Saturday, March 28, 2009

ఉగాది

ఉగాది ఇతర పండగ ల మాదిరి ఏదొ వక దేవత ను పూజించే పండుగ కాదు.కాలానికి సంబందించిన పండుగ.కాలాన్ని మన వీలు కొసము సంవత్సరాలు గా లెక్కించి నారు.సంవత్సరము మొదలు అయిన రొజు ఉగాది పండుగ.ఉగాది జాతీయ పండుగ. దేశము లోని వివిద రాష్ట్రాల లొ ఈ పండుగను రక రకా ల పేర్ల తో జరుపు కుంటారు. ఉగాది రొజు ఇష్ట దేవతను పూజించి ఉగాది పచ్చడి ని పెద్దవారి తొ పెట్టించుకొని తినాలి.ఆరు రుచులు కలిపి చేసిన ఉగాది పచ్చడి జీవిత ము లొని కష్ట సుఖముల కు ప్రతీక.ఉగాది నాడు సాయంకాలము దేవాలయము లొ కాని, గ్రామ చావిడి లొకాని , నగరాల ,పట్టణాల లొ అడిటొరియము లలొ పంచాంగ శ్రవణము చేస్తారు . పంచాంగ శ్రవణము లొ ఆ సంవత్సర పలితాలను అంచనా వేస్తారు .ఉగాది ని సాంప్రదాయ బద్దముగా పాటించటము వలన సకల శుభాలు కలుగుతాయి.

2 comments: