Tuesday, April 20, 2010

మనస్వి కి జన్మదిన శుభాకాంక్షలు



సరిగ్గా సంవత్సరము క్రితము " నాలోనేను " అంటూ ఓ చిన్ని కవిత తో మయూఖను మొదలు పెట్టింది జయ . నీ పనేమిటమ్మా అంటే ఏదో అమాయకపు పిల్లలు దొరికారు కదా అని పొద్దుటినుండి సాయంకాలము వరకు లెక్చర్ లు దంచటమే నట . ఆ అనుభవ మే కావచ్చు ఏది రాసినా ఆకట్టుకునేటట్లుగా , అలవోకగా రాసేస్తుంది . పాపికొండల విహారము , అసంధర్భపు పాటలు , మాస్టార్ కి సెల్యూట్ , వాణిశ్రీ వీణా నాదము మొదలైన మంచి టపాలు పదమూడు రాసాక , అనివార్య కారణాల వలన మయూఖ , మనస్వి గా మారింది !!!

" వినీల గగనపు వేదికపై నే పాడిన జీవనగీతం " మనస్వి కి టాగ్ లైన్ . అందుకే కాబోలు వంటలు , నా చిత్రలేఖనాలు ,వాక్యాల గారడి తో ప్రేమలేఖ , చర్చావేదిక , తను చదివిన పుస్తకాల గురించి , ప్రతి స్పందనా బ్లాగ్ మిత్రుల తో పంచుకుంటుంది . నేను తప్పు చేసానా అని బేలగా , బిక్క మొహం తో అడుగుతుంది పాపం . వరుడు లాంటి సినిమాలు చూడకండి బాబోయ్ అని హెచ్చరిస్తుంది . మరుజన్మలోనైనా నేనునేనుగానే మళ్ళీ పంతులమ్మ గా పుట్టాలి , అంటూ , లాంతర్ పట్టుకున్న చిత్రం ను చూస్తుంటే చిన్నప్పుడు చదువుకున్న , " లేడి విత్ ద లాంప్ " పాఠం గుర్తొచ్చింది .

అలా చుక్ చుక్ అని ముందుకు ప్రయాణిస్తున్న మనస్వి కి యాభై పెట్టెలు చేరాయి అని సంతోషించిన , అల్ప సంతోషి జయ . మనస్వి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లా , ఇంకా ఎన్నో ఎన్నో డబ్బాల ను చేర్చుకొని , ముందుకు , మునుముదుకు సాగిపోవాలని ఆశిస్తూ ,

మనస్వి కి జన్మదిన శుభాకాంక్షలు .

12 comments:

  1. నా తరుపున కూడా :)

    ReplyDelete
  2. అందరిమనసులూ చూరగొంటూ, అందరినీ ఆకట్టుకుంటూ, అందరి హృదయాల్లోనూ స్థానమేర్పరచుకొన్న మనస్వినిగారికి.....(జయగారికి)
    ...
    హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు....

    ReplyDelete
  3. హేపీ బర్త్ డే టూ జయ గారూ...

    ReplyDelete
  4. Jaya garoo,many many happy returns of the day.

    ReplyDelete
  5. అప్పుడే ఏడాదా? రోజులెంత వేగంగా జరిగిపోతున్నాయండీ.. మనస్వికి మనః పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. చాలా బాగుంది మీ టపా..

    ReplyDelete
  6. నేస్తం గారు
    శ్రీలలిత గారు
    శేఖర్ గారు
    సునిత గారు
    మధురవాణి గారు
    మురళి గారు
    చిన్ని గారు...
    బ్లాగ్ లంటే ఏమో తెలియని నాతోటి బ్లాగ్ రాయించిన ఘనత మాత్రం మా అక్కదే. ముందు అంత ఇంట్రెస్ట్ లేకపోయినా ఇప్పుడు ఈ బ్లాగ్ లు చూడకుండా ఉండలేని స్టేజ్ కొచ్చాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.

    ReplyDelete
  7. విష్ చేసిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలాండి .
    @ నాకు కూడా క్రెడిట్ ఇచ్చినందుకు థాంకు , జయ .

    ReplyDelete
  8. మనస్వి కి పుట్టినరోజు శుభాకా౦క్షలు...
    మరిన్ని పెట్టేలతో అతి పెద్దరైలు బ౦డి కావాలి మన మనస్వి..

    ReplyDelete
  9. సారి జయ, మాల గారు, కొంచం లేట్ గా చూసా ఈ పోస్ట్. అభినందనల మందార మాల జయ సవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భం లో. మాల గారన్నట్లు ఏది రాసినా ఎంతో హాయి గా ఆకటుకున్నేట్లు రాయటం మీకు లెక్చరర్ అవ్వటం మూలం గానే వచ్చిందేమో..

    ReplyDelete
  10. మాలా కుమార్ గారూ...,సరిగ్గా సంవత్సరము క్రితము " నాలోనేను " అంటూ ఓ చిన్ని కవిత తో మయూఖను మొదలు పెట్టింది జయ . నీ పనేమిటమ్మా అంటే ఏదో అమాయకపు పిల్లలు దొరికారు కదా అని పొద్దుటినుండి సాయంకాలము వరకు లెక్చర్ లు దంచటమే నట . ఆ _____________________good one

    ReplyDelete