Sunday, June 14, 2020

ప్రభాతకమలం




నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం.
 నా పేరు కమల పరచ.నేను మాలాకుమార్ అనే పేరు తో రచనలు చేస్తుంటాను.మా ఏమండీగారి పేరు పరచ.ప్రభాత్ కుమార్. మా ఇద్దరి పేర్లు కలిపి పెట్టినదే "ప్రభాతకమలం". మా ఏమండీగారు నా జీవితం లోకి 1968 లో ప్రవేశించాక మేము కలిసి చేసిన మా ప్రయాణం లో,మా ఏమండీగారి తో,మా పిల్లలు,మనవలు,మనవరాళ్ళు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో, ఆర్మీలోనూ, సివిల్ లైఫ్ లోనూ పంచుకున్న సంతోషకర సంఘటనలను చిన్న చిన్న కథలుగా రాసుకున్నాను.అవి మీ కందరికీ తెలిసిన విషయమే కదా. ఇప్పుడు అవే కథలను  మీకు ఈ "ప్రభాతకమలం లో వినిపించబోతున్నాను.
నేను నా కథలను వీడియో ఛానల్ చేసుకొని చదువుదామనుకుంటున్నాను అని మా అమ్మాయి తో చెప్పగానే, కవర్ పేజ్ మనమే చేసుకుందాము, ఆన్ లైన్ ఇమేజెస్ వద్దు అని మా మనవరాలు సంజన బొంత( మా మేనకోడలు రమ,capt (నేవీ).రవికుమార్ ల కూతురు) తో వేయించింది.లోగో మా మనవరాలు అదితి నా లోగో ఎలా ఉంటే బాగుంటుందో ప్లాన్ చేసి, తన ఫ్రెండ్ Saraa Murtasతో వేయించింది.ఇక అసలు పని వీడియో క్రియేట్ చేయటము, నేను చదివినది ఎడిట్ చేసి,అన్నీ కలిపి అప్లోడ్ చేయటము మా మేనల్లుడు మాధవ్ జస్వంత్( మా కజిన్ బ్రదర్ శ్రీనివాస్, రాధల కొడుకు) చేసిపెట్టాడు.ఇదంతా మా అమ్మాయి సంజ్యోత్ పరచ డైరెక్షన్ లో జరిగింది.మరి ఇంత మంది సహకారము తో నేను చేసిన ఈ ప్రయత్నం ఎలా ఉందో విని చెపుతారు కదూ!

మా ఏమండీగారి పర్యవేక్షణలో, నేను మాలగా ఎలా మారింది, ఈ ప్రభాత కమలం కథాకమామీషు ఏమిటో ,ఏమండి కథలలోని మొదటి కథ ప్రభాతకమలం లో చెపుతున్నాను వినండి మరి.
“Prabhatakamalam” is a channel through which I will share small anecdotes and stories from my life and times with my beloved “Emandi” Prabhatkumar Paracha. These stories date from 1968 when I first met him, and traverse through our happy experiences with our children, grand children, family and friends both during our army and civilian lives. I hope you enjoy listening to these stories as much as I have enjoyed living them.
Emandi kathalu Story and Narration ; kamala Paracha (malakumar)
Director;Sanjyoth Paracha
Video manager ; Madhav Jaswant
Thambnail illustration ; Sanjana Bontha
Logo; Sara Murtas
Logo management Aditi Magal.


No comments: