ఆత్మీయులు
జ్ఞాపకాలు-12
30-1-2019
నాతో బ్లాగ్ లో ఒక అమ్మాయి,"మీరు చాలా అదృష్ఠవంతులు.మీకు ఏమీ కష్టాలు లేవు.ఎప్పుడూ మీ కుటుంబం
గురించి హాయిగా, సంతోషంగా చెపుతుంటారు.చక్కగా ఎంజాయ్
చేస్తారు."అంది.దేవతల రాజు ఇంద్రుడి కే తప్పలేదు బోలెడు కష్ఠాలు.మానవమాత్రురాలిని
నేనెంత :) కాకపోతే గతం గతః అనుకోవాలి.చిన్న బాధను భూతద్దంలో పెట్టిచూడగలిగే మనం,చిన్న ఆనందాన్ని కూడా అలాగే అనుభవించాలి.గతం లోని ఇబ్బందులను గతః
అనుకోవాలి.ముళ్ళున్నాయని గులాబీ అందాన్ని,నాగులకోన నుంచి
వచ్చిందని మొగలి సువాసనను ఆస్వాదించకుండా ఉండగలమా? అలాగే ఇబ్బందులున్నాయని జీవితాన్ని ఎంజాయ్ కుండా ఏడుస్తూ
ఉండలేముకదా!. సంతోషం అన్నది ఎక్కడి నుంచో రాదు.మనలో మన మనసులోనే ఉంటుంది అన్నది నా
భావన.
పువ్వు ఎంత అందమైనదైనా ఒక్కటే ఎంత సేపు
ఉంటుంది.కొద్ది సేపు కాగానే నీరసంగా తల
వాల్చేస్తుంది.అదే పూవుకు ఒక్కోపూవును ను చేర్చి, మరువం దవనం లతో కలిపి కడితే అందమైన కందంబమాలవుతుంది.అమ్మ నుంచి
పుట్టింటికీ, ఏమండీ చిటికెన వేలు పట్టుకొని
అత్తింటికీ చేరిన నన్ను , కుటుంబసభ్యులు, స్నేహితులూ నా జ్ఞాపకాలను అందమైన కదంబమాల లా మార్చారు.వీరిలో ఎవరూ
లేకుండా నా జ్ఞాపకాలు లేవు ..ఆకాశమంత అవధులులేని ఆనందానీ ఇచ్చిన, జగమంత కుటుంబాన్ని నాకు ఇచ్చిన ఆ దేవదేవునికి సర్వదా కృతజ్ఞురాలిని.
కొత్త సంవత్సరము కొత్తగా మొదలు
పెడుదాము,మీమీ మధురిమలను పంచుకోండి అని, జ్ఞాపకాల జావళీలు పాడించిన భానక్క ( మంథా భానుమతిగారు)కూ, నా జ్ఞాపకాలను ఆదరించిన మితృలకూ ధన్యవాదాలు.
once again Happy & Healthy 2019 to you all.
thank you.
No comments:
Post a Comment