Sunday, January 15, 2012

మా ఇంటి సంక్రాంతి




గోవు పూజ ; మా ఇంటికి వచ్చిన గోమాత పేరు "సరస్వతి " . లక్ష్మి కి నీళ్ళాడే రోజులట . అందుకని సరస్వతి ని తీసుకొచ్చానన్నాడు . సరస్వతి ఐనా కావలసిందేకదా ! ఆ ఆవు , దూడ ల కు ఇలా పూజలు చేయించుకోవటం అలావాటేమో , చక్కగా మూర్లెత్తి , పసుపూ , కుంకుమా పెట్టించుకున్నాయి .




బంతిపూలు ; మా పక్కింటివాళ్ళు ఫ్లాట్స్ కట్టించటానికి , ఇంటితో పాటు మామిడి చెట్టునూ కొట్టేసారు . అందుకని ఈ సారి మామిడాకులు లేకుండా వట్టి బంతిపూల తో సరిపెట్టుకోవలసి వచ్చింది !



ముత్యాల ముగ్గు ; ముత్యాలెక్కడా అని చూడకండి . ఏదో బాగుందని అలా పేరు పేరు పెట్టాను :)



పొంగలి ,



చెక్కర పొంగలి ; చక్కని తల్లికి చాంగుభళా ! అని ఈ పొంగలి , చెక్కర పొంగలి సంక్రాంతి లక్ష్మికి నైవేద్యం పెట్టానన్నమాట .



మా గేట్ పక్కన పక్కింటి కూలీలు వేసిన బోగిమంట . ( మా గేట్ పక్కన కాబట్టి మాదన్నట్లేగా !)

అన్నీ మేము శాస్త్రొక్తం గా చేసుకున్నట్లేగా ! ఏమిటీ బోగిపళ్ళు , బొమ్మలకొలువు లేవంటారా ? మరి ప్రస్తుతం మా ఇంట్లో చిన్నపిల్లలెవరూ లేరు గా ! ఎప్పుడూ చేసే చక్కిలాలూ , అరిసెలు కూడా చేయలేదు . ఎందుకంటే ఓపిక లేక :)

ఇవీ మా సంక్రాంతి సంబరాలు :)

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు .

19 comments:

  1. మీ ఇంటి సంక్రాంతి చాలా బాగుందండీ..
    మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!

    ReplyDelete
  2. సంక్రాంతి శుభాకాంక్షలు....

    ReplyDelete
  3. ఛక్కటి కనువిందు!సంక్రాంతి శుభాకాంక్షలు!

    ReplyDelete
  4. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

    ReplyDelete
  5. చక్కగా చేసుకున్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు!

    ReplyDelete
  6. మీ సంక్రాంతి లక్ష్మి చాలా బాగుందండీ.
    మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు..

    ReplyDelete
  7. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

    ReplyDelete
  8. చాలా బాగున్నాయండీ సంబరాలు :-) మీకు మీకుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  9. మీకూ, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలండి.

    ReplyDelete
  10. మీకూ, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలండి.

    ReplyDelete
  11. చాలా బాగున్నాయి మాలా గారూ మీ ఇంటి సంక్రాంతి సంబరాలు.. మొదటి ఫోటోలో నీలం రంగు చీర కట్టుకున్న సంక్రాంతి లక్ష్మి కూడా చాలా బాగుంది.. :D

    ReplyDelete
  12. బొమ్మల సంక్రాంతికి మీ వ్యాఖ్యలు మరింత అందాన్నిచ్చాయండి.మీకు,మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  13. Do you want to get significantly more targeted free visitors from search engines for your website almost effortlessly? Well, with more exposure across the internet it's possible. But most website owners are yet not aware of how to get the popularity that multiplies itself within days. As lot of internet marketers say, this backlink and traffic service can bring potentially thousands of visitors to almost any website. So just visit http://xrumerservice.org to get started. :)

    ReplyDelete
  14. రాజి ,

    థాంక్ యు .

    &లయ రామకృష్ణ గారు ,

    థాంక్ యు .

    &సి . ఉమాదేవి గారు ,

    థాంక్ యు .

    ReplyDelete
  15. రామకృష్ణ గారు ,

    చిన్నీఅశ గారు ,

    శ్రీలలిత గారు ,

    నాని గారు ,

    ధన్యవాదాలు .

    ReplyDelete
  16. వేణూ శ్రీకాంత్ ,

    భారతి గారు ,

    థాంక్స్ అండి .

    &నీ కాంప్లిమెంట్ కు థాంక్ యు :)

    ReplyDelete
  17. బాలు గారు ,

    అనానొమస్ గారు ,

    థాంక్ యు .

    ReplyDelete
  18. మాలా కుమార్ గారూ మీ సంక్రాంతి బావుందండీ..మీకు మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  19. జ్యోతిర్మయి గారు ,

    థాంక్స్ అండ్ నా బ్లాగ్ కు వెల్కం అండి .

    ReplyDelete