నిన్న సాయంకాలం టైం 8 కావొస్తొంది . యధావిధిగా మా వారు టి.వి ముందు నేను బాల్కనీ లో సెటిల్ అయ్యాము . అంతకు కొద్ది సేపు ముందే వాన తగ్గిందమో , ఆ వానలో తడిసి న రెక్క నందివర్ధనం పూలు , ఆకులు స్ట్ర్రిట్ లైట్ వెలుగులో మెరుస్తున్నాయి . వాటిని చూస్తూ అప్పుడప్పుడే విచ్చుకుంటూ పరిమళాలు వెదజల్లుతున్న పారిజాతాలను ఆస్వాదిస్తూ నా లోకంలో నేనున్నాను . ఇంతలో . . .
" ఆగు . . . ఆగు " అని గట్టిగా వినిపించింది . ఇదేమిటబ్బా నేనేమి చేసాను నన్ను ఆగు ఆగు అంటున్నారు ఎవరో . నేనెవరితో మాట్లాడటం లేదే ! కొంపదీసి సినిమాలో లా నా మనసే కాదుకదా . ఐనా అదెందుకు ఆగమంటొంది అని ఆలోచిస్తూ వుండగా మళ్ళీ ఈసారి ఇంకొంచం ఘట్టిగా " ఆగు " అని వినిపించింది . ఊహల్లోనుంచి బయటపడి చుట్టూ చూసాను . రోడ్ మీద వక అబ్బాయి బైక్ మీద , ఓ అమ్మాయిని వెంబడిస్తూ ఆగు అని అరుస్తున్నాడు . నేను ఉలిక్కి పడ్డాను . వారం రోజుల నుంచి తెగ సినిమాలు చూసి భ్రమ పడుతున్నానా అనుకుంటూ కళ్ళు నులుము కొని మళ్ళీ చూసాను . ఓ అమ్మాయి విస విసా మా ఇంటి రోడ్ కు అవతలి వైపు నడుస్తోంది . ఓ అబ్బాయి ఆమెను ఆగు అని అరుస్తూ వెంబడిస్తున్నాడు . ఆ అమ్మాయి వెను తిరిగి నడిచింది . అతనూ బైక్ వెనక్కి తిప్పాడు . అలా ఇద్దరూ అటూ ఇటూ తిరిగారు . ఇంతలో అతను బైక్ ఆపి ఆ అమ్మాయి చేయి పట్టుకున్నాడు . ఆమె " వదులు . . . వదులు " అని గింజుకోసాగింది . ఏమైనా సినిమా షూటింగా అని చుట్టూ చూసాను . కెమెరాలు , లైట్ లు , మనుషులు ఎవరూ కనిపించలేదు . ఐతే ఈ సీను నిజం గానే నా కళ్ళెదుట జరుగుతోందన్నమాట అనుకొని ఏమి చేయాలో తోచక ఒక్క సెకను నిలబడి , లోపలి కి వెళ్ళి మావారికి చెప్పాను .
మా వారు గబ గబా వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఆ అమ్మాయి చేయిని అతని నుంచి విడిపించి , ఆ అమ్మాయిని ఆయనవెనకే వెళ్ళిన మా పనమ్మాయి శైలజకు వప్ప చెప్పి , అతనిని దబాయించటం మొదలుపెట్టారు . వాల్లిద్దరూ ఈ పరిణామం వూహించలేదేమో బిత్తర పోయారు . ఆ అమ్మాయిని శైలజ గేట్ లోపలికి తీసుకొచ్చేసి గేట్ వేసేసింది . ఆ అమ్మాయి ఏడవటం మొదలు పెట్టింది . ఆ అబ్బాయేమో సారీ అంకుల్ తను నా కజిన్ అని చెపుతున్నాడు . మావారు అతని మాట వినకుండా గేట్ దగ్గరికొచ్చి అతను నీకు తెలుసా అని ఆ అమ్మాయిని అడిగారు . ఆ అమ్మాయి షాక్ లో వుందేమో జవాబు చెప్పకుండా ఏడుస్తోంది . ఇహ అంతే మా వారు విజృంభించేసారు . ఈ గొడవంతా చూస్తున్న పక్కింటి వాచ్మెన్ తో వాడిని పట్టుకో కట్టేసి పోలీసులను పిలుద్దాము అన్నారు . అప్పటి వరకు సారీ అంకుల్ , సారీ అంకుల్ అని బతిమిలాడుతున్నవాడల్లా పక్కకి పరిగెత్తాడు ఆ అబ్బాయి . ఆ అమ్మాయేమో నేను వెళ్ళిపోతానంకుల్ అని ఏడుస్తోంది . ఎక్కడికెళుతావు , మీ ఇల్లెక్కడో చెప్పు నేను వచ్చి దింపుతాను అని ఆ పిల్లను అరిచారు . అసలు ఆ అబ్బాయిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నవమ్మా నువ్వు ? పద మీ ఇంటికి వచ్చి మీడాడీ తో మాట్లాడుతాను అని ఈయన , లేదంకుల్ నేను వెళ్ళిపోతాను అని ఆ అమ్మాయి కాసేపు వాదించుకున్నాక , శైలజా ఆ అమ్మాయిని లోపల్ కూర్చొబెట్టు , మాలా నా కార్ కీ తీసుకురా నాకు చెప్పారు . ఆ అమ్మాయి గోడు గోడు న ఏడుస్తూ మీరొద్దంకుల్ నేను వెళుతాను అన్నిది . మావారు , నువ్వు మాట్లాడకు ముందు లోపల కూర్చో అని , పక్కింటి వాచ్మెన్ తో
" నువ్వు ఆ అబ్బాయి , ఈ అమ్మాయి చేయిలాగటం చూసావా అని అడిగారు . చూసాను సార్ అన్నాడు . ఐతే ఎందుకు ఆపలేదు ? సినిమా చూస్తున్నావా ? నీకు అక్క చెల్లెళ్ళు లేరా ?"
( అరే ఈ డైలాగ్ అమ్మాయి అబ్బాయి తో అన్నట్లు చూపిస్తారే సినిమాలో ! మావారు అంటున్నారేమిటి చెప్మా !)
" వక చెల్లి వుంది సార్ "
" ఐతే మీ చెల్లెలిని ఇలా ఎవరైనా చేయి పట్టుకొని లాగుతుంటే నువ్వు వూరుకుంటావా ?"
అతను తల గోక్కుంటూ " వూ మ్హూ " .
ఇంతలో " ఏమైంది సారూ " అంటూ ఎల్లమ్మ వచ్చింది .
" ఏమైందా ? నువెటుబోయావ్ ఇప్పటి వరకు " అని ఎల్లమ్మను అరిచి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడని గమనించారు . నేను కార్ కీస్ తీసుకొని చెప్పులేసుకొని వచ్చాను . ఆ అమ్మాయి నన్ను చూడగానే " ఆంటీ మీరొద్దు ప్లీజ్ నేను వెళుతాను " అంది . ఆ అమ్మాయి ని చూస్తే 17 / 18 ఏళ్ళ అమ్మాయిలా వుంది . చాలా లేతగా సుకుమారంగా వుంది మద్య మద్య చేయి వూదుకుంటోంది . చేయి ఎర్రగా కందిపోయింది . ఏం చదువుకుంటున్నవమ్మా నువ్వు అని అడిగాను . పలానా హాస్పిటల్ లో సిస్టర్ ట్రైనింగ్ అవుతున్నానండి అంది . నువ్వెక్కడుంటావు అన్నాను . అక్కడే హాస్టల్ లో వుంటానండి . మా పేరెంట్స్ వైజాగ్ లో వుంటారు అంది . ఆ హస్పిటల్ ఇక్కడికి చాలా దూరం . ఇక్కడిదాకా ఎందుకు వచ్చావు ? అసలు ఆ అబ్బాయి ఎవరు ? గొడవేంటి అసలు అని అడుగుతే రాంగ్ కాల్ వచ్చిందని అరుస్తున్నాడండి అంటుందే కాని ఆ అబ్బాయి తెలుసని కాని తెలీదు అని కాని చెప్పదు .
" ఫోన్ అంటూ వుంటే రాంగ్ కాల్స్ రాకుండా వుంటాయా ఏమిటి ? " అని శైలజ ఆశ్చర్యం .
ఇంతలో మావారు ఇంకో అబ్బాయిని తీసుకొని వచ్చారు . " ఇతను నీకు తెలుసా " అని అడిగారు . ఆ అమ్మాయి చెప్పేలోపలే అతను " తను మా చెల్లెలండి . మా పిన్ని కూతురు " అన్నాడు . ఆ అమ్మాయి అవునని తలాడించింది . ఇంకేంచేస్తాము ఆ అమ్మాయి వాలకం అనుమానంగా వున్నా అతను మా అన్నయ్య అని అతని తో వెళ్ళేందుకు సిద్దపడితే , మనమేమి చేయలేముగా ! ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు . ఆ సోకాల్డ్ అన్నయ్య థాంక్స్ అంకుల్ అని కూడా చెప్పాడు !
మొతం ఎనలైజ్ చేసుకుంటే , బహుషా ఇద్దరూ సోకాల్డ్ ప్రేమికులు . తిరిగేందుకుకు ఇటొచ్చారు . ఆ అమ్మాయి సెల్ కు ఎవరో అబ్బాయి కాల్ చేసాడు . అది చూసి ఈ అబ్బాయి అనుమానించాడు . అమ్మాయికి కోపం వచ్చింది . అలిగింది . ఆ అలక తీర్చే ప్రహసనమే ఇదంతా . మధ్యలో ఆమెను లోపల వుంచ్టము , అతనిని పోలీసులకు పట్టిస్తామనటం తో వెళ్ళిపోయి ఎవరో ఫ్రెండ్ కు కాల్ చేసి పిలిపించాడు . అతనొచ్చి ఆ అమ్మాయిని తీసుకెళ్ళాడు . అసలు కథ ఇదై వుంటుంది అనుకున్నాము .
ఏ కథ ఏమైనా మాకు ఆ అమ్మాయి గురించి చాలా బాధ కలిగింది . చాలా చిన్న పిల్ల లా వుంది . చదువుకోసమో , వుద్యోగం కోసమో ఆడపిల్లలు బయటకు వచ్చి వంటరి గా వుండక తప్పటం లేదు . కాని ఈ తప్పటడుగులు ఏమిటి ?
ఇహ మా విషయానికి వస్తే , ఆ అమ్మాయిని పంపించి మేము లోపలికి వస్తుంటే మా కాలనీ ప్రెసిడెంట్ అటుగా వచ్చారు . సరే నేను లోపలికి వచ్చేసాను . కాసేపు ఆయంతో మట్లాడి మావారు లోపలికి వచ్చి , " ప్రెసిడెంట్ కు జరిగింది చెప్పాను . ఈ ఆదివారం కాలనీ మీటింగ్ ఏర్పాటు చేయమన్నాను . " అన్నారు .
" ఎందుకు ?"
" ఎందుకా , ఈలోపల 30 లాఠీలు , 30 విజిల్స్ కొనుకొస్తాను . మీటింగ్ లో అందరికీ తలా వక లాఠీ , తలా వక విజిల్ ఇస్తాము . అనుకోకుండా ఏమైనా జరిగినప్పుడు ముందు చూసిన వాళ్ళు విజిల్ వూదితే అందరూ లాఠీలు తీసుకొని బయటకు వచ్చేట్లుగా ఏర్పాటు చేస్తాను ."
" మరి సమయానికి ఆ విజిల్ కనిపించక పోతే ?"
" నీకన్నీ ఇలాంటి తలతిక్క అనుమానాలే వస్తాయి . మొన్న మన పక్కింటావిడ గొలుసు ఎవడో గుంజారు . నేను చూసి వెళ్ళ బట్టి వాడు వదిలేసి వెల్లాడు ."
" అవునవును అందుకే ఆవిడెప్పుడూ మిమ్మలిని మెచ్చుకుంటూ వుంటుంది ."
" రెండు రోజుల క్రితం నువ్వు వాకింగ్ చేస్తూ , ఎవరో మన కాలినీలో కుక్కలకు బిస్కెట్లు వేస్తున్నాడని చెప్పావాలేదా ?"
" చెప్పాను . వారం రోజులుగా రోజూ వచ్చి వీధి కుక్కలకు బిస్కెట్లు వేస్తూ వుంటే , ఏ దొంగోడో , ఏ టెరరిస్టో అని భయం వేసింది . మీరు వాడిని అడ్రెస్స్ వగైరా అడిగాక రావటం మానుకున్నాడుకదా ?"
" మరి అదే . ఏదో వక అర్పాటు చేయకపోతే ఎలాగ? కాలనీ గూర్కా మీద ఆధారపడితే సరిపోదు . మనల్ని మనమూ రక్షించుకోవాలి . ఏదైనా జరగ గానే నాకెందుకులే అని వెళ్ళిపోతే ఎలా ? ఇప్పుడే చూడరాదు ఏమి జరిగిందో . అందరికీ సివిక్ సెన్స్ వుండాలి . "
" బాబోయ్ నాకు స్పీచులు ఇవ్వకండి . అసలు మనం ఈ కాలనీకి అన్ పేడ్ వాచ్ మెన్ ల మైపోయాము . ఇప్పుడు మీరు ఇచ్చే విజిల్ తో నా మనవళ్ళు ఆడుకొని ఎక్కడో పెట్టరనుకోండి . ఆ టైం కు నాకు దొర్కొద్దూ ? అసలే మనపిల్లలు హైడ్ అండ్ సీక్ ఆడుతూ వుంటారు . ఇప్పుడు నాకున్న డ్యూటీలలో ఈ లాఠీ ని , విజిల్ ని దాచటమొకటి కొత్తగా వచ్చిచేరింది . ఎక్కడ దాచను . అలమారలో పెడుదామంటే అలమారా కీస్ ఎప్పుడూ దొరికి చావవు . టైం కు దొరుకుతాయో ఏదో . ఇదంతా ఎందుకు నేనసలు బాల్కనీ లోనే కూర్చోకుండా వుంటే సరిపోతుంది " .
" ఏమైనా కానీ డాడీ ఇహ జన్మలో ఆ అబ్బాయి ఏ అమ్మాయి చేయీ పట్టుకోడు . అమ్మా నీకసలు విజిల్ వూదటం వచ్చా ?" అని అప్పుడే వచ్చి అంతా విన్న మా అమ్మాయి డైలాగు .
" అమ్ముమ్మకు రాకపోతే నేను వూదిపెడతాను . " మా విక్కి సరదా :)
పాపం వాళ్ళ ప్రణయ కలహం కాస్తా ప్రళయ కలహమైపోయింది . ఏమో ఏది ఏమైతే నాకేమిటి నేనిప్పుడు అర్జెంట్ గా విజిల్ వూదేటప్పుడు టెన్షన్ పడి గాలి మాత్రమే వచ్చేట్లు కాకుండా పెద్ద సౌండ్ వచ్చేట్లు వూదటము నేర్చుకోవాలి . లాఠీ తిప్పటం నేర్చుకోవాలి . ఐయాం సో బిజీ యార్ !!!!!



19 వ్యాఖ్యలు:
హా హా హా.. చాలా బావుంది. మీరు దీన్ని ఇంగ్లీష్ లో రాసి ఏ ఆర్మీ మేగజీన్ కో (At least to RSI Magazine) పంపొచ్చు కదా. అక్కడ కొందరు మరీ చెత్తగా రాస్తారు. ఇది నిజంగా బావుంది. మీ వారి (చాదస్తం గా చాలా మంది పరిగణించే) ముందు చూపు, ధైర్యం, సివిక్ సెన్సూ గురించి చాలా హాస్యస్పోరకంగా రాసారు.
అమ్మాయిలకి ఏ మాత్రం బెరుకు లేదు చదువుకోమని పంపిస్తే బాయ్ ఫ్రెండ్స్ ,షికార్లు. తల్లిదండ్రుల నమ్మకాలని పిల్లలు వమ్ము చేసి ప్రమాదాలలో పది జీవితాలు నాశనం చేసుకుంటుంటే ఎవరు ఆపగలరు ?ప్రణయం కాదు..ప్రళయం కాలం ఇది.మంచి విషయం పంచుకున్నారు.
ప్చ్ ఏమిటో మరీ పదిహేడు పద్దెనిమిదేళ్ళకే ఈ వెర్రిమొర్రి వేషాలు....ప్చ్!
హహహ బావుంది మీ హడావుడి. ఇంక మీ ఇంటికొస్తే విజిల్, లాఠీలతో - శంఖం, చక్రం లాగ- దర్శనమిస్తారన్నమాట. :)
భలే ట్విస్టిచ్చారు కథకి :)
పాపం ఆ తల్లి తండ్రులు. పిల్లలు చదువుకోవాలనో, ఉద్యోగం చేసుకోవాలనో ఇలా దూర ప్రదేశాలకు ఎంతో నమ్మకంతో పంపిస్తారు. 17-18 యేళ్ళకు ప్రేమలు తప్పుకాదు. అది ఆకర్షణా, ప్రేమా అని తెలియకుండపోవడం తప్పు.
మీరు జాగ్రత్తగ ప్రాక్టీస్ చెయ్యండి, విజిల్ గాని మింగేసేరు ;)
మీ వారి స్పందన బావుందండి.ఎవరో మన కాలినీలో కుక్కలకు బిస్కెట్లు వేస్తున్నాడని చెప్పావాలేదా ?"
" చెప్పాను . వారం రోజులుగా రోజూ వచ్చి వీధి కుక్కలకు బిస్కెట్లు వేస్తూ వుంటే , ఏ దొంగోడో , ఏ టెరరిస్టో అని భయం వేసింది . అమ్మో నిజమా నేను, మా వారు వీధి కుక్కలకి , ఆవులకి బిస్కెట్లు వేస్తూనే ఉంటాము మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి అటు రాకుండా ఉంటాము
నేను కేవలం ముఫ్ఫై నిమిషాల్లో విజిల్ లేకుండా గాఠిగా ఈల వైడం నేర్పుతాను. (వాళ్ళ బాబాయి కోసం బుడుగు వేసినట్టు), మరి నాకేమిస్తారు?
ఏ కాలనీ లో విజిల్ ప్రాక్టీసు, కర్ర సాము హడావడి ఉంటాయో అది మీ కాలనీ అని ఫిక్స్ అయిపోయాము.
పక్కింటావిడ వెనకాల మీ వారు ఉండగా, దొంగాడి కెంత ధైర్యం గొలుసు లాగడానికి?? ఇదేదో కొంచెం తేడాగా అనిపిస్తోందేమిటి నాకు.... దహా
జరిగిందేదో జరిగింది. మీరు చెప్పిన తీరు మాత్రం చాలా బావుంది.
మా ఇంటి దగ్గరున్న పార్కులో (నడిచి వెళ్ళే దూరం కదా అనీ, ఎక్కువ మంది ఉండరు కనుక కంగారు పడకుండా కావలిసినంత సేపు ఆడుకోవచ్చు, నేను హాయిగా ఉయ్యాల ఊగచ్చు అని) ఆడుకోవడానికి పిల్లలని తీసుకెళ్తే కనిపించిన సీను చెప్పడానికి నేను సిగ్గు పడ్డాను. కానీ మా చిన్న పిల్ల వాడు స్పష్టంగా చెప్పాడు, "టీనేజీ పిల్లలు ముద్దు పెట్టుకుంటుంటే చూశాము, అందుకే ఇప్పుడు అక్కడికి ఆడుకోవడానికి వెళ్ళట్లేదు" అని. ఇంకో జంట మా ఇంటి ముందే సరదాగా కాలక్షేపం చేస్తుంటే మా పిల్లలు ఆడుకునే బంతి వాళ్ళ వైపు వెళ్ళింది. ఆ జంటలో అబ్బాయి బెదురు లేకుండా బంతి పిల్లలకి అందేలా వెనక్కి విసిరాడు. పిల్లలూ శుభ్రంగా ఆడుకోవడంలో పడిపోయారు. నాకే ఎబ్బెట్టుగా అనిపించి వాళ్ళు మళ్ళీ కనిపించినప్పుడు ఇక్కడ పిల్లలు disturb చేస్తారు వాళ్ళని అని చెప్పి వెళ్ళి పొమ్మన్నాను. అంతకంటే ఏం చెయ్యాలో తోచలేదు. ఆ జంటలో అమ్మాయిని చూస్తే మాత్రం ఎందుకో బాధ అనిపించింది. ఆ వయసులో ఉండాల్సిన పసితనం కనిపించలేదు తన ముఖంలో (నా అభిప్రాయం మాత్రమే). ఆ వయసులో అనుభవించి ఆనందించాల్సిన మిగతా విషయాలు తను మిస్సవుతోందన్న భావన నాకుండడం మూలానో ఏమో మరి. ఏమో కాలం మారుతోంది. దేశం కాని దేశం. ఎలా ఆలోచిస్తామో, పిల్లలు ఎలా అర్థం చేసుకుంటూ పెరుగుతారో అన్న భయం వెంటాడుతుంటుంది. ఒక్కో సారి పిల్లలే బాగా అర్థం చేసుకుని సవ్యమగా ఆలోచించగలరు అనీ అనిపిస్తుంటుంది.
nice...
మాలాకుమార్ గారు, నిన్న 'మిస్సమ్మ' సినిమా చూసాక మీ టపా చదివాను, అరె సావిత్రి పాడిన 'తెలుసుకొనవె చెల్లి..అలా మసులుకోనవే చెల్లి' లానే అనిపించింది మీ టపా.
సుజాత గారు ,
మావారి ధర్యం , మొండి ధీర్యం అండి . ముందు వెనుక చూడకుండా సిరికిన్ చెప్పడు లెవల్లో దూకేస్తారు :)
ఆర్మీ మాగ్జిన్ కి పంపేంత సీను నాకెక్కడిదండీ బాబు :)
& వనజ వనమాలి గారు ,
పేరెంట్స్ కు తమ పిల్లల మీద ఎంత నమ్మకమో , ఈ పిల్లలు , మగ కానీయండి ఆడ పిల్లలు కానీయండి అంత పోగొట్టుకుంటున్నారు . ఈ పిల్లల గురించిన ఆలోచనలో మొన్న రాత్రంతా నాకు నిద్ర లేదు . చాలా బాధ కలిగింది . స్చప్ . . . మనమేమి చేయగలం ?
& అ.సౌమ్య గారు ,
ఏమి హడావిడో ఏమో లెండి . మొత్తానికి మమ్మలిని విష్ణుమూర్తిని చేసేసారన్నమాట !
భాస్కర్ గారు ,
అవునండి తల్లి తండ్రులే పాపం అండి :(
మీ జాగ్రత్త గుర్తుంచుకుంటాను లెండి :)
& శైలబాల గారు ,
కుక్కలకు బిస్కెట్స్ వేయటము తప్పు కాదండి . నేనూ మా గేట్ ముందు పెద్ద , వెడల్పాటి గిన్నెలో నీళ్ళు పెడుతాను కుక్కలకోసం . మా వారు కుక్కల చలివేంద్రం అని నవ్వుతుంటారు :) కాని ఆ అబ్బాయి బైక్ మీద వచ్చి రోజొక ఇంటి ముందు నిలబడి వేస్తున్నాడు . ఎక్కడి నుంచో ఇక్కడకు వచ్చి వేయాల్సిన అవసరమేమిటి అని నా అనుమానం అదీ ప్రతి రోజూ ! ( ఐనా మా వీధి కుక్కల సంగతి మేము చూసుకోలేమా :))
& శ్రీలలిత గారూ ,
మీరంతటి ఘనులే నాకు తెలీదూ :) మీకు లంచమివ్వలేకే కదా వేరే దారి చూసుకున్నది :)
బులుసు సుభ్రమణ్యం గారు ,
మీరెలా ఐనా ఫిక్సైపోండి నాకేమీ అబ్యంతరం లేదు . కాని నా బ్లాగ్ కు మొదటి సారే నాహా తో రావటం మీకు ధర్మ మేనా ?
& లలితజి గారు ,
ఈ మధ్యకాలం లో పార్కులన్నీ అలాగే వున్నాయండి . సెలవరోజు పిల్లలను పార్క్ కు తీసుకెళ్ళాలంటే భయం గా వుంది . మనం ముదుకెళుతున్నామో , వెనెక్కి వెళుతున్నామో అర్ధం కావటం లేదండి . పిల్లలకు అర్ధం కావటమేమో కాని అనవసరమైన కుతూహలం పెరుగుతోంది .
benny computer news gaaru ,
thank you .
శ్రీ గారు ,
నిజమేనండి . నాకు నిజం గా అలానే బుద్ది చెప్పాలని అనిపించింది . మరీ చనువు బాగుండదని వూరుకున్నాను . అప్పటి కే మా వారు బాగానే చివాట్లు వేసారు .
క్షమించాలి. నాహా కాదండీ. దహా అనే వ్రాసాను. దరహాసం అని నా ఉద్దేశ్యం.
మీ బ్లాగు నేను తరుచుగానే చూస్తుంటాను. అప్పుడప్పుడు కామెంట్లు కూడా పెట్టిన గుర్తు. అంచేత నేను చెప్పొచ్చేదేమిటంటే ఇది మొదటి మాటు కాదు అని. మళ్ళీ... దహా.
బులుసు సుబ్రమణ్యం గారు ,
అయ్యో జోక్స్ లలో క్షమించటాలేమిటండి :)
ఏమోనండి మీరు దహా అన్నా నాకు ఇప్పటికీ నాహా ( నారద హాసం ) లాగే కనిపిస్తోందండి . మరి నేనేమి చేయను చెప్పండి ( దహా )
భలేగా రాశారండీ.. ఆ అబ్బాయి-అమ్మాయి గురించి మీ అనాలిసిస్ బాగుంది. నిజమే అయి ఉండొచ్చు అనిపించింది.. నేను కొంచం ఆలస్యంగా స్పందిస్తున్నా, ఈపాటికి మీకు విజిల్ ఊదడం వచ్చేసి ఉండాలి !!
మాలా కుమార్ గారూ !
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు
శిరాకదంబం వెబ్ పత్రిక
టపా బాగుంది అనడం కంటే , కొంచెం బాధ వేసిందండి. ఆ అమ్మాయి విషయమే. అమ్మ నాన్న ల తోడూ లేకుండా వాళ్ళని ఇంత దూరం పంపడం, తోటి వాళ్ళు చేసేదే నిజం అన్న భ్రమ లో వీళ్ళు బతకడం. చదువు అయిపోగానే వాళ్ళని ఇంత దూరం పంపించి , అమ్మా నువ్వు మంచి ఉద్యోగం తెచుకో అని చెప్తారు తప్ప , దాని కన్నా నాకు నువ్వు ముఖ్యం అని ఎవరు చెప్పారేమో. ఉద్యోగం వచ్చాక, నాకు ఫలానా MNC లో ఉద్యోగం వచిందని వాళ్ళు చెప్పడం, ఇక తల్లి తండ్రులు సంబరపడి పెళ్లి సంబంధాలు వెతకడం. తన ప్రవర్తన, వేషధారణ మారుతుంటే ఏంటిది అని గట్టిగ అడగలేక "మార్పు" అని సర్హి చెప్పుకోవడం. నాదొక విన్నపం , ఆ బంగారు తల్లుల్ని ఉద్యోగం పేరు చెప్పి దూరాలకి తోసేయ్యకండి. చుట్టూ తోడేళ్ళు ఉన్నాయి. మీకు వీలైతే వారితో వెళ్లి ఉండండి. జాగ్రత్త గా చూసుకోండి. అంత కన్నా మనకి విలువైన, ముఖ్యమైన పని ఈ ప్రపంచం లో ఉండదేమో. ఆడపిల్లలు అరుదౌతున్నారు, ఆడతనం అనే అర్ధం మారిపోతుంది. వీళ్ళు "అమ్మ" లు కాలేరు. అమ్మతనం చూపలేరు. ఆ విలువా వారికి తెలియదు. ఎందుకంటే మీరు అది నేర్పలేదు. ఆడపిల్లలని వంటరిగా వదిలేయకండి. ఉద్యోగం, onsite ఇవన్ని గొప్ప విషయాలే. కాని చుట్టూ కంచె ఉండాలి, అది వాళ్ళని గుచ్చకుండా ,వాళ్ళని కాపాడేది అయి ఉంటె చాలు. ఆర్ధిక స్వాతంత్ర్యం ఆడపిల్లల్ని మారుస్తుంది. వాళ్ళని మగవాళ్ళల మార్చకండి, ఆత్మ స్థైర్యాన్ని, నిబ్బరాన్ని నేర్పించండి.
Post a Comment