భాగ్యలక్ష్మి దేవాలయము -చార్మినార్

భాగ్యలక్ష్మి దేవాలయము చార్మినార్ నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం. బోనాలజాతర సంధర్భంగా మనము దర్శిస్తున్న అమ్మవారి దేవాలయాలలో ఈ రోజు చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుందాము రండి. ఈ దేవాలయము ఎప్పుడు వెలిసినది అన్నదానికి వివిధకథలు వినిపిస్తున్నాయి. ఓసారి చార్మీనార్ దగ్గరికి అమ్మవారు నడుచుకుంటూ వస్తే అక్కడి కాపలావారు ఆవిడను అడ్డగించారు. దేవి తనగురించి చెబితే రాజానుమతి తీసుకొని వస్తామనీ, అప్పటి వరకూ అక్కడే ఉండమని ఆ కాపలాదారు లోపలికి వెళ్ళి రాజుతో చెప్పాడు. అప్పుడు రాజుకు ఆ వచ్చింది అమ్మవారేనని అనిపించి, కాపలాదారు వెళ్ళకపోతే ఆవిడ ఇక అక్కడే ఉండిపోతుందని అనుకొని అతనిని వెళ్ళవద్దంటాడు. దానితో ఆ దేవి అక్కడే ఉండిపోయిందట. “ఇక్కడ వందల ఏళ్ల నుంచీ అక్కడ పూజలు జరుగుతున్నాయి. కాకపోతే గుడి ఉండేది కాదు. అమ్మవారు ఇప్పుడున్న రూపంలో కాకుండా, బొడ్రాయి రూపంలో ఉండేది. 1979 లో వక బస్ డ్రైవర్ ఆ రాయిని ఢీకొట్టాడు. అది ప్రమాదవశాత్తు జరిగింద లేక కావాలని చేశారా అనే గొడవ నడిచింది. అప్పుడు చెన్నారెడ్డిగారు ముఖ్యమంత్రి. ఆయనే అప్పుడు అక్కడ ఒక గుడిలా కట్టడానికి సహకరించారు. అప్పట్లో ఆ గుడి పూజారి కర్ఫ్యూలో కూడా పూజలకు వెళ్లేవారు. శుక్రవారం పూట మధ్యాహ్నం 12 గంటల నమాజు సమయంలో ఆయన హారతి గంట కొట్టకుండా పోలీసులు ఆ గంట పట్టుకుని కూర్చునేవారు. పగిలిన రాయిని పూజించకూడదు కాబట్టి ఒక పటం పెట్టి పూజించేవారనీ, ఆ తరువాత అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేసారనీ, విగ్రహము పాదాల దగ్గర రెండు వెండితొడుగుల కింద ఆ రాయి ముక్కలను ఉంచారనీ అక్కడి పూజారులు చెపుతారు. ఇంకా ఈ దేవాలయము గురించి ఉన్న చాలా కథలు, ఈ దేవాలయము గురించిన పరిశోధనల పూర్తి వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు గూగులమ్మను అడుగుతే చెపుతుంది. బోనాల చివరిరోజున అమ్మవారి రథయాత్ర ఇక్కడ నుంచి సాగుతుంది. ఇందులోని పాట మా అమ్మమ్మ కీ|శే|శ్రీమతి. వరలక్ష్మమ్మగారు దాదాపు నలభైయాభై సంవత్సరాల క్రితం పాడినది. ఇదండీ ఈనాటి మనదేవాలయ దర్శనము. వచ్చేవారం మరో దేవాలయ దర్శనములో కలుసుకుందాము. నా పోస్ట్ లను శ్రద్దగా వింటున్న మితృలకు ధన్యవాదాలతో సెలవు. నమస్తే. https://www.youtube.com/watch?v=E4LQ1DUJIgs

ujjayini mahankali devaalayam

నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం. ఈరోజు సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయము దర్శించుకుందాము. గోల్కొండకోటలోని బోనాలపండుగ ఎల్లమ్మ దేవాలయము వద్ద ప్రారంభమై సికింద్రాబాద్ లోని ఉజ్జయినిమహంకాళి అమ్మవారి దేవాలయముకు చేరుకుంటుంది. ఉజ్జయని మహాంకాళి దేవాలయం 1815లో నిర్మించారు. సికింద్రాబాద్ పాత బోయిగూడ నివాసి అయిన సురటి అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసేవారు. ఆయనను 1813 సంవత్సరంలో ఉద్యోగ రీత్యా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి బదిలీ చేశారు. బదిలీ జరిగిన కొద్దిరోజులకే ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది చనిపోయారు. ఆ సమయంలో అప్పయ్య సహోద్యోగులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉజ్జయినిలో కలరా వ్యాధి నుండి ప్రజలను కాపాడలని, పరిస్థితులు చక్కబడితే తన స్వస్థలమైన హంకాళి దేవాలయము సికింద్రాబాద్ నమస్తే నా ప్రభాతకమలం కు స్వాగతం. ఆషాడమాసంలో జంటనగరాలలో జరిగే బోనాలు పండుగ గోల్కొండకోటలోని ఎల్లమ్మ బోనాలతో ప్రారంభమయ్యి, సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయానికి వస్తుంది. గోల్కొండకోటలోని ఎల్లమ్మ దేవాలయమును నేను చూడలేదు. అందువలన ఆ దేవాలయము గురించి చెప్పలేను. ఇక సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయమును ఈ వారం దర్శించుకుందాము. ఉజ్జయని మహాంకాళి దేవాలయం 1815లో నిర్మించారు.. సికింద్రాబాద్ పాత బోయిగూడ లో ఉండే సురటి అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసేవారు. ఆయనను 1813 సంవత్సరంలో ఉద్యోగ రీత్యా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి బదిలీ చేశారు. బదిలీ జరిగిన కొద్దిరోజులకే ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది చనిపోయారు. సికింద్రాబాద్ (లష్కర్)లో ఉజ్జయిని అమ్మవారికి గుడి కట్టి కొలుస్తామనీ వేడుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు కలరా వ్యాధికి గురైన వారు కోలుకున్నారు. కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది. అమ్మవారు కరుణించడం వల్లనే కలరా వ్యాధి తగ్గిందని సురటి అప్పయ్య, ఆయన మిత్రులు విశ్వసించారు. ఆయన 1815లో ఉజ్జయిని నుండి సికింద్రాబాద్‌కు వచ్చారు. 1864వ సంవత్సరంలో కట్టె విగ్రహం తీసివేసి ఇప్పుడు ఉన్న మహంకాళి, మాణిక్యాలదేవీ విగ్రహాలు ప్రతిష్టించి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఉజ్జయినిలో జరిగిన కలరా వ్యాధి సమయంలో తన మొక్కుబడి గురించి కుటుంబసభ్యులకు ఆయన వివరించారు. కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారితో కలిసి పాతబోయిగూడ బస్తీకి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో (ప్రస్తుతం గుడి ఉన్న ప్రాంతంలో) కట్టెలతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఉజ్జయిని మహంకాళిగా నామకరణ చేసి పూజలు ప్రారంభించారు. ఉజ్జయినిలో తాను అమ్మవారిని దర్శించుకున్నది ఆషాఢమాసం కావటంతో సికింద్రాబాద్‌లోనూ ఆషాఢంలో జాతర జరపాలని ఆయన నిర్ణయించారు. జాతరకు తరలివచ్చే భక్తులకు నీటి సౌకర్యం కోసం పక్కనే ఉన్న పాడుబడ్డబావిని పురుద్ధరిస్తున్న సమయంలో మాణిక్యాల అమ్మవారి ప్రతిమ లభించింది. ఆ ప్రతిమను మహంకాళి అమ్మవారి విగ్రహం పక్కనే ప్రతిష్ఠించి మాణిక్యాల అమ్మవారిగా నామకరణం చేశారు. ఉజ్జయినిలో తాను అమ్మవారిని దర్శించుకున్నది ఆషాఢమాసం కావటంతో సికింద్రాబాద్‌లోనూ ఆషాఢంలో జాతర జరపాలని ఆయన నిర్ణయించారు. అయితే మరో కథనం ప్రకారం .. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. బోనాలల్లో రంగం అనే ఉత్సవం జరుపుతారని పోయినవారం చెప్పుకున్నాము కదా. ఆ రంగం పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. ఈ రంగం కార్యక్రమంలో పోతరాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. అది తగ్గించ్చేందుకు అక్కడవున్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు. పొతరాజు తన దంతాలతో ఆ మేకపోతును కొరికి, తల, మోండెం వేరు చేసి పైకి ఎగురవేస్తాడు దీనిని గావు పెట్టడం అంటారు. ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తరువాత జరుగుతుంది. ఇవన్నడీ ఈనాటి మహంకాళీ అమ్మవారిదేవాలయం విశేషాలు. ఈ సమాచారము ఆన్లైన్ లో సేకరించాను. ఇందులోని పాటను పాడిన గాయని శ్రీమతి డా: y.krishnakumaari గారు. చక్కని పాటను ఇచ్చినందుకు ధన్యవాదాలండి కృష్ణకుమారిగారు. నా ఛానల్ ను చూసి ప్రొత్సహిస్తున్న మితృలకు ధన్యవాదాలు. వచ్చేవారం లస్కర్ బోనాలుగా కూడా పిలవబడే సింకింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిదేవాలయము నుంచి బోనాలుచేరుకునే బల్కంపేట రేణుకాఎల్లమ్మవారి దేవాలయము దర్శించుకుందాము. అందాకా సెలవామరి. నమస్తే. https://www.youtube.com/watch?v=pmNfJoaiSB0&t=10s