Monday, December 27, 2010

అయ్యబాబోయ్ సాహితి కి రెండేళ్ళట !!!!!!!!!!!!!!



కొత్త పోస్ట్ హారం, మాలిక లో వెంటనే కూడలి లో పది నిమిషాలు ఆలశ్యముగా విడుదలైంది . ఎలా నడుస్తుందో ఏమో ? కూడలి నుండి 63 టికెట్స్ అమ్ముడయ్యాయట . హారం నుంచి 49 , మాలిక నుంచి 26 అమ్ముడయ్యాయని స్టేట్స్ చెపుతోంది ! స్చప్ . . . అంతేనా ???? మొత్తం 200 లైనా కాలేదు (((( . . . . . ఈ గ్రాఫ్ ఎప్పటికి పైకి పోను ? కామెంట్స్ కూడా 8 ఏ వచ్చాయి , , , , ,

కొత్త పోస్ట్ రాసినప్పుడల్లా , కోట్లు గుమ్మరించి కొత్త సినిమాను విడుదల చేసిన నిర్మాతను మించి ఆత్రుత , టెన్షన్ :) అవును మరి కోటి కోటి ఆలోచనలు చేసి రాస్తాను కదా ఆమాత్రం ఆత్రుత వుండదేమిటి ?:-)అలా అని అన్ని పోస్ట్ల కూ ఆ ఆత్రుత వుండదు . చాలా బాగా రాసాను అనుకున్నదానికే , రామచరణ్ సినిమానో , జూనియర్ యంటీఅర్ సినిమానో కోట్ల తో నిర్మించి , విడుదల చేసి , రిజల్ట్ కోసం అన్ని కేంద్రాల లోని తన ఏజంట్ల కు కాల్ చేసి , ఎప్పటికప్పుడు ఎలా నడుస్తోందో తెలుసుకుంటూ వుండే నిర్మాతలా ఫీలైపోతూవుంటాను ! టెన్షన్ పడిపోతూవుంటాను . కాని అదేమిటో నేను బాగున్నది అనుకున్న పోస్ట్ కు టుక్కూ . . . టుక్కూ . . . టుక్కూ అనుకుంటు రెండో మూడో కామెంట్స్ వస్తాయి :)

అసలు రెండు సంవత్సరాల క్రితం బ్లాగ్ మొదలు పెట్టినప్పుడు రెండు సంవత్సరాలు బ్లాగ్ వ్రాస్తానని నేనేమాత్రమూ ఊహించలేదు . ఏదో కొన్ని రోజు వ్రాసి ఆపేస్తాననుకున్నాను .రాస్తూనే వున్నాను . పైగా ఈ ఎదురుచూపులు ! ఇంకా ఆపైన ఐదు బ్లాగులు ! అంతేనా బుక్స్ అండ్ గర్ల్స్ ఫ్రెండ్స్ కు ఫస్ట్ గెస్ట్ ఆథర్ ని ! అంతేనా ? చిత్రమాలిక కూ మొదటి అథిది రచయిత్రినే :) ఏమిటో అంతా మాయ , కల ! కమ్మటికల :)

సాహితి కి జన్మదిన శుభాకాంక్షలు .

శ్రీలలిత గారు , ఈ కార్డ్ చేసి కానుకగా పంపారు .అభిమానము తో వచ్చిన కానుకను మరి అందుకోకుండా వుండగలనా ? థాంక్ యు శ్రీలలిత .



ఇంకా ఎవరైనా కానుకలు ఇద్దామనుకుంటే ఇచ్చేయండి . ఎంతైనా రెండు సంవత్సరాల పాపాయే కదా ! అందుకే ఈ పుట్టినరోజు కు కానుకలు స్వీకరించబడవు అని రిస్ట్రిక్షన్ పెట్టలేదు :))

31 comments:

  1. సాహితి కి జన్మదిన శుభాకాంక్షలు :-) మీకు అభినందనలు మాల గారు.

    ReplyDelete
  2. సాహితి కి జన్మదిన శుభాకాంక్షలండీ.

    ReplyDelete
  3. సాహితి కి జన్మదిన శుభాకాంక్షలు :-)

    - మంచుకొండ

    ReplyDelete
  4. సాహితికి శుభాభినందనలు.

    ReplyDelete
  5. సాహితి కి జన్మదిన శుభాకాంక్షలు మాలాకుమార్ గారు..

    ReplyDelete
  6. సాహితికి జన్మ దిన శుభాకాంక్షలు

    ReplyDelete
  7. యాపీ యాపీ యానివర్సరీ..ముందుముందు మీ రచనలు వెబ్ పత్రికలనుండి దినపత్రికలు, వారపత్రికలకు కూడా వ్యాప్తి చెందాలని కోరుకుంటున్నాను..

    B O L

    ReplyDelete
  8. మీ సాహితి కి పుట్టినరోజు శుభాకాంక్షలు మాల గారూ,
    మీకు అభినందనలు.

    ReplyDelete
  9. సాహితీమాలకు అభినందన మందార మాల!

    ReplyDelete
  10. wow, రెండేళ్ల సాహితికి పుట్టినరోజు శుభాకాంక్షలు!

    ReplyDelete
  11. సాహితి కి జన్మదిన శుభాకాంక్షలు

    ReplyDelete
  12. మీ సాహితి కి జన్మదినశుభాకాంక్షలు మాలాకుమార్ గారు.

    ReplyDelete
  13. అభినందనలు మాలగారు.

    ReplyDelete
  14. మాయ నిజమైతే
    కల వాస్తవమైతే
    ఇదిగో... ఇలాగే
    పండుగలు... వేడుకలు..
    ఆనందాలు....అభినందనలు...అందుకోండి మరి...
    సాహితికి ద్వితీయవార్షికోత్సవ శుభాకాంక్షలతో...

    ReplyDelete
  15. సాహితీమాలకి అభినందన మందారమాల! :)

    ReplyDelete
  16. మాలాగారూ
    బుడి బుడి నడకలు మానేసి ఉరకలు పరుగులు పెడుతున్న మీ సాహితికి జన్మదిన శుభాకాంక్షలు. 5 బ్లాగులు 50 బ్లాగులు కాకపోయినా, 2011 లో 500 ల పోస్టుల పండగ కూడా చేసుకోమని మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ
    psmlakshmi

    ReplyDelete
  17. అక్కా, సాహితి కి నా హృదయపూర్వక జన్మదిన 'అభినందనమాల'.

    ReplyDelete
  18. సాహితికి శుభాకాంక్షలు.

    ReplyDelete
  19. రాయటం రాదు సాహిత్యం తెలియదు అంటూ అబద్దం చెప్పి రెండేళ్ళు అవిరామంగా రాసి మాకు అనందాన్ని అందించినందుకు క్రుతఙ్నతలు
    మీ సాహితికి జన్మదిన శుభకంక్షలు.............

    ReplyDelete
  20. wowwwwwwwwwwwwwwwwww నిజమా ???ఇప్పుడే చూసా....... సాహితి కి జన్మదిన శుభాకాంక్షలు ..ఇలాంటి పోస్ట్ లు చాలా చాలా అంటే కనీసం ఒక వెయ్యి పోస్ట్ లయినా రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    ReplyDelete
  21. మాలాకుమార్ గారు, క్షమించాలి:) ఒకరోజు ఆలస్యంగా సాహితికి జన్మదిన శుభాకాంక్షలు:)

    ReplyDelete
  22. వేణు శ్రీకాంత్ ,
    & rsరెడ్డిగారు ,
    & మంచుకొండ ,
    &ఉమాదేవి గారు ,
    & రాజి ,
    &భాను గారు ,
    ధన్యవాదాలండి .

    ReplyDelete
  23. జ్యోతి గారు ,
    పత్రికల కు కూడా రాయాలా :)
    థాంక్ యు .
    & సిరిసిరి మువ్వగారు ,
    & లత గారు ,
    & పరిమళం గారు ,
    & రావు గారు ,
    & సౌమ్య ,
    అందరికీ ధన్యవాదాలండి .

    ReplyDelete
  24. జ్యోతి గారు ,
    పత్రికల కు కూడా రాయాలా :)
    థాంక్ యు .
    & సిరిసిరి మువ్వగారు ,
    & లత గారు ,
    & పరిమళం గారు ,
    & రావు గారు ,
    & సౌమ్య ,
    అందరికీ ధన్యవాదాలండి .

    ReplyDelete
  25. వెంకట సుబ్బారావు గారు ,
    & రాధిక గారు ,
    & శిశిర ,
    & శ్రీలలిత గారు ,
    వహ్వా ఏమి రాసారండి . బాగుంది .
    & మధురవాణి ,
    థాంక్స్ అండి .

    ReplyDelete
  26. లక్ష్మిగారు ,
    500 ల పోస్ట్ల పండగా ? బాబోయ్ :)
    & జయ ,
    & అశోక్ ,
    & వంశీ ,
    ఏమిరా నాయనా నీకు అబద్ధం చెప్పానా ? నిజంగా నిజం :0
    & శివానీ ,
    ఏమిటమ్మడూ , 1000 పోస్ట్లే ! లక్ష్మి గారిని మించిపోయావే !
    & మనసుపలికే ,
    ఆలశ్యం ఏమీలేదండి . ఎప్పుడైనా విష్ చేయవచ్చు .

    అందరికీ థాంక్స్ అండి .

    ReplyDelete
  27. mala kumar గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

    ReplyDelete
  28. సాహితికి జన్మదిన శుభాకాంక్షలు. మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    ReplyDelete
  29. మీకును నూతన సంవత్సర శుభాకాంక్షలు .అలాగే మీ బ్లాగ్ పాపాయికి జన్మదిన శుభాకాంక్షలు :-)

    ReplyDelete