Tuesday, November 6, 2012

ఒప్పుల కుప్పా వయ్యారి భామా




 
ఒప్పులకుప్పా వయ్యారి భామా ,
సన్నా బియ్యం చాయాపప్పూ ,
బిస్తీ బిస్తీ బీరాకాయా .

గుడు గుడు గుంచం గుండేరాగం ,
పాముల పట్టం పడగేరాగం,
పెద్దన్నపెళ్ళీ పోదము రండీ ,
చిన్నన్న పెళ్ళీ చూతము రండి .

ఏకాలమైయిందీ ఈ ఆటలన్నీ ఆడి . ఈ మద్య మా ఫ్రెండ్ ఈ బొమ్మలు ఎక్కడి నుండో తెచ్చి చూపించింది . అంతే తేనతుట్టె కదిలింది :)
బిస్తి గీస్తూ ఎంత గిర్రున తిరిగే వాళ్ళమో :) ఎవరు ముందు వదిలేస్తే వాళ్ళూ ఓడినట్లు . నా మొహం గెలిచినవాళ్ళూ , అంత స్పీడ్ లో తిరుగుతూ వాళ్ళు వదిలేయగానే వీళ్ళూ  ధన్ మని కింద పడిపోయేవారు :) కాని కళ్ళు తిరిగే వరకూ తిరగటం ఎంత మజా :)

గుడు గుడు గుంచం నుంచి , కాళ్ళా గజ్జా దాకా వచ్చి చక్కిలింతలు కలిగితే అదో ఆనందం .

రింగులు తిప్పికుంటూ బాల్యం లోకి వెళ్ళిపోయాను :)

ఈ మధ్య ఎక్కడో చదివాను , ఈ పాటలల్లో సైంటిఫిక్ రీజన్ వుంది అని వివరిస్తూ రాసారు . ఎక్కడ చదివానో గుర్తు రావటం లేదు .గుర్తొచ్చి , దొరికితే పెడతాను :)






19 comments:

  1. marchi poyina aatalu malli gurtu chesaaru nice post thank u mala garu

    ReplyDelete
  2. మళ్ళీ ఈ ఆటలన్నీ ఆడుకుంటూ ఆదమరిస్తే ఎంతబాగుంటుందో!

    ReplyDelete
  3. మర్చి పోయిన వాటిని మళ్ళీ గుర్తుకు తెచ్చారు.

    ఇప్పటి తరంకి పరిచయం చేయడం అవసరం. ధన్యవాదములు

    ReplyDelete
  4. ఒకనాటి ఆటలు,పాటలు మనసుపై చెరగని ముద్రలు.మరోమారు గుర్తుచేసి సంబరపరిచారు.

    ReplyDelete
  5. చెప్పాలంటే గారు ,
    థాంక్ యు .

    * పద్మార్పిత గారు ,
    మళ్ళీ ఈ ఆటలన్నీ ఆడుకుంటూ ఆదమరిస్తే నిజం గా ఎంత బాగుంటుందో కదా :)

    *రాధిక గారు ,
    థాంక్స్ అండి .

    ReplyDelete
  6. జలతారువెన్నెల గారు ,
    నిజమే లవ్లీ మెమొరీసే :)

    *వనజా వనమాలి గారు ,
    బాల్య స్మృతులన్నీ గుర్తొచ్చాయా :) థాంక్స్ అండి .

    *సి.ఉమాదేవి గారు ,
    ఇలా అప్పుడప్పుడు ఆ మధురస్మృతులను గుర్తుతెచ్చుకుంటూ వుంటేనే ఆ ఆనందమే ఆనందం కదండీ :) థాంక్స్ అండి .

    ReplyDelete
  7. మీ స్వీట్ మెమొరీస్ బాగున్నాయండీ..
    ఈ ఆటల్లో సైంటిఫిక్ రీజన్స్ గురించి ఎప్పుడో స్వాతి వీక్లీ లో వచ్చినట్లు గుర్తున్నాయి ..

    ReplyDelete
  8. నిజమేనండీ. ఈ ఆటలు ఆరోగ్యానికీ, జ్ఞాపకశక్తికీ మంచివట. మంచి శారీరిక, మానసిక వ్యాయామం.

    ReplyDelete

  9. ఒక్కసారి మనసులో ఒప్పులకుప్ప తిరిగేసానంతే...
    యేమిటో ఆ రోజులు..ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా వుండే రోజులు...

    ReplyDelete

  10. ఒక్కసారి మనసులో ఒప్పులకుప్ప తిరిగేసానంతే...
    యేమిటో ఆ రోజులు..ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా వుండే రోజులు...

    ReplyDelete
  11. బొమ్మలు చాలా అందంగా వున్నాయి.

    ReplyDelete
  12. రాజి ,
    పరిమళం గారు ,
    శిశిర,
    శ్రీలలిత గారు ,
    జ్యోతిర్మయి గారు ,
    థాంక్ యు .

    ReplyDelete
  13. ఎంత మంచిపోస్టో..
    బాల్యాన్ని గుర్తుచేసారు...:)

    ReplyDelete
  14. దీపావళి శుభాకాంక్షలండీ..

    ReplyDelete
  15. సుభ గారు ,
    థాంక్స్ అండి . మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు .

    ReplyDelete