తెల్లవారు ఝాముననే మా వదినగారింటికి వెళ్ళాలి. 50 సంవత్సరాల తరువాత ఉండ్రాల తద్దె నోము తీర్చుకునే పని పెట్టుకున్నాను ,వస్తావా అన్నారు. అసలు నోములు పుట్టింటి వారే తీర్చాలట ! . నేను ఏమిచేయాలో చెప్పండి అన్నాను. నాకు తెలిసినప్పటి నుండీ చెపుతున్నాను , మీరు తీర్చు కోండి నేను సాయం చేస్తాను అని. ఆవిడ పెళ్ళైనఫ్ఫుడు , అవిడకి 12 సంవత్సరాల వయసులో మా అత్తగారు ,ఆవిడతో చాలా నోములు నోమించారట. ఏమేమి నోముకున్నారో కూడా గుర్తు లేవట . ఇన్ని సంవత్సరాల తరువాత తీర్చుకుందామనుకున్నారు. నువ్వేం తేనవసరము లేదు పొద్దున్నే 5 గంట్లకల్లా వచ్చేయ్ చాలు అన్నారు. ఏదో పెద్దరికం భుజాన వేసుకుందామనుకున్నాను కానీయ్ కుదర్లే ! పాపం ఆవిడే అన్ని చేసుకున్నారు. ముందు రోజు విన్నూ బర్త్ డే పార్టీ లో గోరంటాకు, షాంపు ఇచ్చారు. మరి నాకేది అంది సంజు. పొద్దున్నే వచ్చి భోజనం చేయాలి, మళ్ళీ 12 గంటలకు వచ్చి ,భోజనం చేయాలి రాలేస్తావా ? అన్నారు . అదేంటి పెద్దత్తయ్యా ? మండే పెట్టుకున్నావు ? సండే అయితే అందరం వచ్చేవాళ్ళము కదా ? అమ్మాయిలంతా ఆవిడ మీద దాడి చేసారు. మరేం చేయనర్రా తదియ ఆ రోజే వచ్చింది. అప్పుడే చేసుకోవాలి అని నచ్చ చెప్పారు.
తెల్లవారుఝాముననే మావారికో కప్పు కాఫీ లంచం ఇస్తే చిక్కడపల్లి తీసుకెళ్ళారు. అప్పటికే వదినగారు పూజ మొదలు పెట్టారు.ఐదుగురు ముత్తైదువులకి పసుపురాసి, బొట్టు పెట్టి , బుట్టవుయ్యాల లో ఉయ్యాల లూగించారు. గోంగూర పచ్చడి, కంది పచ్చడి , పొట్లకాయ కూర తో అన్నం వడ్డించారు.ఇంత పొద్దున్నే ఎలా తింటాం అనుకున్నాం కాని ఆ రుచే వేరు. కబుర్లలో బాగానే లాగించాం. ఆ తరువాత బ్రేక్ . మళ్ళీ 11.30 కి పూజ చేసాక అందరం లలితాసహస్రనామం చదివాక ,భోజనం పెట్టి, చీర , ఐదు పూర్ణాలు , తాంబూలం ఇచ్చారు. కథ చదివి ఉద్యాపన చేసారు.
ప్రతి సంవత్సరమూ భాద్రపద బహుళ తదియ నాడు నోచుకునే నోము ఉండ్రాళ్ళ తదియ.ముందు రోజు ఐదుగురు ముత్తైదువులకి గోరంటాకు ముద్ద ,పసుపు కుంకుమలు ,కుంకుడు కాయలు ,నువ్వులనూనె ఇచ్చి మాయింటికి తాంబూలము తీసుకోవటాని కి రండి అని ఆహ్వానించాలి.
ఉండ్రాళ్ళతద్దె లోని ప్రత్యేకత తెల్లవారుఝాము భోజనాలు.భోజనాలయాక ఉయ్యాలలూగుతారు.
మద్యాహ్నం గౌరీ పూజ.గౌరిని షొడశోపచారాలతో పూజించిన వారికి సమస్త శుభాలు సమకూరుతాయంటారు.ఐదు దారపు పోగులు పోసి,ఐదు ముడులు వేసి , ఏడుతోరాలను అమ్మవారి పక్కనే వుంచి పూజించాలి. ఒక తోరం అమ్మవారికి, ఒకటి నోముకున్నవారికి , మిగితా ఐదు, ఐదుగురు ముత్తైదువులకు కట్టాలి. బియ్యపు పిండిలో బెల్లము కలిపి ,పచ్చి చలిమిడి చేసి ,ఐదు ఉండ్రాలను చేసి , నైవేద్యం పెట్టాలి.
పూజ తరువాత చేతిలో అక్షింతలనుంచుకొని కథచెప్పుకోవాలి.ఈ వ్రత కథ ఏమిటంటే , పూర్వం ఓ వేశ్య ,తన సౌందర్యం తో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది.ఒక ఉండ్రాళ్ళతద్దె నాడు ,రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు.ఆమె అహంకారముతో దైవ నింద చేసీన నోముకో లేదు. పలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్ళారు.మహా వ్యాది బారాన పడ్డది.తరువాత రాజ పురోహితుడి సలహాతో ఉండ్రాల తద్దె నోము నోచుకొని, తన సంపద ని తిరిగి పొంది, ఆరోగ్యస్తు రాలై శేష జీవితాన్ని ఆద్యాత్మికంగా గడిపి ,మరణానంతరం గౌరీ లోకానికి వెళ్ళింది.
ఒక గర్విష్టికే ఈ నోము వలన ఇంతటి సద్గతి లభించింది కదా ! సత్ప్రవర్తన తో ఉండి నోచినవారికి ఇంక ఎంత ఉన్నతమైన పలితముంటుందో ఊహించుకొని సన్మార్గం లో నడవండి ! అనేది ఈ కథలోని నీతి.
హిందు సాంప్రదాయములో నోములు ,పూజలకి పెద్ద పీటనే వేసారు. నోము నోచుకుంటేనే సుమంగళిగా వుంటామా ? అందుకోసం వ్రతాలు చేయాలా ? అని వితండ వాదం చేసే వారికి ఏమీ చెప్పలేను . అంత పరిజ్ఞానము నాకు లేదు. నోముకుందాము అనుకోగానే ఇల్లు శుభ్రం చేసి , మామిడాకులు కట్టి, ముగ్గేసి, దేవుడి పీఠానికి పూలూ ,ఆకులు అలంకరించి , ధూప దీప నైవేద్యాల తో పూజించి ,ముత్తైదువులకు ,తాంబూల మిచ్చి , ఆశీస్సులు తీసుకోవటము తో ఇంటికి ఓ కళ వస్తుంది. మనసు లో ఓ ప్రశాంతత ఏర్పడుతుంది.ఇంట్లో పాజిటివ్ వేవ్స్ వచ్చినట్లుగా వుంటుంది. కుటుంబ శ్రేయస్సు ,ఆద్యాత్మికానందం కలుగుతుంది.
nijame nandi .chakkaga nomu cheskunta a kale veru.mi post bagundi
ReplyDeleteచాలా బాగుంది. ఈ నోము వివరాలు నేనెప్పుడు వినలేదు. ఉండ్రాళ్ళతద్ది అంటే ఉండ్రళ్ళ తోటి వ్రతం అనుకున్నాను. నేను ఇలాంటివన్ని చాలా మిస్ అవుతున్నాను. నాకిప్పుడు అర్ధమైంది. ఉమ ఎందుకు నిన్న డుమ్మా కొట్టిందొ. ఇంతకి సంజు వొచ్హిందా, రాలేదా!
ReplyDeleteivvala undralla tadde ani kuda gurtuledandi maku...baga gurtuchesaru.atla tadde ku kada uyyala ugedi undralla tadde ku memu ugevallam kade.
ReplyDeleteబాగుంది.
ReplyDeleteస్వాతిమధవ్ గారు ,
ReplyDeleteమీకు నచ్చినందుకు థాంక్స్ అండి .
జయ ,
ReplyDeleteఉండ్రాలతద్ది ఇలానే నోముకుంటారు. థాంక్ యు
మంజు గారు,
ReplyDeleteఉండ్రాలతద్దె రోజు కూడా తెల్లవారుఝాముననే అన్నం తిని , ఉయాలలూగుతారండి.
అక్టోబర్ 6 న అట్లతద్దె అండి.
థాంక్ యు
కొత్తపాళి గారు ,
ReplyDeleteమీరు బాగుంది అన్నందుకు ధన్యవాదాలండి
undralla tadde chala bagundi,,
ReplyDeleteatlage Devi Navratrula gurinchi kooda rayi.
nuvvu baga rastunnavu,,pandagala gurinchi neeku baga telusu,
share ur knowladge with us,
parvathi.
hi
ReplyDeleteatla tadde katha and pooja vidhanam kavali andi.....
http://sahiti-mala.blogspot.com/2009/10/blog-post.html
ReplyDeleteఇది చూడండి పనికి వస్తుందేమో . మీకోసమే రాసాను .