రాధామాధావాల పావడాను కట్టి
జాజిపూలను జడలో తురిమి
గులాబీల అందాన్ని పొదుపుకొని
పారిజాతాల పరిమళాన్ని అద్దుకొని
ముద్దమందారాన్ని ముద్దుగా అరచేత ఉంచుకొని
మంచు బిందువులో తడిసిన నందివర్ధనం లా
ఓ వెన్నెల కిరణంలా, ఓ పిల్ల తెమ్మెరలా
నా చిన్ని ప్రపంచంలోకి వచ్చి, నాలోని ఊహలకు రూపాన్ని ఇస్తూ , నన్ను
తొమ్మిది సంవత్సరాలుగా సాహితీవనంలో విహరింపజేస్తున్న నా చిన్నారి
"సాహితి" కి జన్మదిన శుభాకాంక్షలు.
No comments:
Post a Comment