Monday, July 25, 2011

ఈ రోజు నా షష్ఠి పూర్తి :)))))



ఈ రోజు నా షష్ఠిపూర్తి :) అంటే ఈ నాటి తో నాకు అరవై ఏళ్ళు పూర్తవుతాయన్నమాట ! అంటే నేను పుట్టి ఈవాల్టికి అరవై ఏళ్ళు ఐందన్నమాట :) స్చప్ . . . . . ఏమిటో నిన్ననో మొన్ననో నేగా అమ్మ వెన్నెల్లో కూర్చొపెట్టి కథలు చెపుతూ అన్నం పెట్టింది .
ములుగులో చింతచెట్టు కింద కూర్చొని ఆడుకుంటూ వుంటే కృష్ణవేణి అత్తయ్య తీసుకెళ్ళి వాళ్ళ సమితి ఆఫీసులో " భలే తాత మన బాపూజీ " పాడించిందీ కదూ ! ఆ పాట విని ముద్దు ముద్దుగా భలే పాడుతున్నవూ అని భద్రమత్తయ్య వాళ్ళ స్కూల్ లో " అమ్మా నొప్పులే అమ్మమ్మా నొప్పులే " డాన్స్ చేయింది జ్ఞాపకమే గా !
బూర్గుంపాడ్ లో రోజూ తెల్లవారు ఝాముననే , అమ్మ తో కలిసి గోదావరి వడ్డుకు పెసరచేల మద్య నుంచి వెళ్ళిన దీ జ్ఞాపకమే !
మానుకోటలో ప్రైమరీ స్కూల్ లో చేర్చటాని కి నాన్నగారు , తీసుకెళితే , వాళ్ళు మాథ్స్ టెస్ట్ పెట్టి , " మీ అమ్మాయి కి లెక్కల్లో 100 మార్క్స్ వచ్చాయండి . చాలా తెలివిగలది అని మెచ్చుకుంటూనే 6థ్ క్లాస్ లో చేర్చుకోవటానికి వయసు తక్కువ అందుకని 5 థ్ క్లాస్ లో చేర్చుకుంటాము అని హెడ్ మాస్టర్ అన్నప్పుడు ,నేను 6థ్ క్లాస్ లో చేరుతాను అని ఎంత గోలపెట్టానో మర్చిపోయానా ? లేదే ! వయసు తక్కువ అని ఐదో క్లాస్ లో చేర్చినా , యస్. యస్. యల్ . సి కి వచ్చేసరికి ఆ వయసూ తక్కువై రిజల్ట్స్ కోసం నల్లగొండ , హైదరాబాద్ చుట్టూ నాన్నగారిని ఎంత తిప్పించుకొని ఇచ్చారని :)

పి.యు.సి అవుతూనే అనుకోకుండా పెళ్ళైపోయి పూల తో అలంకరించిన పడవంత పూల రధం (కారు ) లో ఊరేగింపుగా అత్తవారింట అడుగుపెట్టినదీ జ్ఞాపకమే . ఆ పైన రెండేళ్ళకే బుజ్జి బుజ్జి చేతులూ , కాళ్ళూ ఆడించుకుంటూ , కళ్ళు విప్పార్చుకొని అమాయకంగా చూస్తూ , నన్ను అమ్మను చేసి నా వడిలోకి చేరిన అమ్మాయి రాకా గుర్తే . అక్కేనా నేనూ వున్నానంటూ ముద్దుగా వచ్చిన అబ్బాయి రాకా గుర్తే :) నాదీ అంటూ నేను సంపాదించుకున్న ఆస్తి వారిద్దరేగా !
వాళ్ళింకా పసిపిల్లలు కారు పెద్దవాళ్ళైయ్యారు సుమా అంటూ , నాకు అత్తగారి ప్రమోషన్ ఇచ్చిన అల్లుడూ , కోడలూ వచ్చి ఎన్నళైందమ్మా ! ఈ మద్యేగా :) అమ్మమ్మా , బామ్మా అంటూ బుజ్జి బుజ్జి మనవరాళ్ళూ మనవళ్ళు వచ్చీ ఎంతోకాలం కాలేదు మరి :)
అభిమానించిన అత్తయ్యగారు , మామయ్యగారు కనుమరుగైన గుండె భారం ఇంకా తీరనే లేదు :(
మీకు మీ పెద్ద అమ్మాయంటేనే ఎక్కువ ప్రేమండీ అని అల్లుడు వేళాకోళాం ఆడుతుంటే మురిపంగా ముసి ముసి నవ్వులు నవ్వుతూనే వెళ్ళిపోయిన నాన్నగారి కోసం కనుల తడి ఆరనే లేదు :(
అన్నీ నిన్నా మొన్నానే ఐనట్లుగా వున్నాయి . ఇంకా ఎన్నో ఎన్నెన్నో జ్ఞాపకాలు ఇంత ఫ్రెష్ గా వుంటే అప్పుడే అరవైళ్ళే గడిచిపోవటమేమిటి ? నమ్మకం కుదరటం లేదు :) కానీ నమ్మక తప్పదు . ఇది కాదనలేని కాలం లెక్క మరి :)
ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన ఆ దేవదేవునికి సర్వదా కృతజ్ఞురాలిని . అడగకనే అన్నీ ఇచ్చాడు . అందుకే ఓకోరిక కోరాలని వుంది . మరి నా ఈ కోరిక తీర్చే భారం ఆ దేవదేవునిదే !!!!!
పైన వున్న ఫొటోలో నేను ఎత్తుకున్నది నన్నే :) అది నా ఫస్ట్ బర్త్ డే ది . నాకు కొత్త ఫ్రాక్ కుట్టింది మా అమ్మే . చక్కగా కొత్త గౌను కుట్టి వేసి , దొడ్లో పూసిన సన్నజాజిపూలను తెంపి దండకట్టి నా మెడలో వేసిందిట మా అమ్మ . అంత ముచ్చటగా తయారు చేస్తే చక్కగా వుంచుకొవచ్చుగా ! అబ్బే . . . ఆ దండను లాగి తెంపి పారేసానట :)
పుట్టిన రోజున చిన్నపిల్లలు ఏమనిపాడుకుంటారు ?
" హాపీ బర్త్ డే టు మి " :)))))

60 వ్యాఖ్యలు:

భాస్కర రామి రెడ్డి said...

షష్ఠి పూర్తి జన్మదిన శుభాకాంక్షలండి.

విరిబోణి said...

పుట్టిన రోజు శుభాకాంక్షలు :)

విరిబోణి said...

మాలా గారు - వయసు శరీరానికేగాని మనసుకు కాదు అని చాల సహజం గా చెప్పారు. మీరు ఇంకా ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.

Kalpana Rentala said...

నిజమే , మీకు ఇంకా అరవై ఏళ్ళు కాదు ఆరేళ్ళుకూడా రాలేదు. మీరు ఇంకా ఆ ఫోటోలోని చిన్న పాపాయినే. మీ మనసు ఇంత తాజాగా ఇంత ప్రేమ గా వున్నప్పుడు శరీరానికి 60 వస్తే ఏంటీ? ఇంకో ఆరవై వస్తే ఏమిటి?

పుట్టిన రోజు శుభాకాంక్షలు

Sravya Vattikuti said...

Very Nice Maala gaaru !
మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు !
పుట్టినరోజు నాడు కేవలం ఆ రోజుకు సంభందించిన కోరికలు మాత్రమే కోరుకోవాలి , మీ ఇష్టం వచ్చినవి కాదు అది రూల్ :)))))

Rao S Lakkaraju said...

హ్యాపీ బర్త్ డే అండ్ షష్ఠిపూర్తి. మెనీ మోర్ బర్త్ డేస్ ఫర్ ఎవర్.

sbmurali2007 said...

పుట్టిన రోజు శూభాకాంక్షలు!
మీ అనుభూతుల మాలల్లో, అనుభవాల పూలల్లో పరిమళం ఎప్పటికీ వాడకుండా ఇలాగే వుండాలని ఆశిస్తూ,
శారద

కృష్ణప్రియ said...

మీకు సష్టిపూర్తి శుభాకాంక్షలు. మీకు మిగిలున్న కోరిక కూడా విన్నాను. మీకు నచ్చిన విధం గా మీ జీవితం అలా సాగిపోవాలని కోరుకుంటూ...

Enjoy your day!

SHANKAR.S said...

జన్మదిన వార్షికోత్సవ శుభాకాంక్షలండీ. పెద్దవారు కాబట్టి మిమ్మల్ని ఆశీర్వదించలేను కానీ మీ ఒడిలో ఉన్న మీకు శతాయుష్మాన్ భవ

ఆత్రేయ said...

అరవైయ్యో జన్మదిన శుభాకాంక్షలు !!
మీరు శతాధిక వత్షరాలు సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, శాంతిగా ఉంటూ మీ బ్లాగ్ ద్వారా మిత్రులని రంజింపజేయాలని భగవంతుని ప్రార్ధిస్తూ..

likita said...

Wish u a very happy birthday మాలా కుమార్ గారు

Anonymous said...

Happy Birthday, Attayya. - Ravi Komarraju

geetika said...

Happy BIRTH DAY to you MALA KUMAR garu.

మరెన్నో అందమైన జ్ఞాపకాలు.. అనుభూతులు మీ సొంతమవ్వాలని మనస్ఫూర్తిగ కోరుకుంటూ..


గీతిక B

లత said...

జన్మదిన శుభాకాంక్షలు మాలగారూ
మరెన్నో ఎన్నో పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలి మీరు

నేస్తం said...

మిమ్మల్ని మీరే ఎత్తుకుని లాలిస్తున్నారా :) వాట్ ఏన్ ఐడియా మేడం జీ :) ఇక మీరు కోరుకున్న కోరిక తీరాలని నేనూ కూడా మన్స్పూర్తిగా కోరుకుంటున్నాను .. అంతా బాగుంది కాని నేను అలిగాను అంతే :)

శిశిర said...

పుట్టిన రోజు శుభాకాంక్షలు మాల గారు. మీరెప్పటికీ ఇంతే ఉత్సాహంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటూ...

తృష్ణ said...

maala gaaru, see the greetings in hte below link.:)))
Have a Grreeeerrrrtttt Birthday !!

http://www.123greetings.com/birthday/milestone/milestone16.html

harephala said...

సీనియర్ సిటిజెన్ క్లబ్ మెంబరు అయిన సందర్భం లో హార్ద్జిక శుభాకాంక్షలు....

భమిడిపాటి సూర్య లక్ష్మి, ఫణిబాబు

జ్యోతి said...

Happy Birthday To You
Happy Birthday To You
Happy Birthday To Malagaru

షష్ఠి పూర్తి జన్మదిన శుభాకాంక్షలు

చెప్పాలంటే...... said...

షష్ఠి పూర్తి + పుట్టిన రోజు శుభాకాంక్షలు మాలా గారు -:)

శ్రీలలిత said...

ఏంటండీ మీరు మరీనూ...
అరవైయేళ్ళని షష్ఠిపూర్తి చేసేసుకుని, బర్త్ డే సాంగ్ పాడేసుకుంటే మేమూరుకుంటామా.. హన్నా...
ఆరేళ్ల పాపలా మీ మనసుండాలి
మనవళ్లతో కలిసి బుడుగు చదువుకోవాలి
పిల్లలతో కలిసి ఆడిపాడుకోవాలి
మనందరం కలిసి ఇంకా బోల్డు కార్యక్రమాలు చెయ్యాలి...
వీటన్నింటికోసమే అరవయ్యేళ్ళ తర్వాత ఇవాళ మీరు మళ్ళీ పుట్టారు.
ఇంకో అరవై సంవత్సరాలు మళ్ళీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని
ఆ భగవంతుడిని కోరుకుంటూ..
ప్రస్తుతం అరవై యేళ్లకి జన్మదిన శుభాకాంక్షలతో...
శ్రీలలిత...

నీహారిక said...

On this occation of your 60th birthday I want to give you one Award ..... "The Jewel of a Blogger"

I always feel the warmth,affectionate,cool sweetheart, lovable lioness nature ruling this blogging world.

Many Many Happy Returns of The Day Madam.

Don't put the mehendi today, because today its raining, go to our secret place at your home and sing the song which I have placed at my blog....vaasantasameeramlaa.blogspot.com.

Have a nice Day. Sweet Dreams.

శ్రీలలిత said...

ఏంటండీ మీరు మరీనూ...
అరవైయేళ్ళని షష్ఠిపూర్తి చేసేసుకుని, బర్త్ డే సాంగ్ పాడేసుకుంటే మేమూరుకుంటామా.. హన్నా...
ఆరేళ్ల పాపలా మీ మనసుండాలి
మనవళ్లతో కలిసి బుడుగు చదువుకోవాలి
పిల్లలతో కలిసి ఆడిపాడుకోవాలి
మనందరం కలిసి ఇంకా బోల్డు కార్యక్రమాలు చెయ్యాలి...
వీటన్నింటికోసమే అరవయ్యేళ్ళ తర్వాత ఇవాళ మీరు మళ్ళీ పుట్టారు.
ఇంకో అరవై సంవత్సరాలు మళ్ళీ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని
ఆ భగవంతుడిని కోరుకుంటూ..
ప్రస్తుతం అరవై యేళ్లకి జన్మదిన శుభాకాంక్షలతో...
శ్రీలలిత...

వేణూ శ్రీకాంత్ said...

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మాల గారు :)
ఫోటో చాలా బాగుంది.. ఐడియా సూపర్..
మీరుకోరుకున్న కోరిక తీరాలని నేను కూడా కోరుకుంటున్నాను..

ఆ.సౌమ్య said...

మాలగారు అరవైయ్యవ యేట వెనక్కి తిరిగి చూసి అబ్బ జీవితం ఎంత బావుందో అనుకోవడం కన్నా అదృష్టం ఇంకోటుండదు..మీరు అదృష్టవంతులు!

మీరు ఇలాగే కలకాలం హాయిగా నవ్వుతూ, ప్రేమతో జీవిస్తూ చల్లాగా ఉండాలి!

60 వసంతాలు సొంతం చేసుకున్న మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు! ఈరోజు మన ఫేవరెట్ సొరకాయ తో అన్ని ఐటమ్స్ చేసుకుని తినేయండి. తినే ముందు నన్ను ఒకసారి తలుచుకోండేం! :)

krishnaveni said...

Malagaru, many many happy returns of the day and a fantastic and a novel idea of carrying your own photograph.
Spend the day well and may you celeberate many more such birth days.
Krishnaveni

బుద్దా మురళి said...

.మీ జీవితం పట్ల మీ సంతృప్తి ముఖ్యంగా ఈ పదం తో(ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన ఆ దేవదేవునికి సర్వదా కృతజ్ఞురాలిని ) మీరెంత సంతృప్తి కరమైన జీవితం గడిపారో, గడుపుతున్నారో అర్థమవుతోంది . మీకు జన్మదిన శుభాకాంక్షలు ( మీది తెనాలే మది తెనాలే తరహాలో మాదీ నల్లగొండానే.. పుట్టింది )

జయ said...

అక్కా హృదయపూర్వక జనమదిన శుభాకాంక్షలు.

sreedevi said...

పుట్టిన రోజు శుభాకాంక్షలు :)

sreedevi.

సుజాత said...

అవును, మీరు యంగ్ ఫరెవర్! బుల్లి మాలకి (అవును, ఇవాళేగా పుట్టారూ మరి) ఆశీస్సులు, అభినందనలు!

మధురవాణి said...

అవును మాలా గారూ.. మీరూ, నేనూ మొన్నీ మధ్యేగా మీ స్కూల్ కబుర్లు చెప్పుకున్నాం.. ఇంతలోనే అరవై ఏళ్ళంటారా.. అదేదో తప్పు లెక్క లెద్దూ.. మీరింకా బుజ్జి పాపాయే! హ్యాప్పీ హ్యాప్పీ బర్త్డే టు యూ.. Wishing you many more! :)

లలిత said...

మాలగారూ ఇకనుంచి మీ వయసు వెనక్కి నడవాలి . మిమ్మల్ని చూస్తే నాకెప్పుడూ ఆశ్చర్యమే . ఎప్పుడూ ఏదో ఓ కొత్తవిషయం నేర్చుకుంటూనేవుంటారుమీరు . మీలాంటివారు అస్సలు వయసు లెక్కపెట్టుకోకూడదు

శివరంజని said...

మాలా గారు హేపీ హేపీ బర్త్ డే. ఇలాంటి బర్త్ డే లు మీరు ఇంకో 60 చేసుకోవాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.:-D అంటే ఎమిటంటే నా 60 బర్త్ డే కి నాకు మీరు విషెష్ చెప్పి ఇప్పుడు నేను చెప్పిన విషెష్ కి బాకి అప్పుడు తీర్చాలి అన్నమాట:-D మీ బర్త్ డే కదా మరి నాకొక 60 చాక్లేట్స్ కూడ ఇవ్వనే లేదు :-(

మురళి said...

ఇప్పుడే జయ గారి బ్లాగు చూసి ఇటు వచ్చానండీ.. హృదయపూర్వక శుభాకాంక్షలు..

రాజి said...

పుట్టినరోజు శుభాకాంక్షలు మాలాకుమార్ గారు..
Many Many Happy Returns of The Day

మాలా కుమార్ said...

భాస్కర రామి రెడ్డి గారు ,
ధన్యవాదాలండి .
* విరిబోణి గారు ,
నేను చెప్పింది మీకు నచ్చినందుకు , మీ విషెస్ కు థాంక్స్ అండి .
* కల్పనా రెంటాలగారు ,
:)) థాంక్స్ అండి :)

మాలా కుమార్ said...

శ్రావ్యా ,
మరి ఆ కోరిక పుట్టినరోజు సంభందించినది కాదా ? అంటే చీరలూ నగలూ నా ? అవి అడగక పోయినా ఇస్తారుగా :)
థాంక్ యు .
* లక్కరాజుగారు ,
థాంక్ యు .
* శారద గారు ,
మీ చక్కటి శుభాకాంక్షలకు థాంక్స్ అండి .
*కృష్ణప్రియ గారు ,
నాకోరిక తీరాలని కోరుకున్నందుకు థాంక్స్ అండి :)

మాలా కుమార్ said...

శంకర్ గారు ,
మీ ఆశీర్వాదానికి ధన్యవాదాలండి .
* ఆత్రేయగారు ,
శతాధికవత్సరాలా ? అమ్మో :)
మీ దీవెనలకు ధన్యవాదాలండి .
* లికిత గారు థాంక్యు .

మాలా కుమార్ said...

రవీ ,
థాంక్యు
* గీతిక గారు ,
థాంక్స్ అండి .
లత గారు ,
థాంక్ యు .

మాలా కుమార్ said...

నేస్తం గారు ,
నా ఐడియా మీకు నచ్చినందుకు , నా కోరిక తీరాలని కోరుకున్నందుకు థాంక్ యు .
అవునూ ఎందుకలిగారు ? ఎందుకలిగారో చెప్పకుండా అలుగుతే ఎలా ?
మా బుజ్జి కదూ , మా బంగారు కదూ అలక మానమ్మా :)
* శిశిరా ,
థాంక్ యు .
* తృష్ణా ,
మీ గ్రీటింగ్ చాలా బాగుందండి . థాంక్ యు .

మాలా కుమార్ said...

భమిడపాటి సూర్యలక్ష్మి గారు , పణి బాబు గారు ,
ధన్యవాదాలండి .
* జ్యోతిగారు ,
థాంక్స్ అండి .
* మంజు ,
థాంక్ యు .

మాలా కుమార్ said...

శ్రీలలిత గారు ,
బర్థ్డే రోజు హన్నా అంటార్ వా ((((
మీ దీవెనల కి చాలా చాలా ధన్యవాదాలండి .
* నీహారికా ,
మీ విషెస్ కి పొగడ్తలకి ( కొంచం ఎక్కువైనాయేమో హి హి హి ) థాంక్ యు థాంక్ యు వెరీ మచ్ .
మీ పాట్ పాడుకున్నాను . థాంక్ యు :)
* వేణూశ్రీకాంత్ గారు ,
నా ఫొటో ఐడియా నచ్చినందుకు , నా కోరిక తీరాలని కోరుకునందుకూ , మీ విషెస్ కూ థాంక్ యు .

మాలా కుమార్ said...

సౌమ్యా ,
మీరు చెప్పినట్లే సొరకాయకూర చేసుకొని మిమ్మలిని తలుచుకుంటూ తిన్నాను :)
థాంక్ యు .
* కృష్ణవేణి గారు ,
థాంక్స్ అండి .
* బుద్దా మురళిగారు ,
అవునండి మనం మనం నల్లగొండవాళ్ళం , మీరు పుట్టారు , నేను చదువు కున్నాను :)
థాంక్ యు .

మాలా కుమార్ said...

జయ ,
పోస్ట్ వ్రాసినందు కు , నీ విషెస్ కు థాంక్ యు .
*శ్రీదేవి ,
థాంక్ యు .
* సుజాత గారు ,
మీ కాంప్లిమెంట్ కు , మీ ఆశీస్షుల కు , అభినందనకు థాంక్ యు వెరీ మచ్ అండి .

మాలా కుమార్ said...

మదురా అదేకదా నేనన్నదీనూ రెండేళ్ళ క్రితమేగా బూర్గుంపాడు గురించి ఎన్ని కబుర్లు చెప్పుకున్నాము :)
థాంక్ యు మధురవాణి .
* లలిత గారు ,
వెనక్కి నడుస్తే దయ్య మనుకుంటారేమో :)
మీ కాంప్లిమెంట్ కు థాంక్ యూ .
* అమ్మో శివానీ నీది చాలా పెద్ద కోరికమ్మాయ్ :) అంతెందుకు కాని మా ఇంటి కోచ్చేయ్ 120 చాక్లెట్లిస్తాను :)
థాంక్ యు .

మాలా కుమార్ said...

మురళి గారు ,
ధన్యవాదాలండి .
* రాజి ,
థాంక్ యు . థాంక్ యు వెరీ మచ్ .

psmlakshmiblogspotcom said...

మాలాగారూ
జన్మదిన శుభాకాంక్షలు. ప్రమదావనంలో మీ ధ్యాంక్స్ గ్రీటింగ్ కార్డే చాలా బాగుందని మెచ్చుకుని మీ బ్లాగ్ కి వచ్చి ఎలా మెచ్చుకోవాలో తెలియక ఆగిపోయాను. మా ఒళ్ళో మీరే..వారెవా..
psmlakshmi

మేధ said...

ఇప్పుడే పోస్ట్ చూశానండీ.. (కాసింత ఆలస్యంగా) అభినందనలు.. :)

రిషి said...

బిలేటెడ్ విషెస్ మాల గారూ, ఎలా గడిపారు ఆరోజు న? ఏవరెవరు వచ్చారు,ఏమేమి తెచ్చారు?

ఈ మధ్య నేను కొన్ని కొన్ని పోస్ట్లు మిస్సయిపోతున్నాను. మిమ్మల్ని ఈరోజు నా బ్లాగులో చూసి చాలా రోజులనుండి ఈవిడ రాయట్లేదేమిటి అనుకుంటూ మీ బ్లాగుకొచ్చి చూస్తే ఏముంది, నేను చదవని టపాలు ఓ మూడు నాలుగున్నాయి.

క్రిష్ణప్రియ గారి బ్లాగు, నేస్తం గారి బ్లాగు విషయం లో కూడా ఇలాగే అయ్యింది.

( మీరు మా ఇంటికికొస్తే కానీ నేను మీ ఇంటికి రాలేదనుకుంటారేమొనని ఈ వివరణ అంతా :) )

మాలా కుమార్ said...

లక్ష్మి గారు ,
ఏదో మీ అభిమానం అండి :) థాంక్ యు .
* మేధ గారు,
థాంక్స్ అండి .
రిషి గారు ,
ఆ రోజు మా ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి గుడి కి వెళ్ళి అర్చన చేయించుకొని వచ్చామండి . మా అమ్మాయి , అల్లుడు , పిల్లలు వచ్చారు :)
చాలా వివరణ ఇచ్చారే ! పరవాలేదండి . నేనూ అలానే చాలా సార్లు మంచి పోస్ట్లు మిస్ అవుతుంటాను . మళ్ళీ కామెంట్స్ ల లో చూసి చదువుతుంటాను :)
థాంక్స్ అండి .

sunita said...

బిలేటెడ్ విషెస్ మాలగారు. సారీ! ఈ పోస్ట్ ఎలా మిస్స్ ఐయ్యానొ అర్ధం కావడంలేదు. నిండు నూరేళ్ళూ ఆరోగ్యమా ఆనందంగా ఇలాగే ఉండాలి మీరు.Many many happy returns of the day!

మాలా కుమార్ said...

సునీత గారు ,
సారీ ఎందుకండి . విష్ ఎప్పుడైనా చేయవచ్చు . థాంక్ యు .

సుభద్ర said...

మాయదారి నెట్ పాడు నెట్ ఈ మద్య అస్తమాను ప్రోబ్లం..నా బెస్ట్ ప్రెండ్ కి షష్టి పుర్తికి విష్ చెయ్యలేకపోయానని..
మాలాగారు అందరిక౦టే ముందు నేనే ఉండాలి మీ పుట్టుపండగ కి కాని నేనే లాస్ట్ అయ్యాను తెగ పీల్ అయిపోతూ పుట్టినరోజు శుభాకాంక్షలు..నాకోసంకేక్ దాచేఉంటారు నాకు తెలుసు పంపెయ్యండి..మీకు దేవుడు సకలసంపదలు,ఆయురార్యోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను..

స్ఫురిత said...

మాలగారు ...మీరు భలే వున్నారండీ...

మీకు షష్టిపూర్తి శుభాకంక్షలు...చాలా ఆలీశంగా చెప్తున్నాను క్షమించాలి...నేను అంత regular blogger ని కాదు...ఖాళీ దొరికినప్పుడు అలా విహరిస్తూ వుంటా బ్లాగుప్రపంచం లో
అన్నట్టు నేను అలిగాను...:( నా బ్లాగులో ఇప్పుడే చూస్తున్నా మీ బ్లాగు అని కామెంటు పెట్టారు :(...మునుపు నా బ్లాగుకొచ్చారు మీరు ...నా పిచ్చితల్లి టపా చూసారు...మెచ్చుకున్నారు...నన్ను పరిచయం కూడా చేసారు బ్లాగు ప్రపంచంలో స్త్రీలు లో...
ఇంతమంది బ్లాగర్లలో అప్పుడప్పుడూ చుట్టం చూపుగా వచ్చి పోయే నాలాంటి బ్లాగర్ ని గుర్తుపేట్టుకోటం కష్టమే అనుకోండి...ఐనా అలగటం నా జన్మ హక్కు కాబట్టి అలిగానంతే...

మాలా కుమార్ said...

సుభద్ర ,
అందరికంటే ముందు మీరే వున్నారు . నాలుగు నెలల క్రితం మనం కలుసుకున్నప్పుడు నా బర్త్ డే గురించి మాట్లాడుకున్నాము . స్వీట్స్ తిన్నాము . ఫొటో కూడా దిగాము మర్చిపోయారా ? కాబట్టి మీరు ఫీల్ అవ్వాల్సిన పనిలేదండి :) థాంక్ యు .

మాలా కుమార్ said...

స్పురిత గారూ ,
హుం నామీద అలిగేసారా ? ఎందుకు బంగారు , మీ బ్లాగ్ ఇంతకు ముందే చూసేసి ఇప్పుడే చూసాను అన్నందుకా :) సారీ . కానీ ఆ రోజు మీ పోస్ట్లు చాలా చదివాను . కాకపోతే కామెంట్స్ ను చదవలేదు :) హి హి హి అందుకే ఇలా దొరికిపోయాను :) సారీ చెప్పేసానుగా ఓ చిరునవ్వు నవ్వేయండి మరి . నాకు తెలుసు మీరు మంచి అమ్మాయి అందుకే నవ్వేసారు అదిగో నాకు కనిపిస్తోంది .
నేనూ ఎప్పుడూ అనుకుంటునే వుంటాను నేను పరిచయం చేసిన అందరినీ అప్పుడప్పుడూ వెళ్ళి పలకరించి వద్దామని , కాని కాస్త బద్దకం :)
మీ కామెంట్ కు థాంక్ యూ థాంక్ యు వెరీ మచ్ .

kallurisailabala said...

షష్ఠి పూర్తి జన్మదిన శుభాకాంక్షలండి.
అన్ని నిన్న మొన్న జరిగినట్టున్నాయి అని మీరు రాసిన విధానం ఎంతో ఆప్యాయంగా ఆనాటి రోజులు నా కనుల ముందు ఉంచింది.

స్ఫురిత said...

మాలగారూ...భలే కనిపెట్టేసారే నేను మంచి అమ్మాయినని...:)
అసలు నేను నవ్వుతూనే అలిగానండీ...నా టపాలు చాలా చదివినందుకు బోలెడన్ని తాంకులు

మాలా కుమార్ said...

శైలబాల గారు ,
నా బర్త్ డే పోస్ట్ రాయాటమే కాకుండా ,నా బ్లాగ్ లో కూడా విష్ చేసారు . మీకు చాలా చాలా థాంక్స్ అండి .

మాలా కుమార్ said...

స్పురిత గారు ,
నేను మంచి అమ్మాయిలను అలాగే కనిపెడుతానండి :))