చెన్నైలో , మొదటిసారి మేఘ , బూరెబుగ్గల తో , నల్లటి కర్లీ హేర్ తో , చక్రాలాంటి కళ్ళు గుండ్రంగా తిప్పుతూ నా వైపు చూడగానే , అబ్బ ఎంత ముద్దుగా వుందో ! నా మనవరాలేనా !!! నా దిష్టే తగిలేట్టుగా వుంది అనుకొని మురిసి ముక్కలైపోయి , అప్పుడే " రాణీ యమ్మ " అని పేరు పెట్టేసుకున్నాను .
కొత్తగా మాటలు వచ్చేటప్పుడు , నా మీద ఏమైనా కంప్లైంట్ చేయాలంటే " చూడు తాతా నీ నైఫ్ " అనేది . " అవునమ్మా మీ బామ్మ నాకు నైఫే " అనేవారు తాత . ఏమిటీ నేను నైఫ్ నా అంటే కాదు బామ్మా నువ్వు తాత లైఫ్ అనేది . అంతే అంతే అని తాత తలాడించేవారు . పాపం చాలా సంవత్సరాలవరకు , వైఫ్ అంటానికి , నైఫ్ అనో , లైఫ్ అనో తడబడి పోయేది . నిద్ర లో " డాడీ " అని కలవరించగానే " వస్తున్నా బంగారుతల్లీ " అంటూ తాత లేచి పరుగెత్తుతారు . అయ్యో అది మీ అమ్మాయికాదు , మిమ్మలిని పిలువలేదు , వాళ్ళ డాడీ ని పిలిచింది అని నేనంటున్నా వినీపించుకోరు . ఎంతైనా మా రాణియమ్మ తాత కూచ్ .
" ఈస్ట్ ఆర్ వెస్ట్ " అని మేఘ అనగానే , పక్కనుండి తమ్ముడు " మేఘా ఈజ్ బెస్ట్ " అనాలన్నమాట .( కాకపోతే , మేఘ లేనప్పుడు , వాడు ఈస్ట్ ఆర్ వెస్ట్ అంటే నేను గౌరవ్ ఈజ్ బెస్ట్ అనాలనుకోండి , అది వేరే సంగతి .)
సో, ఈస్ట్ ఆర్ వెస్ట్ మా రాణీయమ్మ ఈజ్ బెస్ట్ !!! మా రాణీయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు .
రాణీయమ్మకు పుట్టినరోజు జేజేలు ...బొమ్మ సరిగ్గా మీరు వర్ణించినట్టే ఉందండీ ...ఒక్క జుట్టు రంగు తప్ప !
ReplyDeleteహాయ్ మేఘా! నీకు జన్మదిన శుభాకాంక్షలు. Have a nice time. Enjoy with every body.
ReplyDeleteDear Megha...
ReplyDeleteMANY HAPPY RETURNS OF THE DAY...
Happy Birthday Megha dear. Many Many Many happy returns of the day. East or west Megha is best .:-)
ReplyDeleteమేఘా బుడ్డికి పుట్టినరోజు జేజేలు!
ReplyDeleteపరిమళం గారు ,
ReplyDeleteజయ ,
శ్రీలలిత గారు ,
భావన గారు ,
అమ్మ ఒడిగారు ,
మా మేఘను ఆశీర్వదించిన మీ అందరికి ధన్యవాదాలండి .