Wednesday, February 27, 2013

తెలుగు వెలుగు లో నేను




పొద్దున్నే మావారు 'మాలా , మాలా' అంటూ గావుకేకలు పెట్టారు . ఏమైందా అని భయపడుతూ పరిగెత్తాను .

'నువ్వు పత్రిక లోకి ఎక్కావు ' అన్నారు .

ఒక్క క్షణం బుర్ర పనిచేయలేదు .' నేనా . . . పత్రిక లోకి ఎక్కటమా ????' అని తెగ హాచర్యపోయి , ఆ పైన నేనేమి చేసానురా భగవంతుడా అని భయపడుతూ 'ఏ పత్రిక లోకండి ?'అని అడిగాను .

ఇదిగో అని "మాలా కుమార్ " అని వున్నది చూపించారు .

 ఇదేమిటా అనుకున్నాను . 'ఓహో జ్యొతి గారు బ్లాగుల గురించి 'తెలుగు వెలుగు 'లో రాశానన్నారు . పేపర్ అతనిని పుస్తకం తెచ్చిపెట్టమంటే ఇంకా మార్కెట్ లోకి రాలేదమ్మా , వచ్చాక తెచ్చిస్తానన్నాడు . వచ్చినట్లుంది . ఐతే నా గురించి కూడా రాశారన్నమాట 'అని స్వగతంగా అనుకుంటూ , మావారి వైపు కాస్త గర్వంగా చూస్తూ పత్రిక తీసుకొని చూసాను .ఎంతైనా మన గురించి వుంది అంటే కాస్త గొప్పే కదా :)

మార్చ్ నెల ' తెలుగు వెలుగు ' లో తెలుగు బ్లాగుల గురించి , కొంతమంది మహిళా బ్లాగర్స్ గురించి జ్యొతిగారు వ్రాశారు . అందులో నాకూనూ కొద్దిగా ప్లేస్ ఇచ్చారు . అదీ సంగతి . ఏమి వ్రాసారంటే ఆ . . . నేనెందుకు చెపుతాను . మీరే పుస్తకం కొనుక్కొని చదవండి . లేదంటారూ ఇక్కడ చదవండి . అక్కడ చూసి వచ్చి ఇక్కడ మీరేమనుకున్నది చెప్పండి :)

థాంక్ యూ జ్యోతిగారు .

10 comments:

  1. బాగుంది.. మీకు కంగ్రాత్సండీ.
    వ్యాసం మాత్రం ఇంకంప్లీట్ గా ఉందండీ.

    ఇంకా బాగా రాయచ్చు. మంచి బ్లాగర్లని పరిచయం చేయచ్చు. మధురవాణి, కొత్తావకాయ, తృష్ణ, ఇద్దరు సౌమ్యలు,క్రిష్ణ ప్రియ,మానస,ఇందు,రసజ్న (సారీ నాకు ఈ అమ్మాయి పేరు టైప్ చేయడం రావట్లేదు) శ్రావ్య,జ్యోతిర్మయి,సూర్యలక్ష్మి గారు, మంజు,సునీత,ప్రవీణ ఇట్లా ఆక్టివ్ గా చాలా మంది వ్రాస్తున్నారు కదా.. వాల్ల గురించి ఒక్క మాట రాయలేదు. ఎప్పటికీ ప్రమదా వనం..అని పాత పాట.

    ReplyDelete
  2. మాలాకుమార్ గారికి , కంగ్రాట్స్.ఇకపోతే .పై అజ్ఞాత తో ఏకీభవిస్తూ ,,వ్యాసం అనేది ఎప్పుడు సమగ్రం గా వుండాలి.చాల మంది బ్లాగర్ల పేర్లు విస్మరించడం ఉద్దేశ పూర్వకం కాకపోవచ్చు .కానీ ప్రస్తుతం మనోభావాలు దెబ్బతినే ట్రెండ్ నడుస్తున్న నేపథ్యం లో జ్యోతి గారు ఈ విషయం లో జాగరూకత వహించాలి.

    ReplyDelete
  3. కంగ్రాట్స్ మాలా కుమార్ గారు. ఈ అంశం మీద వ్యాసం వ్రాసే ప్రయత్నం చేసినందుకు జ్యోతి గారికి ప్రశంశలు.

    Having said that, I couldn't resist my self from thinking about the substandard stuff of our publishing world and other fields :(

    ReplyDelete
  4. @మావారి వైపు కాస్త గర్వంగా చూస్తూ పత్రిక తీసుకొని చూసాను

    :)

    ReplyDelete
  5. శశికళ గారు , అనోనమస్ గారు , రాజి ,అనోనమస్ గారు ,వీకెండ్ పొలిటీషియన్ గారు ,మౌళిగారు అందరికీ థాంక్స్ అండి .

    ReplyDelete
  6. కంగ్రాట్స్ మాలా గారు. :)

    ReplyDelete
  7. అభినందనలు మాలాకుమార్ గారు

    ReplyDelete
  8. విజయ సంవత్సర ఉగాది శుభాకాంక్ష​లు మాలా కుమార్ గారు!

    ReplyDelete