Monday, March 15, 2021

Nee Jathaga Nenundaali | కథామాల Podcast by Mala Kumar | E06 - చాందిని |...



నమస్టే నా ప్రభాతకమలం కు స్వాగతం.
మాలిక అంతర్జాలపత్రిక ఎడిటర్ జ్యోతి వలభోజు గారు తండ్రి- కూతుళ్ళ అనుబంధం మీద కథ రాద్దామని మా రచయిత్రుల సమూహం  ప్రమదాక్షరిలో ప్రతిపాదించారు. అలా కొందరము రచయిత్రులము తండ్రీకూతురు అనుబంధం మీద కథ వ్రాసాము. అవి వరుసగా మాలిక అంతర్జాల పత్రికలో ప్రచురించారు. ఆ కథలు పత్రిక లో పబ్లిష్ అవుతున్నప్పుడే ప్రముఖ రచయిత్రి శ్రీమతి. మంథా భానుమతి గారు వాటిని విష్లేషించారు.ఆ తరువాత ఆ కథలన్నీ "తండ్రి-తనయ" అనే పేరు తో పుస్తకం గా ప్రింట్ చేయించారు జ్యొతి వలభోజుగారు.
అదో ఆ సంధర్భంగా వ్రాసినదే నా ఈ కథ " చాందిని."ఇది 6-8-2014 లో మాలిక అంతర్జాల పత్రికలో పబ్లిష్ అయ్యింది. కథనూ, నా కథ మీద మంథా భానుమతిగారు చేసిన విష్లేషణనూ  చెపుతాను వినండి. విని ఊ కొట్టటం మర్చిపోకండి.
 మంథా భానుమతి గారి విశ్లేషణ చదివి, చాందినీ లోకి పదండి. . . . . 
విశ్లేషణ- మంథా భానుమతి
కన్నపిల్లలమీద ఎంత ప్రేమ ఉన్నా తమ అలవాట్లను, వ్యసనాలను వదిలించుకోలేరు కొందరు తల్లిదండ్రులు. తల్లులకేం వ్యసనం అనుకుంటాం.. కానీ పిల్లలు పిలుస్తున్నా వినిపించుకోకుండా పుస్తకాలు పట్టుక్కూర్చోడం, ఇంటిపనులని గాలికొదిలి టివీ చూస్తూ కూర్చోడం వంటివన్నీ మానసిక బలహీనతలే. 
ఇంక తండ్రుల విషయానికొస్తే, అలవాట్లేంఖర్మ.. వ్యసనాలే కోకొల్లలు. ఒకటో తేదీనాడే జీతం అంతా పేకాటకి అర్పణం చేసి ఇల్లు చేరే వాళ్ళు నాకు నలుగురైదుగురు తెలుసు. ఇంక మందుబాబులు, బియ్యం నిండుకున్నా సిగరెట్ పెట్టెకి తగలేసే వాళ్ళు.. లాటరీ టికెట్ల మోజుతో కోటీశ్వరులవాలనుకే వాళ్ళు, నష్టాలొచ్చినా షేర్లమార్కెట్లో లక్షలు పోగొట్టుకొనేవాళ్ళు ఎంతమందో! పెళ్ళాం, పిల్లలు అలో లక్షణా అని గోలెడుతున్నా వాళ్లకేం పట్టదు. 
ఒక కొత్తరకం వ్యసనానికి అలవాటుపడ్డ తండ్రి శ్రీహర్ష. పుట్టిన క్షణంనుంచే కూతుర్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళాలని కలలు కంటాడు. అపురూపంగా పెంచాలనుకుని ఒక్క కూతురే చాలనుకుంటాడు. మొదట్లో ఎంతో సంతోషంగా, కూతురే లోకంగా గడుపుతూ, ఆ పాప ఉన్నతికే అహర్నిశలూ శ్రమించే తండ్రిని మహమ్మారి లాంటి వ్యసనం తగుల్కుంది. రూపాయి ఖర్చు లేకపోయినా అది కూతురి భవిష్యత్తుకి ముప్పు కలిగించేది. అనుకోకుండా భార్య కంట పడిన శ్రీహర్ష తత్తరపాటుతో అరిచి ఆవిడ నోరు మూయిస్తాడు. 
కూతుర్ని తీసుకుని ఇల్లు విడిచిపోయిన తల్లి, ఆ సమస్యని పరిష్కరించిన విధానం మనసుకి హత్తుకుంటుంది. అయితే దానికి ఆ తండ్రికూడా మనఃస్ఫూర్తిగా సహకరిస్తాడు. మళ్లీ ఆ ఇంట ఆనందాలు వెల్లి విరుస్తాయి. భయంకరమైన ఊబిలోకి పడాల్సిన తమ చిన్నారి పాపని రక్షించుకుంటారు. 
శ్రీమతి కమలా పర్చా గారి కలం నుండి వెలువడిన, తండ్రీ కూతుళ్ళ బంధంలో ఒక కొత్త కోణం చూపించే కథ “చాందినీ”. కమలా పర్చాగారు నాలుగైదు సంవత్సరాలనుండి బ్లాగును నిర్వహిస్తున్నారు. ఇప్పుడిప్పుడే మంచి మంచి కథా వస్తువులని తీసుకుని, కథలు రాస్తున్నారు. సులభమైన శైలిలో, పాఠకుల హృదయాలను స్పృశించే నేర్పు ఉన్న రచయిత్రి. వీరి కలం నుండి మరిన్ని కథలు రావాలని ఆశిద్దాం.
(6-8-2014 - మాలిక వెబ్ మాగ్జిన్) 

No comments: