Monday, June 17, 2013

కుశలమా :)








ఫొటో లో వున్నదేమిటో ఎవరైనా చెప్పగలరా? తరం వాళ్ళు ఎప్పుడైనా చూసారా?ప్రయత్నించండి చెప్పగలేరేమో చూద్దాం :)

పోస్ట్ అన్న కేక వినగానే రయ్ మంటూ పరుగెత్తుకొచ్చి , ఉత్తరాలు అందుకోవటము లో ఎంత ఆనందం. పోస్ట్ మాన్ వచ్చే సమయాని కి ఎంత ఎదురుచూపులు :) ఫ్రెండ్స్ కు పేపర్ల కొద్దీ ఉత్తరం వ్రాయటం , వాళ్ళ దగ్గర నుంచి అంతే పెద్ద పెద్ద ఉత్తరాలు అందుకోవటం మా చిన్నప్పుడు మాకు చాలా సంతోషం కలిగించే విషయం. మానాన్నగారి కి ట్రాన్స్ఫర్ వచ్చి వేరే వూరికి వెళ్ళగానే ముందున్న వూరి ఫ్రెండ్స్ దగ్గర నుంచి బోలెడు వుత్తరాలు వచ్చేవి .ఏప్రిల్ ఫస్ట్ ఇన్లాండ్ లెటర్ లో 'ఏప్రిల్ ఫూల్ ' అని రాసి ఏడిపించటం భలే సరదాగా వుండేది :)

పి.యు.సి లో  రకరకాల అందమైన గ్రీటింగ్ కార్డ్స్ పంపటం అలవాటైంది.హైదరాబాద్ వచ్చాక రకరకాల లెటర్ పాడ్స్ కలెక్ట్ చేయటం, వాటి మీద అందంగా వుత్తరాలు వ్రాయటం చక్కని అనుభూతి. బషీర్ బాగ్  లో షాప్ లో దొరికేవి. ప్రత్యేకం లెటర్ పాడ్స్ కోసం షాప్ కు వెళ్ళేదానిని . లెటర్ పాడ్స్ కు సరిపోను కవర్ లు కూడా వుండేవి.ఫ్రెండ్స్ కు వ్రాయటాని కి రకం , అమ్మ కు వ్రాయటానికి రకం, శ్రీవారి కి వ్రాయటాని కి వక రకం ఇలా ప్రత్యేకమైన లెటర్ పాడ్స్ దొరికేవి. ఎంత అందంగా వుండేవో!మరి ఇప్పుడు షాప్ వుందో లేదో తెలీదు.ఎందుకంటే ఉత్తరాలు వ్రాసి, అందుకొని చాలా ఏళ్ళైపోయింది .దాదాపు అందరూ వచ్చి ఇక్కడే స్తిరపడ్డారు. ఉత్తరాలు వ్రాయటము కూడా కళ. రోజులలో సినిమాల్లో నాయికా నాయకులు అందం గా ప్రేమ లేఖలు వ్రాసుకుంటూవుండేవారు. స్చప్ . . .  ఇప్పుడు ఉత్తరాలే లేవు :(
ఇప్పుడూ పోస్ట్ మాన్ వస్తాడు. పోస్ట్ అనగానే ఎంతలేదన్నా ఆత్రుతగానే వుంటుందికాకపోతే వచ్చేవన్నీ బిల్లులు!
ఉత్తరము కుశలము తెలెపేది అందరికీ ఆనందము కలిగించేది. ఐతే టెలిగ్రాం అనగానే అందరూ భయపడిపోయేవారు.టెలిగ్రాం లో ఎక్కువగా అశుభవార్తలే వచ్చేవి.తరువాత తరువాత గ్రీటింగ్ టెలిగ్రాం లు కూడా వచ్చాయి. మా పెళ్ళి కి,మా అమ్మాయి పుట్టినప్పుడు  చాలా గ్రీటింగ్ టెలిగ్రాంస్ , మావారి స్నేహితుల దగ్గర నుంచి వచ్చాయి. ఏమిటో అప్పుడు అవి దాచుకోవాలని తోచలేదు .
ఉత్తరాలు మాయం అయ్యాయి. ఇహ టెలిగ్రాం సర్వీసులు కూడా నిలిపేస్తున్నారని పేపర్ లో చదివినప్పుడు చాలా బాధ కలిగింది. అదేమిటో చిన్న చిన్నగా నాకు తెలిసినవన్నీ కనుమరుగవుతున్నాయి:( నేను వంట మొదలు పెట్టినప్పుడు మా అత్తగారింట్లో కుంపట్లలో చేసేవారము .ఇప్పుడు ఎక్కడా కుంపటి లేదు.పచ్చడి అన్నా , పిండి రుబ్బాలన్నా రోలు తప్పనిసరి. ఇప్పుడు దాని స్తానం లో మిక్సీ వచ్చేసింది. రాచిప్ప బదులు నాన్ స్టిక్ పాన్లు వచ్చేసాయి.రిక్షా , జట్కా లేవు.ఎంత అభివృద్ధి చెందాము అనుకున్నా అవన్నీ తలుచుకుంటే దిగులుగా వుంటుంది.

పైన వున్నది మా అబ్బాయి పుట్టినప్పుడు మావారికి ఇచ్చిన టెలిగ్రాం:)

15 comments:

  1. వావ్ భలే దాచుకున్నారుగా 74 లో ఇచ్చిన టెలిగ్రాం మంచి తీపి జ్ఞాపకం

    ReplyDelete
  2. నిజంగా భలే దాచుకున్నారు మాలా గారు

    ReplyDelete
  3. మొబైల్ ఫోనులు వచ్చాక టేలిగ్రాములు పోయాయి outdate అయిపోయాయి!ఉత్తరం ముక్కలు అరుదు ఐ పోయాయి!శాస్త్ర విజ్నానమ్ కొన్నిటిని అందిస్తుంది మరికొన్నిటిని మరిపిస్తుంది!

    ReplyDelete
  4. భలే దాచుకున్నారండీ :) నేను గుర్తుపట్టానులెండి :)

    ReplyDelete
  5. wow...... mala garu meeru superrrrrrrrrr

    ReplyDelete
  6. మాలాగారు జ్ఞాపకాల అనుభూతుల తోటలో తవ్వేకొలది బయటపడే అనుభవాల కదంబమాల సౌరభం ఈ మధ్య మీరు రాసిన పోస్ట్ లలో అన్నింటా గుబాళిస్తోంది.కాని అందరి కష్టసుఖాలను అందచేసిన టెలిగ్రామ్ దాదాపు 160 సంవత్సారాలు తన సేవలందించి మరో నెలలో కనుమరుగవుతోంది అన్న వార్త కూడా ఈ రోజే చూడటం కాకతాళీయమేనేమో!మీకు అభినందనలు, చక్కగా దాచిపెట్టిన అనుభూతిని మాతో పంచినందుకు.

    ReplyDelete
  7. Maalaa gaaru.. mee Jnaapakaala paatarani teesi bhale parichayaM chesaarE! very nice!!

    ReplyDelete

  8. మీరు వ్రాసినట్టుగానే టెలిగ్రామ్ లకి సంబంధించి చాలా చాలా ఙ్ఞాపకాలు ఒక్కసారి చుట్టుముట్టేసాయి మాలాగారూ. బాగా వ్రాసారు.

    ReplyDelete
  9. oh....teligram.bhale undhi.mee kaburlu baagunnayi

    ReplyDelete
  10. పప్పు శ్రీనివాస్ గారు ,
    ఏదో నండి అది అలా వుండిపోయింది:)

    *లక్స్మీ నరేష్ థాంక్ యు .

    *సూర్యప్రకాష్ ఆప్కారీ గారు,
    మీరు చెప్పింది నిజమేనండి . థాంక్ యు.

    ReplyDelete
  11. వేణూ శ్రీకాంత్,
    గుర్తుపట్టేసారా :)

    *అనోనమస్ గారు ,
    థాంక్స్ అండి:)

    *ఉమాదేవి గారు ,
    నాలుగు రోజుల క్రితం పేపర్ లో టెలిగ్రాం సర్వీసెస్ ఆపేస్తున్నారు అని చదివి నప్పటి నుంచి ఏదో దిగులుగా వుంది :)
    ఈ మధ్య గతం లో కి వెళ్ళిపోతున్నానంటారు :)

    ReplyDelete
  12. వనజా వనమాలి గారు,
    నా జ్ఞాపకాలు మీకు నచ్చినందుకు థాంక్స్ అండి.

    *శ్రీలలిత గారు,
    మీ జ్ఞాపకాలు కూడా చెప్పండి మరి. థాంక్స్ అండి.:)

    * శశీ ,
    థాంక్ యు.

    ReplyDelete
  13. నాకూ గుర్తుంది మాలగారూ! కాకపోతే కొత్తవి వచ్చినప్పుడు పాతవి పోవడం సహజం. టెలిగ్రాములు పంపించుకునేవాళ్ళెవరూ లేకపోయినందువల్ల సర్వీస్ ఆపేసి ఉంటారు మరి. :-)

    ReplyDelete
  14. కృష్ణవేణి గారు,
    మీ వాఖ్యకు థాంక్స్ అండి.

    ReplyDelete
  15. మాలాగారు నమస్కారం.మీ పోస్టు ఆర్టికల్ ఎన్నో స్మృతులను కుదిల్చి వదిలింది. ఇప్పుడు ఉత్తరాలు లేవు,రావు.నేను కూడా 1975 జూలైలో మా అమ్మగారురాసిన వుత్తరం దాచుకున్నాను అదే ఆమె ఆఖరి వుత్తరం.భగవద్ గీతపుస్తకం తెరిస్తే ఆవుత్తరం కంట పడుతుంది.చూసి మళ్ళీ భద్రంగా వుంచుతాను.మళ్ళీ ఆ చేతి రాత కనిపించదు.
    హైమవతి.

    ReplyDelete