నచ్చుతే సబ్స్క్రైబ్ చేయటమూ, షేర్ చేయటమూ మర్చిపోకండీ. సబ్స్క్రైబ్ చేసి ఉంటే ధన్యవాదాలు :) నొప్పింపక తానొవ్వక

Sunday, August 1, 2021

Face book kathalu EP: 03 High School Sweet Heart podcast by Mala Kumar

ఇప్పటి వరకూ నా ప్రభాతకమలం లో "ఏమండి కథలు," "కమలీ(నీ)యం" నా చిన్ననాటి కథలు, వివిధ అంశాల మీద నేను రాసిన "నీ జతగా నేనుండాలి లొని కథామాల" కథలు విన్నారు. లాస్ట్ ఎపిసోడ్ నుంచి నా ఫేస్ బుక్ కథలు వినిపిస్తున్నాను. అవేమిటంటే... నేను సంవత్సరం క్రితము ఫేస్ బుక్ లోని వివిధ కథల గ్రూప్ లల్లో చేరాను. ఆ గ్రూప్ లల్లో వివిధ అంశాల మీద కథ రాయమంటారు. అంటే ఒక చిత్రమో, ఒక పదమో, ఒక వాక్యమో, లేదా కొద్ది కథనో ఇచ్చి, దానికి సరిపోను కథ రాయమంటారు. అదీ వారు చెప్పినన్ని పదాలల్లోనే మొత్తం కథను, భావము, కంటిన్యుటీ చెడకుండా రాయాలి. వర్ణలూ, ఉపోద్ఘాతాలూ, వివరణలూ వగైరా వగైరా లేకుండా మినీ కథలల్లోనే మొత్తం చెప్పేయాలన్నమాట. సో ఇదేదో బాగానే ఉందని నేనూ రాస్తున్నాను. అలా రాసినవే నా ఈ ఫేస్ బుక్ కథలు. ఈరోజు నేను వినిపించబోయే కథ 'వివాహబంధం' గురించి "పొన్నాడవారి పున్నాగవనం" గ్రూప్ లో, శ్రీమతి. వెలగపూడి భారతిగారు నిర్వహిస్తున్న "చిన్నారి పొన్నారి చిట్టి మందారాలూ - చిన్న కథలూ" లో నేను రాసిన "హై స్కూల్ స్వీట్ హార్ట్స్" కథ, ఇంకా దానిమీద భారతి గారు చేసిన సమీక్ష. మరి కథ విని మీ అభిప్రాయం కూడా చెపుతారు కదూ ఈ వీడియోకు ఇంకో విశేషము కూడా ఉంది. అదేమిటంటే దీని మీకు తెలుసుగా రచన, వాయిస్ నావేనని, ఇంకా కవర్ పేజ్, ఆడియో ఎడిటింగ్, వీడియో మిక్సింగ్, యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి, పోడ్ కాస్ట్ చేయటమూ అన్నీ నేనే చేసాను. దాదాపు నెలరోజులుగా ఇవన్నీ చేయటము నేర్చుకుంటున్నాను. నా వీడియో ఫ్రెండ్ Ramya Vuddanti మీరు నేర్చుకుంటారు, మీరు చేయగలరు అని నన్ను ప్రోత్సహించి, స్కైప్ లో బేసిక్ నేర్పించి, యూట్యూబ్ లోని ట్యుటోరియల్ వీడియోల లింక్స్ ఇచ్చింది. రమ్య స్కైప్ క్లాస్, నోట్స్, యూట్యూబ్ లోని ట్యుటోరియల్ క్లాస్ ల వీడియోలూ చూస్తూ ప్రాక్టీస్ చేసి, పోయినసారి వీడియో రమ్య సహాయముతో, ఈ సారి వీడియో పూర్తిగా స్వయంకృషితో పోడ్ కాస్ట్ చేసాను. ఇంకా ఆడియో ఎడిటింగ్ పూర్తిగా రాలేదు. మా పిల్లలు పరవాలేదు బాగుంది అని భరోసా ఇచ్చారు. ఇక ఇప్పుడు మీరు విని ఎలా చేసానో చెప్పండీ :) చిన్నారి టీచరమ్మ రమ్యకు ధన్యవాదాలు. https://www.youtube.com/watch?v=btkrKItYTv0