Thursday, October 31, 2019

��Vasanthavallari (173):��Comedy tracks..Mala kumar gari Kaburlu..Alamara ...







ప్రఖ్యాత మిమిక్రీ ఆర్టిస్ట్ వసంతలక్ష్మి అయ్యగారి, వారి "వసంత వల్లరి" కామెడీ ట్రాక్ లో ,వారి గళం తో వినిపించిన నా కథ "అలమారా లిఫ్ట్ తో అగచాట్లు.

వసంత లక్ష్మిగారి అభిప్రాయం "రచయిత్రి మాలాకుమార్ గారి రచనలలో హాస్యరసం అలవోకగా జాలువారుతూంటుంది.కబుర్లు చెబుతున్నట్టేవుంటూ మన భుజాలు తడుముకునేలా చేస్తారువారు..తనవ్రాతలతో.

కావాలంటే యీ లింకు తెరచిమీరే వినండి.........ఔనా...కాదా?"

నా సంతోషం " నా కథ మీ గళం లో ఎంత బాగుందో! ఈ కథనే కదా మిమ్మలిని నాకు పరిచయం చేసింది. మన మధ్య స్నేహం కలిపింది.వసంతలక్ష్మి గారు థాంక్స్ అండి."

ఇక వినండి :)

Monday, October 28, 2019

Ek pyar ka nagma hai .. Old is Gold Hindi (Complete Song)





ఏక్ ప్యార్ కా నగ్మా హై

జిందగీ ఔర్ కుచ్ భీ నహీ

తెరేమేరే కహానీ హై

ఆంఖో మే సముందర్ హై

:( :( :( :( :(

Thursday, October 10, 2019

చెదిరిన గూడు

రెక్కలు తెగిపోయి, చెదిరిపోయిన గూడు
ముందు వంటరిగా నిలబడ్డాను
వానలకు వాలిపోయిన రాధామాధవం
తడిసి ముడుచుకున్న మామిడి
ఆకులు నల్లబడ్డ నాగిని
ముందే ఎండలకు మోడైన తెల్ల సంపెంగి
వచ్చావా అని దీనంగా చూసాయి.
హడావిడిగా కరెంట్ తీగ మీద వంటరిగా
పరుగులు పెడుతున్న ఉడత ఒక్క నిమిషం ఆగి
నువ్వూ నాలాగే తోడు కోల్పోయావా అని విచారంగా అంది.
ఎంతసేపు బయట నిలబడతావు
లోపలికి రా అని జాలిగా స్వాగతించింది
శూన్యమైన నా గూడు  .